7, ఏప్రిల్ 2020, మంగళవారం

సమస్య - 3332 (స్తంభాగ్రంబున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో"
(లేదా...)
"స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే"

82 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    అమిత్ షా ఉవాచ:

    కుంభమ్మందున మీనమౌ తెరగునన్ గుప్తమ్ముగా నిక్కుచున్
    దంభమ్మౌ కడు పల్కులన్ వడివడిన్
    ధైర్యమ్మునన్ నేర్చుచున్
    రంభన్ బోలు ప్రియంక! కాంగ్రెసున నిన్ రప్పించగా రాహులే
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటివిదె గ్రద్దా
    పెద్దవైనావటే!

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కంభమ్మందున దొర్వునన్ తరువుపై గారాబుగా పుట్టుచున్
    కుంభమ్మందున నీటినిన్ పడుచు మా గుండమ్మకున్ చిక్కగా
    గంభీరమ్మగు హైద్రబాదు నగరిన్ గర్వంపు జూ లోననున్
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే!

    రిప్లయితొలగించండి


  3. అద్దాలమేడ పైనో
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో?
    పెద్ద అరిందముడివకో
    మొద్దువలెన్ దూషణలకొ ముతజిర్ తలపో?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. అంభశ్చారపు పోకడై యిపుడు నీ వారిందవైనావు నీ
    రంభారావిడి పొద్దుగూకుల ప్రచారాల్చేయ చానల్సులే
    జంభాల్కొట్టుచు మోడి పై కొడిమెలన్ జవ్వాడుచున్చేయుటా?
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి.యస్ వారి దారి పట్టినట్టున్నారు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. (ద్రౌపదీపరాభవ సమయంలో భీష్మపితామహుని,ద్రోణాచార్యుని,ధృతరాష్ట్రచక్రవర్తిని ఉద్దేశించి
    వారి అంతరంగాల ఔన్నత్యాన్ని అన్యాపదేశంగా ప్రశ్నిస్తున్న సుయోధనసోదరుడు వికర్ణుడు )
    స్తంభంబందెన నీదు మానసము తా
    తా !మాటలే పోయెనా ?
    కుంభంబందున సంభవించితివిగా
    గూఢత్వమా దేశికా ?
    గంభీరంబుగ గద్దెనెక్కిన పితా !
    గర్వాంధులన్ దిట్టవా ?
    స్తంభాగ్రంబున గూరుచుంటి విదె గ్ర
    ద్దా !పెద్దవైనావటే ?
    (స్తంభంబందెన -కొయ్యబారెనా ;గూఢత్వమా -దాగుండటమా;దేశికా -గురువర్యా;పితా -తండ్రీ )

    రిప్లయితొలగించండి
  6. అద్దమ రేయిన నీవిటు
    నిద్దురమాని మలయాద్రి నిగ్గులు గనుచున్
    సద్దును చేయక నుంటివి
    గ్రద్దా స్తంభాగ్రమెక్కగా పెద్దవొకో



    రిప్లయితొలగించండి
  7. కం//
    శుద్దులు నేర్పెన పెరుమాళ్
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో !
    ముద్దుగ నామాటలినుమ
    సద్దును జేయక వెడలుము స్వామికి దెలుపన్ !!

    రిప్లయితొలగించండి
  8. శుంభత్క్రౌర్యమహాగ్నిదగ్ధు డగుచున్ శూరత్వముం జూపి యా
    జంభార్యాదుల ధిక్కరించు ఖలుడై సర్వాత్మనోన్మాదియౌ
    దంభప్రావృతు డొక్కరుం డనెను గృధ్రం బందు జేరంగ నీ
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?

    రిప్లయితొలగించండి
  9. గద్దెపయి యంధుడుండిన
    గ్రద్దలె రామచిలుకలగు కాదన గలరే
    పెద్దవు వారింపనిచో
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగా బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులకు నమస్సులు. 'రాజకీయ గోల్మాలులు' అనేసమాసం సమ్మతమేనా. సరదాగా పూరించాను. పరిశీలించ ప్రార్థన.
    సుద్దులు బలుకుచు వెనుకన్
    గ్రుద్దుచు నీ రాజకీయ గోల్మాలులతో
    గద్దెను జేరిన యోరీ
    గ్రద్దా ! స్తంభాగ్ర మెక్కగా బెద్దవకో!
    (ఒక నేత తన వ్యతిరేక పక్షం లోని పదవిని పొందిన మరొక నేతతో. )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజానికి 'రాజకీయ గోల్మాలులు' దుష్టసమాసమే. ఎలాగూ సరదా పూరణ అన్నారు కదా...

