అంజని దేవి ఒక అందమైన అప్సరస. ఆవిడ తన సుందరిని అని గర్వముతో ఒక ముని శాపమునకు గురి అయి కోతిగా పుడుతుంది. శాపము బాపు కొనుటకు శివుని గూర్చి తపస్సు చేసి అతనిని తన గర్భములో జన్మించమని అడుగుతుంది. శివుడు తాను ఆ వానర వనిత గర్భములో జన్మించి శ్రీహరి రాముడిగా అవతరించు సమయాన అతనికి సాయము చేస్తాను అని కైలాసము విడచి వెడలి పోతాడు. పతిని విడచి ఉండ లేక పార్వతి తాను కూడా వెళుతాను అని తన ప్రమధ గణములకు చెప్పగా వారు వద్దు అని వారిస్తారు.అప్పుడు పార్వతీ దేవి శివుడు వానరుడై పుడుతాడు కాబట్టి అతని వెంట నేనుండి అతని తోకలో పుడుతాను. కోతికి తోక చాలా ముఖ్యము నా శక్తి మొత్తము ఆ తోకలో ఉంచుతాను అని తన ప్రమధ గణములకు చెప్పెనను భావన
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
తరువున్ చెంతను కూర్చియున్న శివునిన్ తాదాత్మ్యన్ జెందుచున్
కరముల్ మోడ్చుచు నేను చూడగనటన్ గంభీరమౌ భక్తినిన్
వరమౌ తీరున దాగ మూషికమహో వైనంపు లింగమ్మునన్
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
తొలగించండి* తాదాత్మ్యతన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ధరలో నీకిక సూటి లేడనచు భల్ ధైర్యమ్మునన్ గొల్చుచున్
సరియౌ రీతిని వాయుపుత్రుడనహో శస్త్రమ్ములన్ పొందగన్
వరమౌ తీరున కాంగ్రెసున్ చెరచగన్ బంగారు రాష్ట్రమ్మునన్
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
తొలగించండి* సాటి
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికం//
రిప్లయితొలగించండిసంకటమగు చంద్రునిగన
పంకజనాభుఁన కెరుకయె పాలించంగన్ !
వంకను జూచిన భయపడు
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(హరిహరనాథుడు వాలంబులు ధరించిన విలక్షణుడైన
రిప్లయితొలగించండిస్వామి అని శిష్యులకు బోధిస్తున్న గురువు)
వరదైవంబగు చక్రి దాల్చునుగదా
వాలంబు రమ్యంబుగా !
పరమేశుండగు శూలికిం గలదు పో
వాలంబు చర్చింపగన్ !
సిరినాథుండు ధరించు "నందకమునే"
శిక్షింప దుష్టాత్ములన్ ;
గిరిజానాథుడు "దివ్యపాశుపతమున్"
గేల్దాల్చు సచ్చాంతికై .
(వాలంబు -ఖడ్గము ;బాణము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజింకను చంద్రుని యందున
రిప్లయితొలగించండిశంకించక వెలుచ లన్ని సరసము లాడన్
పంకజ ముఖిపార్వతి గని
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"
హరునిన్ జుల్కన జేయ దక్షుడట గర్వాంధుండునై ., తత్కృతా
ధ్వరమున్ ధ్వంసము జేసె కేశము విదల్పన్ వీరభద్రుండు! శం...
కరుడే రుద్రుడునౌను, మ్రొక్కనతనిన్ గాపాడు! లేకున్నచో
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్!!
వాలము... కేశము
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిలంకాదహి సామీరిగ
రిప్లయితొలగించండిశంకరుడే పుట్టెధరణి సాయపడంగా
లెంక యవుచు రాముని కా
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివంకర టింకర నరులకు,
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
తంకవపు స్థాయి మెరమెర
కుంకటి కనులకగుపడుటకు సుమా సుదతీ
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకర భగవానుడు ని
రిప్లయితొలగించండిశ్శంకగఁ గలఁడు గద సృష్టి సర్వమునందున్!
