15, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3340

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"
(లేదా...)
"సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై"

79 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  వింతగ జీన్సును వేసుకు
  చెంతకు వచ్చిన పడతిని శాంతము జూడన్
  నంతనె తలచితి నిటులనె
  *"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😄🙏😄🙏

  రిప్లయితొలగించండి
 2. మరో ప్రయత్నం

  *కం||* 🌸🌸

  కొంతైనను లేక బెరుకు
  నెంతో నేర్పరిగ బైకు నేర్వగ తానే
  వింతగ జూచెడి జనులనె
  *"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వింతగ జూచి జను లనిరి" అనండి.

   తొలగించండి
  2. ధన్యోస్మి 🙏🙏

   సవరణతో

   కొంతైనను లేక బెరుకు
   నెంతో నేర్పరిగ బైకు నేర్వగ తానే
   వింతగ జూచి జనులనిరి
   *"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"*

   🙏🙏🙇🙇

   తొలగించండి

 3. నడిరేయి సరదా పూరణ:

  1971:

  పకపక నవ్వు పాకియుల వన్నియు మూతులు మూసిపోవగా
  సకలపు శత్రు వాహినులు సంకట మొందుచు పారిపోవుచున్
  వికలము కాగ హృత్తులహ విందులు చేసెడి నిందిరమ్మయౌ
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై...

  రిప్లయితొలగించండి
 4. సంతొకఁడు గలిగె జాగున
  నింతికిఁ, "బురుషత్వమబ్బె", నెంతయొ వేడ్కన్
  స్వాంతమునం దలపోసెను
  కాంతుడు దనకంచు సుతసుఖంబుఁ గుడుచుచున్!

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  2004:

  తికమక కాగ మానసము తీరును తెన్నును కానరాకయో
  నికటమునున్న సాధువును నేతగ నెన్నుచు మూతిమూయుచున్
  వెకటగు రీతినిన్ వెనుక వీగుచు నేలెడి గాంధియమ్మ యౌ
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై....

  https://en.m.wikipedia.org/wiki/The_Accidental_Prime_Minister

  రిప్లయితొలగించండి
 6. సకలముతానెజేతునని,సర్వులుజెప్పినకాదుపొమ్మనెన్
  వికలమనస్కురాలనిరి,వీధికినెక్కిరిసంఘపెద్దలే
  ప్రకటితమాయె గొప్పగను,,ప్రాభవమందగనిందిరమ్మలో
  సకలముగోరుకొన్న,బురుషత్వము,దక్కెనుపూర్వపుణ్యమై
  +++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 7. (రాజ్యసంక్షేమం కోసం అమ్మాయిని అబ్బాయిగా
  పెంచిన కన్నతండ్రి కాకతిగణపతిదేవుడు)
  సుకముగ కాలమున్ గడపు
  సొంపగు కాకతిరాజ్యమంతటిన్
  వికలము జేయ నెంచుకొను
  వెఱ్ఱుల తిక్క కుదుర్చునట్లుగా
  చకచక పెంచె రుద్రమను
  శౌర్యుడు రుద్రుగ గణ్పతీంద్రుడే !
  సకియకు గోరుకొన్న పురు
  షత్వము దక్కెను పూర్వపుణ్యమై .  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మాన్యులు జయకృష్ణ బాపూజీ మహాత్ములకు నమస్కారాలు ఐతిహాసిక మైన మీ పూరణ ఎంతో ఔచితీమంతంగా ఉన్నది. మీ పూరణకు సాభివాదాలు

   తొలగించండి
 8. కం//
  వంతుల వారిగ దిను, పూ
  బంతి పెదవి పైన మీస పంక్తిని కనగన్ !
  గంతులతో మగడు బలికె
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి
 9. కం//
  గొంతెమకోరిక లెన్నియొ
  వింతగ గోరుకొనుచున్న విరిబోఁడికి, యా !
  పంతుల జోస్యము నిజమై
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి
 10. వింతగ వింటిమి కథలో

