నడిరేయి సరదా పూరణ: చనుచును రాత్రి వేళనట చంద్రుని వెన్నెల లేని రోజునన్తినుచును కోడి బిర్యనిని తీరుగ త్రాగి గుడుంబనున్ భళాఘనమగు చౌర్యమున్ సలుప గండర గండులు సౌధమందునన్ తనయయుఁ; దండ్రియున్ గలిసి; తల్లినిఁ; జంపిరి సంతసంబునన్
శాస్త్రి గారూ, శుభోదయం!పూరణ నాకు అర్థం కాలేదు. దేనిని చంపారు?
🙏చోరులు తనయను, తండ్రిని, తల్లిని సంతసంబునన్ చంపిరి అని నా భావము.
రండి చూడండి వెండితెర పయిన సినిమా జిలేబి హీరోయిను మాంఛి థ్రిల్లరు కథ! సస్పెన్సు తుదిదాక రూఢి గానుతండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!నడిరేయి హత్య సినిమా టైటిలు :)జిలేబి
బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) వింతేమున్నది కలియుగమ్మునన్: మునుపొక తండ్రినిన్ కొలిచి ముచ్చట మీరగ నచ్చచెప్పుచున్దినమును రాత్రినిన్ వలచి తీరును తెన్నును లేని పుత్రియేవినకయె తల్లి మాటలను ప్రేమను జూపగ వెఱ్ఱివానిపై తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
మిడ్ నైట్ మర్డరర్స్ చిత్రము నేడే చూడండి :)మునుగడ చూచి యుండరు ప్రమోదిత నాయిక గాను థ్రిల్లరిద్ది! నవల "అర్ధరాత్రి మణిదీపము" స్కంభనమైన చిత్రమిద్ది!నడక తీరు చూడవలె దిమ్మడచంగ జనాళి చూతురే"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
("లేడీ మేక్బెత్" వంటి దుర్మార్గురాలైన మానవదానవికి దగ్గరివారే వేసిన శిక్ష )ఘనమగు వంశమందుననుఘాతిని యొక్కతె జన్మనందెనే ;వినయము లేదు ;దేవతల విజ్ఞుల పూజ్యుల ధిక్కరించునే ;ధనమనమానహానికర దారుణజారిణి పీడబాపగా తనయయు దండ్రియున్ గలిసి తల్లిని జంపిరి సంతసంబునన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తస్కరుల బారిన బడక దప్పుగొనిరిదండ్రి కూఁతుండ్రు ; చంపిరి తల్లినయ్యొ !యెంత దారుణమో యిదియెంచి జూడవలదు యిట్టి యిబ్బంది యెవరి కయినను
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వలదు+ఇట్టి' అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. "వలదయా యిట్టి యిబ్బంది పరులకైన" అందామా?
🙏🏽
తేగీ//పెద్దపులి పిల్లల నొదలి పేరుకొరకుతండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ !యనిన వదలక కొట్టగా, కనులుమూసిజాలి,దయజూపు మికనైన జంపకనెను !!
పూరణ అర్థం కాలేదు. 'ఒదిలి' అనడం సాధువు కాదు. "పిల్లల విడిచి" అనండి.
వ్యసనపరుడయ్యి వసుధను బాధపెట్టెతనయ కోర్కెలు వీడక తగవులాడెభారమంతయు మోయంగ వలసివచ్చెతండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!!
మైలవరపు వారి పూరణవినయము లేదు ! పాపమను భీతియు లేదు! కుటుంబబంధముల్కనుమరుగయ్యె! జీవనవిలాసములే బ్రతుకయ్యె! తల్లినింగన ధనవంతురాలగుట క్రౌర్యమునన్ సుఖభోగమత్తులైతనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
ఘనతరమైన మానసిక కష్టమునందు జరించుచుండ వారనునయ వాక్య జాలమున నాధిని ద్రుంచి సమాదరించి రాతనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్ ధనగతభావనాజనిత దౌష్ట్యము లాయమ కంటకుండగన్.
