3, ఏప్రిల్ 2020, శుక్రవారం

సమస్య - 3328 (నానా శ్రేయములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు"
(లేదా...)
"నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్"

89 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కానంగా నడివీధినిన్ నెమలినిన్ గారాబు ముస్తాబుతో
  శ్వానమ్ముల్ వడి పారిపోవగనహా స్థానమ్ములన్ వీడుచున్
  హానిన్ గొల్పెడు ధూమముల్ పురమునున్ హ్లాదమ్మునన్ వీడగా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కానన్ జాలని పుత్రుడే వసతినిన్ గగ్గోలు కల్పించగా
  తేనెల్ వోలెడు మన్మరాలి నుడులే త్రేన్పింప హ్లాదమ్మునన్
  దీనారమ్ములు పాసుబుక్కున నెఱిన్ తీండ్రించి కూర్చుండగా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి

 3. నా పూరణ. శార్ధూలము
  *** **** ***

  చైనాదేశమునన్ జనించి కడు విస్తారమ్ము వ్యాపించుచున్

  నానా దేశ ప్రజాళి గర్కశముగన్ నాశమ్ము గావించుచున్

  ప్రాణాలన్ గొనె నీ కరోన క్రిమి...; పల్కన్ భావ్యమౌనే యిటుల్???

  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్"

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 4. (కుటుంబజీవనపు కళకళలు)
  "ఏనాడైనను నింట నిల్వ"మను కా
  ర్యేష్టుల్ గృహేష్టుల్ సదా ;
  నానాడున్ "దిను"డంచు బెట్టెదరుగా
  నాహారమే భార్యలున్ ;
  "నా నా విద్యల గాంచు"డంచును మహా
  నాదాల సంతానమే ;
  నానాశ్రేయము లందజేసెను కరో
  నా మానవుల్ మెచ్చగన్ .
  (కార్యేష్టులు-పనిపైనే ఆసక్తులు ;గృహేష్టులు-ఇంటిపైనే ఆసక్తులు ;
  నానాడు-ప్రతిదినము ;మహానాదము-పెద్ద అరుపు)

  రిప్లయితొలగించండి

 5. ఇంటి పట్టున ఓ నిమిషమైనా ఉండని పెనిమిటి పొద్దస్తమానము కండ్ల ముందరే ఉంటే సహనాభివృద్ధి యే :)


  ఇంటి పట్టున పడియుండని మగ రాయ
  ల కదె నేర్పెనయా గూరల తరుగుట జి
  లేబులకు నేర్పె సహనము లెస్స గాను
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి


 6. ఇల్లే కదా స్వర్గసీమ :)

  ఏనాడైనను కాయగూరల ముఖమ్మే చూడ లేదాయె వా
  డై నట్టింటను బుద్ధిగా తరిగె జోడై భార్యతో! ఓర్పునౌ
  రా నాంచారులు నేర్చిరే పెనిమిటుల్ రాపాడ తోడై సదా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. పోయె కైకూలి! మదురువు పోయె! తిండి
  పోయె! జీతము కోతాయె! పోయె వితతి!
  పోయె మార్కెట్టు వృద్ధియు పోయె నెట్లు
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు?  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. నానా రీతుల నాశనమ్ము జనులున్మాదుల్వలెన్ మారిరే
  చీనాలో జనియించె కుందకము కొంచెమ్మైన లేదాయె నౌ
  రా నైరాశ్యపు పల్కులేల నరుడా రాపాడెరా! యెట్లురా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఇంటనుండంగజేసెతానెల్లజనుల
  గాలికాలుష్యమునుతగ్గెఁజాలనేడు
  మంచిక్రమశిక్షణనుపెంచె మనుజులందు
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 10. ధ్యానౌన్నత్యము దెల్పుచుండి యొకరుం డత్యంతమోదంబునన్
  దానా మిత్రున కౌత్తరాహుడగుటన్ దద్యుక్త శబ్దంబులన్
  వానిం జేరి వచించె 'పూర్వజులకున్ స్వాస్థ్యమ్ముతో నీయిలన్
  నానా శ్రేయము లందఁజేసెను" "కరోనా" మానవుల్ మెచ్చగన్

  కరోనా=చేయుమా(హిందీ)

  రిప్లయితొలగించండి
 11. బయట నుంచి తిరిగి వచ్చిన
  వారెల్ల
  విప్పుచుండె వలువల్ తప్ప దనుచు,