క్ష్వింకము లందున నుండెడు
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!
లంకేశ దమను రాముని
రిప్లయితొలగించండివంక నిలువ నెంచి గాలిపట్టిగఁ దా ని
శ్శంకను జన్మించిన యా
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిలంకేశుడు గొంపోయిన
రిప్లయితొలగించండిపంకజముఖి సీత జాడ పావని దెలిపెన్
శంకయ!? రాముని హితుడగు
"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
వంకరబుద్ధులమనుజులు
రిప్లయితొలగించండిశంకలు సృజియించి 'టీవి' ఛానలులందున్
వంకలుపెట్టగ నందురు
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
రిప్లయితొలగించండిపైన యేది కలదో క్రింద అదియే కలదు
అరరే రావణు కుంకలార వినుడీ యాద్యంతమున్ తోక యే
పరిశీలింపగ మిన్ను నీరు చిరియై ప్రాకట్యమైకన్బడెన్
నరులందాత్మగ హృత్తుగా వలయమై నాట్యంబుచేసెన్ గనన్
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్!
జిలేబి
లంకను గాల్చి యయోనిజ
రిప్లయితొలగించండిసంకటమును తీర్చినట్టి సత్యుండగునా
లంకారికి బంటతడా
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపగన్.
శంకరుడు....శుభములను గూర్చువాడు.
పరమాత్ముం డొకరుండె భేదమరయన్ భావ్యంబు గాదన్న స
రిప్లయితొలగించండిత్వర మార్యోక్తికి రూప మిచ్చెను గదా బాలుండు చిత్రంబునన్
తిరునామంబును శంఖచక్రము లటన్ దీపిల్లు శార్ఙ్గమ్ము న
ప్పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
శంకరు నంశగ రాముని
రిప్లయితొలగించండికంకిత భావమున సేవ లతులిత రీతిన్
గొంకక జేసెను గద యా
శంకరునకు దోక గలదు చర్చింప న్
రిప్లయితొలగించండికింకరుడయ్యె దశశిరుడు
*శంకరునకు,దోక గలదు చర్చింపంగన్*
జంకక రావణు పురియౌ
లంకను గాల్చెను హనుమయు లలితో నచ్చో
అంకము త్రేతాయుగమున
రిప్లయితొలగించండినంకితభావంబునిల్చెహనుమంతుండై
శంకరుడేసుందరుడన
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
నేటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండి.
శంకరునకు దోక గలదు, చర్చింపగన్
ఇచ్చిన సమస్య కందములో నా పూరణము సీసములో
అంజని దేవి ఒక అందమైన అప్సరస. ఆవిడ తన సుందరిని అని గర్వముతో ఒక ముని శాపమునకు గురి అయి కోతిగా పుడుతుంది. శాపము బాపు కొనుటకు శివుని గూర్చి తపస్సు చేసి అతనిని తన గర్భములో జన్మించమని అడుగుతుంది. శివుడు తాను ఆ వానర వనిత గర్భములో జన్మించి శ్రీహరి రాముడిగా అవతరించు సమయాన అతనికి సాయము చేస్తాను అని కైలాసము విడచి వెడలి పోతాడు. పతిని విడచి ఉండ లేక పార్వతి తాను కూడా వెళుతాను అని తన ప్రమధ గణములకు చెప్పగా వారు వద్దు అని వారిస్తారు.అప్పుడు పార్వతీ దేవి శివుడు వానరుడై పుడుతాడు కాబట్టి అతని వెంట నేనుండి అతని తోకలో పుడుతాను. కోతికి తోక చాలా ముఖ్యము నా శక్తి మొత్తము ఆ తోకలో ఉంచుతాను అని తన ప్రమధ గణములకు చెప్పెనను భావన
అందగత్తె ననుచు నహముతో నంజని
పొందెను శాపము పొలము తెంకి
వలన, చేయంగ తపమును శూలధరుండొ
