2, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3327 (రాముఁడు పెండ్లియాడుటకు...)

కవిమిత్రులారా,
🕉శ్రీ రామ నవమి శుభాకాంక్షలు Images ...
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"
(లేదా...)
"రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట
 భద్రగిరిస్థ వేదికిన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలు)

73 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    సోముని తోడుతన్ తనరి సుంతయు జాలిని చూపకుండగా
    భీముడు మోడివర్యుడిట బింకము మీర నిరాకరించగా
    కామము క్రోధమున్ విడిచి కమ్మని శ్రాంతిని నందమొందుచున్
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట
    భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తామసులైన కాంగియుల దారుణ రీతిని దుమ్ముకొట్టుచున్
    సోముడు పుత్రవీరునకు శోభమ మెచ్చగ పట్టమీయగన్
    గోముగ హైద్రబాదునను గొప్పగ దీపిలి కల్వకుంటడౌ
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి


  3. ఈ మహినన్ కరోన క్రిమి హెచ్చు వధించగ మర్త్య జాతినిన్!

    క్షేమము కాదొ! యేమొ! యని చింతిలి మిక్కిలి భీతిజెందెనో!

    భామిని సీత గూడి కడు బావనమూర్తి విరాజితుండు శ్రీ

    రాముడు పెండ్లియాడుటకు రాఁడట
     భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  4. (కరోనాసురి సంహారానంతరమే కల్యాణవేదిక వద్దకు
    వస్తానంటున్న వీరరాముడు)
    ఆ మునిరాజశిష్యుడును ;
    నాయతబాహుడు ;భానుతేజుడున్ ;
    శ్యామలవర్ణసుందరుడు ;
    సన్నుతధర్మపరుండు ;మంగళా
    రాముడు ;కారొనాసురి -క
    రాగ్రశరాగ్రమహార్చి మాడ్చకే
    రాముడు పెండ్లియాడుటకు
    రాడట భద్రగిరిస్థవేదికిన్!!
    (మునిరాజశిష్యుడు -విశ్వామిత్రుని శిష్యుడు ;కరాగ్రశరాగ్రమహార్చి -చేతిలోని బాణముల అగ్నిజ్వాలామాలికతో
    కారొనాసురి-కరోనా రాక్షసి)

    రిప్లయితొలగించండి


  5. వీడు వాడెవడయ్యరొ విదుర రాడు
    రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు?
    మానసంబున తలచు సుమా మనుజుడు
    మీదు రాముని కల్యాణ మిపుడె యనుచు!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. శ్యామల రాయడాతడయె జానకి తోడయె శోభగూర్చగా
    నీమము తప్పకన్ జనుల నిండుగ చూడగ వచ్చువేళ నే
    నేమని చెప్ప నమ్మ నరుడే సృజి యించె కరోన! మైథిలీ
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. లోకమంత భయపడు కరోన రోగ
    తీవ్రత నెదుర్కొనంగ నీదినము రామ
    నవమి యైననుకూడ జనత యెదుటకు
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

    రిప్లయితొలగించండి


  8. అర్చకులు బిలిచిరి రామ రాయటంచు
    "రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
    పొండి " పోలీసులు తరిమి పొంక పడిరి
    పో కరోన మహిమ నాట బోవ కపురు!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    "నా మనుజుల్ కరోన వ్యథ నల్గుచునుండ ప్రపంచమందు., నా..
    కేమిది వేడుకా?" యనుచు నెత్తె శరమ్ము దురంతదుష్టసాం...
    క్రామికరోగరూపదశకంఠవధార్థము., గాన నేడు మా...
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట
    భద్రగిరిస్థ వేదికిన్!!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. భూమిపయిన్ "గరోన"యను భూతము చేరెను గాన మానవ
    క్షేమము గోరి లోపలనె చేయుదు రర్చకు లొక్కరిద్దరే
    స్వామికి బెండ్లియన్న నొకబాలకు డింటను దెల్పె "నిత్తరిన్
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్"

    రిప్లయితొలగించండి
  11. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు.

    తేటగీతి
    తలలుఁ దనువంత నిండిన దానవుండు
    'కోవిద'ను పేర లోకమ్ముఁ గ్రుంగఁ జేయఁ
    బంక్తి కంఠునిఁ గూల్చిన భంగి చెలఁగ
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు!