  చేతులన్ కాళ్ళను మూతులన్ పలుమార్లు
  కడగక లోనికి నడుగు పెట్ట

  కుండిరి,వేడిగ నుండిన భోజన మును కోరి నిళ్ళలో తినుచు నుండె,

  తల్లితండ్రులు తమ పిల్లల తోనాట
  లాడుచు గడిపిరి వీడకుండ,

  నొకచోట నింటిలో న‌ కుటంబ మంత జే
  రి కబుర్లు జెప్పిరి సుకము గాను,

  పిస్తాలు బర్జర్లు పెట్టక నిళ్ళలో
  పిండి వంటలు చేసి పెట్టు చుండె,

  మందు షాపులు లేక మనుజులు
  నిళ్ళలో నుండి తే నీరు త్రాగె

  పిల్లల కెల్లరు ప్రేమతో కధలను
  చెప్పుచు వారల మెప్పు పొందె


  తెలిసి వచ్చెను జనులకు విలువలు గల

  పూర్వ కాలపు పధ్ధతుల్ ,పోటి పడుచు

  నేడు పాటించు చుండగ, నిజము గాదె

  పూని శ్రేయము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విప్పిరి వలువలు...తినుచు నుండ్రి... మనుజులు తమతమ...(గణదోషం)... మెప్పు గనిరి..." అనండి.

   తొలగించండి
 12. కానవచ్చెఁ గాలుష్యము లేని గాలి!
  కలిగె శుభ్రతావసరావగాహనమ్ము!
  ప్రకృతి కోపింప వ్యస్తమౌ బ్రతుకు తెలిసె!
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 13. 'శతావధాని' ఆముదాల మురళి గారి పూరణ......

  పూనించెన్ గృహమందు నెల్లరిని విస్ఫోటించు కాలుష్యమున్
  బోనెంచెన్ ధనదర్పమెల్ల నడఁచెన్ బోషించె దాతృత్వమున్
  దా నేర్పెన్ బరిశుభ్రతన్ బొదుపు భద్రంబంచు నీరీతిగా
  నానా శ్రేయము లందఁ జేసెను కరోనా మానవుల్ మెచ్చఁగన్.

  రిప్లయితొలగించండి

 14. మైలవరపు వారి పూరణ

  ఈ నీ తిండియు నిద్ర నీకొసగ నెంతేన్ తృప్తితో పొంగెదో?
  జ్ఞానీ! విశ్వవినాశగీతికలలో సంగీతమున్ మెచ్చెదో?
  యే నైపుణ్యమునన్ వచించెదవు? నీవీరీతి నేనొప్ప?., నే
  నానా శ్రేయము లందఁజేసెను
  కరోనా మానవుల్ మెచ్చగన్!?

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 15. ఒంటరి తనము తోనింటనుండి, ప్రియపు
  మాట కరువుతో వృద్ధులు మనుచు నుండ
  కలిపె ను కుటుంబ సభ్యుల , తెలిపె శుద్ధ
  మైన మన పూర్వ పద్దతు లందరికిని
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 16. కాని పనులను  చేసెడు కాముకులకు 
  వేని నైనను తినునట్టి భిక్షకులకు 
  లేని పోనివి కల్పించు లీడర్లకు  
  "పూని, శ్రేయమ్ము లిడె కరోనా నరులకు
  "కాముకులకు = కాని పనులు చేయాలనే కోరిక కలవారికి,
  భిక్షకులకు = అడిగియైనా  తినేవాళ్లు,
  లీడర్లు = ఊరంతా పనిలేక తిరిగేవాళ్లు, 
  పూని = ఆవేశించి (తగిలి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లీడర్లకు' అన్నచోట గణభంగం. సవరించండి.

   తొలగించండి
 17. పాలకులు బాధ్యత దెలిసియు ప్రజల కొఱకు
  పూని శ్రేయము లిడె : కరోనా నరులకు
  సోక కుండగ చర్య ల నేక ములను
  తీసి కొను చుండె రక్షింప తెగులు నుండి

  రిప్లయితొలగించండి
 18. ఘ్రాణించెన్ స్వగృహాశ్ర మోపవన సౌగంధ్యమ్ము శాంతమ్ముగా
  ప్రాణాయామము యోగ ధ్యానముల నభ్యాసమ్ము గావించితిన్
  చానాండ్లై తలపెట్టుకొంటిఁ ప్రియ వ్యాసంగమ్ము లీరీతియిన్
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యోగ ధ్యానముల' అన్నపుడు 'గ' గురువై గణభంగం. "ప్రాణాయామము ధ్యాన యోగముల..." అంటే సరి! 'చానాండ్లు' అన్నది వ్యావహారికం.

   తొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  ఈనాఁడెన్నియొ మేళ్ళు కల్గెఁ గద! పోయెన్ వాయు కాలుష్యమే!
  ధ్వానంపుం గలుషమ్ము వోయెఁగద! మద్యమ్మే కనన్ రాదుపో!
  కానన్ రావయె బాట నాపదలు! దొంగల్ గానరారైరయా!
  కానం గల్గితిమయ్య భారతిని నీ కామర్సు లాన్లైనునన్!
  మానం జేసెను నింధనమ్ముల వ్యయాల్! మ్రందించె నేరమ్ములన్!
  గానం గల్గితి మింట బాల జన విజ్ఞానంపుఁ బాఠ్యమ్ములన్!
  గానం గల్గితి మింట నందఱము సత్కౌటుంబ బంధమ్ములే!
  గానం గల్గితి మయ్య కోయిలల సద్గానమ్ములన్ జెట్లపై!
  మౌనమ్ముల్ విడె! శుభ్రతల్ పెరిగెఁ! గొంపన్ హెచ్చె నారోగ్యముల్!

  నానా శ్రేయము లందఁజేసెను "కరోనా" మానవుల్ మెచ్చగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణార్యా! మాకేమీ మిగల్చకుండా అన్నీ మీరే వ్రాసేశారు!నమోనమః!

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ సీతాదేవి గారూ! మీ అభిమానపూర్వక ప్రోత్సాహక వాక్యములకు కడుంగడు కృతజ్ఞుడను!

   తొలగించండి
 20. ఓౌనిది నిజమేయరయగ నోలలామ!
  పూనిశ్రేయమ్ములిడెకరోనానరులకు
  చేయిచేయికలుపుటనుజేయకిపుడు
  చేతులెత్తుచునతులనుజేయుకతన

  రిప్లయితొలగించండి
 21. పిల్ల, పాపలొక దరిని ప్రేమ నుండె,
  వున్న దానితో తృప్తిని పొంద నేర్చె |
  కలుష రహితమై ప్రకృతెల్ల కళకళనయె|
  మందు బాబుల సందడి మందమయ్యె |
  దైవ, ధార్మిక చింతన ధరణి పెరిగె |
  "పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఉన్న'ను 'వున్న' అనరాదు. "ప్రేమ నుండి । రున్నదానితో... పొంద నేర్చి..." అనండి.

   తొలగించండి
 22. సతిసుతులగూడి సమయము సాగదీసి
  కుదురుగ గృహముననె మెల గుటను నేర్పి
  విచ్చలవిడిగ సాగు జీవితము మార్చ
  బూని , శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 23. చీనా దేశము నుండి రేగె విషమున్ చిందించుచున్ భూమిపై
  నానా దేశములన్నిటన్ నిలిచె యానమ్ముల్ విహారమ్ములున్
  ఈనాడంతట తగ్గె జూడుడిల మాలిన్యమ్ము గాలుష్యముల్
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి


 24. ఇంటి నుండి పనులు చేయు చిమ్ము గాను
  బయటి కేగవలయునను బాధలేక
  సతి సుతులతోడనుకలసి సంబరపడ
  *పూని శ్రేయమ్ము లిడెకరోనా నరులకు"

  రిప్లయితొలగించండి
 25. ఔనౌ నీ వను మాట సత్యయుతమౌ యాయా విశేషోక్తిసం
  ధానానేకసమన్వయీకృతసుసందర్భంబు లందొప్పగన్,
  కానీ! మారణహోమకారకముగన్
  కాకుస్వరోక్తంబుగా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా, మానవుల్ మెచ్చగన్!.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "సత్యయుతమౌ నాయా...' అని ఉండాలి కదా?

