27, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3352

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"
(లేదా...)
"పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై"
(ఈ సమస్యను పంపిన విట్టుబాబుకు ఆశీస్సులు)

86 కామెంట్‌లు:

  1. మిక్కిలి బాధాకరమౌ
    పెక్కు సమస్యలు గలుగుట; పెన్నిధియె కదా
    చిక్కులెరుంగని బ్రతుకన
    చక్కగ నదె వరమునిమ్ము స్వామీ నాకున్

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    మిక్కిలి ప్రీతినిన్ నమిలి మ్రింగుచు లడ్డులు జాంగిరీలునున్
    ఫక్కున నవ్వుచున్ బలుపు పండుగ చేయుచు కుల్కుచుండెడిన్
    చక్కని భాజపాలకహ,...చల్లగ రాహులు సోనియమ్మకున్
    పెక్కుసమస్యలుండుటయె,...పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతిపక్షానికి సమస్యలుంటే అధికార పక్షానికి పండుగే కదా! మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. చిక్కు సమస్యల పూరణ
    చక్కగపూరించికవులుసంతస మొందున్
    ఒక్కటి కాదుకవులకున్
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  4. చిక్కని కొరోన వైరసు
    ఎక్కడ గన నక్కడెదుగ, విజ్ఞానముతో
    చిక్కుముడి విప్పనలవడె;
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లెక్కకు మించిన సంతతి
      చక్కగ తిండైనలేక సతమతమవుచున్
      చొక్కిల బ్రోవ కుచేలుని
      పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా.

      చొక్కిలు- కోరు

      తొలగించండి
    2. రేగళ్ళ వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ****
      యజ్ఞేశ్ గారూ,
      భక్తులకు సమస్యలుంటేనే గద భగవంతుని సన్నిధికి చేరేది... మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తిక్కది లాకుడౌను కడు తియ్యని గంటల శ్రాంతినీయగా
    బొక్కుచు మూడు పూటలును బోరును తీర్చు ప్రయత్నమందునన్
    ప్రక్కను శంకరాభరణ వాటిక నందున వేనవేలుగా
    పెక్కుసమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లాకుడౌనులో శంకరాభరణ సమస్యలతో కాలక్షేపం...
      మీ ప్రశంసాత్మకమైన ఆటవిడుపు పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ధన్యవాదాలు.

      తొలగించండి
  6. నిక్కపునిగ్గుదేల్చుటయెనీమముజూడగపూరణంబనన్
    చక్కనివౌసమాసములుసంధులుఛందముశోభగూర్చపెం
    జిక్కులనేర్చికూర్చగలచేవయుశక్తియుబొందనేర్వ,కై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  7. నిక్కము వ్యతిరేకంబై
    చక్కనిసాధనలుగల్గిసరిజేయగ,లా
    జిక్కుల మక్కువ గన ,కై
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  8. చక్కని కార్యదక్షతయు, సద్గుణరాశి, సమాజసేవకై
    మిక్కిలియైన కాంక్షయును మేలగు నిర్మలభావదీప్తితో
    గ్రక్కున సాగువారలను గష్టము లేమియు చేయలే విలన్
    బెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి


  9. మక్కువ దేని పయిననో
    టక్కని ప్రకృతి వరమిచ్చుటయు కోరినదే
    యెక్కువగుట భళి తధ్యము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ( నాటి ఉక్కుమనిషి ఉపప్రధాని పటేల్ -
    నేటి ఉక్కుమనిషి ప్రధాని మోడీ )
    నిక్కుచు నిందలాడు కడు
    నీచులు ;మీరిన కోట్ల సంతతుల్ ;
    మెక్కెడి నల్లవర్తకులు ;
    మెల్లగ దేశము దూరు దయ్యముల్ ;
    చక్కగ దల్లి గన్గొనని
    జాల్ములు ;నుక్కుప్రధాని మోడికిన్
    బెక్కు సమస్యలుండుటయె
    పెన్నిధియౌ గద !చిత్ప్రభాసమై .
    (జాల్ములు -అవివేకులు )

    రిప్లయితొలగించండి


  11. తక్కువ చేయదోయ్ ప్రకృతి ధారణ తోడుత నేది కోరగా
    మక్కువ గా జనాళి కదె మంచి యటంచును పంచి పెట్టునోయ్
    టక్కున తద్యమిద్దియె పటాగ్రపుబంగరుగా విశేషమై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై;



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. కుంతి..

    నిక్కముగా పలికెనిటుల
    చిక్కులు తొలఁగ గమలాప్తు చింతన జేయన్
    మక్కువ కల్గును మఱిమఱి
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  13. కం//
    ఎక్కువ కోర్కెల తోనే
    పెక్కు సమస్యలు గలుగుట, పెన్నిధియెకదా !
    చక్కని మోడీ పాలన
    మక్కువగా దలచి మీరు మరలుము నరుడా !!

