6, ఏప్రిల్ 2020, సోమవారం

ప్రకటన


శంకరాభరణ సమూహ మిత్రులకు🌹 శుభోదయం 🌹
మిత్రులారా! పెద్దలారా!  మీకు  నమస్కారం🙏
          ఈ శార్వరి ఉగాది కాస్త కరోనా ఉగాదిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే .అయితే మన శంకరాభరణ సమూహం దానిని అధిగమించి అద్భుతమైన పద్య సమర్పణలతో ఉగాదిని జరుపుకున్నది. ఇందులో ఉత్సాహంగా పాల్గొని పద్యాలను పంపిన కవీశ్వరులకు పాదాభివందనాలు.🙏
          మన ఉత్సాహాన్ని వృధా పోనీయక పద్యాలను అన్నింటిని డిటిపి చేసి ఇ- పుస్తకరూపంలో  చేసిన గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి కవులు అందరి తరపున నమస్కారాలు  చెల్లిస్తున్నాను. వారు చేసిన శ్రమకు వెలకట్టలేము. ఇప్పుడు మనం అందరూ కలిసి  దానిని  ప్రచురించు కుంటే అది  మనకు  కరోనా చేసిన అల్లకల్లోలం నుండి  ఊరట కలిగిస్తుంది . దీనికి మనందరం ఆర్థిక సహకారంతో ముందడుగు వేద్దాం. లాక్ డౌన్ తీరిన వెంటనే పుస్తక ముద్రణ జరిగేందుకు సంకల్పించి ఇప్పుడే గురువుగారి అకౌంటుకు డబ్బులు పంపిస్తే తర్వాత కార్యక్రమాలు వేగవంతం అవుతాయి అని భావిస్తున్నాను. డబ్బులు పంపిన వారు శంకరాభరణం సమూహంలో తమ ట్రాన్సాక్షన్ నెంబర్‌తో తెలియజేయాలి. శ్రీమాన్ కంది శంకరయ్య గారి అకౌంట్ వివరాలు అందిస్తున్నాను. 
Kandi Shankaraiah
State Bank of India,
Warangal Main.
A/c No. 62056177880
IFC : SBIN0020148
ఈ అకౌంట్ కు ఫోన్ పే ,పేటీఎం ,గూగుల్ పే (7569822984) సౌకర్యం కూడా ఉన్నది .
పద్యాలు పంపని వారెవరైనా ఉంటే ఇప్పటికైనా పంపించవచ్చు. సంకలనంలో చేరుస్తారు.
నా ఈ అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరిస్తారని మరొక్కమారు నమస్కారాలతో సెలవు 🙏
మీ 
ఆముదాల మురళి ,
శతావధాని, తిరుపతి.
🙏🙏🙏🌹🙏🙏🙏

5 కామెంట్‌లు:

 1. తప్పకుండా నేనిందులో అత్యుత్సాహముతో నావంతు పాత్రను పోషించగలను.....

  రిప్లయితొలగించండి
 2. ఆర్యా
  నమస్కారములు.
  ఎంత పంపవలయునో తెలుప ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 3. చాలా సంతోషము...
  నావంతు పాత్ర పోషించగలను.

  రిప్లయితొలగించండి
 4. ఆర్యా నేను సైతం, ఉడుతా భక్తి గ..
  నమస్సులు 🙏🙏

  రిప్లయితొలగించండి