23, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3348

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్"
(లేదా...)
"మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్"

47 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    అమిత్ షా ఉవాచ:

    మూర్ఖుడు గాని వాడెవడు ముందుకు వచ్చెడి ధైర్యముండకే
    మూర్ఖుల రాజకీయమున మూర్ఖుల కోటుల మధ్యనాదటన్
    మూర్ఖుల మీర రాజిలుచు ముద్దుల మోమున రాహులుండగన్
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మూర్ఖపు కైపదమ్మునను మొన్నను నిన్నటి కాలమందునన్
    మూర్ఖపు పూరణమ్మిడగ ముచ్చట మీర శకారునిన్ గొనన్...
    మూర్ఖుల మీర మూర్ఖుడిట మోసపు బుద్ధుల శాస్త్రియుండగన్
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్

    శాస్త్రి =
    భవదీయుడు జి. ప్రభాకర శాస్త్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్ఖపు కైపదానికి ఇంతకంటె మంచి పూరణను నేనెలా ఆశిస్తాను?
      మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  3. ఇచ్చిన పాదమెక్కడే జిలేబి :)


    అడుసున కాలెట్టియరే
    ముడికారియనుచు వడివడి మూర్ఖుండు శకా
    రుఁ డనుట పోలునె మీకున్
    తడబాటు పడడతడే వితథము పలుకగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాట్సాఫ్ జిలేబి గారూ,
      పాదభ్రంశంతో దుష్కరప్రాసాక్లేశాన్ని తప్పించుకున్నారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  4. జిలేబి చుట్టుటెట్లు :)

    మూర్ఖుడు మారకారుడగు? ముద్దుగ తిట్టుటదేల సోదరా?
    మూర్ఖుడెవండు? బుద్ధిని సమున్నత గల్గిన వాడెవండగున్?
    మూర్ఖుడు వీడు మూర్ఖుడని ముచ్చటగా వడి బల్కుటేలనో
    మూర్ఖుఁ డటంచు మీర నుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్!


    ఇట్లే జిలేబి చుట్టవలె :) వృత్తమనగా జిలేబి జిలేబి అనగా వృత్తము :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మూర్ఖత యనగ నెరుంగక
    మూర్ఖత్వంబు నెవరికిని మోప బొసగదే
    మూర్ఖత్వంబును జూపుచు
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్

    నాకు శకారుని కథ తెలియదు.క్షమించండి.గూగులమ్మనడిగి తెలుసుకుంటాను 🙏🏽

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సీతారామయ్య గారికి

      ఓ మూడు సంవత్సరాల క్రితం ఎవరీ శకారుడు అని నాకూ తెలియక ఆ పై తెలుసుకొనేందుకు చేసిన యత్నం రిజల్ట్స్ ఈ లింకులో చదువ వచ్చు -

      శకారుడెవరు ?


      https://varudhini.blogspot.com/2017/10/blog-post_21.html



      జిలేబి

      తొలగించండి
    2. ధన్యవాదములు జిలేబి గారూ . నమస్కారములు

      తొలగించండి
  6. కం//
    మూర్ఖుడు గాకున్నను ప్రజ
    మూర్ఖులతో దిరుగ రాజు మూర్ఖుం డనగన్ !
    మూర్ఖుల అభియోగము విని
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్ !!

    రిప్లయితొలగించండి
  7. మూర్ఖజనాధినాయకుడు మూర్ఖశిఖామణి యొక్కనాడటన్
    మూర్ఖులసంఘమందు కడు మోదముతో వచియించె నీగతిన్
    మూర్ఖుడు కాడతండు మనముందు తరంబున మార్గదర్శినిన్
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్.

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    శకారుని చెలికాడు.. గ్రామజనులతో...

    స్వర్ఖగ నీతమౌ అమృత జాతి రసమ్మును గ్రోలి వాగుచున్
    గీర్ఖరుడంచు పేరుగొనె! నీతిగ భీత వసంతఁ బండిత...
    ద్వార్ఖము జేర్చె! రాజునకు బావమఱందిని దుష్టబుద్ధితో
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్ ??