    రిప్లయితొలగించండి
  14. చక్కని కొండిక , యర్థము
    జిక్కని మాటలను గూర్పుజేయ జదువగన్
    గ్రక్కున శంకరగురువుకు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ


    లెక్కలనంగ నాకునసలే భయమౌను! పరీక్షలన్ గనన్
    చిక్కులనెన్నొ విప్పవలె! చేయునదేమిక? పొత్తమందునీ
    లెక్కలతోడ వాటికి పరిష్కృతిఁ జూపునుదాహృతమ్ములౌ
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. కం//
    ఎక్కువ కోర్కెల తోనే
    పెక్కు సమస్యలు గలుగుట, పెన్నిధియెకదా !
    చక్కని మోడీ పాలన
    మక్కువగా దలచి నీవు మరలుము నరుడా !!

    రిప్లయితొలగించండి
  17. ఇక్కట్లెదురైన మనిషి
    చక్కగ భగవంతు దలచి సాగును సతమున్
    లెక్కకు పాండవు లోలెన్
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  18. ఒక్కఁడ బంధుసంగతము నొగ్గి వసించుచు నాశ్రమంబునన్
    జక్కఁగ శంకరాభరణ సత్కవిబృందమె నా కుటుంబమై
    ప్రక్కన నుండఁగా సతము వారల కేనిడునట్టి వేనవేల్
    పెక్కు సమస్య లుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి
  19. ఎక్కువచిక్కులుకలిగిన
    మిక్కిలి పనితనము పెరిగిమేలొనగూర్చున్
    చక్కని నేర్పరులగుటకు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  20. శంకరాభరణం
    సోమవారం...28/04/2020

    సమస్య:

    "పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై"

    నా పూరణ. ఉ.మా.
    **** **** **

    మక్కువతోడ జీవిత సమస్యల చిక్కుల నొక్కటొక్కటిన్

    జక్కగ నూడదీయుచును సాగుతు బోయిన జీవనమ్మునన్

    మిక్కిలి మోదమున్ గలిగి మీఱిన దృప్తియె కల్గు;నిక్కమే

    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  21. అక్కజ మేకద నరులిల
    చిక్కుసమస్యలు ముసిరిన ఛేదించుచు తా
    మిక్కిలి మేధావి యగును
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  22. ఉక్కిరి బిక్కిరి చేసెడు
    చిక్కుపరిస్థితుల మేధఁ జిగిరించుఁగదా!
    నెక్కొను జీవన ప్రగతియు!
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!

    రిప్లయితొలగించండి
  23. ప్రక్కన యున్నగృహములో
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!
    నిక్కపు కాలక్షేపము
    చక్కగ లాక్డౌనున నొగి చర్చింపంగన్!

    రిప్లయితొలగించండి
  24. దక్కగ ప్రశస్తి సభలో
    చిక్కులు గల్పింప దలచు శేముషి తతి కిన్
    జిక్క ని యవ ధాని కెపుడు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధి యే కదా

    రిప్లయితొలగించండి


  25. అక్కా జిలేబి నీకా
    పెక్కు సమస్యలు గలుగుట, పెన్నిధియె కదా
    తక్కువ సమయము లోనవి
    నిక్కముగా తీరుట! యిది నీ పుణ్యంబే!


    జేబి

    రిప్లయితొలగించండి


  26. ఎక్కువ తక్కువలె కదా
    నిక్కము గా దేల్చునోయి నిగ్గుని రమణీ
    చుక్కానిగా బతుకునకు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. చిక్కుసమస్యలే ముసిరి చిందర వందర జేయు వేళలో
    చక్కటి మార్గమున్ వెదకు, సాధన జేయుచు ముప్పునుండి తా
    జక్కగ పారిపోవు, నరజాతికి జూడ వరమ్మదే కదా
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి


  28. జాల్రా జిలేబి :)


    నిక్కము మోడికి కప్పెను
    తొక్కటపాటు సమయములె దుశ్శాలువలన్
    ముక్కాకలుదీఱుటకై
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. కందం
    చిక్కులఁ గరోన వెతలన్
    బ్రక్కన మన 'శంకరాభరణ' బ్లాగున నెం
    చక్కగఁ బూరణఁ జేయఁగఁ
    బెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    కుంతీమాత దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ తో...

    ఉత్పలమాల
    చిక్కులు చుట్టు ముట్టిన భజింతురు దైవము నార్తి భీతితో
    నొక్కడ వెన్నొ రీతుల సుయోధను దాష్టిక మాపి యల్లుడా!
    యక్కరలెన్నొ దీర్చు గతి నండఁగ నుండుచు, నీదు తోడుకై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై!

