త్రిమూర్తులలో బ్రహ్మ మంచి తెలుపు రంగు వదనము గలవాడు అతనికి ముఖమునుంచి ఆంగీరసుడు, , బొటన వ్రేలు నుంచి దక్ష ప్రజాపతి, కనుల నుంచి ఆత్రి మహార్షి ,తెల్లటి వర్ణము తో జన్మించారు. తెల్లని బ్రహ్మ మనసు నుంచి మరీచి నల్ల రంగుతో జన్మించాడు అది జూచి దేవతలు అరెరె బ్రహ్మ తెల్లని వాడు ఏల ఈ మరీచి నల్ల రంగు తో జన్మించాడు తెల్లని పిల్లికి నల్లటి కోతి జన్మించెను గదా అను భావన
అల్లదె చూడుమా సఖుడ ఆ మృగరాణికి నిండె మాసముల్ పిల్లలు పుట్టు పున్నమికి వేడుకలౌ మృగకోటి కింక మీ రెల్లరు మంచి కానుకల నిచ్చిన మంచి దటంచు చెప్పె నా పిల్లికి నల్లకోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ, బుట్టెరా.
రిప్లయితొలగించండిParty Jumping Science:
దిల్లికి పోయి వేడుకను దీటుగ నీటుగ పార్లమెంటునన్
మెల్లగ మెల్లగా చనుచు మిక్కిలి శ్రద్ధను చాటుమాటుగా
చల్లగ సూది గ్రుచ్చగను శాస్త్రియ పద్ధతి నేర్చి కూర్చుచున్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
నడిరేయి సరదా పూరణ 👆
తొలగించండి
తొలగించండి"శాస్త్రియ" = జీ. పీ. శాస్త్రియ
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅది శాస్త్రసంబంధమైనదైనా, జి.పి. శాస్త్రికి సంబంధించినదైనా 'శాస్త్రీయ' అని కదా ఉండాలి!
🙏
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా చిరు ప్రయత్నం
*ఆ వె*
చెప్పమని తెలిపితి చెవిటికి నే, కోతి
పిల్లకి జనియించె నల్లకోతి
వినకె పరుగు పెట్టి వెడలి పలికెనట
*"పిల్లికి జనియించె నల్లకోఁతి"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చెప్పుమని' అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బద్దెన ఉవాచ:
బొల్లున దంచ బియ్యమును బొమ్మలు మాటల నాడిపాడుటన్
తెల్లని కోకిలమ్మలును తేరకు వచ్చిన తెల్ల యల్లుడున్
చల్లగ రాగ విశ్వమున జంతువు లన్నియు సంతసించగా
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!
అభినవ బద్దెన గారి ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికొత్త వింత వార్త గోలగా వినవచ్చె
రిప్లయితొలగించండి*పిల్లికి జనియించె నల్ల కోతి*
యనుచు నూరు వాడు యచ్చెరువున చెప్ప
కాల మహిమ యనిరి ఘనులు వినుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఊరు వాడ/ఊరివాడు'
రిప్లయితొలగించండిపిల్ల యొకటి చూడ ప్రియము మీరంగను
పిల్లికి జనియించె, నల్లకోఁతి
దారి బోవు చుండి దానిని చూచి గృ
హమున కేగి చెప్పె నందరికిని
కత కంచికి మనమింటికి :)
జిలేబి
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరొక పూరణ
రిప్లయితొలగించండికల్లయు కాదునెప్పుడును కల్గును పిల్లులె యండ్రు గొప్పగా
నల్లగ పుట్టుచుండునట నల్లని కోతికి తప్పకట్టి దౌ
తెల్లని బెబ్బులే కలిగి తీరును కుక్కకు బుట్టు నెప్పుడున్
*పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కాదదెప్పుడును" అనండి.
