29, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3354

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడియారము సిగ్గుపడును గమనము నాపున్"
(లేదా...)
"అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా"
(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

135 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు 🙏🙏

  *మన సమూహ గవాస్కర్, ఆర్యులు శ్రీ G P శాస్త్రి గారికి నమస్సులతో* 🙏

  *కం ||*

  వడివడి గా పరుగులిడుచు
  తడఁబడకనె పద్యములను తనదగు రీతిన్
  నడిరేయిన పూరించగ
  *"గడియారము సిగ్గుపడును గమనము నాపున్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😄🙏😄🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో పూరణ ప్రయత్నం 🙏
   (మోసము జేసే పెండ్లి కొడుకు పెళ్లి ఆగడం అనే అర్థం తో )

   *కం||*

   తడబడుచూ పెండ్లికని వ
   రుడు మోసము జేయ జూడ రూఢీ యని యే
   డడుగుల ముచ్చట నిలుపగ
   *"గడియారము సిగ్గుపడును గమనము నాపున్"*!!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😊🙏😊🙏

   తొలగించండి
  2. మరో ప్రయత్నం 🙏😓

   *కం||*

   అడుగడుగున కరొనా యా
   గడముల యందు, మరణముల గండము గొనినన్
   తడబడి యలసిక తిరుగక
   *"గడియారము సిగ్గుపడును గమనము నాపున్"*!!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌸🙏💐🙏

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  అతడు:

  చిలిపిగ పెండ్లియాడుచును చిత్తరు వోలెడి సుందరాంగి నా
  వలపుల స్వప్నసుందరిని బాడుగ కొంపను స్వాగతమ్మిడన్
  కులుకుల రాణి యాదటను గుమ్మము నెక్కుచు తేఱిపాఱి తా
  నలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!

  A beautiful face that would stop a clock 👆

  **************************************************************

  ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఆమె:

  కలియగ ముత్తుకూరునను కాపుల వీధిని పేడకేగుచున్
  వలపులు మీర వారమున భార్యగ కూడుచు నింటదూరగన్
  బలుపున భీమసేనుడును వందకు నొక్కడు ట్రంపురూపుడై
  యలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!

  A hideous face that would stop a clock 👆

  రిప్లయితొలగించండి
 3. నడిరేయిదాటి పోయినె
  పడుచుదనపు ఆలుమగలు పడుకొనియుండన్
  వడివడిగను పరుగులిడెడు
  గడియారము సిగ్గుపడును, గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 4. బుడి బుడినడకల బాలుడు
  తడిబట్టలు గట్టుకొనగ తహతహ పడుచున్
  మడిగట్టితిననియనగా
  గడియారము సిగ్గుపడుము గమనమునాపున్
  *****+++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 5. భడవల కరవాణుల గన
  దడపుట్టించెడు విషయము తగిలెకరోనా
  చెడుతిరుగుడులని తెలియగ
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 6. (అది 30-01-1948 సాయంసమయం. ఆరుగంటలు కావస్తున్నది.
  బిర్లామందిరప్రాంగణం. గాంధీ -గాడ్సే )
  కలనయినన్ గనంబడని
  కారుణికత్వపు పుణ్యమూర్తియే !
  యలిగిన దుష్టభావుకుని
  యీసుతుపాకికి గుండె నిచ్చుచున్
  మెలమెల "రామ"యంచు నట
  మేదిని గూలుచు సాంధ్యవేళలో
  నలయక చూచినంత గడి
  యారము సిగ్గిలి యాగిపోవురా !

  రిప్లయితొలగించండి
 7. బడినందు పరుగు పందెము
  నడిపెడు వానికి సమయపు నడక దెలుపుచున్
  వడివడి పరుగిడ జూసిన
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి


 8. ముడిసరకేలేక జిలే
  బి డిగనురుకి కైత యనెడు విన్నాణముతో
  గడగడ వ్రాయు విధము గని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్  జిలేబి

  రిప్లయితొలగించండి

 9. * శంకరాభరణం వేదిక *
  29/04/2020 బుధవారం

  సమస్య
  ********
  "అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!"