      తొలగించండి
  11.  పెద్దవని గౌరవించగ 
    సుద్దులు చెప్పుటె సతతము సూక్తుల వలెనే 
    వద్దులె  చాలులె చెప్పకు 
    "గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో" 

    రిప్లయితొలగించండి
  12. కందం
    పెద్దననుచుఁ దొందొల్తను
    నొద్దిక గారవముఁ జూపి యున్నతుఁడుగ నే
    డుద్ధతిఁ బేరిట్టి పిలుచు
    గ్రద్దా!స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పూరణ
      కందం
      పెద్దననుచుఁ దొందొల్తను
      నొద్దిక గారవముఁ జూపి యున్నతుఁడుగ నే
      డుద్ధతిఁ బేరెట్టి పిలుచు
      గ్రద్దా!స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో!!

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ
      కందం
      పెద్దననుచుఁ దొందొల్తను
      నొద్దిక గారవముఁ జూపి యున్నతుఁడుగ నే
      డుద్ధతిఁ బేర్వెట్టి పిలుచు
      గ్రద్దా!స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో!!

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    శుంభత్పౌరుషమొప్ప రక్కుచు దశాస్యున్ గోళ్లతో.,నింగి సం..
    రంభంబొప్ప జటాయువప్పుడిటు పోరాడన్., దయాహీనుడై
    దంభోన్మత్తుడు రెక్కలన్ దునుముచున్ దా పల్కెడిన్ "మద్రథ..
    స్థంభాగ్రమ్మున నిల్చి నిక్కెదవు గ్రద్దా! పెద్దవైనావటే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'స్తంభాగ్రమ్మున' టైపాటు.

      తొలగించండి
  14. అంభో జాక్షుని వాహనాంబ వగుచీ వారాధ్య మై వెల్గుచు న్
    గంభీరంబగు రూపు తో నెగుర వే కమ్రమ్ము గా రోదసి న్
    కుంభి న్ జేరియు దేవళంబు గనియు న్ కోర్కె న్ హరి న్ గాంచ గా
    స్తంభా గ్ర o బున కూరు చుంటి విదెగ్రద్దా పెద్ద వై నా వ టే

    రిప్లయితొలగించండి
  15. వద్దని చెప్పిన కూడను
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో !
    గద్దెపయికెక్కి నంతనె
    పెద్దరికమనునది నీకు వెరపెటు లౌనో !

    రిప్లయితొలగించండి
  16. హద్దులు మీరిన యహమిక
    వద్దుగ, కోకిల గళమున పదుగురు మెచ్చన్
    ముద్దుగ పాడగ తరమే ?
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    [కద్రువనుండి తన తల్లి చెఱను మాన్పించుటకు స్వర్గమునఁ గల యమృతముం దేఁబోయిన గరుత్మంతుని గేలి సేయుచు నింద్రుఁడు పలికిన సందర్భము]

    "దంభంబూనియు స్వర్గధామమున యుద్ధం బూని రావచ్చునా?
    జంభారిన్నెదిరించి నెగ్గగలవే? శత్రుత్వముం బూని యు
    జ్జృంభింపం దగునే? సుధన్ గొనియుఁ బోన్ శ్రేష్ఠాత్ముఁ డీవే? యొహో

    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా! పెద్దవైనావటే?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'జంభారిన్ + ఎదిరించి' ... ద్విత్వనకార ప్రయోగం చేసారు. అక్కడ "జంభారాతి నెదిర్చి* అనవచ్చు కదా?

      తొలగించండి
    2. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ! మీరు సూచించిన సవరణ బాగున్నది. తప్పక స్వీకరిస్తాను. కృతజ్ఞతలు!

      సవరించిన పూరణము:
      "దంభంబూనియు స్వర్గధామమున యుద్ధం బూని రావచ్చునా?
      జంభారాతి నెదిర్చి నెగ్గగలవే? శత్రుత్వముం బూని యు
      జ్జృంభింపం దగునే? సుధన్ గొనియుఁ బోన్ శ్రేష్ఠాత్ముఁ డీవే? యొహో
      స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా! పెద్దవైనావటే?"