(నరులందరూ ఒకటే అన్నఒక మహాజ్ఞాని అంతటితో ఆగక జంతువులన్నీ
రిప్లయితొలగించండిఒకటే అని చాటటంతో వాటిలో వెల్లివిరిసిన "సహజీవనసౌభాగ్యం" ఫలితం)
" ఎల్లలు లేవు ; జంతుతతి
యెక్కడ నుండిన నన్నియొక్కటే ;
చెల్లవు బూజుభావముల
చీకటిబాసల పోహణింపులే ;
కొల్లగ గూడు " డన్న సరి
కొత్త సమైక్యపు జీవితమ్ముతో
బిల్లికి నల్లకోతియును
బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా !!
(ఎల్లలు -హద్దులు ;పోహణింపులు -కూర్పులు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'సరిక్రొత్త'
నల్లదయిననేమి తెల్లదయిననేమి
రిప్లయితొలగించండిపిల్లికి జనియించె నల్లకోఁతి
యనుచు వినగ మిగుల నాశ్చర్య మైనది
కల్లదయినదిదియ ఖచ్చి తముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కచ్చితముగ'
జన్యు శాస్త్ర విదుల విన్యాసములుజూడ
రిప్లయితొలగించండితాటి మొక్కనుండితాండ్రవచ్చె
జంతుజన్యుమార్పుజయముగజేయంగ
పిల్లికిజనియించెనల్లకోతి
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఈస్టుమన్ కలరు చిత్రము వెండితెర పై నేడే చూడండి
అల్లెను రాజమౌళి సినిమాకథ యొక్కటి వాపితమ్ముగా
తొల్లి మహేంద్ర బాహుబలి తుమ్మగ దాని ప్రకంపనమ్ములన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టె,రా
లల్లి ! జిలేబి ! పద్మ! కమలా!పువుబోడియ! చూచెదమ్ము రా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
గురువర్యులకు నమస్సులు
రిప్లయితొలగించండితెల్లని చందమామ కధ తెల్పిరి రోదసి శాస్త్రవేత్తలే
నల్లని కల్వపూల చిరు నవ్వులు రువ్విగ చిత్రమందునన్
తల్లుల కోర్కెలన్ నిలుపు తర్కము తోడుగ జన్యు జ్ఞానమే
కల్లలు కావు కావు యని ఖ్యాతితొ పల్కెను శాస్త్ర జ్ఙానమే
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
కస్తూరి శివ శంకర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రువ్విగ'? "కావనుచు" అనండి. "ఖ్యాతిని బల్కెను" అనండి.
కల్ల యిదేమికా దచట గంటిని మాంత్రిక వర్యుడొక్కరుం
రిప్లయితొలగించండిడల్లన ద్రిప్పి దండమొక టచ్చెరువందెడి యద్భుతంబులన్
కొల్లలు గాగ జూపె నొక క్రొత్త విధానముతోడ నందులో
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా"
తొల్లి తపంబు జేసి., కని తోయజగర్భుని., పిల్లి బెబ్బులుల్
పిల్లల గూర్చి కోరెనిటు "స్వేచ్ఛ జరించుచు వాడవాడలం...
దెల్లరి భీతి గొల్పు" వరమిమ్మన., వల్లె యనంగ బ్రహ్మయున్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపున్నమి దినమందు పొల్లుమాటలనిట్లు
రిప్లయితొలగించండిపిచ్చివాడొకండు ప్రేలుచుండె
నుత్తరాన సూర్యుఁడుదయించెఁ జూడరా!
పిల్లికి జనియించె నల్లకోఁతి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపల్లెలనుండు బాలకుడు పట్నము వానికి చెప్పె నిట్లు మే
రిప్లయితొలగించండిమెల్లర మాప్తబాంధవుల మిందు బరస్పర, మన్యజీవులున్
బెల్లగు ప్రేమతో మెలగు భేదము లంటక సత్యమోయి మా
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచెల్లునొ? చెల్లదో? జనులు చిత్రవిచిత్రపు వార్తలందుఁ దా
రిప్లయితొలగించండిముల్లసిలంగ నేర్తు రెవడో యొకడట్టులఁ జెప్పసాగెఁ దాఁ
జొల్లుకబుర్లు! సత్యమయె జోస్యము బ్రహ్మము సెప్పినట్లుగాఁ!
బిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశాస్త్రవేత్త యొకడు చతురుడై సృష్టింప
రిప్లయితొలగించండిపిల్లికి జని యించె నల్ల కోతి
వింత జూచి జనులు వెఱఁగు పడుచు మెచ్చుఁ
కొనుచు పొగడి రత ని గొప్ప గాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మెచ్చుకొనుచు' అన్నపుడు అర్ధానుస్వారం రాదు.
తొలగించండిమెఱయు కంకణమ్ము మెడలోన పూమాల
రిప్లయితొలగించండిదాలిచి యవధాని తనరుచుండ
విసరెనొక సమస్య పృచ్ఛకుండిట్టుల
"పిల్లికి జనియించె నల్లకోఁతి"
ఫేసుబుక్కులోన ఫేకున్యూసుల లోన
తొలగించండినిన్స్టగ్రాములోన నిచ్చకాల
వాటుసప్పులోన వాగెదరీరీతి
"పిల్లికి జనియించె నల్లకోఁతి"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపిల్లికి పాదపాగ్రములఁ బేర్మి ఫలమ్ములు మెక్కు కోర్కె, దా
రిప్లయితొలగించండినెల్లెడ గ్రామవీథులఁ జరించగ బెబ్బులి కోర్కెఁ దీర్చగా
వల్లె యటంచు బ్రహ్మ తమ వాంఛకు యోగ్య వరమ్ము నీయగా
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశంకరాభరణం
రిప్లయితొలగించండిశుక్రవారం.....10/04/2020
సమస్య:
"పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా"
నా పూరణ. ఉ.మా.
**** **** **
ఎల్లరు నవ్వుచున్ మిగుల హేళన జేయుచు నుండరే సదా?
కల్లగు గాని నిక్కమెపుడు గాదని వింతగ జూచుచుండరే?
చెల్లదు పో!యటంచనరె చిత్రముగా వచియించ నిట్టులన్
"పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా"
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఉత్పలమాల
తొలగించండిఅల్లరిఁ జేయఁ బోడెపుడు నాటల నా మనుమండుఁ దేలుచున్
మెల్లఁగ బొమ్మలన్ గొనుచు మేటిగఁ గొల్వునుఁ దీర్చు చుండ నేఁ
బిల్లనుఁ దల్లి నొక్కదరిఁ బేర్చు మటంచును సంజ్ఞఁ జేయఁగన్
బిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!
శంకరాభరణం
రిప్లయితొలగించండిశుక్రవారం.....10/04/2020
సమస్య:
"పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా"
నా పూరణ. ఉ.మా.
**** **** **
తెల్లని కాకముల్ మిగుల తీయని తింత్రిణి కాయలున్ గడున్
జల్లని యగ్ని కీలలును, శాకములన్ భుజియించు సింగముల్
నల్లని హంసలున్ మరియు న్యాయము, ధర్మము ధాత్రి గాంచగన్
"పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా"
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
భార్య తాళినమ్మి పానశాలకు బోయి
రిప్లయితొలగించండికల్లు త్రాగి వాగె ఖలుడొకండు
దూడ పుట్టె నొక్క దున్నపోతనుచును
పిల్లికి జనియించె నల్లకోతి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభర్తతో భార్య :
రిప్లయితొలగించండిఆటవెలది
వరుడు కోతి వలెను వధువు పిల్లి వలెను
నీడు కాదటంచు గోడు వడిన
వినక పెండ్లిఁ జేయ విస్మయమ్మేలయా!
పిల్లికి జనియించె నల్లకోఁతి!
తెల్ల పిల్లి చెంత నల్ల కూనను గాంచి
రిప్లయితొలగించండివాగె నొకడు కల్లు త్రాగి యిట్లు
కలియుగమ్ము నందు కలుగు వింతలవెన్నొ
పిల్లికి జనియించె నల్లకోతి.
ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండిపిల్లికి జనియించె నల్ల కోతి
త్రిమూర్తులలో బ్రహ్మ మంచి తెలుపు రంగు వదనము గలవాడు అతనికి ముఖమునుంచి ఆంగీరసుడు, , బొటన వ్రేలు నుంచి దక్ష ప్రజాపతి, కనుల నుంచి ఆత్రి మహార్షి ,తెల్లటి వర్ణము తో జన్మించారు. తెల్లని బ్రహ్మ మనసు నుంచి మరీచి నల్ల రంగుతో జన్మించాడు అది జూచి దేవతలు అరెరె బ్రహ్మ తెల్లని వాడు ఏల ఈ మరీచి నల్ల రంగు తో జన్మించాడు తెల్లని పిల్లికి నల్లటి కోతి జన్మించెను గదా అను భావన
ఇచ్చిన పాదము ఆట వెలది నా పూరణ సీశములో
ఆంగీర సుడు బుట్టె నంబుజ గర్భునా
శ్యమునుంచి సితపు చాయ తోడ
దక్షుడు జనియించె ధవళవర్ణము తోడ
స్రష్టకున్ మేటి యంగుష్ట మందు
నేత్రమందు కలిగె నత్రి మహర్షి శు
భ్రవర్ణ రూపుడై బ్రహ్మ కపుడు,
మనసు నుంచి మరీచి మ్లానపు
వన్నియ తోడనా పద్మజునకు
పుట్టె, కనిన వారు ముక్కుపై వేలుంచి
పలికె రిటుల,” శ్వేత వర్ణ ధారి
నలువ, బిడ్డ రంగు నలుపాయె తెల్లటి
పిల్లికి జనియించె నల్ల కోతి “
తొలగించండిఅదురహో! ఎక్కడికెక్కడి లంకె!
జిలేబి
dhnyavaadalu chaala kalamu ayinadi meeru muchchatinchi
తొలగించండిప్రజల యాదరణకు పాకులాడెడి నేటి
రిప్లయితొలగించండిదృశ్య మాధ్యమములు దిన మసత్య
వార్త లిట్లు వేగ వ్యాప్తి జేతురెపుడు
"పిల్లికి జనియించె నల్లకోఁతి"
పొరుగు వీధిలోన బుజ్జికూనలుమూడు
రిప్లయితొలగించండిపిల్లికి జనియించె, నల్లకోతి
చూచి ముద్దులాడ సూదంటిగోళ్ళతో
తల్లిపిల్లిరక్కి తరిమిపంపె
భల్లున నవ్విపో వుదరు పైత్యపుమాటలు చెప్పుదేటికిన్
రిప్లయితొలగించండివెళ్ళుము నమ్మరెవ్వరిట పిచ్చిజనంబనుకుంటివా? యెలా?
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా?
కల్లునుతాగిమైకమది కళ్ళకుమోసము చేసెనేమిటో!
పిల్లికిజనియించెనల్లకోతిభువిని
రిప్లయితొలగించండికాలమహిమవలనగలుగుచుండె
నింకనేమిజరుగుశంకర!చెప్పుమ
నీదుచేష్టలెటులొనేర్వగలమె?
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపాలు పెరుగు యన్న బహుళమై ప్రీతియున్
పిల్లికి, జనయించె నల్లకోతి
తెల్లకోతికి యది దైవలీల గదయా
చిత్ర విచిత్ర మహిమ జీవ మదియు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాల జ్ఞానమెపుఁడు కల్లకాబోదని
రిప్లయితొలగించండికాలగతినితెలిసె కలియుగమున
నింబవృక్షమందునిర్గమించెనుబాలు
పిల్లికి జనియించె నల్లకోఁతి
పిల్లలారు జూడ వీధి చివర నొక్క
రిప్లయితొలగించండిపిల్లికి జనియించె; నల్లకోఁతి
పిల్ల జేరె నొకటి మెల్లంగ నచ్చట
దల్లడిల్లె నింక దల్లి పిల్లి
పిల్లలు మెచ్చురీతి పలు వింతలు గూర్చుచు తెల్గులోన కో
రిప్లయితొలగించండికొల్లలు తీసె చిత్రములు కొండల రాయుడు, వాటిలో గనన్
తెల్లని కాకులుండునట, దీప్తము పచ్చిక మేయుచుండునే
పిల్లికి నల్లకోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[అమోఘమైన బ్రహ్మంగారి వాక్కు ఫలితం...కలికాల మహిమ...అనుట]
అల్లదె పోతులూరి గురు లల్లిన యట్టి త్రికాల తత్త్వముల్
సెల్లుచునుండెఁగా భువినిఁ జేఁతగ మాఱి, ఫలాల నిచ్చి! ను
త్ఫుల్లమనస్కు వాక్కు లవె! తూచయుఁ దప్పవు! నేఁడుఁ జూడఁగాఁ
బిల్లికి నల్ల కోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!