పిల్లలను వెంట గైకొని వీధులందు తిరుగు చుండెడి పెట్టనా తరుణి గాంచి కూర కొరకంచు కోరగా కూర్మి వీడితండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
చక్కని పూరణ. అభినందనలు.
కాని కాలము కాకున్నకలదె యెందు కన్న తండ్రియే కూతును కలియుటన్నచాలదనియేమొ వారలు చవట తెలివి "తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ"
కవల కూతుండ్రఁ గని భార్య కన్నుమూయనమిత భార్యానురక్తుడైనట్టి వారితండ్రి, కూఁఁతుండ్రు చంపిరి తల్లినయ్యొయంచుఁ బ్రేమఁ జూపడు వారియందుఁ దాను!
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
డా.బల్లూరి ఉమాదేవిత్రాగి వచ్చి పీడించుచు ధనము కొరకుపతియు,సోకుల కొరకని సుతయు సతతమడుగు చుండగ కాదన నాగ్రహమున*తండ్రి కూతుళ్ళు చంపిరి తల్లి నయ్యొ*
జనకు సభ లోన నుండిరి జానకి యును తండ్రి కూతుండ్రు : చంపిరి తల్లి నయ్యొ తండ్రి యాజ్ఞ ను తలదాల్చి తనయు డైన పరశు రాముడు జంకక పంత మూని
పెండ్లి చూడగ వెడలె సద్విధి యటంచుతండ్రి కూతుళ్లు; చంపిరి తల్లి నయ్యొయింట నొంటరిఁగని కడు హేయమైనదుండగులు సొమ్ములను లాగి ధూర్తులగుచు.
శంకరాభరణం గురువారం...16/04/2020సమస్య: "తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"నా పూరణ. చం.మా.**** **** *తనయుల బిల్చిఁ బల్కె జమదగ్నియె తల్లినిఁ జంపు మంచుఁ గ్రోధనమున ;నంత రాముడును ధర్మమొ కాదొ యనిన్ దలంచకేజనకుని యాజ్ఞ నాచరణ సల్పఁ గుఠారముఁ బూని త్రుంచెరో!తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్" -- ఆకుల శాంతి భూషణ్ వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "ధర్మమొ కాదొ యటంచు నెంచకే" అనండి. 'తనయ' అని కదా సమస్య?
వినిననె చేరి రాస్పతిరి, వేదన తగ్గె, ప్రశాంతచిత్తులైతనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్మనసున నిండినట్టి యల మంతనమున్, సుకుటుంబ విల్వలేకనబడు రీతి నిద్దరును కారణమయ్యిరి తల్లి స్వస్తికిన్౹౹
గురువు గారికి నమస్సులు.పాడు కార్యముల్ జేయగ పాపము కొనితండ్రి కూతుళ్ళుచంపిరితల్లినయ్యొ కీడు తలపెట్టు కామాంధ కీచకులనుదేహశుద్దియుచాలదుదహనము సరి.దేశ బహిష్కరణ చట్టమున్ తెచ్చుడిలన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. నాలుగవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
పెనిమిటి వచ్చెనంచు కడు వేడ్కలు జేయుమటంచు కోరగా తనయను తృప్తి పర్చగను తండ్రియె సైయ్యని సంతనుండి తా నెనిమిది పిల్లలున్న నొక యెర్రని పెట్టను తెచ్చినంత నా తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
మనసుకు నచ్చినట్టి నవ మన్మథుడుండగ కాదటంచు నీ యనుజుని పెండ్లియాడననె యాత్మజ యందుకు సమ్మతించె నా పెనిమిటి, చారులోచనయె వేదన నంది విషమ్ము గ్రోలగన్ తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
ఏమితప్పునుజేసెనోనేమొకానితండ్రికూతుండ్రుచంపిరితల్లినయ్యొతల్లిదండ్రులెపుడమినిదైవసములునట్టివారినిజంపినబుట్టగతులునుండవెవరికినిజమిదియొండులేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "జేసెనో యేమొ..." అనండి.