      తొలగించండి
  18. గురువు గారికి నమస్సులు.
    ఒద్దిక కరువై సవతుల్
    హద్దుల్ మీరగ సుహాస హృదయము లేకన్
    పెద్దగు భార్యను తిట్టెన్
    గ్రద్దా స్తంబాగ్రమెక్కగా బెద్దవొకో

    రిప్లయితొలగించండి

  19. శార్దూలవిక్రీడితము
    శంభుండీయఁగ మేటిదౌ వరమునశ్వత్థామ దుష్టాత్ముఁడై
    డింభుల్నౌ యుపపాండవేయులను ఖండించంగ పార్థుండనెన్
    యంభోజాక్షుని ద్రౌపదీసతుల సౌహార్ధమ్ము రక్షించెనిన్
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'డింభుల్నౌ' ? 'అనెన్ + అంభోజాక్షుని' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.
      డింభుల్నౌ = పిల్లలైన

      సవరించిన పూరణ :

      శార్దూలవిక్రీడితము
      శంభుండీయఁగ మేటిదౌ వరమునశ్వత్థామ దుష్టాత్ముఁడై
      డింభుల్నౌ యుపపాండవేయులను ఖండించన్ నరుండాడె న
      య్యంభోజాక్షుని ద్రౌపదీ సతుల సౌహార్ధమ్ము రక్షించెనిన్
      స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?

      తొలగించండి
  20. దంభంబే నిజ మార్గమై వితథ వాగ్దానంబులన్ జేసియున్
    కుంభంబున్ దగ కొట్టినాడనని వాక్రువ్వంగ నేమౌనొకో
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే
    యంభారావములాపుమా దెలిసె నీదన్యాయమౌ రీతులే

    రిప్లయితొలగించండి
  21. బద్ధకమదేలనీకున్
    సిద్ధంబవ్వుడి మఖమున, సేవాగుణమున్
    బద్ధుడవైకలిగుండక
    గ్రద్దా! స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  22. *శిశుపాలుడు కృష్ణుని నిందించుచూ పలికిన మాటలుగా....*

    సంభారమ్మున తక్రసారమొలకన్ స్వచ్ఛందజుల్ మిత్రులై
    యంభోజాక్షులు స్నానమాడుతరి సంవ్యానంపు చోరుండవై
    రంభోరూసతి రుక్మికిన్ సహజనే లంకించినావే యిటన్
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే

    రిప్లయితొలగించండి
  23. సుద్దులుబలుకగనేరవు
    మొద్దునువలెమెలగుచుండిమూర్ఖపుచేష్థన్
    హద్దులుమీరుచునుంటివి
    గ్రద్దా!స్తంభాగ్రమెక్కగాబెద్దవొకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మొద్దువలెన్ మెలగుచుండి" అనండి.

      తొలగించండి
  24. సుద్దుల జెప్పుచు తిరిగెడు
    మొద్దును గని యొక డనియెను మొరటు గ న య్యా
    కొద్దిగ యోచింప వలయు
    గ్రద్దా ! స్తంభాగ్ర మెక్క గా పెద్ద వొకో !

    రిప్లయితొలగించండి
  25. కం//
    శుద్దులు నేర్పెన పెరుమాళ్
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో !
    ముద్దుగ నామాట వినుము
    సద్దును జేయక వెడలుము స్వామికి దెలుపన్ !!

    రిప్లయితొలగించండి
  26. కం.

    ప్రొద్దున లేచిన దాదిగ
    ఖద్దరు బట్టల ముసుగున ఖర్చులు యనుచున్
    లొద్దగ రూకలు జమగొన
    గ్రద్దా స్తంభాగ్ర మెక్క గా బెద్దవొకో

    లొద్ద : రాశి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఖర్చులు+అనుచు' నన్నపుడు యడాగమం రాదు. "కర్చులటంచున్" అనండి.

      తొలగించండి
  27. అంభోజాక్షునిసేవకోసముగదాయాత్రంబుతోనచ్చటన్
    స్తంభాగ్రంబునగూరుచుంటివిదెగ్రద్దా!పెద్దవైనావటే
    దంభంబెక్కడగాననీయకభళాతాదాత్మ్యమైనుంటివే
    స్తంభంబయ్యదిదైవరూపముగదేదావిష్ణునుంటన్సుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాదాత్మ్యమై యుంటివే' అనండి. "దా విష్ణువౌటన్ సుమా" అనండి.

      తొలగించండి
  28. సద్దయ మీ కుల జన్యము
    నద్దామోదరుఁడు గొనియె నంగన మనగం
    బెద్దవె నీ విలఁ జుమ్మీ
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో


    గంభీరస్వన భీక రోద్ధత మహా కంఠీరవం బుండఁగా
    నంభారావము పిక్కటిల్ల దిశలం దాఁబోతు లుండంగ సం
    రంభావేశములం జెలంగి వని వ్యాఘ్రం బుండ గర్జించుచున్
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్ద వైనా వటే

    రిప్లయితొలగించండి
  29. సంభాషింతువు మంచిమాటల సదా సాధించగా డుబ్బు నున్
    అంభోదంబున రాలు తుంపరులతో యాచార పూజల్ గదా
    గంభీరంబుగ దాచిబెట్టు ధనమే గాచేటి దేవుండు, ఛీ!
    స్తంభాగ్రంబున గూరుచుంటి విదె గ్రద్దాపెద్దవైనా వ టే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'డబ్బునున్' టైపాటు. "తుంపరలతో నాచార పూజల్..." అనండి. 'కాచేటి' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  30. దంభంబుల్ పలు చెప్పి యెక్కితివిలే చక్కంగ నా గద్దె ప్రా
    రంభంబున్ పొనరించి తీ వెరలనే లక్ష్యమ్ముగా వేట సం
    రంభం బాపుము పొంచె ఝంఝ ధరపై రాల్చంగ నిన్ జాలులే
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?