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల
    ధూము కరోన తొండముల దూయఁగ లోక భయంకరమ్ముగన్
    కాముకుడైన రావణుని కంఠములన్ దెగఁ ద్రుంచినట్లుగన్
    హోమమనెండు యుద్ధమున హూనముఁ జేసెడు కార్యదర్శియై
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పూరణ:

      ఉత్పలమాల
      ధూము కరోన తొండముల దూయఁగ లోక భయంకరమ్ముగన్
      కాముకుడైన రావణుని కంఠములన్ దెగఁ ద్రుంచినట్లుగన్
      హోమమనెండు యుద్ధమున హూనముఁ జేసెడు యోధుఁడౌచుఁ దా
      రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!

      తొలగించండి
    2. ఎడు, గెడి గాగమ పదముల నరసున్న లేమి కారణమున హోమ మనెండు రూప మసాధు వండి. హోమ మనెడు సాధువు.
      హూనముఁ జేసెడు వ్యావహారికము.

      తొలగించండి
    3. ఆర్యా!ధన్యవాదములు.సవరించిన పూరణ:

      ఉత్పలమాల
      ధూము కరోన తొండముల దూయఁగ లోక భయంకరమ్ముగన్
      కాముకుడైన రావణుని కంఠములన్ దెగఁ ద్రుంచినట్లుగన్
      హోమమనంగ యుద్ధమున నుక్కడగించెడుయోధుఁడౌచుఁ దా
      రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!

      తొలగించండి
  13. గురువు గారికి నమస్సులు.
    తోడు పెండ్లి కొడుకు లేక తోచకుండె
    జోడు కుదరదు వియ్యపు జోరులోన
    పాడు మహమారి వైరసు పడగ ,నేడు
    రాడు పెండ్లాడ భద్రాద్రి రామ విభుడు.

    రిప్లయితొలగించండి
  14. ప్రజ కరోనాకు భీతిలి వగచియుంట
    చేర రారయ్యె భద్రాద్రి చెంతకనుచు
    పరమ కరుణాంతరంగ విభ్రాజితుండు
    రాడు పెండ్లాడ భద్రాద్రిరామ విభుడు

    రిప్లయితొలగించండి
  15. కామినియగు పౌలస్తియె కాంచి విశ్వ
    మోహనుండగు రాముని, మోహమంది
    మనువు నాడగ రమ్మంచు మగువ పిలువ
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

    రిప్లయితొలగించండి
  16.  పాడు బ్రతుకని ప్రజలెల్ల బాధనుండ 
    వేడుకగ పెండ్లి చేయంగ వీలుపడదు 
    నాడెముగ ముందు  నణచ మనుచు 
    "రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"  

    రిప్లయితొలగించండి
  17. "పాడు బ్రతుకని ప్రజలెల్ల బాధనుండ 
    వేడుకగ పెండ్లి చేయంగ వీలుపడదు 
    నాడెముగ ముందు విపత్తు  నణచ మనుచు 
    "రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు" 

    రిప్లయితొలగించండి
  18. భక్తు లందరు గృహముల బంది గాగ
    వాద్య బృందాలు లేవంచు వంత చెంది
    రాడు పెండ్లాడ భద్రాద్రి రామ విభుడు
    విసిరె గద కరోనా పంజా విశ్వ మం త

    రిప్లయితొలగించండి
  19. రాజ్య లక్ష్మి ని కాపాడు రాజు తాను,
    ధర్మ పత్నిని విడనాడ ధర్మ ప్రభువు,
    నేడు విశ్వంబు కాపాడు నీమ మంద
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుడు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  20. భూమిజనమ్ము నందరిని భూతకరోన హరించ, మారుతిన్
    నీమముతోడఁ దూర్ణముగఁ దెమ్మమృతమ్మని బూన్చి వేగ స్వ
    ర్ధామముఁ జేరఁ, దల్లయకరాస్రముఁ గోరి తపోనిమగ్నుడై
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట
    భద్రగిరిస్థ వేదికిన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  21. సోముని దాల్చియుండు పురుషోత్తమునిన్ శివ రాత్రి నాడు విం
    ద్యామర వీచి మర్త్యులు వియచ్చరులున్ యతి కోటి సిద్ధులున్
    గోమున వారణాసి జని గొప్పగ పూజల మున్గియుండుటన్
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  22. ఖలు కరోనాయె వ్యాపింప కల్పమందు
    ప్రజలు గుమిగూడ వలదంచు ప్రభుత తెలుప
    నిల్లు వీడరు జనులింక నిటకు నొకడు
    రాడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుడు

    రిప్లయితొలగించండి
  23. మేము ప్రధానమంత్రి నుడి మీరము యింటనె యుండెదమ్ము, మా
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్
    ప్రేమగ సీతతోడ తన పెండ్లిని మా గృహమందునన్ పరం
    ధాముడు చేకొనున్, గొనును తాఁ వడపప్పును పానకమ్ములన్౹౹

    రిప్లయితొలగించండి


  24. తేటగీతి పాద గర్భిత ఆటవెలది. ప్రత్యక్ష ప్రసారం‌ వుందట


    వీధియందు రాఁడు పెండ్లాడ భద్రాద్రి
    రామవిభుఁడు గుడిని రాజిలునట
    చూచెదమిక టీవి చూపగ ప్రత్యక్ష
    ముగ జిలేబి కనుల ముందరేను!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు!