  *ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్*

  సుంతయు కల్లయు గాదిపు

  డింతులు చేయుమగ పనులనింపుగగనమే

  రిప్లయితొలగించండి
 11. కం//
  రంతిలు జుండెడి రమణికి
  జంతిన ముంజేతులకును చక్కని శ్మశ్రుల్ !
  వింతగ మొలవగ బలికిరి
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి
 12. చింతలు చలదిక సఖియా
  అంతయునేజూచుకొందు అంతయునేనై
  వింతగలాక్ డౌనందున
  ఇంతికి పురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్
  +++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 13. కాంతా రత్నము సత్యయె
  వింతగ విల్లమ్ముపట్టి పెనకువ సలుపన్
  యంతయు కృష్ణుని లీలయె
  నింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విల్లమ్ములూని... సాంతము కృష్ణుని..." అనండి.(సలుపన్+అంతయు... అన్నపుడు యడాగమం రాదు)

   తొలగించండి


 14. బంతి వలె తిరిగె డా పూ
  బంతిని గాంచిన విధాత పరితోషముతో
  కొంత గతిమార్పు చేయగ
  నింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 15. సకలము దేవదేవుని ప్రసాదము! కర్మఫలమ్ము తోడుగా
  ను కలిసి వచ్చి జీవులకు నూతన మైన శరీరమందు జీ
  వకణము లెల్ల వర్ధిలును వాంఛలె వాటము జూపు చూడనా
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 16. మొట్టమొదటి పోలీసమ్మణ్ణి :)


  కాంతయె పోలీసాయెను
  వింతగ చూచిరి మనుజులు విరిబోణినటన్
  సుంతయు గుసగుసలాడిరి
  యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. అకలుష భావనా సహితయై సతతంబు మురారి కర్చనల్
  సకలద! వాంఛ దీర్చుమని సన్నుతరీతిని జేసి దీక్షతో
  నొకపరి నొక్క చేడియ మహోగ్రతపం బొనరించ దాని కా
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 18. కం//
  ముంతలుగ కల్లు చవిగొన
  శాంతించు ననుచు ముదముగ శాంకరి బలుకన్ !
  పంతముతో మీదికురికె
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి


 19. మాహేంద్రజాలము


  వింతగ జపించె హాంఫట్!
  దంతముల కదలిక రమణి తనువును మార్చెన్
  కాంతులు విరజిమ్మగనా
  యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. సరిజేసితిని గురువుగారు 🙏
  కం//
  వంతుల వారిగ దిను, పూ
  బంతి పెదవి పైన శ్మశ్రుపంక్తిని కనగన్ !
  గంతులతో మగడు బలికె
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి
 21. సరిజేసీతిని గురూజీ 🙏
  కం//
  గొంతెమకోరిక లెన్నియొ
  వింతగ గోరుకొనుచున్న విరిబోఁడికి, నా !
  పంతుల జోస్యము నిజమై
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి
 22. సరిజేసితిని గురూజీ 🙏
  కం//
  రంతిలు చుండెడి రమణికి
  జంతిన ముంజేతులకును చక్కని శ్మశ్రుల్ !
  వింతగ మొలవగ బలికిరి
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ !!

  రిప్లయితొలగించండి

 23. మైలవరపు వారి పూరణ

  సకునికి సాళ్వభూపతికి శంతనసూతికి చెందకుంటి., నా...
  సుకమును ద్రుంచె భీష్ముడని శోకముతో దపమాచరించి స్రు...
  క్కక హరుఁ గొల్చి పొందెను శిఖండిగ జన్మమునంబ., అట్టి యా...
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 24. ఇంతుల గెలిచిన భీష్ముని
  పంతముతో నంబ,నోటుపఱుపగ దల్పన్,
  సంతత తపమును జేయగ,
  నింతికి పురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్.

  రిప్లయితొలగించండి
 25. సంతసమున కీచకుడే
  కాంతము లో సఖినిపొంద కామాతురుడై
  చెంతకరిగి కాంచినతరి
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్

  రిప్లయితొలగించండి
 26. ఎంతటి ధైర్యంబో మరి
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్
  వింత యిది యనుచు దలచిరి
  యంతటి చట్టసభ యందు నందరి నెదురన్

  రిప్లయితొలగించండి
 27. ఎంతో ప్రేమతొ బెంచగ
  సుంతైన సరకు గొనకయు చోద్యంబయ్యెన్!
  గొంతే మార్చుక బ్రతికిన
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"

  రిప్లయితొలగించండి
 28. అంతములేనిది తత్త్వము
  చింతించగపురుషుడన్నశివపార్వతులే,
  స్వాంతనయాధ్యాత్మికముగ
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 29. గురువు గారికి నమస్సులు.
  పంతము బూనిరి వైద్యుల్
  కాంతునకు జనకుడగునటుకమ్మని వరమున్
  వింతగ దోచును ధరణిన
  యింతికి పురుషత్వమబ్బె నెంతాయో వేడ్కన్

  రిప్లయితొలగించండి
 30. చింతన వీడక యిందిర
  పంతముగ నపుడు ప్రధాని పదవి గ్రహింపన్
  వింతగ నెంచి జనులనిరి
  "ఇంతికి బురుషత్వమబ్బె నెంతయు వేడ్కన్!
  .

  రిప్లయితొలగించండి
 31. వింతగు కోర్కె జనింపగ
  పంతము తో వైద్యుని గని వాంఛను దెలుప న్
  స్వంత చికిత్స నొనర్పగ
  నింతికిఁ బురుషత్వ మబ్బె నెంతయుఈ వేడ్కన్

  రిప్లయితొలగించండి
 32. సుంతయు గొంకును లేకను
  పంతముతో నన్ని కళల ప్రౌఢిమ మగువల్ |
  వింతలు జేయుగ, తలుపన్
  "ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"

  రిప్లయితొలగించండి
 33. అంతము జేయగ భీష్ముని
  పంతముతో దపము జేసి వరమును బడసెన్
  వింతగ జూడగ నంతట
  నింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్

  రిప్లయితొలగించండి
 34. పంతులుగూతురుశారద
  యెంతయొదానిష్టపడుచుజీన్సుధరించన్
  గాంతలుముదముననిటులనె
  నింతికిపురుషత్వమబ్బెనెంతయువేడ్కన్

  రిప్లయితొలగించండి
 35. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  ఇంతికిఁ బురుషత్వ మబ్బె నెం
  తయొ వేడ్కన్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీశములో


  కిట్టూరు రాణి చెన్నమ్మ కర్ణాటకలో , మరాఠ రాష్ట్రములో ఝాన్సి లక్ష్మిభాయి, తులువ రాణి అభయక్క ఉల్లాలు నగరము కొరకు , బ్రిటిష్ వారితో
  పురుషత్వము ఆపాదించుకొని పోరాడినారు. పురుషత్వ లక్షణములు పుణికిపుచ్చుకొని దుర్గా మాత కూడ దుష్ట సంహారము జేసె. అవసరమున్నప్పుడు స్త్రీకి పురుష లక్షణములుకలుగ వచ్చునను భావన


  స్వామిని చెన్నమ్మ సాయకమును బట్టి
  కిట్టూరు కైజేసె గట్టి పోరు


  ఝాన్శి లక్ష్మీభాయి ఝక టము చేసెగా
  బ్రిటిషర్ల తో తన బిడ్డ కొరకు


  అబ్బక్క రాణియు నబ్బుర ముగ చేసె
  నాంగ్లేయ పౌజుతో నలుపు లేక

  నరయంగ నింతికిఁ బురుషత్వ మబ్బె నెం
  తయొ వేడ్కనిలలోన"ధర్మ రక్ష


  ణమ్ముకై మహిషాసురున్ కొమ్ము బట్టి

  సంహరించి దేవతలకు సంత సమిడె

  గాదె దుర్గమ్మ, చూడంగ కాంత లెల్ల

  పురుషులవలెమారి భువిలో మెరయు చుండు


  సాయకము = కత్తి , స్వామిని =రాణి, ఝకటము= యుధ్ధము పౌజు =సైన్యము

  రిప్లయితొలగించండి

 36. కందం
  అంతయు తానౌ కృష్ణుఁడు
  ముంతల నవనీతముఁ గొని మూతికిఁ బూయన్
  వింతగ మీసము లమరఁగ
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్