    రిప్లయితొలగించండి
  31. కృద్ధపుచేష్టలుమానుము
    శ్రాద్ధాన్నంబునుతినుశ్మశానపు పక్షీ
    యెద్దానికి నీగర్వము
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  32. గంభీరంబుగ పెద్దలున్ బుధులు ప్రాగబ్బంబులన్ బండితుల్
    సంభాషించుచునుండగా సభను వేసంబూనినన్ బ్రాజ్ఞసం
    రంభం బొప్పగ శుంఠ పెద్ద యగునే? లక్షింపకన్ స్థాయి యా
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే?

    రిప్లయితొలగించండి
  33. పెద్దని కీర్తి గడింపగ
    పెద్దగ పాండిత్య ముండి పేరొందవలెన్
    గద్దెను గూర్చొన జాలునె?
    గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో!

    రిప్లయితొలగించండి
  34. తిరుమల బ్రహ్మోత్సవాలకు గరీడ ధ్వజారోహణ

    శ్రద్ధను గనంగ వేడ్కలు
    సిద్ధులు యక్షులు సురాది చిన్మయబృందం
    బుద్దీపనమంది తరల
    గ్రద్దా!స్తంభాగ్ర మెక్కగా బెద్దవొకో!

    అంభోజాక్షుని యుత్సవంబులవి నేడత్యంత భోగమ్ముమై
    గంభీరాకృతి నిర్వహించుటకునై గంధర్వ యక్షాదులన్
    రంభాద్యప్సరసల్ విరించి హర సుత్రామాది బృందమ్ములన్
    సంభావించుచు స్వాగతమ్మననహో! శాస్త్రోక్తరీతిన్ దగన్
    స్తంభాగ్రమ్మున గూరుచుంటివిదె గ్రద్దా!పెద్దవైనావటే!

    రిప్లయితొలగించండి
  35. పెద్దలుజెప్పెడు సూక్తులు
    బుద్ధిగ మనమాచరించ బూజర వీడున్
    బద్ధకమనినీవందువ
    గ్రద్దా స్తంభాగ్రమెక్కగాబెద్దవొకో
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  36. తద్దయు ధైర్యంబడరగ
    యుద్ధమునర్జునుడుచేయ యోధులతోడన్
    ఒద్ధికగ సమరము గనుచు
    గ్రద్దా! స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  37. తద్దయు భీతిని పొందుచు
    నొద్దికగా గృహము నుండి యూరక నీతుల్
    రద్దైన మాటలు పలికెదు
    గ్రద్దా! స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో

    రిప్లయితొలగించండి
  38. అందరికీ నమస్సులు 🙏🙏

    *కం||*

    హద్దూ పద్దూ లేకను
    వద్దని చెప్పిన పనులను వదలక నీవే
    ముద్దుగ మాటలు వినవా
    *"గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో"?*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో ప్రయత్నం 🙏🙏

      *కం||*

      యుద్ధమునకు సిద్దమనుచు
      హద్దులు మీరుచు దుమికిన హరియించెదమే
      ముద్దుగ జెప్పిన వినవా
      *"గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో"?*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి

  39. శంభోశంకర బుట్టుజీవులను విశ్వాసాన రక్షింపగా?
    లంభంబౌ సుఖశాంతులందగనె! సౌలభ్యానజీవించగా
    డింభంబందున నున్న ప్రాణులను నాడించేటి మార్గంబులో
    స్తంభాగ్రంబున కూరుచుండుటకు గ్రద్దా పెద్దవైనావటే!
    శ్రీ. కె.ఈశ్వర ప్ప.ఆలూరు. కర్నూలు జిల్లా

    రిప్లయితొలగించండి
  40. దంభంబుల్ సరిచాలుపల్కకికనీదర్పంబు చాలించు యా
    రంభంబాయెను నీకుదుర్దినము మీరంబోకుమా హద్దులన్
    సంభావించక నెగ్గుసిగ్గులనువాచాలత్వముంజూపెదే
    స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే

    రిప్లయితొలగించండి