    "ఏమె కరోన! నీ విలను నెందఱనో హతమార్చఁగాను, మా
    యీ మనుజుల్ భయంబు మెయి నిండ్లను వీడక యుండ్రి! నీవు నీ
    నీమము వీడి పోవఁగదె! నీ విట నుండినఁ, గిన్కఁబూని, శ్రీ

    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడఁట భద్రగిరిస్థ వేదికిన్!"

    రిప్లయితొలగించండి
  26. నేమము తప్పకుండగను నెమ్మిని బూనుచు వచ్చు స్వామి యున్
    సీమలయందుకీటకము స్వేచ్చగ వ్యాప్తిని చెంద గాంచుచున్
    ధామము వీడిరాకుడని దాప్రజ కున్ దెలుపంగనెంచుచా
    రాముడు పెండ్లియాడుటకురాడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  27. వసుధ జనులంత నెఱనమ్మి భక్తి చేత
    తాము గృహమందు నాసీత రాము లకును
    పానకమ్మును వడపప్పు వారుబెట్ట
    భక్తుల శుఖశాంతులెతాను భద్రమంచు
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు.

    రిప్లయితొలగించండి
  28. టీవిలోనె చూచెదమిప్పటికిఁ దరింప,
    జనములు గుమిగూడగఁ బ్రశస్తంబు గాద
    ని మది నెంచి భక్తుడెవడు నేడు చూడ
    రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు!

    రిప్లయితొలగించండి
  29. శంకరాభరణం ...02/04/2020
    గురువారం

    సమస్య
    **** ***
    రాముడు పెండ్లియాడుటకు రాఁడట
     భద్రగిరిస్థ వేదికిన్

    నా పూరణ.
    **** *****

    ఉత్పలమాల:

    నీమము, భక్తి వీడకను నిత్యము బూజలొనర్చు మర్త్యులన్

    సేమము దృంచి నాశనము జేసెను కీటకమౌ కరోనయే!

    భూమి జనాళి బీడించెడు భూతమునున్ గడతేర్చుదాక శ్రీ

    రాముడు పెండ్లియాడుటకు రాడట
    భద్రగిరిస్థ వేదికిన్



    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  30. ఏకపత్నీ వ్రతుడటంచనేక జనులు
    చేత ప్రస్తుతింప బడిన శ్రీరఘుపతి
    వాసిగవినుము వేరొక వనిత కొరకు
    *"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"*

    రిప్లయితొలగించండి
  31. తుంటరి కరోన భయమున నింటనుండి |
    రామ కళ్యాణము కనగ లేమనుచును|
    కుంద జనులు, రాముడు వెత జెందినాడు |
    "రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"

    రిప్లయితొలగించండి
  32. సమస్య :-
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

    *తే.గీ**

    పల్లె పల్లెకూ తాళము పడిన వేళ
    బయట తిరిగినంత కరోన పట్టు వేళ
    కాపలాగ లాఠీలన్ని కాయువేళ
    ఎవడు తన్నులు తినవచ్చు? నెవడు రాడు
    రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
  33. నా పూరణ ప్రయత్నం 🙏🙏

    *తే గీ*

    రావణ వధను జేసెను రమ్యముగను
    ఒక్క బాణము చాలు నొడుపుగనిపుడు
    కరొన నంతము జేయక కదిలిచటకు
    *"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"*

    కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి..
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
  34. భూమిజ విగ్రహమ్మదియె పుత్తడి తోడ తయారు జేసితిన్
    నేమము తోడ, వేడుకగ నీరజ పత్రదళాయ తాక్షుడౌ
    రాముడు పెండ్లియాడుటకు, రాడట భద్రగిరిస్థ విదికిన్
    క్షేమము గోరి యొక్కడును కీటక మైనక రోన భీతిచే.

    రిప్లయితొలగించండి
  35. తే.గీ
    జాతి యిక్కట్లు పడుచుండ జాలిపడెను
    నష్ట పరచుటిష్టములేక నవమి పేర
    భక్త జన కూటమి కడు నపాయమనుచు
    రాడు పెండ్లాడ భద్రాద్రి రామ విభుడు

    తే.గీ:
    జడిసి పోతుంటెజనులెల్ల జగతినిండ
    కాచి కాపాడవలసిన కాలమందు
    రాడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుడు
    ప్రజల సేమమే తనకును ప్రథమమనుచు.