  చంపకమాల
  సకలము తానెయౌచు మృదు స్పర్షనొసంగుచు నందమీయగన్
  ముకులిత కుబ్జ పోలికను పూరుష రూపము పొందనెంచినన్
  నికటమునై నిషీధి నవనీతముఁ గృష్ణుఁడుఁ బూయ మీసమై
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 37. పకపక నవ్వకుండ నిక వంటలు జేయుచు వంటయింటిలో
  నొక శశకమ్మువోలె పడి యుండుట నచ్చదటంచు చెప్పగా
  చకచక వైద్యులామెకిల శస్త్రచికిత్సయె జేసిరంతటన్
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 38. గురువర్యులకు నమస్సులు

  చకచక కైతలే కురిసె జాజుల తావుల వోలె యింపుగన్ 
  పకపక హాసచంద్రికల భామిని భావము కోరినట్లుగన్ 
  శుకపిక రాగమాలికల శోభలు గాంచగ భావనంబులన్ 
  సకియకు గోరుకొన్న,బురుషత్వము,దక్కెనుపూర్వపుణ్యమై

  కస్తూరి శివశంకర్

  రిప్లయితొలగించండి
 39. పెద్దలకు నమస్సులు 🙏

  కం ll
  పంతము బట్టిన నాగమ 
  చింతలు దీర్చ నలగామ జీవన మందున్     
  సుంతయు భయమే గానక   
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్


  కం ll
  ఇంతలు కనులుండగ  ప్ర 
  శ్నింతువు  వచ్చిన సమయము జెప్పమనుచు పూ 
  బంతులు కినుకను జూపగ    
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్  

  కస్తూరి శివశంకర్ 🙏

  రిప్లయితొలగించండి
 40. మకరపురాశిలోజననమందినభామకునెట్టకేలకున్
  సకియకోరుకొన్నపురుషత్వముదక్కెనుపూర్వపుణ్యమై
  తికమకగాదెయియ్యదనిదీవ్రముగానుదలంచితేరమా!
  వికటపురీతినిన్జరుగువేయికినొక్కటిభూతలంబునన్

  రిప్లయితొలగించండి
 41. స్వాతంత్ర్య సాధన-- సరోజినీ నాయుడు

  చం:

  మకరము పట్టువోలు జన మార్గము నెంచి బ్రిటీషు నాజ్ఞలన్
  కకవిక ధిక్కరించి యణగారిన ప్రేమము దేశ భక్తినిన్
  ప్రకటిత మొంద జేసి కడు బాధల నొంద సరోజినీ యనన్
  సకియకు గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వ పుణ్యమై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 42. పూజ్యులకు నమస్సులు 🙏
  నా పూరణ ప్రయత్నం...
  రాణి రుద్రమ నుద్దేసించి...

  సంతున కొమరులు లేరని

  చింతించక పెంచె తనను చిరుత వలెన్ పూ

  బంతియె రణమున గెలువన్

  *ఇంతికి పురుషత్వ మబ్బె నెంత యొ వేడ్కన్*

  వాణిశ్రీ నైనాల

  రిప్లయితొలగించండి
 43. కుంతీ సుత మధ్యము రథ
  మెంతయు ధీరత నలంకరించ రణమునన్
  వింత ద్రుపద రాజాత్మజ
  యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్


  వైవస్వత మనువు తనూజ యిలాదేవి చరిత్ర నిచట ననుసంధానము సేసికొన వలెను.