మిత్రులందఱకు నమస్సులు!["కూఁతురు పెండిలియై యత్తవారింటి కేఁగఁ, దండ్రి యవార్డుఁ గొనుటకై పరదేశమున కేఁగఁగా, సంతోషము పట్టలేక గుండెపోటుఁ దెచ్చుకొని యీ తల్లి మరణించెఁగదా! తండ్రీ, తనయా యిద్దఱూ మోయలేని సంతోషాన్నిచ్చి, దగ్గఱ లేకుండ వెడలి, యీమెను చంపినారుగదా!" యని యిరుగు పొరుగు టమ్మలక్కలు సంభాషించుకొనుచున్న సందర్భము]"తనయనుఁ బేరు, డబ్బు గల ధన్యున కిచ్చియు వేడ్కఁ బెండ్లి సేసినఁ దగ నేఁగెఁ! దండ్రికిని శ్రేష్ఠతమంపు టవార్డు రాఁగ, నల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"
మాన్యులు పాలకుర్తి రామమూర్తిగారి సూచనమేరకు నొక పాదము తగ్గించి సేసిన పూరణము:"తనయకుఁ బెండ్లిసేయఁ, జనెఁ! దండ్రియుఁ బద్మపురస్కృతమ్ము నల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
చం: ఒనరువు నైజమైన సుతి నొద్దిక కూతురు తండ్రికిన్ భళాతనదగు రీతి పెంపకము తల్లిగ గూర్చిన గాని యెట్టకున్ననునయమాడ బెండ్లి యన నమ్మిక బల్కుచు నిద్దరొక్కటైతనయయు దండ్రియున్ గలిసి తల్లిని జంపిరి సంతసంబునన్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఎట్టకున్'?
తనయయుతండ్రియున్గలిసితల్లినిజంపిరిసంతసంబుగన్ వినగనురోతబుట్టెనిదిప్రేమనుజూచుటపోయిచంపెనా?గనికరమింతయేనియునుగానగరాదె!యిదేమిపుట్టుకోయనయముదల్లిదండ్రులకునాదరమొప్పగసేవజేయుడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "చంపెనా కనికరమింత..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతితేటగీతిఅల్లుని కులము వేరని హతమొనర్చికన్య పగఁబూన తప్పదు ఖైదటంచుజీవమున్ వీడె పిత! మానసికముగ నటఁదండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
నిజమే.... వాస్తవం!ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
కాల ముత్తరింప నగునె కంజునకును గరుణ యొకయింత నేరక కాలు భటులు కర్మపరిపక్వ మైన దుఃఖమ్మువొందఁ దండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లి నయ్యొ కన విన నేర నట్టి విధిఁ గాంతునిఁ బుత్రిని సేవ లందు ముంచినఁ గడుఁ బ్రీతి నిత్యము సుశీల చెలంగ భృశంపు టార్తియేనెన రది మీఱ ముంచి యనునిత్యము వాగభిమాన వార్ధిలోఁదనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్ [నెనరు =కృతజ్ఞత; చంపిరి యన నుక్కిరిబిక్కిరి చేసిరని భావము]
అధ్భుతమైన సమంజసమైన పూరణలార్యా,నమస్సులు!
ధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
ఈ మధ్య దినపత్రికలలో చదివిన వార్త ఆధారంగా కల్పన...చంపకమాలతనయనుఁ జూడ్ఁగన్ వరుని తండ్రియె వచ్చినఁ బెండ్లిచూపులన్మునుపటి ప్రేమికుండనుచు ముచ్చటఁ దల్లియె లేచిపోవుచున్బనిగొని యింటి గౌరవము భంగము జేయగ! స్వప్నమందునన్దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి! సంతసంబునన్?
అష్టాచెమ్మా ఆటపనియది లేకయే పగలు పత్నియు పుత్రికతోడ నాటలో ననయము మంచిపందెముల హ్లాదమునొందుచు ముందుకేగుచున్ కినుకనుబూను భార్యనుడికించుచు జంపుడు పందెమందునన్ తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
బల్లిదపు మశూచిక్రిమియె తల్లియనగదానినడచగ వైద్యుండు తండ్రియయ్యె కనుగొనిన వాక్సిను కూతుగలసి నేడుతండ్రికూతుండ్రు చంపిరి తల్లినయ్యొ!