  నా పూరణ. చం.మా.
  **** **** **

  కలువల నేత్రముల్ కలిగి గాఢపు వన్నెలు గారు భామినిన్

  వలచి...వివాహమున్ గొనుచు... బ్రాణసఖిన్ విడిబోక... యెప్పుడున్

  గలయిక కోరి... రే బవలు గానక యందున మున్గితేల దా

  నలయక... చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి


 10. కులుకుదనమ్ములన్ వడి నిగూహనమున్ తొలగింపు రమ్మ! కో
  మలి! గజయాన! చంద్రముఖి! మాపటి వేళ కలాపయామినీ
  యలకలకొల్కి మాధురి! సయాటల దేల్చుము! నీదు మోహమం
  దలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవు! రా!  జిలేబి

  రిప్లయితొలగించండి


 11. అట్లా సమస్య వస్తే యిట్లా టక్కని వృత్తము చుట్టు జీపీయెస్ వారి వంగతురంగ వేగము :)


  వడి వృత్తము చుట్టు నతడు
  నడిరేయి ప్రభాకరుండు నడగడి వేగం
  బు డిగబడి! చూడనతడిని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మైలవరపు వారి స్పందన:

   నిజం నిజం.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి శుభోదయం 💐🙏👏

   తొలగించండి

  2. డా. మునిగోటి సుందరరామ శర్మ గారి స్పందన:

   👌👌👌సమాధానం చెప్పి సమస్య ఇవ్వగలవారు వంగబంధు... వారివేగం *అశ్వధాటి*💐🙏💐

   తొలగించండి

  3. అదురహో అశ్వధాటి వాజినీవేగము :)

   తొలగించండి

 12. Beating corona times అవధానుల డయనము వాట్సాపు :)


  వడి వాట్సాపవధానము!
  కొడికట్టె కరోన వేళ కూకటిరత్నం
  బు డవిణ మ్రోగించి! గనన్
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  వలపుల పట్టెమంచమున వాతెర వీటికలంది యంది., మ..
  ల్లెల నునుసిగ్గు దొంతరల లేమ మగండును తేలి సోలి., యె...
  ల్లలనెరుగంగలేని మధురంపు సుఖంబుల మున్గియుండగా
  నలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 14. అడడడ మామర కిళియే
  సుడసుడ పోడుడి జిలేబి సుర్రెండ్రదువే
  నొడియల్ సిమిట్ట కణ్ణై
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్


  జిలేబి :)

  రిప్లయితొలగించండి
 15. వడివడిగ వ్యాపించెడి
  పడివచ్చిన కరొన నాప ప్రభులున్ చూడన్
  గొడవలు కొందరు చేయగ
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్.


  బాపట్ల సత్యనారాయణ సాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. 'వడివడిగను వ్యాపించెడి" అనండి.

   తొలగించండి
 16. గడసరి వాడొక్కడు తన
  పడతిని పుట్టింటికంపి పరిచారికతో
  పడకసుఖము బొందగగని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 17. బడి మూయకనే సతతము
  వడివడిగా పారిపోవు పాఠి నుపాధ్యా
  యుడు గని, చూపగఁ దనచే
  గడియారము, సిగ్గుపడును గమనము నాపున్!

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. బలమును దగ్గెఁ బూర్తిగను బ్యాటరి యందున! వింత గాదులే!!
   కలియుచు రెండుమాఱ్లు క్షణకాలము రేయి పగళ్ళలోన నా
   యలసిన ముళ్ళు మూడు వడి నాడగలేని క్షణానఁ గాలమే
   "యలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా"

   తొలగించండి
 19. వడివడి తూరుపునను పరు
  గిడి సూర్యుడు పైకి వచ్చె, గిచ్చిన లేవవ్
  గొడవేల చూడు మిక నా
  "గడియారము సిగ్గుపడును గమనము నాపున్"

  రిప్లయితొలగించండి
 20. చం॥
  నిలువక ఇంటిలోన యనునిత్యము, మిత్రుల గానకన్ మదిన్

  దలచుచు చేయ నేదియును దారియు నెక్కడ గాన రాకనే

  కలవగ, వేళ బోవు నవకాశము లేకను మాటిమాటికిన్

  అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగి పోవు రా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇంటిలోన ననునిత్యము..' అనండి. 'కానక' అన్నది ద్రుతాంతం కాదు.