    స్వర్ఖగము... గరుత్మంతుడు

    గీర్ఖరుడు... మాటలచే గాడిద(నింద్యుడు)

    ద్వార్ఖము... ద్వారమనెడి ఖాళీప్రదేశము

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ఔత్సాహికులకు మార్గదర్శకమై, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సంతతనీచకార్యహతసాధుజనాళిసురక్షణార్థమై
    చింతిలి, వీడి ప్రేముడిని, చేష్టల నోర్వమి యాదిశక్తి, దు
    స్స్వాంతహిరణ్యదుష్టమహిషాదిదురంతకహంతకాళిఁ దా
    నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  10. తడబడి మద్యపు మత్తు న
    పుడమిని పల్కె నొక డిట్లు మూర్ఖుo డు శకా
    రు డనుట పోలునె మీకు న్
    వె డ గయి నావలె నతడును వెల్గెను గదరా

    రిప్లయితొలగించండి
  11. మూర్ఖుని కెల్లజనంబులు
    మూర్ఖులుగా దోచుచుంద్రు పూజ్యుండైనన్
    జార్ఖండు వాసు లారా
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్

    రిప్లయితొలగించండి
  12. ఝార్ఖండుకు రాజైనను
    మూర్ఖుండై మసలువాడు బూతులె నమ్మున్
    చర్ఖాలా మాటల్లెడి
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్

    రిప్లయితొలగించండి
  13. వడవడ వణకుచు ముదుసలి 
    తడబడుచును రాగ పల్కె మూర్ఖుండు, శకా           
    రుఁ డనుట పోలునె మీకు
    న్కడు దీనత నున్నవాని కరుణయె లేకన్  

    రిప్లయితొలగించండి
  14. మూర్ఖుడవీవుకాన జన పూజ్యుడు వీరుడు విక్రమార్కునిన్
    మూర్ఖునిగా దలంచితివి, బుద్ధివిహీనుడ వోయ చాలికన్
    మూర్ఖుల కెవ్వడేని కడు మూర్ఖునిగా కనిపించు సత్యమే
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [శకారానుయాయులు శకారునిఁగూర్చి వ్యతిరేకులతో వచించు వాక్యములు]

    చర్ఖను చేతఁబట్టఁగను చక్కఁగ నీతని గాంధి యందురే?
    బుర్ఖనుఁ దాల్చినాఁ డితఁడు పోల్కిని ముస్లిముఁడౌనె యీతఁడున్?

    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్?
    మూర్ఖుఁడితండు కాఁడు ఘనమూర్ఖశిఖామణికాఁడె? నమ్ముఁడీ!

    రిప్లయితొలగించండి
  16. మూర్ఖునితో వాదించుట
    మూర్ఖపు పనియౌ, విడువక మొండిగ నటులే
    మూర్ఖుని దెగడిన వాడను
    "మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్"

    రిప్లయితొలగించండి
  17. మూర్ఘుడగు ముఖ్యమంత్రిని
    మూర్ఖపు ప్రజలెన్నుకొనగ ముద్దుగ దామే
    మూర్ఖత ప్రశస్తియౌటను
    మూర్ఖుండు శకారుడనుట పోలునె మీకున్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్ఖులు వారెపో భువిని ముద్దుగ నెన్నుకొనంగ మూఢునిన్
      మూర్ఖతయే పసందగుచు పూజ్యతనొందగ నాంధ్రదేశమున్
      మూర్ఖత నిండుగాదనరు మొండిశిఖండియె రాజ్యమేలగా
      మూర్ఖుడటంచు మీరనుట పోలునె శిష్టశకారు నివ్విధిన్ !

      తొలగించండి
  18. ఉ:

    మూర్ఖుడటంచు ముద్రబడ ముచ్చట దీరగ నన్ని కార్యముల్
    మూర్ఖత పేరు మీదుగను మొండిగ ఢీకొని నిర్వహించుచున్
    మూర్ఖపు నైజమున్ విడచి ముంగిట నిల్చెడు వాడినే యహో
    మూర్ఖుడటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. పూజలకు ప్రణామాలు🙏
    ఈ రోజు నా పూరణ...
    కం"

    మూర్ఖుల చేసెన్ ప్రజలను

    మూర్ఖపు పాలన సలిపిన మూడు సమయమున్

    మూర్ఖ శిఖామణి నొట్టిగ

    *మూర్ఖుండు శకారుడనుట పోలునె మీకున్?*

    వాణిశ్రీ నైనాల

    రిప్లయితొలగించండి

  20. కం:మూర్ఖులతో సహవాసము
    మూర్ఖుల కే చెల్లుననుచు భువిలో నెపుడున్
    మూర్ఖుల వలె మాట్లాడుచు
    *మూర్ఖుండు శకారుడనుట బోలునె మీకున్.*

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులకు ప్రణామాలు🙏
    ఈ రోజు నా పూరణ...