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!
పెనగొని యున్నబంధమది పేగున బుట్టెను గూతురొక్కతిన్కనుగొన జిత్రమౌ విధియు గాలము తీరగ వచ్చెదల్లికిన్వినుకొని మంచి మాటలను బెద్దలు జెప్పగ రోగిశాంతికిన్తనయయు దండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
అనయముగా వినోదమును హాస్యమునున్ వెలయించుండెడీఘనమగునట్టి బుల్లితెర క్రౌర్య విషాద కుతంత్ర ధార వాహినుల ఘటింపజేసె పరికించగ నందున నొక్క దృశ్యమున్ తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
ఝామురాతిరి నిదురను జారుకొనగనెల్లయాత్రికుల్ రైలులో నింతలోనచోరులేతెంచి నగలకై, చూచుచుండతండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లినయ్యొ
తనయభిమానపుత్రికకుదక్కపురస్కరణంబు విద్యలోతనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్తనమదియుత్సహించగనుతల్లికి నాశుభవార్త చెప్పగన్ మనసుల వానవెల్లువగ మల్లెలుపూసెను గీమునందునన్
గాసుపొయ్యి నాపమరచె కన్నబిడ్డ కాఫి పెట్ట మనగపతి కదలె నతివ భగ్గు మన్న మంటలబడి బుగ్గియాయెతండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
చనుచును రాత్రి వేళనట చంద్రుని వెన్నెల లేని రోజునన్
తినుచును కోడి బిర్యనిని తీరుగ త్రాగి గుడుంబనున్ భళా
ఘనమగు చౌర్యమున్ సలుప గండర గండులు సౌధమందునన్
తనయయుఁ; దండ్రియున్ గలిసి; తల్లినిఁ; జంపిరి సంతసంబునన్
శాస్త్రి గారూ, శుభోదయం!
తొలగించండిపూరణ నాకు అర్థం కాలేదు. దేనిని చంపారు?
🙏
తొలగించండిచోరులు తనయను, తండ్రిని, తల్లిని సంతసంబునన్ చంపిరి అని నా భావము.
రిప్లయితొలగించండిరండి చూడండి వెండితెర పయిన సిని
మా జిలేబి హీరోయిను మాంఛి థ్రిల్ల
రు కథ! సస్పెన్సు తుదిదాక రూఢి గాను
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!
నడిరేయి హత్య సినిమా టైటిలు :)
జిలేబి
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వింతేమున్నది కలియుగమ్మునన్:
మునుపొక తండ్రినిన్ కొలిచి ముచ్చట మీరగ నచ్చచెప్పుచున్
దినమును రాత్రినిన్ వలచి తీరును తెన్నును లేని పుత్రియే
వినకయె తల్లి మాటలను ప్రేమను జూపగ వెఱ్ఱివానిపై
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిమిడ్ నైట్ మర్డరర్స్ చిత్రము నేడే చూడండి :)
మునుగడ చూచి యుండరు ప్రమోదిత నాయిక గాను థ్రిల్లరి
ద్ది! నవల "అర్ధరాత్రి మణిదీపము" స్కంభనమైన చిత్రమి
ద్ది!నడక తీరు చూడవలె దిమ్మడచంగ జనాళి చూతురే
"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి("లేడీ మేక్బెత్" వంటి దుర్మార్గురాలైన మానవదానవికి
రిప్లయితొలగించండిదగ్గరివారే వేసిన శిక్ష )
ఘనమగు వంశమందునను
ఘాతిని యొక్కతె జన్మనందెనే ;
వినయము లేదు ;దేవతల
విజ్ఞుల పూజ్యుల ధిక్కరించునే ;
ధనమనమానహానికర
దారుణజారిణి పీడబాపగా
తనయయు దండ్రియున్ గలిసి
తల్లిని జంపిరి సంతసంబునన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితస్కరుల బారిన బడక దప్పుగొనిరి
రిప్లయితొలగించండిదండ్రి కూఁతుండ్రు ; చంపిరి తల్లినయ్యొ !