   తొలగించండి
 21. రిప్లయిలు
  1. వడి వడిగలేచిపూరణ
   నడి రేయిన పూర్తి చేయ, నాతియుకట్టెన్
   మడిబట్టయు తోచూచిన
   గడియారము సిగ్గుపడును, గమనము నాపున్

   తొలగించండి
 22. విడచిన యానందమ్మును
  తడబాటున తప్పుకొనిన తరుణీమణికిన్
  బడలికరాగా పాన్పున
  గడియారముసిగ్గుపడును గమనమునాపున్!

  రిప్లయితొలగించండి
 23. కులములు వేరువేరనుచు ,కుందగజేసిరి తల్లిదండ్రులే
  పలుకుటగూడమానిరిక,పంతమువీడనికాలమందునన్
  నలతలుగల్గెవారికని,నాణ్యముగాతనుసేవజేయగా
  అలయకజూచినంత,గడియారముసిగ్గిలియాగిపోవుగా
  +++++++++++++++++++++++++=+
  రావెలపురుషోత్తమరావు


  రిప్లయితొలగించండి
 24. వడివడిగ డెవిలియర్సను
  గడసరి బ్యాటు ఝళిపించ గడగడ మనుచున్
  తడబడును వైరి పక్షము,
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్"

  గడసరి ప్రభాకరులిటను
  వడిగా కలము ఝళిపించి పద్దెము లల్లన్
  నడిరేయిని తడబాటున
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్"

  రిప్లయితొలగించండి
 25. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కనిన్'?

   తొలగించండి
  2. సవరణతో...
   సడిలేని పథములం గని
   వడి విడి నడు జన జడస్వభావ గతిఁ గనన్;
   కడకున్ క్లాక్టవరందలి
   గడియారము సిగ్గుపడును గమనము నాపున్.

   తొలగించండి
 26. నడుమును బిగించి కూర్చొని
  వడి వడిగనుపూరణముకు పదములు వెతకన్
  కదలని కలమును చూచియు
  గడియారము సిగ్గుపడును, గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 27. తడిసిన చీరెతొ వడివడి
  నడచెడి పడుచుని సొగసులు,నవ్వును చూడన్
  చెడు మతి,కుడిచేతినగల
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్ .


  బాపట్ల సత్యనారాయణ సాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చీరతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'చేతిని గల/చేతను గల' అనండి.

   తొలగించండి
 28. కం//
  ముడిదీసెడి సమయంబున
  గడియల శబ్దము గలుగగ గండడు లేవన్ !
  తడబడు రమణిని గాంచిన
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్ !!

  రిప్లయితొలగించండి
 29. సమస్య :-
  "గడియారము సిగ్గుపడును గమనము నాపున్"

  *కందం**

  నడకద్దిన శవముండగ
  గొడవపడగ యాస్తుల కొరకు కసిడి కొడుకుల్
  కడుసిగ్గు మాలిన పనికి
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్
  ...................✍చక్రి

  రిప్లయితొలగించండి


 30. ఎక్కడో చదివినట్టుంటే నా బాధ్యత గాదు :)  ఎడలను పలుకుల పలికెడు
  గడుగడు నిపుణులు తెగ చిలుక తెఱగుల కడుం
  గడు మురిసెడు కవులను గని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. తడయక పనులను సేయక
  గడియార ము సిగ్గు పడును : గమనము నాపున్
  చెడు సహ వాసము మనకి ల
  సుడి గుండము నందు ముంచి శోకము గూర్చున్

  రిప్లయితొలగించండి

 32. * శంకరాభరణం వేదిక *
  29/04/2020 బుధవారం

  సమస్య
  ********
  "అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!"

  నా పూరణ.
  **** **** **
  ( ఓ అభిసారిక రాత్రికి ప్రియుని కలవాలని అందముగా ముస్తాబై ఆ సమయం ఎప్పుడొచ్చునోయని మాటిమాటికి గడియాముచూస్తూ ఉండు సందర్భంగా...)

  చం.మా.

