1, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3326 (విషమును మ్రింగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్"
(లేదా...)
"విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్"

49 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    పండిత రాహులుండువాచ:

    ఖుషినిక వీడి వేల్పులట కూడుచు దైత్యుల, మాధవుండి తో,
    విషయములన్ని తెల్పగను వీడుచు నందిని వెండికొండనున్
    శషభిష లాడకుండగను చక్కగ నవ్వుచు శంకరుండహో
    విషమునుమ్రింగె;... మాధవుఁడు, వేల్పులు,
    దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'మాధవుండితో'?.... "చక్రధారితో" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పండిత రాహులుండువాచ:

    ధిషణిని బ్రోవనెంచి వడి తీరిచి దిద్దుచు నిర్ణయమ్మునున్
    శషభిష లాడకుండగయె శంకరి ప్రీతిని చెంతనుండగా
    విషమును గ్రోల శంకరుడు;...వీడుచు సంద్రపు పాలనున్ వడిన్
    విషమునుమ్రింగె మాధవుఁడు వేల్పులు
    దైత్యులు సంతసింపగన్

    విషము = 1) గరళము, 2) జలము

    రిప్లయితొలగించండి
  4. గుసగుసలాడమానుమిక ,గుట్టును రట్టుగజేయువేళయెన్
    శషభిషలాడనేమిటికి?శంకలుమానుచు వేడ శ్రీహరిన్
    ధిషణనుజూపువైరసును ,దిమ్మదిరుంగగనెత్తిగొట్టుచున్
    విషమునుమ్రింగెమాధవుడు,వేల్పులుదైత్యులుసంతసింపగన్
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు










    రిప్లయితొలగించండి
  5. (హరుని హాలాహలపానము )
    విషధరధారి శంకరుడు
    వేదన చెందుచు దేవదానవుల్
    విషమసమస్యలో మునిగి
    వేడగ విభ్రమవిహ్వలాంగులై ;
    చషకము వంటి చేతిపయి
    చక్కగ నుంచుచు గౌరి సమ్మతిన్
    విషమును మ్రింగె ;మాధవుడు -
    వేల్పులు -దైత్యులు సంతసింపగన్ .
    (విషధరధారి -సర్పములను ధరించువాడు ;చషకము -గిన్నె)

    రిప్లయితొలగించండి
  6. నిశినజరించురాక్షసులు,నిన్నిటుబంపకరోనవైరసూ
    మిసమిసలాడివచ్చితివి, మేదినిపైకిటుజంపుదృష్టితో
    విషయముదెల్సి శ్రీహరియె,వేగమెదూసుకువచ్చెజూడునీ
    విషమునుమ్రింగెమాధవుడు,వేల్పులుదైత్యులుసంతసింపగన్
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు










    రిప్లయితొలగించండి


  7. హమ్మయ్య!


    తృషితముగ శివుడు త్రాగెను?
    మిషనొక్క మెతుకును జూచి మేవడి తోడై?
    ఋషులను కాచె రఘుపతియె?
    విషమును; హరి మ్రింగె; మురియ వేల్పులు దితిజుల్!


    మెతుకు కథ అక్షయ పాత్ర కథ



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. విషధరభూషణుండనుచు విజ్ఞత జూపక చేరి యిచ్చటన్
    శషభిషలేల? విశ్వమున శంకరతుల్యుడు లేడొకండు నే
    విషయమునందునైన నని విన్నది,పార్వతి పల్కి రీగతిన్
    విషమును మ్రింగె మా ధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్.
    (విన్నది=గంగ)

    రిప్లయితొలగించండి


  10. మా శంకరునికి సాటి యెవరీలోకములో!

    తృషితుని గా ఋతంబరుడు తృప్తిగ నెల్లరు చూడగానటన్
    విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్
    పషిణి కటంకటమ్మునకు వాసిని లక్ష్మి కరమ్ము గైకొనెన్
    లషణము లక్షణమ్మును భళారె జిలేబియ తెల్పుగాదుటే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    కృషిని సురల్ నిశాచరులు క్షీరపయోధి మథించుచుండ., దు...
    ర్విషయమనన్ జనించెఁ గడుభీతినొనర్ప హలాహలమ్మటన్!
    చషకముఁ బట్టి శంకరుడు సాంద్రదయానిలయుండు ధీరతన్
    విషమును మ్రింగె., మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. మిష కాదు నిజము వినరా!
    శషభిషలను మాని తెలియ హరి హరు లొకటే  
    ఋషులొప్పుకున్న విషయము 
    "విషమును హరి మ్రింగె మురియ వేల్పులు ది  తిజుల్