యెంత దారుణమో యిది
యెంచి జూడ
వలదు యిట్టి యిబ్బంది యెవరి కయినను
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వలదు+ఇట్టి' అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. "వలదయా యిట్టి యిబ్బంది పరులకైన" అందామా?
🙏🏽
తొలగించండితేగీ//
రిప్లయితొలగించండిపెద్దపులి పిల్లల నొదలి పేరుకొరకు
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ !
యనిన వదలక కొట్టగా, కనులుమూసి
జాలి,దయజూపు మికనైన జంపకనెను !!
పూరణ అర్థం కాలేదు. 'ఒదిలి' అనడం సాధువు కాదు. "పిల్లల విడిచి" అనండి.
తొలగించండివ్యసనపరుడయ్యి వసుధను బాధపెట్టె
రిప్లయితొలగించండితనయ కోర్కెలు వీడక తగవులాడె
భారమంతయు మోయంగ వలసివచ్చె
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివినయము లేదు ! పాపమను భీతియు లేదు! కుటుంబబంధముల్
కనుమరుగయ్యె! జీవనవిలాసములే బ్రతుకయ్యె! తల్లినిం
గన ధనవంతురాలగుట క్రౌర్యమునన్ సుఖభోగమత్తులై
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఘనతరమైన మానసిక కష్టమునందు జరించుచుండ వా
రిప్లయితొలగించండిరనునయ వాక్య జాలమున నాధిని ద్రుంచి సమాదరించి రా
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్ ధనగతభావనాజనిత దౌష్ట్యము లాయమ కంటకుండగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపిల్లలను వెంట గైకొని వీధులందు
రిప్లయితొలగించండితిరుగు చుండెడి పెట్టనా తరుణి గాంచి
కూర కొరకంచు కోరగా కూర్మి వీడి
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికాని కాలము కాకున్నకలదె యెందు
రిప్లయితొలగించండికన్న తండ్రియే కూతును కలియుటన్న
చాలదనియేమొ వారలు చవట తెలివి
"తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవల కూతుండ్రఁ గని భార్య కన్నుమూయ
రిప్లయితొలగించండినమిత భార్యానురక్తుడైనట్టి వారి
తండ్రి, కూఁఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
యంచుఁ బ్రేమఁ జూపడు వారియందుఁ దాను!
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిడా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిత్రాగి వచ్చి పీడించుచు ధనము కొరకు
పతియు,సోకుల కొరకని సుతయు సతత
మడుగు చుండగ కాదన నాగ్రహమున
*తండ్రి కూతుళ్ళు చంపిరి తల్లి నయ్యొ*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనకు సభ లోన నుండిరి జానకి యును
రిప్లయితొలగించండితండ్రి కూతుండ్రు : చంపిరి తల్లి నయ్యొ
తండ్రి యాజ్ఞ ను తలదాల్చి తనయు డైన
పరశు రాముడు జంకక పంత మూని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెండ్లి చూడగ వెడలె సద్విధి యటంచు
రిప్లయితొలగించండితండ్రి కూతుళ్లు; చంపిరి తల్లి నయ్యొ
యింట నొంటరిఁగని కడు హేయమైన
దుండగులు సొమ్ములను లాగి ధూర్తులగుచు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశంకరాభరణం
రిప్లయితొలగించండిగురువారం...16/04/2020
సమస్య:
"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"
నా పూరణ. చం.మా.
**** **** *
తనయుల బిల్చిఁ బల్కె జమదగ్నియె తల్లినిఁ జంపు మంచుఁ గ్రో
ధనమున ;నంత రాముడును ధర్మమొ కాదొ యనిన్ దలంచకే
జనకుని యాజ్ఞ నాచరణ సల్పఁ గుఠారముఁ బూని త్రుంచెరో!