  కలువగనెంచితిన్ ప్రియుని ఖాయముగా మరి నేటి రాత్రికిన్

  కలవరమాయె హృత్తునకు కాలము సాగక ముందుకున్! సఖున్

  కలిసి సుఖించి తోషమిడు కాలము యెప్పుడు వచ్చునంచు దా

  నలయక... చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 33. వడిగా కుబేరుని గెలిచి
  కడుముదమున పుష్పకమును కని దశకంఠుం
  డడచ దిశాధిపతుల తా
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 34. బడలిక నెరుగక గాంధీ
  సడలని ధృతితో జనులను సంఘట పరుపన్
  వడివడి నడకల తిరుగగ
  "గడియారము సిగ్గుపడును గమనము నాపున్"

  రిప్లయితొలగించండి
 35. అలనొక జాతరన్ జనకు డా పసిబాలుని తృప్తికోసమై
  వలసిన వస్తువున్ గొనెను వాడును దాని ధరించి చీరినన్
  బలుకక తిండినిం గొనక వర్తిలుచుండగ తండ్రి పల్కె నీ
  వలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా.

  రిప్లయితొలగించండి
 36. వడిగా చర్చలు జరుపుచు
  వడిగా నిర్ణయములూని ప్రభుతను సరిగా
  నడిపించెడి మోడిని గని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 37. వడివడిగా రవి ప్రాగ్దిశఁ
  తడిపెను తన ప్రభలఁ జల్లి, త్ర్యాహణ రవముల్
  సడి చేయఁ చిత్తరువుఁ గని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్౹౹

  రిప్లయితొలగించండి
 38. బలమును చూపి రావణుడుపట్టగ పుష్పకమున్ జయించి తా
  నలకను దిక్పతుల్ బెదర నాతని ధాటికి మూడు లోకముల్
  కలవర మందుచున్ వశము కాగ మునుల్ భయమొంద రక్కసుం
  డలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా

  రిప్లయితొలగించండి
 39. రిప్లయిలు
  1. అలసట యన్నదే యెఱుగ డాకలి దప్పుల మాట లేదు పు
   త్రులు సతి నాత్మబంధువులఁ ద్రోసె త్యజించె గృహోత్సవమ్భులన్
   దలపక స్వాస్థ్యముం గవికృతాద్యనుశీలుడు నైన వీనిఁ దా
   నలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా"

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 40. ఇలఁ జనియించినట్టి నరులెల్లరు సద్గుణ శీలురంచు తా
  దలచిననేమి వారలిట ధర్మము వీడి చరించు స్వార్థచి
  త్తులగుచు మానవాళి కడు దుష్కృత కార్యము లాచరింపగా
  నలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా.

  రిప్లయితొలగించండి
 41. పలుకులవాణి వాక్కులను బాడుచు జెప్పగ వింటుయున్ననన్
  కులుకులబోణి గన్నులకు కొంచము నీటిని జూచునప్పుడున్
  అలుకను బూని గేహమును యాగము జేయుచు నుండువేళలన్
  అలయక జూచినంత గడియారము సిగ్గిలి యాగిపోయరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వింటు+ఉన్న' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 42. పూజ్యులకు ప్రణామాలు🙏
  కం"

  నడిరేయి వేచి యుండన్

  వడివడి పూరణ మొడలిడ పండిత వర్యుల్

  సడలని యాశక్తి కిచట

  *గడియారం సిగ్గు పడును గమనము నాపున్*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 43. కం|| బడికివెడలఁజూచెగురుడు
  వడిఁబ్రేమనుఁదెల్పజూచిభామయుతనలో
  నడిమియరసికులుకవితా
  గడియారము,సిగ్గుపడును ,గమనము నాపున్
  (క్రమాలంకారము)"

  రిప్లయితొలగించండి
 44. రిప్లయిలు
  1. చం|| కలనెరవేర్చుకొందురుసుఖమ్ముత్యజించియభీష్టకాలమున్
   కొలువులఁదీరు,సాధనముఁగొందరుగాంచువిశేషకా ర్యముల్
   తలపులుమారిబద్దకముదారుణమైచరియింపభావిలోన్
   "అలయకచూచినంతగడియారముసిగ్గిలియాగిపోవురా"

   తొలగించండి
 45. గడియలకొలదినినిదురను
  విడువకవేజామువరకువెంగళియోలెన్
  గడిబిడిజేయుచునుండగ
  గడియారముసిగ్గుపడునుగమనమునాపున్

  రిప్లయితొలగించండి
 46. ఘడియలు లెక్కలు వేయుచు
  పడిగాపులు గాయుచుండ పరిణయ మెపుడో
  విడిపోదే లాక్డౌనిక
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్!!