   తొలగించండి
 26. తేటగీతి
  వ్యక్తిగత పరిశుభ్రతావసర మెఱిఁగి
  యింట నుండఁగ సృజనత లింపుఁ గూర్చి
  నడతఁ దప్పిన చెలరేగి యడఁచు ప్రతినఁ
  బూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 27. ఏకతమ్మునఁ బ్రజ నుంచి సోఁక నీక
  క్రిమిని వైద్య మందించుచుఁ గేవలమ్ము
  ధైర్యము వహించి మాన్య ప్రధాన మంత్రి
  పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  [కరోనా నరులు = కరోనా సోఁకిన నరులు; కేవలము = సమస్తము]


  ఏ నాఁడైన నెఱుంగ నేరని దహో యిక్కీటకం బీ ధరన్
  నానాదేశ విహార మానవ మహా నాశంకరం బైననుం
  దా నీ నా డిట నైకమత్యమును సంధానించి సత్యంబుగా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 28. గురువు గారికి నమస్సులు.
  జ్ఞాన వైరాగ్య ముక్తికి జ్ఞాన ధార
  పూని శ్రేయమ్ములిడె, కరోన నరులకు
  నష్ట కష్టాల కడలియె నరక మయ్యె
  ఏమి వ్రాయుదు మహమారి నేలు చుండ?

  రిప్లయితొలగించండి
 29. శార్దూలవిక్రీడితము
  ప్రాణాయామము నిత్యకృత్యమగుచున్ బ్రాణేశ్వరీ తోడుగన్
  ధ్యానాసక్తత పెంపు మీర సృజనల్ దైవప్రసాదంబులై
  గానాదుల్ మది నేల నమ్మలిన శృంగారమ్ము లింపార! మీ
  రేనాడైనను శుభ్రతన్ మఱువ గిట్టింతున్ సుమా! యంచుఁ దా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాణేశ్వరీ' అని దీర్ఘాంతం?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

   శార్దూలవిక్రీడితము
   ప్రాణాయామము నిత్యకృత్యమగుచున్పత్నీ సమేతమ్ముగన్
   ధ్యానాసక్తత పెంపు మీర సృజనల్ దైవప్రసాదంబులై
   గానమ్మై యమలిన్యమౌ సరస శృంగారమ్ము లింపార! మీ
   రేనాడైనను శుభ్రతన్ మఱువ గిట్టింతున్ సుమా! యంచుఁ దా
   నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

   తొలగించండి
 30. శా:

  ఏనాడో గద నింట నుండ సుఖమున్ యింపార నర్ధాంగి తో
  కానోయీ యన యింత చేదు నిజమా కానంగ లేకుంటినే
  మౌనంగా భరియింప నెల్ల పనులన్ మాటాడ లేకుండగన్
  నానా శ్రేయము లందజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుఖమున్+ఇంపార, అనన్+ఇంత' అన్నపుడు యడాగమం రాదు. 'మౌనంగా' అనడం వ్యావహారికం.

   తొలగించండి
  2. గురువు గారు సూచించిన మార్పులతో ..
   శా:

   ఏనాడో గద నింట నుండ సుఖమున్నింపార నర్ధాంగి తో
   కానోయీ యన నింత చేదు నిజమా కానంగ లేకుంటినే
   మౌనమ్మెంచగ జేయ నెల్ల పనులన్ మాటాడ లేకుండగన్
   నానా శ్రేయము లందజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 31. నానాదేశపుపౌరులందరుకరోనాపీడితుల్గానగా
  నానాశ్రేయములందజేసెనుకరోనామానవుల్ మెచ్చగన్
  మీనా!యట్లుగమాటలాడుటయిటన్ మీమాటయొప్పారునే?
  ప్రాణాలెన్నియొపోవుచుండెనుగదాప్రాణంబులేతోడుగా

  రిప్లయితొలగించండి
 32. చైనాలోన జనించినట్టి క్రిమి విశ్వమ్మెల్ల వ్యాపింపగా
  నా నాథుండొక యన్నెకాడు మధుపానాసక్తుడే భీతితో
  తానిల్లున్ విడి పోవడే కుదురుగా తానుండుటన్ గాంచగా
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 33. ఆలు బిడ్డల విడి మరయంత్ర మట్లు
  మసలు చుండెడి మనుజుడే మారి నేడు
  మానవత్వపు విలువల మర్మ మెరుగ
  బూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు

  రిప్లయితొలగించండి
 34. విశ్వమెల్లను వణుకగ భీతినొంది
  విఫణివీధులు బందాయె వింతగాను
  పంటలన్నియు పొలమందె వాలిపోయె
  పనులు లేవాయె కూలీలు పస్తులుండె
  వలసవెళ్ళిన పిల్లల వంతలచట
  వినగ పెద్దల మనములు వికలమాయె
  కూలె మార్కెట్లు వేతన కోతలాయె
  అన్నిరంగాలు స్తంభించె,ఛిన్నమగుట
  నార్ధికవ్యవస్ధ యెటుల నయ్యలార
  పూని శ్రేయమ్ములిడె కరోనా నరులకు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేతన కోతలు' దుష్టసమాసం.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా!
   వేతనాల్ కోతబడెను అనవచ్చునా?