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "ధర్మమొ కాదొ యటంచు నెంచకే" అనండి.
'తనయ' అని కదా సమస్య?
వినిననె చేరి రాస్పతిరి, వేదన తగ్గె, ప్రశాంతచిత్తులై
రిప్లయితొలగించండితనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్
మనసున నిండినట్టి యల మంతనమున్, సుకుటుంబ విల్వలే
కనబడు రీతి నిద్దరును కారణమయ్యిరి తల్లి స్వస్తికిన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపాడు కార్యముల్ జేయగ పాపము కొని
తండ్రి కూతుళ్ళుచంపిరితల్లినయ్యొ
కీడు తలపెట్టు కామాంధ కీచకులను
దేహశుద్దియుచాలదుదహనము
సరి.
దేశ బహిష్కరణ చట్టమున్ తెచ్చుడిలన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాలుగవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
పెనిమిటి వచ్చెనంచు కడు వేడ్కలు జేయుమటంచు కోరగా
రిప్లయితొలగించండితనయను తృప్తి పర్చగను తండ్రియె సైయ్యని సంతనుండి తా
నెనిమిది పిల్లలున్న నొక యెర్రని పెట్టను తెచ్చినంత నా
తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనసుకు నచ్చినట్టి నవ మన్మథుడుండగ కాదటంచు నీ
రిప్లయితొలగించండియనుజుని పెండ్లియాడననె యాత్మజ యందుకు సమ్మతించె నా
పెనిమిటి, చారులోచనయె వేదన నంది విషమ్ము గ్రోలగన్
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమితప్పునుజేసెనోనేమొకాని
రిప్లయితొలగించండితండ్రికూతుండ్రుచంపిరితల్లినయ్యొ
తల్లిదండ్రులెపుడమినిదైవసములు
నట్టివారినిజంపినబుట్టగతులు
నుండవెవరికినిజమిదియొండులేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జేసెనో యేమొ..." అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి["కూఁతురు పెండిలియై యత్తవారింటి కేఁగఁ, దండ్రి యవార్డుఁ గొనుటకై పరదేశమున కేఁగఁగా, సంతోషము పట్టలేక గుండెపోటుఁ దెచ్చుకొని యీ తల్లి మరణించెఁగదా! తండ్రీ, తనయా యిద్దఱూ మోయలేని సంతోషాన్నిచ్చి, దగ్గఱ లేకుండ వెడలి, యీమెను చంపినారుగదా!" యని యిరుగు పొరుగు టమ్మలక్కలు సంభాషించుకొనుచున్న సందర్భము]
"తనయనుఁ బేరు, డబ్బు గల ధన్యున కిచ్చియు వేడ్కఁ బెండ్లి సే
సినఁ దగ నేఁగెఁ! దండ్రికిని శ్రేష్ఠతమంపు టవార్డు రాఁగ, న
ల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,
దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"
మాన్యులు పాలకుర్తి రామమూర్తిగారి సూచనమేరకు నొక పాదము తగ్గించి సేసిన పూరణము:
తొలగించండి"తనయకుఁ బెండ్లిసేయఁ, జనెఁ! దండ్రియుఁ బద్మపురస్కృతమ్ము న
ల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,
దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిచం:
రిప్లయితొలగించండిఒనరువు నైజమైన సుతి నొద్దిక కూతురు తండ్రికిన్ భళా
తనదగు రీతి పెంపకము తల్లిగ గూర్చిన గాని యెట్టకు
న్ననునయమాడ బెండ్లి యన నమ్మిక బల్కుచు నిద్దరొక్కటై
తనయయు దండ్రియున్ గలిసి తల్లిని జంపిరి సంతసంబునన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎట్టకున్'?
తనయయుతండ్రియున్గలిసితల్లినిజంపిరిసంతసంబుగన్
రిప్లయితొలగించండివినగనురోతబుట్టెనిదిప్రేమనుజూచుటపోయిచంపెనా?