    రిప్లయితొలగించండి
  13. విషమును గ్రోలిన దెవరన
    విషమాక్షుండదియె నిజము, వెంగళు డొకడా
    విషయమెఱుంగక చెప్పెను
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్

    రిప్లయితొలగించండి
  14. ఖుషిగా'నేప్రిల్ ఫూ'లయి
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు,దితిజుల్,
    మిష గొను పోకిరి మూకల్,
    వృషభంబుల బోలునట్టి వెఱ్ఱి జనంబుల్.

    హరి=హరి అను పేరుగల ఒక తుంటరివాడు

    రిప్లయితొలగించండి

  15. కృషి సలుపన్ సురాసురులు క్షీర పయోధి మధించి...యత్తఱిన్

    విషము జనించ నెల్లరును భీతిలి వేడ త్రిశూలపాణినిన్...

    వృషభ విహారి త్ర్యంబకుడు పింగళుడున్ దన లీలజూపుచున్

    విషమును మ్రింగె... మాధవుఁడు, వేల్పులు, దైత్యులు సంతసింపఁగన్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  16. హరి యను వానికి జ్వరము సోకగా ----
    ఋషులు వచించిన విధమున
    కృషి తోడ తయారు జేసి కీలక మగు నా
    విషమను కొనక క షాయపు
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితి జు ల్

    రిప్లయితొలగించండి
  17. కృషి సలిపెన్ సురాధిపతి కేశవ ముఖ్యుని సన్నుతించి వి
    ద్విషులను గూడి సాగరము దీటుగ చిల్కిన కాలకూటమే
    విషమ పరీక్ష కాగ కడు వేదన నొందెను; దేవదేవుడే
    విషమును మ్రింగె; మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  18. మిషనిడి కృష్ణుఁ జంపుటకు మేని స్వరూపముఁ మార్చె పూతనా
    విషయముఁ గ్రోలి యామె దరి వేడ్కగ జేరి యురోజపాలలో
    విషమును మ్రింగె మాధవుఁడు, వేల్పులు దైత్యులు సంతసింపఁగన్
    విషము గ్రసిం చుమాధవుడు, వేషము మారెను దైవమొక్కటే౹౹

    రిప్లయితొలగించండి
  19. శషభిష నడతల కవినని
    ధిషణత లేక నిటుపలికె, తికమక తోడన్ |
    విషయ జ్ఞానము లేమిని
    "విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్"

    రిప్లయితొలగించండి
  20. విషధిఁ మధించు వేళ తొలి వేల్పుల వేల్పుల యత్నమందు తా
    రిషమున నుద్భవించె రమ, శ్రీ, హరి లక్ష్మిని గైకొనంగ నా
    వృషభ విహారి, శూలి, శిపివిష్టుడు, శంభుడు, వాకదాలుపా
    విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపగన్.

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    విషమును మ్రింగె మాధవుఁడు
    వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

    సందర్భము:
    రాముడు సీతా వియోగ మనే విషాన్ని మింగితే వేల్పులు సంతసించారు. ఏమైతేనేం! సీతాపహరణం జరిగింది. రావణ వధకు క్రమంగా సమయం దగ్గర పడుతుం దని.
    దైత్యులు సంతసించారు శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఖరదూషణాదుల వధించిన రాముడు దుఃఖితు డైనా డని.. రోగం కుదిరిం దని..
    శివుడు పార్వతికి రామగాథను వివరించే క్రమంలో సీతా వియోగ ఘట్టాన్ని గురించి చెప్పినాడు.
    "కాలకూట విషాన్ని మింగే నా డైనా నేను వెఱ్ఱివాణ్ణి కాలేదు. కాని భార్యా వియోగ మనే దుర్విషాన్ని మింగి రాత్రీ పగలూ ఓ... యని యేడ్చే రాముణ్ణి చూస్తే నాకే మతిపోయిం దనుకో! (చూసిన వానికే మతిపోతే మింగిన వాని కింకెంత.. అని.)
    ఆశ్వయుజం కార్తికం ఇట్లే నిద్ర లేకుండానే గడిపాడు రాముడు. 1
    ఉష = రాత్రి
    ఇషము = ఆశ్వయుజము
    సీతకంటె ముందే రాము డగ్ని ప్రవేశం చేసినాడా యేమి అనిపిస్తుంది మైథిలీ వియోగాగ్నిలో దహించుకుపోతున్న ఆనాటి రాముణ్ణి చూస్తే.
    నేను చెప్పే మాట సైతం నోరు కాలే టటువంటిదే అనవచ్చు సుమా! 2
    ఉషపుడు = సూర్యుడు
    ఉషపము = అగ్ని
    ఉషణ(ము) = నోరు మండించేది, కారము
    ఈవిధంగా దుఃఖిస్తూ వుండగా దేవతలూ దానవులూ సంతోషించినా రానాడు." (ఎందుకో పైననే పేర్కొనబడింది.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సీతా విరహము.. విషము..అనలము*