   తొలగించండి
 35. నానా చెత్తవి సీరియళ్ళు ముగిసెన్ నారీమణుల్ నవ్వగా
  నానందంబయె జూడగా నెడముతో నాక్యూలలో లోకులన్
  పానీపూరిలవంటి తిండ్లుదినుటన్ వర్జించ విద్యార్ధులే
  నానా శ్రేయము లందజేసెను కరోనా మానవుల్ మెచ్చగా

  రిప్లయితొలగించండి
 36. నానాశ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్
  దీనారావపుహేలవృద్ధగృహమందేవృద్ధబంధ్వాదులున్
  నానాటన్ దమపిల్లలన్ విడిచి దానాడింది సయ్యాటగా
  మానాడెవ్వడు నాడి చూపనిది సంపన్నంబయెన్ దేశమం
  దానా డా నెహరూ మహాత్ములును వద్దన్నారొకో దేశంబుకై
  ప్రాణాలన్ త్యజియించి నెంచి దెగువన్స్వాతంత్ర్యసంగ్రామమై
  నీ నా భేదము ద్రుంచి నేర్పు నను మన్నింపంగ మాదేశమే
  మానంబంచు స్వదేశ గౌరవము నింపాదిన్జగచ్ఛ్రేయమే
  జ్ఞానానందమయంబుగా దలిచి ప్రజ్ఞాకాంక్ష విజ్ఞానమున్
  నానాటన్ ఘన సంస్కృతీ ప్రభల విన్నాణంబు రాణించ స
  న్మానానందము గూర్చ వందనముతో మర్యాద లందింపరే
  యీనాడేవి వినమ్ర భాషణములా హేలార్ఘ్య పాద్యంబులున్
  మేనిన్బూనిన నీచ సంస్కృతికి సామీప్యం బయె న్మేదినిన్
  దీనార్తార్థికి దిక్కు జూపగను సాధింపన్న కారార్థులన్
  మానీడ న్శుచి బెంచి శుభ్రతకు సామ్రాజ్యాళి నర్పింప కో
  రోనాజ్ఞాని వటంచు హిందువులు సారూప్యా నుయాయు ల్భువిన్
  వేనోళ్ళన్ నుతి యించరే ప్రజలకున్ బీయూష బాంధవ్య మం
  చా నాడందరి మేలు గోరియు పునఃస్థాపింప వేంచేసియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఐదవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 37. మానంబుల్ మరి ప్రాణముల్ గొనెడు దుర్మార్గంబులున్ లేవు ని
  ర్మానుష్యంబుగ మారె దారులవి రామా! లేవు కాలుష్యముల్
  ధ్యానంబుల్ పరమార్థమై జనులు సంధానించిరా దైవమున్
  *నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్మెచ్చగన్*

  2 రాణి వాసమ్ము లోనుండు లాభ మొకటి
  చాన యందించు సరిలేని సౌఖ్య మొకటి
  మౌన మందుండు మధుర మౌ గాన మరయ
  *పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు*

  3.ఖానా ఖాలియ పాని పీలియ సహీ గానాభిమై సున్లియా
  జానూ యాదుపె శాయరీ లిఖు దియా జన్నుత్తు మే ఘుూమ్ లియా
  లేనా క్యా అబు జీలియా సహి! అకేలే మౌజు మస్తీ లియా
  *నానా శ్రేయము లందఁజేసెను కరోనామానవుల్ మెచ్చగన్*


  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి

 38. సమస్య : నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  నానాసూన వితాన వాసలననానందించు లోలంబముల్
  నా నైపుణ్యము పాకమందు గనుమా నా మేటి ప్రావీణ్యమున్
  నేనీ వేళన స్నేహ వీచిక సుధానెయ్యంబు లందింపగన్
  నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్

  కస్తూరి శివశంకర్

  రిప్లయితొలగించండి