గనికరమింతయేనియునుగానగరాదె!యిదేమిపుట్టుకో
యనయముదల్లిదండ్రులకునాదరమొప్పగసేవజేయుడీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చంపెనా కనికరమింత..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండితేటగీతి
అల్లుని కులము వేరని హతమొనర్చి
కన్య పగఁబూన తప్పదు ఖైదటంచు
జీవమున్ వీడె పిత! మానసికముగ నటఁ
దండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
నిజమే.... వాస్తవం!ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండికాల ముత్తరింప నగునె కంజునకును
రిప్లయితొలగించండిగరుణ యొకయింత నేరక కాలు భటులు
కర్మపరిపక్వ మైన దుఃఖమ్మువొందఁ
దండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లి నయ్యొ
కన విన నేర నట్టి విధిఁ గాంతునిఁ బుత్రిని సేవ లందు ముం
చినఁ గడుఁ బ్రీతి నిత్యము సుశీల చెలంగ భృశంపు టార్తియే
నెన రది మీఱ ముంచి యనునిత్యము వాగభిమాన వార్ధిలోఁ
దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
[నెనరు =కృతజ్ఞత; చంపిరి యన నుక్కిరిబిక్కిరి చేసిరని భావము]
అధ్భుతమైన సమంజసమైన పూరణలార్యా,నమస్సులు!
తొలగించండిధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ మధ్య దినపత్రికలలో చదివిన వార్త ఆధారంగా కల్పన...
రిప్లయితొలగించండిచంపకమాల
తనయనుఁ జూడ్ఁగన్ వరుని తండ్రియె వచ్చినఁ బెండ్లిచూపులన్
మునుపటి ప్రేమికుండనుచు ముచ్చటఁ దల్లియె లేచిపోవుచున్
బనిగొని యింటి గౌరవము భంగము జేయగ! స్వప్నమందునన్
దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి! సంతసంబునన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅష్టాచెమ్మా ఆట
రిప్లయితొలగించండిపనియది లేకయే పగలు పత్నియు పుత్రికతోడ నాటలో
ననయము మంచిపందెముల హ్లాదమునొందుచు ముందుకేగుచున్
కినుకనుబూను భార్యనుడికించుచు జంపుడు పందెమందునన్
తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
బల్లిదపు మశూచిక్రిమియె తల్లియనగ
తొలగించండిదానినడచగ వైద్యుండు తండ్రియయ్యె
కనుగొనిన వాక్సిను కూతుగలసి నేడు
తండ్రికూతుండ్రు చంపిరి తల్లినయ్యొ!
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!
తొలగించండిపెనగొని యున్నబంధమది పేగున బుట్టెను గూతురొక్కతిన్
రిప్లయితొలగించండికనుగొన జిత్రమౌ విధియు గాలము తీరగ వచ్చెదల్లికిన్
వినుకొని మంచి మాటలను బెద్దలు జెప్పగ రోగిశాంతికిన్
తనయయు దండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనయముగా వినోదమును హాస్యమునున్ వెలయించుండెడీ
రిప్లయితొలగించండిఘనమగునట్టి బుల్లితెర క్రౌర్య విషాద కుతంత్ర ధార వా
హినుల ఘటింపజేసె పరికించగ నందున నొక్క దృశ్యమున్
తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
ఝామురాతిరి నిదురను జారుకొనగ
రిప్లయితొలగించండినెల్లయాత్రికుల్ రైలులో నింతలోన
చోరులేతెంచి నగలకై, చూచుచుండ
తండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లినయ్యొ
తనయభిమానపుత్రికకుదక్కపురస్కరణంబు విద్యలో
రిప్లయితొలగించండితనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
తనమదియుత్సహించగనుతల్లికి నాశుభవార్త చెప్పగన్
మనసుల వానవెల్లువగ మల్లెలుపూసెను గీమునందునన్
గాసుపొయ్యి నాపమరచె కన్నబిడ్డ
రిప్లయితొలగించండికాఫి పెట్ట మనగపతి కదలె నతివ
భగ్గు మన్న మంటలబడి బుగ్గియాయె
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