సగె నొక్క వరమును సరస గతిని,
మర్కట స్త్రీ గర్భ మందు జననమునొం
దగ వెడలెను పతి, తలచ నడవి
నట్టుడౌ శంకరునకు దోక గలదు, చ
ర్చింపగన్ వలదు మీ రెల్ల రిపుడు
వెడలు చుంటి కై లాసము వీడి, తోక
ముఖ్య మందురు వానరములకు, నట్టి
వాల మున పుట్టెదననుచు పరుల తెల్పి
ప్రమధ గణములకు వెడలె భరణి పైకి
పొలము తెంకి = ముని, అడవి నట్టుడు = కోతి, పరుల = పార్వతి , భరణి = భూమి
వంకర బుద్ధుల వాడనె
రిప్లయితొలగించండిశంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
వంకలు బెట్టెడి తులువకు
పంకిలమౌ గాదె బుద్ధి వాదంబేలా
నిన్నటి సమస్యకు నా పూరణ పరిశీలింప మనవి:
రిప్లయితొలగించండిదుండగములాప యత్నించి దూరమైరి
తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
బండరాతి మనుష్యులు బందిపోట్లు
యుండలేమిట్టి పాపిష్టి యూరిలోన
లంకా నగరము లోగల
రిప్లయితొలగించండిపంకజముఖి సీత జాడ పసిగట్టినయా
వంకలు తెలియని భక్త వ
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
వంకర టింకర మాటల
రిప్లయితొలగించండిజంకక యొకడిటు కపివలె జనులను తిరగన్
శంకను తలచిరి యెల్లరు
"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
శంకరు నవతార మనియు
రిప్లయితొలగించండిశంకయె వలదని నుడివిరి సారము గనగన్
శంకరుడే హనుమ యనిరి
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!!
ఎల్లపుడూ పరమేశ్వరుణ్ణి వదలకుండా వెంటవుండే భక్తగణములే వాలము అనే భావముతో......
రిప్లయితొలగించండినిరతంబున్ తన భక్త సంతతుల సాన్నిధ్యంబునన్ వెల్గి స
త్వరమే వారలకోర్కె దీర్చననుకంపాదృష్టి వీక్షింప భూ
సురులున్ దేవగణంబు బాయక భవున్ స్తోత్రంబులన్ గొల్తురే
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[హరి హర వాహనములగు గరుడ నందీశ్వరుల సంవాదము]
గరుడుండా శివు వాహనమ్ముఁ గనుచున్ గంభీరుఁడై వల్కె "మా
హరికిన్ వాలము, ’చుట్టువాల్’ గలదయా!" యంచున్; వెసన్ నందియే
"పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు! చర్చింపఁగన్,
గరమందుంగలదోయి ’ముమ్మొనలవాల్’ గాంచంగదోయీ" యనెన్!
(వాలము=ఆయుధము, చుట్టువాలు=చక్రము, ముమ్మొనలవాలు=త్రిశూలము)
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా సరదా పూరణ యత్నం ..
😄😄
*కం||*
వంకలు బెట్టకు హనుమది,
బంకగ హారతి తగులగ భగవంతునికే
బొంకుచు దెలిపితి విట్లని
*"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
(ఒక సినిమా సన్నివేశం ఆధారముగా ప్రయత్నము)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారి సవరణతో..
తొలగించండిహరికిన్ మేలుగ నాభినిన్ కమల మొప్పారంగ ఫాలాక్షమున్
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
వర దుర్వార బలాఢ్యుడా హనుమకొప్పారున్ గదా సాజమే
పరమానంద స్వరూపముల్ గనగ నొప్పై దోచు నెద్దేనియున్
శంకరుగూరిచిపలుకిటు
రిప్లయితొలగించండిశంకరునకుదోకగలదుచర్చింపంగన్
గుంకనువోలెనుసరగున
వంకరగామాటలాడభావ్యమె లల్లీ!