  ఒకనెల స్త్రీగ నొక్క నెల నొందఁగఁ బుంస్త్వము వింతఁ, బుట్టి తా
  సకి యిల పూరుషుండు నయి సద్గురుఁ డైన వసిష్ఠ భూమిదే
  వు కృపను దిర్గి భామ యయి పుణ్య పురూరవుఁ బుత్రుఁ గన్న యా
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను బూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్వయము:
   యిల పూరుషుండు నయి సద్గురుఁ డైన వసిష్ఠ భూమిదేవు కృపను, దిర్గి భామ యయి (కుమార వనమున నడుగిడుట వలన) పుణ్య పురూరవుఁ బుత్రుఁ గన్న...

   తొలగించండి
 44. *కం||*

  వింతగు శిరోజ సొబగులు
  పొంతన కొరకని వలువలు ఒడుపుగ వేయన్
  వింతేమున్నది యిందున
  *"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"*

  కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 45. సకలము కృష్ణుడంచు దపసాధన జేసెను మీర ధన్యతన్
  నికరముగా శ్రమించి తగునీతిగ పాలన జేసె నిందిరన్
  పికమును మించి పాటలును పెద్దలు మెచ్చ సుశీల పాడెగా
  సకియకు గోరుకున్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 46. బంతుల నాడెడు సీతయె
  సుంతయు నాయాసపడక శూలధరు విలున్
  వింతగ నెత్తగ ననిరిటు
  నింతికి బురుషత్వమబ్బె నెంతయు వేడ్కన్

  చకచక నేర్చివిద్యలను సంపద కీర్తిని గొల్లగొట్టుచున్
  తికమకలేక చేగొనుచు తేకువమీరగ మంత్రిపీఠమున్
  సకలము దానెయైచెలగి శాసనకర్తగ వెల్గులీనెడున్
  సకియకు గోరుకున్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 47. కం
  ఇంతివి నీవెంత?యనగ
  పంతము పెరగగ బలీయ పనులను చేసెన్
  వింతను కనిన జనులనిరి
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్.

  కం:
  వింతగ చేసెను యుద్ధము
  సుంతము వెరవక రిపులకు చుక్కలు చూపన్
  పంతము పెరుగెను చూడుము
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్.

  రిప్లయితొలగించండి
 48. మిత్రులందఱకు నమస్సులు!

  [భీష్మతిరస్కృతయైన యంబ, యతనిఁ జంపుటకై ప్రతిన నూని, భార్గవుని తోడ్పాటున, శివునికై తపస్సుచేసి, ”పునర్జన్మతోఁ బురుషత్వ మందెద’’వను వరమంది, మఱు జన్మను శిఖండియై పుట్టిన ఘట్టము ననుసంధానించుకొనునది]

  ఒకటను నంబ భీష్మునకు నొందిన కన్నియయై, తిరస్కృతిన్,
  సకలము వీడి, భార్గవుని సాయమునంది, తపమ్ముఁ జేసి, యం
  ధకరిపు వాఙ్మహత్త్వమునఁ దాను జనించె సుతుండుఁగాఁ! గనన్,

  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై!!

  రిప్లయితొలగించండి
 49. సకలము మార్పు చేయగల శాస్త్ర సుశిక్షిత వైద్యబృందముల్
  నికరములైన నూత్న గణనీయపు వైద్యవిధాన పద్ధతుల్
  ప్రకటితమయ్యె నేఁడు తన వాంఛితమున్ నెరవేర్చ గల్గుచున్
  సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై

  రిప్లయితొలగించండి
 50. శకునములేమిజేయునని,సంపద గల్గిన వారు బల్కగా
  సకలము శూన్యమేయనుట, సాధ్యముజేసెకరోనరోగమే
  వికలమనస్కులై మనుట, వింతగనేర్పిన చింతలేమితో
  సకియకుగోరుకొన్న,పురుషత్వముదక్కెనుపూర్వపుణ్యమై
  +++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 51. సంతతిబాలుడుకలుగక
  చింతనుబాపఁగతనయనుచిన్నతనమునన్
  వింతగసుతునిగబెంచగ
  ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"

  రిప్లయితొలగించండి