చిన్న సవరణ:
తొలగించండిఅల్లదె పోతులూరి గురు లల్లిన యట్టి త్రికాల తత్త్వముల్
సెల్లుచునుండెఁగా భువినిఁ జేఁతగ మాఱి, ఫలాల నిచ్చి! యు
త్ఫుల్లమనస్కు వాక్కు లవె! తూచయుఁ దప్పవు! నేఁడుఁ జూడఁగాఁ
బిల్లికి నల్ల కోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!
ఉ:
రిప్లయితొలగించండిఅల్లన సజ్జనుండొకడు నాలిని మెల్లన కోపగించుటై
చల్లన జెప్పసాగె నొక సామెత నంతట నుగ్రరూపమున్
చెల్లుగ హుంకరించె సతి చేష్ట లుడుంగగ వారి వాదనల్
పిల్లికి నల్ల కోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా
వై. చంద్రశేఖర్
పిల్లికినల్లకోతియునుబెబ్బులికిన్శునకంబుబుట్టెరా
రిప్లయితొలగించండికల్లునుద్రాగితే?యిటులకల్లలుబల్కగనేమిగల్గెరా
చిల్లరమాటలన్బలుకఛీయనియందురుపండితోత్తముల్
నల్లపురెడ్డివంశజుడ!నైతికబాధ్యతగల్గియుండుమా
కల్లలు కొల్లలైనవిగ కాలిడనీయ నికింటిలోన నీ
రిప్లయితొలగించండియల్లరికంతులేదు పరిహాసము గాక మరెచ్చటివ్విధిన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
చెల్లవు నీదు చేష్టలిట జెప్పకుమిట్లు వదంతులన్నియున్
అల్లన మాటలాడుచునె హ్లాదము నింపుచు జన్యు శాస్త్రమున్
రిప్లయితొలగించండియుల్లము లందు వేయ గన నొజ్జ యొకండుపమానమన్నటుల్
పిల్లల కందజేయ తగ బేర్కొనె పాఠము నివ్విధమ్ముగా
"పిల్లికి నల్ల కోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా!
కల్ల కాదు వినవె తెల్లని పిల్లలు
రిప్లయితొలగించండికల్లు పాక చెంత నుల్ల మలర
నల్ల నల్లఁ దిరుగు నల్ల రంగున నున్న
పిల్లికి జనియించె నల్లకోఁతి!
[నల్లకోతి = నల్లని వాఁడా]
కల్లల కెల్ల ఘోర కలికాలము మూలము వింత వింతగం
దల్లి గుణంబు రాదు మఱి తండ్రి వివేకమురాదు సుంతయుం
బిల్లల కక్కటా కనమె విశ్రుత సూరికిఁ బుట్టు మూర్ఖుఁడే
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
కల్లలు కొల్లలై కథలుగా ప్రతి మాధ్యమమందు వింతగా
రిప్లయితొలగించండివెల్లువలెత్తి మానసము వేసటగూర్చుచునుండె నయ్యయో
కల్లలుగాదొకో భువిని కానగనెక్కడనైననెవ్విధిన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా?
అల్లదె చూడుమా సఖుడ ఆ మృగరాణికి నిండె మాసముల్
రిప్లయితొలగించండిపిల్లలు పుట్టు పున్నమికి వేడుకలౌ మృగకోటి కింక మీ
రెల్లరు మంచి కానుకల నిచ్చిన మంచి దటంచు చెప్పె నా
పిల్లికి నల్లకోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ, బుట్టెరా.
కొల్లలుగాను చిత్రములు, కోరి భరించగదీసె వింతగా
రిప్లయితొలగించండియెల్లరు శాండొయీతడని ,యెన్నగదీసెను చిత్రరాజముల్
చల్లగచిన్నదేవరనిచాటెనులోకము, మాటి మాటికిన్
పిల్లికి నల్లకోతియునుబెబ్బులికిన్, శునకంబు బుట్టెరా
+++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
అల్లరి పుత్రులిర్వురయె కాంతుని వంశము వృద్ధినొందగన్
రిప్లయితొలగించండితల్లిది పిల్లిశీలమవ దండ్రికి వ్యాఘ్రపు లక్షణాలునున్
పిల్లలు బెద్దవారయిరి భీతిగ నుండెను వారి జీవితం
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెల్లనిదేదిలేదు కలిచేష్టలు వింతవి స్పర్ధబూనుచున్
రిప్లయితొలగించండిబల్లిదులైన శాస్త్రవర బ్రహ్మలు నేర్వగ నూత్నసృష్టులన్
చెల్లును నేదియైననిట జేర్చగ జాతుల జన్యుచిత్రముల్
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు పుట్టురా!
కల్లలుగావుగా నుడులు కల్గును శుంఠయె బ్రహ్మగర్భమున్
తొలగించండిబల్లిదుడైన రాజునకు భీరువు పుట్టును క్షేత్రహీనతన్
ద్రెళ్ళుచుగూడ నన్యులను దెయ్యపురీతిని వావిలేకయే
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాముకిజనియించెపాము పిల్లులుపుట్టె
రిప్లయితొలగించండిపిల్లికి జనియించెనల్లకోఁతి
కోతికడుపునొకటి కొత్తయేమున్నది
దైవ సృష్టి నియతి దాట లేము
గోడ దూకి బ్రతుకు కోర్కెయే దానిపై
రిప్లయితొలగించండిపిల్లికి జనియించె నల్ల! కోఁతి
కొమ్మ కఱ్ఱలాట కిమ్మనకనె యాడు
తుచ్ఛ రాజకీయ ముచ్చటిదియె౹౹
ఆ.వె//
రిప్లయితొలగించండిలొల్లిపెట్టు నింట పిల్లులు హెచ్చుగ
పిల్లికి జనియించె, నల్లకోఁతి !
పిల్లలు దనవనుచు నల్లరి జేయుచు
కొల్లగొట్టినంత పిల్లులరిచె !!
వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానము నందు కలిపురుషుని మాయచేత ఎన్నో వింతలు జరుగుతాయి అని వివరించారు, కావున ఇది కూడా ఒక వింత అని నా పూరణ..
రిప్లయితొలగించండిసమస్య:
*పిల్లికి జనియించె నల్ల కోతి*
ఆ.వె.
వీర బ్రహ్మ నాడు వివరించి చెప్పెను
కల్గు వింత లెన్నొ కలియుగమున
కలిమహిమను కనగ నేడు జగములోన
*పిల్లికి జనియించె నల్ల కోతి*
మూడవ పాదములో సవరణ..
రిప్లయితొలగించండికల మహిమను నేడు కనగ జగములోన
కొన్ని మార్పులతో "పిల్లికి జనియించె నల్ల కోతి" అను సమస్యను తేటగీతిలో పురాణ
రిప్లయితొలగించండిసమస్య: (తెల్ల అను పదమును జోడించి)
తెల్ల "పిల్లికి జనియించె నల్ల కోతి"
తే.గీ
తెల్ల పెల్లిని పెంచిరి తెలుగు వారు
ప్రేమ మీరగ, నొకరోజు పిల్లి కూన
తెల్ల పిల్లికి జనియించె, నల్ల కోతి
పిల్ల పిల్లి కూనను చేరి పెనుగు లాడె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమొదటి పాదము టైపింగ్ మిస్టేక్ సవరణ
రిప్లయితొలగించండితెల్ల పిల్లిని