లంకేశున కెరిగించిరి
రిప్లయితొలగించండికింకరులరుదెంచి, నేడు కేవలమొక కో
తిం కాంచితిమయ్యా! యప
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
అపశంక-భయములేని
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరుదేహంబున నున్నవింతయవు నాహార్యంబు వర్ణించుచున్
రిప్లయితొలగించండివరకావ్యుండు కవిత్వమున్నుడువగా వ్యాళంబు వాలంబుగా
పొరపాటున్ లిఖియించె వ్రాతకుడు;నాపొత్తంబు నామూలముం
బరిశీలించిన కందిశంకరులదే మాకిచ్చె పూరింపఁగా!
"పరమేశుండగు శూలికింగలదు పో వాలంబు చర్చింపఁగన్"
*తనశిష్యుడుఅడిగినప్రశ్నకు గురువుగారిసమాధానం*
రిప్లయితొలగించండిలంకనుగాల్చినదేమని
సంకోచముచేతనడుగసద్గురుబలికెన్
శంకేల?రామ భక్త వ
శం కరునకుదోకగలదు చర్చింపంగన్
*యస్ హన్మంతు*
పూజ్యులకు నమస్సులు🙏
రిప్లయితొలగించండిశంకరు గళమందుండెడి
వంకర సర్పంబు జార ,వనిలో మునికిన్
శంక కలిగి, తలచె నిటుల
*శంకరునకు తోక గలదు చర్చింపంగన్*
వాణిశ్రీ నైనాల
హరియేరాముఁడుగాభువిన్ దనుజ సంహారంబు గావించగన్
రిప్లయితొలగించండికరుణన్ దానుజనించె మానవునిగా కౌసల్య గర్భంబునన్
హరుడున్ రామునికండగాహనుమయై యావిర్భవింపంగ నా
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
లంకేశుఁ దునుమ భువిపై
రిప్లయితొలగించండిపంకజ నాభుడు జనించె భానుని కులమున్
లెంకగ పుడమి జనించిన
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
కం:
రిప్లయితొలగించండిబొంకులు నేర్చిన తుంటరి
పొంకము పలుకుల పదుగురి బురిడీ జేయన్
శంకే వలదన కలినిన
శంకరునకు తోక గలదు చర్చింపంగన్
వై. చంద్రశేఖర్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికలినిన / కలినిన్ గా మార్చడమైనది
తొలగించండిశంకరాభరణం
రిప్లయితొలగించండిశుక్రవారం...17/04/2020
సమస్య:
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
నా పూరణ.
**** **** *
( వాలము అనగా కత్తి అనే అర్ధమని గ్రహించుడీ...)
ఆ దేవదేవుడు పరమేశ్వరునికి ఆ మూడోకన్ను, త్రిశూలము,కేశములు,నాగుపాము..అన్ని వాలములే అనకా కత్తులే...
మత్తేభ విక్రీడితము
**** **** **** ***
అరయన్ దుష్టులఁ ద్రుంచ శంభునికి ఫాలాక్షమ్ము వాలంబె,యా
కురులే వాలము దక్ష కంఠముఁ గడున్ ఘోరంగ ఖండించ,నా
ఉరగమ్మౌ కద వాలమే!త్రిశిఖమే ఉష్ణీషికిన్ వాలమౌ
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
గరళమ్మే గళమందు శీర్షమున నా గంగమ్మయున్ జంద్రుడున్
రిప్లయితొలగించండిగరమున్ శూలము నందివాహనము గోకర్ణమ్మె కంఠంబులో
పరమేశుండగు శూలికే గలదు పో, వాలంబు చర్చింపగన్
వరుణావాసము దాటినట్టి ఘనుడా ప్రాభంజికిన్ గాంచగన్.