    విషమును మ్రింగునాడయిన
    వెంగలినైతినె! రామచంద్రు డ
    ట్లుషలుఁ బవళ్ళు సీతకొర
    "కో!" యని యేడ్చుచు నిద్ర వీడినా
    డిషమును గార్తికంబును, గ
    ణింపఁ దరంబె! సతీవియోగ దు
    ర్విషమును మ్రింగె మాధవుఁడు
    వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ 1

    ఉషప సువంశ వర్ధనుడు
    నూర్జిత సత్వుడు రామభద్రు డ
    య్యుషపమునన్ బ్రవేశమయి
    యొప్పెను సీతమకన్న మున్నె యం
    చుషణము వంటి మాట యన
    నొ ప్పగు.. మైథిలితో వియోగ మన్
    విషమును మ్రింగె మాధవుఁడు
    వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    1.04.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. విషమునుగూరిచియిటులనె
    విషమునుహరిమ్రింగెమురియవేల్పులుదితిజుల్
    విషమముగబలుకపాడియె?
    విషమునుదామ్రింగెహరుడువేడగజనముల్

    రిప్లయితొలగించండి
  23. వృషపర్వుడేమి మ్రింగెను
    విషమము దొరుకదు మధురను వెన్నేమాయెన్
    విషమేల హరుడు మ్రింగెను
    విషమును, హరి మ్రింగె, మురియ వేల్పులు దితిజుల్

    రిప్లయితొలగించండి
  24. శషబిషలాతమరెందుకు
    ధిషణకునవగతముగానితీరునహరిచే
    విషమును ద్రావింత్రు? యెపుడు
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్?

    రిప్లయితొలగించండి
  25. చం:

    ముసరగ జీకటుల్ మదిని మూర్ఖపు రీతిని తూలనాడగన్
    వెసులుగ నించు గృష్ణు తలబెట్ట గుణింపగ నూరు దప్పులన్
    వశమును దప్పె చ్ఛేది శిశుపాలుని జంపగ చక్రధాటికిన్
    విషమును మ్రింగె మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. ఇషణ మ్మలర వినాలం
    బుషమ్ము ముని కుంభసంభవుం డల కూలం
    కషము లవణాంబుధి వఱలు
    విషమును హరి! మ్రింగె మురియ వేల్పులు దితిజుల్

    [విషము = జలము; ఇషణము: ఇచ్ఛ (దేవతల); కాలకేయులు, రిపులు కనిపించినందుకు సురలు, సోదర దర్శనమున దితిజులు మురిసిరి]


    విషమ సులోచనుండు పరివేష్టిత భూత గణాధి నాథుఁడున్
    విషధర భూషణుండు విష వేష్టిత మూర్ధజ బాసితుండునుం
    దృష తపియింపఁగా జలము తీరున శంకరుఁడే దయాళువై
    విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

    [విషము = విసము, జలము]

    రిప్లయితొలగించండి
  27. మిషనమృతంబుదీయననిమేషులు దైత్యులు పాల సంద్రమున్
    ధిషణగజిల్కునంతచనుదెంచెనుభీకరహాహలమ్మటన్
    విషయమెరింగి శంకరుడు వేడుకనెల్లరు చూచుచుండగన్
    విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
  28. విషయము తెలియగ పూతన
    విషమును చనుబాలనింపి వేషమదితిగన్,
    విషతుల్యులుదితిజులుగన
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు,