  రిప్లయితొలగించండి
 47. విలయముగాను మారెనతి భీకరమైన కరోన నేడిలన్
  కలకలమైన వేళ పరుగాపక రోగుల రక్ష సేయుచున్
  నిలిచిరి రాత్రియున్ బవలు నిద్ర నెరుంగని వైద్య బృందమున్
  అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా

  రిప్లయితొలగించండి
 48. అడరుచు మొఱుఁగుచు శునకము
  వడి వడి మా పైకి దూకఁ బర్వులు వెట్టం
  దడయక యుంచి తలు పనెడు
  గడి యారము సిగ్గుపడును గమనము నాపున్

  (గడి = ఎల్ల; ఆరము = నశించము]


  అలపులు గల్గు జీవులకు నారయ లోకము నందు నెల్లెడం
  గలుగునె జంత్ర మండలికిఁ గార్య నికాయము లందు నెన్నఁడున్
  సొలయదు యంత్ర కర్ణ మది చొప్పడ కున్న నిరోధ తప్తమై
  యలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా

  రిప్లయితొలగించండి
 49. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...


  "గడియారము సిగ్గుపడును గమనము నాపున్"


  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  రావణ బ్రహ్మ మహా శక్తిమంతుడు, ఇంద్రజిత్తు జన్మించు సమయమున గ్రహములను అన్నింటిని తన పాదము క్రింద తొక్కి పెట్టి గ్రహ చలనములను
  ఆపి వేసి గ్రహములను అన్ని శుభ దృష్టులు ఉండు
  నట్లుగా కాల సూచికను(గడియారమును) నియంత్రించాడు. శుభ గడియలలో ఇంద్రజిత్తుపుడితే
  మహా శక్తివంతుడు అవుతాడు అందువల్ల గ్రహములను దెవతలు ప్రార్ధించారు తమ గమనము మార్చు కోమని . కాని ఏ గ్రహము రావణాసురుని శక్తికి భయపడి ఆ సాహసము చేయలేకపోయినవి. శని మాత్రము నా దృష్టి రావణుని చూచునట్లు అవ కాశము కల్గించిన (శని దృష్టి ఉన్న అశుభము జరుగుతుంది అని లోకోక్తి.) నేను నా గమనము మార్చు కుంటాను అని చెబుతాడు. ఆప్పుడు దేవతలు నారదుని పంపి అతని ద్వారా శని దృష్టిని రావణాసరుని పై పడేటట్లు మరల్చ గలుగుతారు. ఆ సన్నివేశము ఇది.
  రవిరాక ముందుగన్ రత్నాకరము లందు
  స్నాన మాడి శివుని సంతసముగ


  పూజలన్ చేసెడు రాజ రత్నమువు నీ
  వు, సుర లెల్లరునీకు సిసువ రకము


  చేయు చుండగ నీవు హాయిగ రాజ్యము
  నేలుచు నుంటివి, నీ ఘనమగు


  శక్తి తోడన్ గ్రహ చలనము లాపుచు
  కాలితో నడచ లంక నగరాధి


  ప, (గడియారము సిగ్గుపడును గమనము నా
  పు)న్గద నిట, కడుముదము కల్గు


  చున్నది ,కలుగును సుతుడు శుభ ఘడియల

  సమయమున , మంద గమనము సంది యమ్ము

  కలుగు చుండె, వీక్షించి యా గతిని మార్చ

  ,మని తెలిపె నారదుడు దశా ననుని కాంచి

  రిప్లయితొలగించండి
 50. గురువు గారు పైది మార్చాను పరి శీలించండి

  రిప్లయితొలగించండి
 51. అన్నయ్యకు అంకితం!
  వడిగా కైపదములగొని
  నడిరేయిని పూరణముల నవ్వులబంచన్
  దడిగట్టగ దా నిద్రకు
  గడియారము సిగ్గుపడును గమనమునాపున్

  గురువుగారికి అంకితం!

  తలపులు నిండగా దగిన దార్ఢ్యముతోడను కైపదమ్ములన్
  బలమగు దీక్షతోడ పరిపాటిగ దానడిరేయి వేళలో
  పలుకుల తల్లికిన్ రుచిగబంచు వధానిని శంకరాఖ్యుని
  న్నలయక జూసినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!