అంకమున నిల్పుదురు ని
రిప్లయితొలగించండిశ్శంకను దారల నితరు లసమనేత్రుం డా
వంక నునుచంగ దేవిని
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
వరసంజాతుఁడు రామ భక్తవరుఁడున్ వజ్రాంగ దుర్భేద్యుడుం
దరుణీ రత్నవిమార్గ ణాచలిత విద్యానైపు ణోద్భాసియున్
స్థిర సంకల్పుఁడు వాయు నందనుఁడు సందీప్తావతారమ్మునం
బరమేశుండగు, శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
[శూలి = శూలము నూనిన వాఁడు (లంకలో)]
ధరణీశుండగువారలున్బ్రజలకాధారంబునౌయట్లుగా
రిప్లయితొలగించండిబరమేశుండగుశూలికింగలదువాలంబుచర్చింపగన్
బరమేశుండునులోకమాతయునుగాపాడంగభూగోళమున్
సురలున్మెచ్చగగాశికాపురపుటచ్చోటన్వసంబుండెగా
వాలము=తోక
రిప్లయితొలగించండితోక=సంతానము
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
"సురగంగా సతి జారుచున్ యుధృతిమై చుంబించితే భూమినిన్
స్థిరమై నిల్పఁగ నోపునెవ్వర?" నుచున్ సేవించఁ బద్మాసనున్
వరమై యిట్లనె నబ్భగీరధునకున్ "బంధించ జూటమ్మునన్
బరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"
గురుదేవుల సూచన మేరకు సవరించిన పూరణ
తొలగించండిమత్తేభవిక్రీడితము
"సురగంగా సతి ధారగా నుధృతిమై చుంబించితే భూమినిన్
స్థిరమై నిల్పఁగ నోపునెవ్వర?" నుచున్ సేవించఁ బద్మాసనున్
వరమై యిట్లనె నబ్భగీరధునకున్" బంధించ జూటమ్మునన్
బరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"
శంకరుడన శుభకరుడగు
రిప్లయితొలగించండిసంకటములను దొలగించు షణ్ముఖునకునౌ
వంకలుగల భుజగాకృతి
శంకరునకు దోకగలదు చర్చింపంగన్
కరమందున్ సుశిరోజమందు మరి యాకంఠమ్మునందున్ దగన్
వరమాలాకృతి సర్పభూషలు శిరోపాదాంత సర్వాంగముల్
పరివేష్టింపగ చూచువాడొకడనెన్ వాతాత్మజుండట్టులన్
పరమేశుండగు శూలికిం గలదుపో వాలంబు చింతింపగన్
రిప్లయితొలగించండిసీతతో మాట్లాడి అశోకవనమును నాశనమొనరించిన
కోతిని రావణు ముందు ప్రవేశపెట్టినపుడు జరిగిన చర్చ :
కందం
పెంకితనమున వనమునకు
సంకటమొనరించె కోతి సరి శిక్షించన్
శంకవిడి కాల్చ వన నా
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధరణిన్ పుట్టె సురల్ స్తుతించ నరవిందాక్షుండు కౌసల్యకున్
రిప్లయితొలగించండివరపుత్రుండయి సూర్యవంశమున క్రవ్యాభుక్తి సంచారులన్
పొరిమార్చన్, హరుడున్ జనించె భువిపై భూజాని సేవించ నా
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
లంకన యశోకవనమున
రిప్లయితొలగించండిపొంకముగల జానకమ్మ పొందునుగోరే
వంకరబుద్ధినిగాల్చు;వ
శంకరునకుతోకగలదు చర్చింపంగన్
*********************
రావెలపురుషోత్తమరావు
కరుణామూర్తగు మారుతే శివుడుగా గాంచుమ్ సదా మ్రొక్కుచున్
రిప్లయితొలగించండిపరమార్ధంబది గానగన్ నిరువురూ పారంగతుల్ శంకరుల్
శరణంబన్నను శ్రీఘ్రమే సమయమున్ సాయంబు జేతుర్ సదా
పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
దయచేసి పద్యం భావం కూడా ఇస్తే బాగుంటుంది
రిప్లయితొలగించండి