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు ఏమండీ*

    రిప్లయితొలగించండి


  30. మిక్కిలిగా పండగ తన
    కెక్కువ రాళ్ళు తగులు గురి యెక్కువగా! చూ
    డక్కా! చింతించకుమా
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  31. ముక్కుచు మూల్గుచు రాహుల్
    తక్కువ గా బతుకుటేల ? దావానలమై
    తెక్కలి సభ్యుల మార్చుము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. ఒక్కొక్క సమస్య యిడును
    చక్కని జ్ఞానమును దాని సాధించుటనన్
    నిక్క మిలన్ మానవునకు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!

    బాపట్ల సత్యనారాయణ సాయి

    రిప్లయితొలగించండి


  33. టక్కున వచ్చె కరోనా
    మిక్కిలి గా తంపరై సుమీ ధోరణులన్
    చక్కగ మార్చెను తృటిలో
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. *"శంకరాభరణము* సమూహపు సమస్యాపూరణము—
    27-04-2020.

    సమస్య : *"పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె గదా"*

    నాపూరణ

    *మ్రొక్కులు తీర్చుకొనంగను
    చిక్కులె వెంకన్న జూడ, శ్రీపతి కరుణా
    దృక్కులు వర్షించు నిధులు
    *పెక్కు, సమస్యలు గలుగుట పెన్నిధియె గదా!*

    రిప్లయితొలగించండి
  35. చొక్కపుఁ బైడి, సొమ్ములగు సుమ్ము భరించిన సుత్తివ్రేటులన్
    జెక్కినఁ గాని గండశిల శిల్పముగా విలసిల్లు రమ్యమై
    నిక్కము చెప్పితీవు బువి నేర్పు గడించ నెదొర్కొనన్ ధృతిన్
    బెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  36. :
    చిక్కుముడి విప్ప గలిగిన
    మిక్కిలి సంతృప్తిగల్గు మేధోవృద్ధిన్
    నిక్కము నామాట వినుము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా.

    కం:
    పక్కకు మళ్ళకు విసుగుచు
    చిక్కులు సాధించినపుడె సిద్ధిలభించున్
    లెక్కకురానీకువెతలు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"

    కం:
    చక్కటి నభ్యాసంబును
    చిక్కున నుభవని ధికూడ చేతనతోడన్
    బిక్కును వీడుము,నిజమిది
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"

    కం:
    చక్కటి నభ్యాసంబును
    చిక్కని భావంబుగూడి చేసిన కవితల్
    మక్కువ పెంచెడి పూరణ
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"

    రిప్లయితొలగించండి
  37. లెక్కలుతేలకనున్నవి
    పెక్కుసమస్యలు,గలుగుటపెన్నిధియెకదా
    యుక్కునుబోలుకరోనా
    నుక్కడెగడుమందువలననొగ్గుటదిశగా

    రిప్లయితొలగించండి
  38. నిక్కపుభక్తితోభవుని నీమముతప్పకపూజచేసినన్
    చిక్కులనెక్కుడున్ కలుగజేసిపరీక్షనువెట్టు భక్తులన్
    స్రుక్కకదీక్షబూనిపలు శోధనలన్ భరియింప మేలగున్
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి
  39. మక్కువతోడపూరణముమంచిగజేసెడుదీర్ఝదర్శికిన్
    బెక్కుసమస్యలుండుటయెపెన్నిధియౌగదచిత్ప్రభాసమై
    నిక్కమునేవచించితినినేర్పులుగల్గెడువారలెందఱో
    చిక్కుసమస్యనున్సులభశైలినిపూరణజేతురేగదా

    రిప్లయితొలగించండి
  40. ఉ:

    నిక్కము జీవితాన బ్రతి నిత్యము జూతుము కష్ట మెన్నగన్
    తక్కువపాటు లేక మది ధైర్యము నిండగ సంచరింపనౌ
    చొక్కపు పుత్తడిన్ దివియ చొప్పుడు క్రోవిని గాల్చు చందమై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  41. అక్కుంతీ సుతుఁ డర్జును
    చిక్కులు దీర్చఁగ మురారి చిక్కిన రీతిం
    జక్కని మిత్రుఁడు, తీర్చఁగఁ
    బెక్కు సమస్యలు, గలుగుట పెన్నిధియె కదా


    చిక్కులు కల్గ మిక్కుటము సిక్కక చింతల నిబ్బరమ్ముగా
    నుక్కు లయమ్ము గాక పరమోన్నత యుక్త వివేక మంద వీ
    లెక్కుడు కల్గఁ బాత్ర మగు నేరికి నిద్ధర వింత కాదులే
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి
  42. మహభారతములో కుంతీ దేవి .......... ( కష్టములే తనకు భక్తిని శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి దరిచేర్చినాయని చెప్పే సందర్భము )

    అక్కజమైంత రీతి హృదయాంతరమందు హరిన్ దలంపరే
    మిక్కుటమైన సంపదలమేయ సుఖంబులుఁ గల్గినంత తాఁ
    స్రుక్కిన్ బాధలన్ బడినచో జపియింతుము కృష్ణుఁ భక్తిమై
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి
  43. మక్కువతో పద్దెముపై
    చక్కగ పాఠముల నేర్పు శంకరు లనగా
    చక్కర గుళికను బోలిన
    పెక్కు సమస్యలు గలిగిన పెన్నిధియె గదా!

    రిప్లయితొలగించండి
  44. లెక్కకు మించి వధానము
    లిక్కాలంబున ఘటింపనినెంచిన తనకున్
    మిక్కుట సాధన జేయఁగ
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  45. మిత్రులందఱకు నమస్సులు!

    [ఎన్ని కష్టములందినను చివరకు హరిశ్చంద్రుని వలె దైవానుగ్రహమునే పొందుదురనుట]

    అక్కట! గాధిజుం దనుప నా నృపుఁడే సతిఁ బుత్రునిం ద్విజుం
    డొక్కని కప్పు డమ్మి, కొని యొందిలి, బుక్కసుఁ డొక్కడుం గొనన్,
    జక్క శ్మశాన మేలుచునుఁ, జంద్రమతిన్ నఱకం జనన్, శివుం
    డక్కజమంద వచ్చి, వెస నాపియుఁ, బూ ర్వపు వైభవమ్మిడెన్!
    బెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై!!

    రిప్లయితొలగించండి
  46. అందరికీ నమస్సులు 🙏🙏

    *కం||*

    చక్కని మనస్సు గలిగిన
    చుక్కని మనువాడ తలచి చూపులు కలుపన్
    నిక్కము పెండ్లని తెలిసిన
    *"పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  47. కుచేలుని వృత్తాంతము

    పెక్కురు సంతానముతో
    మిక్కిలి దారిద్ర్యమునను మెలకువ యున్నన్
    దక్కును కృష్ణకటాక్షము
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె గదా!

    దక్కును కృష్ణుని దర్ళన
    ముక్కిరి బిక్కిరినిజేయు ముదమును గూర్చున్
    చిక్కని భక్తిని నమ్మిన
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె గదా!

    ఒక్కరె వసించుచున్నను
    చక్కని తనబ్లాగునందు సఖ్యతతోడన్
    దక్కగ శిష్య పరంపర
    పెక్కు సమస్యలు గలిగిన పెన్నిధియె గదా!

    దక్కక చోటు దండ్రికడ దారుణదుఃఖము దోడుతన్ విసం
    గ్రక్కెడు మారుదల్లి పలురక్కసి బల్కులు గుండెజీల్చగా
    మ్రొక్కుచు శ్రీహరిన్ గొలువ బొందెను శాశ్వత రిక్కవాసమున్
    పెక్కు సమస్యలుండుట పెన్నిధియౌగద చిత్ప్రభాసమై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక్కపరిన్ కపోతతతి యోర్వకజిక్కును జాలమందున
      న్నొక్కపరిన్ కురంగమును,యద్భటముల్ పడు బోయవానికిన్
      చిక్కులదీర్చ మిత్రులగు చిట్టెలుకన్ మరి వాయసంబులే
      పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌగద చిత్ప్రభాసమై!

      తొలగించండి
  48. ఏసమస్యయు లేకుండ నీపుడమిని
    జీవితమునెంచ తరమౌన, చిరునగవున
    పాలుపంచుకొనినను మీ లోపమెరిగి
    వచ్చునవగాహనము దృతి బ్రతుకు నీడ్చ
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  49. మక్కువతోడ కార్యముల మాన్యులు చక్కగ చేయు చుందురే
    లెక్కకు రావు చిక్కులవి ప్రీతి సమస్యల నెంచి దాటినన్
    దక్కును లౌకకంపు స్థితి తద్దయు ధ్యైర్యము వచ్చు నెప్పుడున్
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై

    రిప్లయితొలగించండి


  50. నిక్కముగా హరి ధ్యాసను
    మిక్కుటమును చేయు గాదె మేదిని లోనన్
    మ్రొక్కుచు భక్తిని పెంచెడు
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా

    రిప్లయితొలగించండి
  51. చిక్కు సమస్యలవిప్పుచు
    చక్కని పద్యముల జెప్పు శక్తియె గలుగన్
    లెక్కకు మిక్కిలి వచ్చెడి
    పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా!


    రిప్లయితొలగించండి
  52. చెక్కిన శిల్పమోలె పలు చిక్కని పద్యసుమాల నల్లగా
    అక్కున జేర్చుకొందురభి మానధురంధర చక్రవర్తులే
    చక్కని పద్యమల్ల గను శారద నిచ్చిన, శక్తియుక్తులన్
    పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై!!


    రిప్లయితొలగించండి