    రిప్లయితొలగించండి
  29. విషమది యుద్భవించె నిక వేల్పులు దైత్యులు దాళజాలకన్
    విషమసమస్య మాకనుచు వేగమె బ్రోవుమటంచు వేడగా
    విషయమెరింగి శంకరుడు వేదన దీర్పగ విశ్వశాంతికై
    విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. విషమునుగూర్చియిట్లుగనువేసరమొందెడుమాటపాడియే
    విషమునుమ్రింగెమాధవుడువేల్పులుదైత్యులుసంతసింపగన్
    విషమునుమ్రింగెభర్గుడునభీష్టముదెల్పగశైలపుత్రియే
    విషమునుమ్రింగమారెనుద్రివీక్షణుకంఠమునల్లగాసుమా

    రిప్లయితొలగించండి
  32. రిప్లయిలు
    1. లక్ష్మీదేవితో పార్వతిసంవాదము.

      విషధినిఁ ద్రచ్చి నీ మగడు విశ్రుతకూర్మమునై తనర్చినన్
      వి‌షమట నుద్భవించి, భయవిహ్వలమై జెలరేగి, విశ్వమున్
      విషమమునై రగుల్చు నెడ, బెట్టు నడంచెనె? చాలు, శ్రీసతీ!
      విషమును మ్రింగె మా... ధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్.

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము.

      తొలగించండి
  33. విషధిని త్రచ్చ దేవతలు విష్ణుని యానతిబొంది వేగనా
    విషధరుఁ ద్రాడుగాఁ , గొని పవిత్ర సువర్ణ నగమ్ము కవ్వమున్
    విషమును క్రక్కె పాము బహు భీతిని పొందజనంబు శూలి యా
    విషమునుమ్రింగ్రె, మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

    రిప్లయితొలగించండి
  34. గురువు గారికి నమస్సులు.
    శషభిష శాస్త్రీయు చెప్పెన్
    విషమును హరిమ్రింగె మరియు వేల్పులు దితిజుల్.
    కృషితో నాస్తిః క్షామo
    ఋషులెల్లరివేద ఘోష ఋజువే సుమతీ!

    రిప్లయితొలగించండి
  35. చంపకమాల
    విషయ మెఱింగి భూసతినిఁ బెంటిపడన్ గడసంజెలో సుర
    ద్విషుఁడుద యించుటన్, 'నరకు 'వేదన లోకము నందు బాపెడున్
    మిషమున సత్యవెంట సుతు మృత్యువు పాలొనరించబూనెడున్
    విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

    రిప్లయితొలగించండి
  36. మిషగొని పూతనహననము
    విషమును హరిమ్రింగె; మురియ వేల్పులు దితిజుల్
    వృషభధ్వజుండు ధృతితో
    విషమును మ్రింగెను జగములు విస్మయమందన్

    రిప్లయితొలగించండి
  37. కందం
    విషయ మెఱిఁగి 'నరకు 'సుర
    ద్విషుననఘునిఁ బోరి సత్య వెంటఁ! ఖలుండన్
    మిషఁగొని సుతుఁ జంపితినన్
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్

    రిప్లయితొలగించండి
  38. పార్వతీ దేవి తన యనుంగు చెలికత్తెలతో అంటున్నట్లుగా ఒక భావన ..........


    మిషయొక యింతలేని తనమేకద నాపతి చెంతజొచ్చి కి
    ల్బిషమది చేయకున్నను పరీక్ష ఘటించుచు వేఢుచుండగా
    విషము శిరంబునందు గల వేలుపు కంఠమునందు నిల్పెనే
    విషమును మ్రింగె మా ధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్"

    రిప్లయితొలగించండి
  39. నిషతో మనుజులు చేసెడి
    విషపూరిత పనులు చూసి భీతితొ ధరణీ
    విషయము దెల్పగ, పాపపు
    విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్!

    వి.మురళీ మోహన్
    పుల్లలచెరువు

    రిప్లయితొలగించండి
  40. విషయమునాలకించగనె వేగమెసంద్రము చెంత చేరె తా
    వృషభమునెక్కి,నెల్లరునుభీతిని పొందు చునుండ
    శూలియున్
    శషభిషలేవిచేయకట సంభ్రమ మందుచు చూచు చుండగా
    విషమునుమ్రింగె,మాధవుడు,వేల్పులుదైత్యులుసంతసింపగన్.

    రిప్లయితొలగించండి