    మూర్ఖుల చేసెన్ ప్రజలను
    మూర్ఖపు పాలన సలిపిన మూడు సమయమున్
    మూర్ఖ శిఖామణి నొట్టిగ
    *మూర్ఖుండు శకారుడనుట పోలునె మీకున్?*

    వాణిశ్రీ నైనాల

    రిప్లయితొలగించండి
  22. మూర్ఖునిసబబేయిటులన
    మూర్ఖుండుశకారుడనుటపోలునెమీకున్
    మూర్ఖతవలనే నాతడు
    గీర్ఖరుడైసానిజంపికేలినిదాచెన్

    రిప్లయితొలగించండి
  23. *ఈ 'ర్ఖ'ను ప్రాసగా నిడుట యెట్లు సమంజసమయ్యె మీకు? మై*
    *సూర్ఖలులందఱం గలిసి చొక్కపు మద్యముఁ గ్రోలినారొ? వే*
    *ర్వేర్ఖనిజంబులం గలిపి మ్రింగితిరో కన మందబుద్ధులై*
    *మూర్ఖుఁడటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. చిన్న సందేహము.

      ఒకచో హ్రస్వంబు దీర్ఘంబగు. – ప్రౌఢ. సంజ్ఞ. 3.

      ఈ సూత్రము ప్రకారము “ఈ ర్ఖా ను ప్రాసగా ..” నన వలయు నేమో యని నా సందేహమండి.

      తొలగించండి
  24. మూర్ఖ జనుఁ డౌను జూపిన
    మూర్ఖత్వమ్ము నతఁ డగునుబో తమ్ముండే
    మూర్ఖ నృప సతికి ననకుఁడి
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్

    [శకారుఁడు = రాజుంచుకున్న దాని తమ్ముఁడు; పోలునె = పోలును గదా]


    కార్ఖలు లెల్ల దానవులు గాడుపుదిండులఁ జంప నెంచుచుం
    బోర్ఖగ రాజ పుంగవుల మూర్ఖపు జీవు లనంగ వచ్చునే
    నీర్ఖర మౌనె హీనముగ నిందిత మేరికి నైనఁ గావునన్
    మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్

    [కారు ఖలులు = కార్ఖలులు; పోరు ఖగరాజ = పోర్ఖగ రాజ; నీరు ఖరము = నీర్ఖరము; శకారుఁడు = జనులను భయ పెట్టువాఁడు (తప్పు చేసిన)]

    రిప్లయితొలగించండి
  25. కారునివ్విధిన్ 

    మూర్ఖుడటంచుమీరనుటపోలునెశిష్టుశకారునివ్విధిన్
    మూర్ఖునిమూర్ఖుగాబలుకపోలదె?చంపియుసామెయామెనున్ మూర్ఖతతోడనేనునిచెభూస్ధలినెఱ్ఱటియాకుక్రిందనే గీర్ఖరుడౌటనేనటులకేలినినుంచెనుభీతిలేకనే 

    రిప్లయితొలగించండి
  26. మూర్ఖుండనియనదగునా
    కార్ఖానాలో శ్రమించు కార్మికుడతడే
    మూర్ఖులమాటలునమ్మిటు
    మూర్ఖుండు, శకారుఁ డనుట పోలునె మీకున్

    రిప్లయితొలగించండి
  27. మూర్ఖశిఖామణియాతడు
    మూర్ఖునిసజ్జనుడను నదిమూర్ఖత్వమెగా
    మూర్ఖులతలదన్నునతడు
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్

    రిప్లయితొలగించండి
  28. కందం
    మూర్ఖులకే శకునములని
    మూర్ఖులకే లగ్నములని మునుముందుగ నా
    మూర్ఖతలే పాటించుచు
    మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్?

    ఉత్పలమాల
    మూర్ఖులుఁ జూతురీ శకునముల్ గన నంచును 'నాచరించుచున్'
    మూర్ఖులకే ముహూర్తముల మోహమటంచును 'నిత్యమెంచుచున్'
    మూర్ఖత యాస్తికత్వమని 'మ్రొక్కుచు' దేవుని 'చాటుమాటునన్'
    మూర్ఖుడటంచు మీరనుట పోలునె శిష్టు శకారునివ్విధిన్?

    రిప్లయితొలగించండి