  రిప్లయితొలగించండి
 52. వలపుల వాడిలోన,వయసొచ్చినకన్నెలవేడిజూడగా
  తలపులదాడిలో జడిసి ,తాహతుమించిన కోర్కెలూరగా
  మిలమిలమాడుయవ్వనము ,మీసముద్రిప్పగజూచువేళలో
  నలయకజూచినంత ,గడియారముసిగ్గిలియాగిపోవుగా
  ++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 53. నడిచెడి ముసలిది గోడన
  గడియారముదగ్గుచుండగంటలుమోతన్
  పడుచుదిచేతిన యున్నది
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్౹౹

  రిప్లయితొలగించండి
 54. అలికులవేణిపాన్పుననమాంతముసాగిలిరెచ్చిపోవదా
  నలయకచూచినంతగడియారముసిగ్గిలియాగిపోవురా
  పలుకగనెల్లవేళలనుబార్ధునినామముభక్తిశ్రద్ధలన్
  నలయకచూచియాఘటికహర్షమునొందుచుదేలియాడునే

  రిప్లయితొలగించండి
 55. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వడిగా పద్యము లల్లుచు
  వడితో స్పర్థించునట్టి ప్రజ్ఞావంతున్
  మిడిగా జూచుచు గదిలో
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్.

  రిప్లయితొలగించండి
 56. కందం
  బిడియము విడి యొడిఁ జేరఁగ
  ముడులన్నియు సిగ్గు వీడి ముచ్చటఁ జేయన్
  మడఁతుక వీడని పతిగని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  చంపకమాల
  వెలుపలఁ గాక లోపలనె వేడుకఁ జేసెడు జంట ముల్లులున్
  వలపుల దేల గంట కొక వాటున, గోడను నిల్చి సాక్షియై
  పులకలఁ గ్రొత్త జంటనొగి ముద్దుల మున్ గగ రేతిరంతఁ దా
  మలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా!

  రిప్లయితొలగించండి
 57. చం:

  వలదని యెంత జెప్పినను వాడుక రీతిని వీధికెక్కగన్
  నిలిపి కరోన రక్షణగ నెందులకంచని నిగ్గుతేల్చగన్
  చిలిపి జవాబు జెప్పవినిచెళ్ళను పోలిసు లాఠి దెబ్బలున్
  అలయక చూచినంత గడియారము సిగ్గులియాగిపోవురా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 58. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కలల లతాంగి చిత్రముగ కన్నుల ముందఱ తోచినంతటన్
  సులువుగ నామె సమ్మతిని సొంపుగ పెండిలియాడి గూడుచున్
  వలపును వీడ నాపతియు పత్నుల సౌఖ్య సుఖంబు లన్నియు
  న్నలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవుగా!

  రిప్లయితొలగించండి
 59. గడువదుకాలముముందుకు
  పడికూర్చుని తినుటకన్న పనిలేకున్నన్
  విడువని కరోన ఫలమిది
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 60. సడి సేయక తమపనులను
  వడివడిగా చేయుచుండు వారినిచూడన్
  ఘడియలతో పని యేమని
  గడియారము సిగ్గుపడును గమనము నాపున్

  రిప్లయితొలగించండి
 61. మిత్రులందఱకు నమస్సులు!

  [క్షణమైన ఆగకుండా నడిచెడి కాలచక్రముం జూచి, బాటరీల సహాయముతో నడిచే గడియారము సిగ్గుపడు సందర్భము]

  "చలనము నొంద, విద్యుదనుసారిగ నుండెడి దాన" వంచుఁ, దా
  గలకల నవ్వుచుం, దనదు కర్మము నొక్క క్షణమ్మునైన వీ
  డ్కొలుపక, లోకమున్ నడపు కోర్కిఁ జరించెడు కాలచక్రమే

  యలయక చూచినంత, గడియారము సిగ్గిలి యాగిపోవురా!

  రిప్లయితొలగించండి
 62. తలపుల రమ్య భావనలు
  తత్వవిరాజిత శోభనందగన్
  పులకితమై శరీరమిక
  ఫుల్లసరోజ సరాగ రాగమై
  విలసితచిత్ర మాధురి న
  వీన మనఃప్రభలందు నిల్వగా
  నలయక చూచినంత గడి
  యారము సిగ్గిలి యాగిపోవుగా!

  రిప్లయితొలగించండి