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    రాముడు గూడ మానవుడె రాష్ట్రము నేలెడి గడ్డు కాలమున్
    తాముగ జూచెనా నిటుల తథ్యము వాకిలి వీడకుండగన్
    మోముకు గుడ్డ కట్టుకొని మూరెడు దూరము నాచరించుటై
    రాముడు పెండ్లియాడుటకు రాడట భద్రగిరిస్త వేదికన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. రాముని మార్గదర్శకము రాజ్యము నందున స్ఫూర్తి నింపగా
    రాముడె తా కరోన యను రక్కసి నడ్డుచు మానవాళికిన్
    బ్రేమము బంచ వచ్చె! తన బెండ్లియె నింటను సల్ప బోవఁగా
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  38. రాడుపెండ్లాడభద్రాద్రిరామవిభుడు
    ననెడుభ్రమలోన నుంటిరియార్య!మీరు
    రామురాకతోడనెపెండ్లిలక్షణముగ
    బరగుచుండెనుజూడుడుభక్తిటీవి

    రిప్లయితొలగించండి
  39. నీమము దప్పకన్ దనను నిర్మల భక్తిని గొల్చువారినిన్
    ప్రేమము మీర గాచు యరవింద దళాక్షుడు ధర్మ మూర్తి శ్రీ
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్
    సేమము గోరి దానె దయసేయును భక్తుల మానసమ్ములన్
    ఆ మహనీయఘట్టమును హాయిగ గాంచుచు నాత్మ సాక్షిగా
    నేమరుపాటు లేక జనులెల్లరునుండ కరోన మాపునే

    రిప్లయితొలగించండి
  40. అన్నదమ్ముల పెండ్లిండ్లు కన్ను లదర
    మేళ తాళధ్వనులు మించ మిథిల జరుగ
    గ్రీవదశకుండు వీరుండు రావణుండు
    రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు


    రాముని సీతనున్ నిలిపి రంజిల భక్తి మనమ్ము లందు నీ
    భూమి జనుల్ నుతించఁ గడు పుణ్యము వెండిళు లేల నిత్యమున్
    గోముగ సీతతో మిథిల గోత్ర సనామ వివాహ మేర్పడన్
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  41. జనులు గృహముఁ గల్యాణము జరుపు చుండ
    జానకిని కూడి రాముడు చనుచునుండె
    వారి యిండ్లకు కరమగు గౌరవమున
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు

    రిప్లయితొలగించండి
  42. ఉత్పలమాల
    గీముల వీడ కండనుచు క్రిక్కిరియంగ 'కరోన' సోకనన్
    పామర పండితాళి మది బంగరు కోవెలలన్ ప్రతిష్టలన్
    నీమము తోడ నుద్వహము నిర్మల భక్తిని జేయ బంధియై
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్!

    రిప్లయితొలగించండి
  43. రాముడుపెండ్లియాడుటకురాడటభద్రగిరిస్ధవేదికిన్
    నేమనిబల్కుచుంటిరయయీశుడురాడటపెండ్లివేదికిన్
    రాముడువచ్చెజూడుడటరాజిలుమోమునవెల్గుచుండుచున్
    భూమిజనంబులెల్లరునుభూరిముదంబునజేలుగొట్టగా

    రిప్లయితొలగించండి
  44. రామకళ్యాణఘట్టము రమ్యమిలను
    చూచితరియింపభక్తులు వేచియుండ
    రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు
    జనులముందుకువైరసు జడుపువలన

    రిప్లయితొలగించండి
  45. ఏమనివిన్నవించెదనుయెక్కడచూచిన 'లాకుడౌను' లే
    సేమముకాదుజీవితము చిక్కులపాలగు గుంపు గూడగన్
    క్షేమముగాజనావళినిజేయుతలంపున గుంపు మధ్యకున్
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  46. గీముల లోననర్చనపు కృత్యములన్ గడు భక్తి చేయుచున్
    రాముని మెప్పు పొందఁ బ్రజ, రాగముతోడుత పోయి యిండ్లకున్
    భూమిజతోడదాశరథి పూజల గాంచుచునుండె తృప్తిగా
    రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్

    రిప్లయితొలగించండి
  47. రాముని రాక తప్పదని ,రాక్షస వైరసు పొంచియుండగా
    రామకృపావలంబమున,రక్షణజేయునురాజ్యమంతయున్
    రామ!కరోనదేహముల, రాపిడివద్దనిమౌనిజెప్పగా
    రాముడుపెండ్లియాడుటకు, రాడట భద్రగిరిస్థవేదికిన్
    ++++++++++++++=======
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి