శంకరాభరణ కవి మండలికి సప్తమీ విభక్తిని గురించిన ఒక చిన్న సూచన -అకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ను" కారమును, ఇకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ని" కారమును , ఉకారాంత పదముల సప్తమీ కొరకు "న" కారమును ఉపయోగించవలసి ఉంటుంది.
తద్వ్యత్యయం బాగా ప్రాచుర్యంలో ఉంది - శంకరాభరణంలో కూడా. ఉదాహరణకు - కవి మండలి యందు అనడానికి కవి మండలిన అని కాకుండా, కవి మండలిని అనాలి; ధరణిన కాదు, ధరణిని అనాలి, అలాగే చంద్ర మండలమున , రాజలోకమున అనాలి (ఇవి రెండూ ఉకారాంత పద సప్తమీ కి ఉదాహరణలు) ... ఇత్యాది ! ఆయా పదాంతములను పోల్చుకుని తత్సంబంధి సప్తమీ ప్రత్యయం వాడితే సరిపోతుంది.
ఓడ ' ను ' జరిగే ముచ్చట కనరే అందరికీ తెలిసిందే ( అకారాంత పద సప్తమీకి ఉదాహరణ ) , మాన్యులు శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో - ఇతి నతయః !"
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
రంగుల పండుగన్ కనగ రమ్మని పిల్వగ మిత్రుడాదటన్
మ్రింగను కక్కలేక యిక మీరిన ప్రీతిని రైలునెక్కుచున్
వంగల భూమినిన్ జనుచు బాపడు వీడను నిచ్ఛయించ కా
గంగ; వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పొంగుచు వెండికొండనహ పొర్లుచు భూమిని కౌగిలించుచున్
చెంగున చేరుచున్ తనరి సిగ్గును వీడుచు కాన్పురున్ వడిన్
సంగము నందునన్ కనగ జమ్నను హాయి ప్రయాగరాజనున్
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
కాన్పురు = Kanpur
జమ్న = యమున (in hindi)
Prayagaraaj = Allahabad (new name)
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఆవె//
రిప్లయితొలగించండిజీవరత్నమునకు జీతము పెరుగంగ
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె !
బుట్టినంత వగచి పట్టి వలదనుచు
అత్తదిట్టె మామ చిత్తగించు !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఒకతె+పుట్టినంత' అన్నపుడు సరళాదేశం రాదు.
( వలచి వలపించుకున్న నర్తకి చిన్నాదేవిని
రిప్లయితొలగించండిశ్రీకృష్ణదేవరాయలు చేపట్టటం )
సంగరసవ్యసాచి యగు
సన్నుతశీలుడు కృష్ణరాయలే
చెంగట నాట్యమాడి తన
చిత్తము దోచిన చిన్నదేవినే
పొంగిన ప్రేమవాహినికి
పోడిమి మానసవీణ మారుమ్రో
గంగ -వివాహమాడె నొక
కన్నియ మోదము చెంగలించగన్ .
మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికన్యను -అని చదువగలరు
రిప్లయితొలగించండిశంకరాభరణం
రిప్లయితొలగించండిమంగళవారం...21/04/2020
సమస్య:
"గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్"
నా పూరణ. ఉ.మా.
**** **** *
వంగపు దేశమందున వివాహము జేయ దలంచి తండ్రియున్
బంగరు వన్నెలున్న రహి భామిని బుత్రుని కెన్నెగాన్!భళా!
హంగుగ బెండిలిన్ జరుగ నాతడు మేళములెన్నొ మారుమ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపగన్
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశివుని శిరము పైన చేరెనెవరు శివ
రిప్లయితొలగించండిధనువు విరచి దశరధ తనయుండు
సీత నేమి చేసె,సిత యంబ యెవరొకొ,
గంగ,పెండ్లియాడె,కన్య యొకతె
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సిత యంబ'?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినింగికి వేసె కోరికల నిచ్చెననొక్కడు., పెండ్లిచూపులం...
దంగనలన్ విలాసముగ నద్దిది లేదనుచుండినంతనే
ముంగురులెల్ల తెల్లబడె., మూల్గుచు తల్లియు తండ్రి బెంగఁ గ్రుం...
గంగ వివాహమాడె నొక కన్యను., మోదము చెంగలింపఁగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితండ్రి వరుని కాళ్ళు తన కరములఁ గడు
రిప్లయితొలగించండిగంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె
ప్రేమ పరిణయమయుఁ బెద్దల నొప్పించి
సంప్రదాయవిధిని సడ్డసేసి!
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివాడు సుందరుడు ప్రవాసి పేర్మి గనుచు
గంగఁ బెండ్లియాడెఁ, గన్య యొకతె
బహుమ తిగొని తెచ్చె వారిరువురికి ప్ర
భాత వేళ కథ సభని సమాప్తి
జిలేబి
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సభను' అనండి.
తొలగించండి"డా. విష్ణు నందన్
ఏప్రిల్ 21, 2015 8:26 PM
శంకరాభరణ కవి మండలికి సప్తమీ విభక్తిని గురించిన ఒక చిన్న సూచన -అకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ను" కారమును, ఇకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ని" కారమును , ఉకారాంత పదముల సప్తమీ కొరకు "న" కారమును ఉపయోగించవలసి ఉంటుంది.
తద్వ్యత్యయం బాగా ప్రాచుర్యంలో ఉంది - శంకరాభరణంలో కూడా. ఉదాహరణకు - కవి మండలి యందు అనడానికి కవి మండలిన అని కాకుండా, కవి మండలిని అనాలి; ధరణిన కాదు, ధరణిని అనాలి, అలాగే చంద్ర మండలమున , రాజలోకమున అనాలి (ఇవి రెండూ ఉకారాంత పద సప్తమీ కి ఉదాహరణలు) ... ఇత్యాది ! ఆయా పదాంతములను పోల్చుకుని తత్సంబంధి సప్తమీ ప్రత్యయం వాడితే సరిపోతుంది.
ఓడ ' ను ' జరిగే ముచ్చట కనరే అందరికీ తెలిసిందే ( అకారాంత పద సప్తమీకి ఉదాహరణ ) , మాన్యులు శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో - ఇతి నతయః !"
తొలగించండిసప్తమీ విభక్తి అనగా యేమి ? అంతకు ముందు విభక్తి అనగా యేమి ?
జిలేబి
తొలగించండిఅందున్, నన్ ... సప్తమీ విభక్తి
https://te.m.wikipedia.org/wiki/విభక్తి
రంగడు లక్ష్మికై వెదకి రమ్యమనోహర వాటి యందు వీ
రిప్లయితొలగించండిరంగము జేయు నొక్క గజరాజును ద్రోలి సుఖాంతరంగయౌ
మంగను గాంచి శీఘ్రముగ మంగళ వాద్యపు ఘోష మారు మ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె//
రిప్లయితొలగించండిశివుని శిగన దూరి చిందులేయుచునుండ
గంగఁ , బెండ్లియాడెఁ గన్య యొకతె !
తిరుప మెత్తువాణ్ణి దినముపూజసలుప
అర్ధ దేహమొసగె అగ్గికంటి !!
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సిగను' అనండి.
సవరించితిని గురూజీ 🙏
రిప్లయితొలగించండిఆ.వె//
శివుని సిగను దూరి చిందులేయుచునుండ
గంగఁ , బెండ్లియాడెఁ గన్య యొకతె !
తిరుప మెత్తువాణ్ణి దినముపూజసలుప
అర్ధ దేహమొసగె అగ్గికంటి !!
విరటరాజుమెచ్చి విధిగ కాళ్ళేకడు
రిప్లయితొలగించండిగంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె,
యుత్తర గురుపుత్రుఁ నుర్వియే పొగడంగ
కౌరవ కుల తిలకు గారవమున.
రిప్లయితొలగించండిరంగి! జిలేబి! చంద్రముఖి! రాగిణి! మాలిని యంచు వేడ్కగా
రంగుల రాట్నమయ్యె ననురాగపు స్వప్నము జ్ఞప్తియుందకో?
చెంగమ రెడ్డి? యవ్వనపు చియ్యపుటెక్కుల దావరీడు? ఓ
గంగ! వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్!
జిలేబి
తొలగించండివహ్వా!!!
పరిణయం పు వేళ వరుని కాళ్ళను కడు
రిప్లయితొలగించండిగంగ పెండ్లి యాడె కన్య యొకతె
వలచి నట్టి వాని భర్త గా పొందియు
మరియు చుండె తాను మోద మలర
వలచిన చెలికాని పరిణయ మాడంగ
రిప్లయితొలగించండినోర్మి తోడ వేచి, యూ యనంగ
నమ్మ నాన్న లంత యాంక్ష లన్నియును వీ
గంగ బెండ్లి యాడె గన్య యొకతె!
ఇద్దరాండ్రువరునకి మనసునివ్వంగ
రిప్లయితొలగించండిగంగఁ బెండ్లియాడెఁ, గన్య యొకతె
మంగకమల పిల్ల, బెంగ తోసరసన
తోడు అయ్యె అక్క పెండ్లి యందు
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ ప్రయత్నం ..
*ఆ వె*
వచ్చినాడు తనకు వరుడు గా యనుకొని
నచ్చె పిల్లడనుచు నా మనసుకు
వేగిరముగ తాను ప్రేమయందున మున
*"గంగఁ , బెండ్లియాడెఁ గన్య యొకతె"*
*కళ్యాణ్ చక్రవర్తి , ముంబాయి*
🙏🌸🙏🌸🙏
కుందనంపు బొమ్మ కుదర వధువు గాను
రిప్లయితొలగించండివరుడు మురిసె తనదు భాగ్యమంచు
వైభవముగ తరలి ,పరవశమున మును
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[మౌని విశ్వామిత్రుని వెంట వెడలిన శ్రీరాముఁ డొనర్చిన ఘనకార్యములను గూర్చి యయోధ్యాపురప్రజలు కథలు కథలుగా ముచ్చటించుకొనుచున్న సందర్భము]
"సంగరమందుఁ దాటకను జంపియు, ఱాతిని నాతిఁ జేసియున్,
మంగళకీర్తియుక్తుఁడగు మా రఘురాముఁడు శూలి చాపమున్
భంగమొనర్చి, వేగమె సభాస్థలి మెచ్చఁగ, నెమ్మనంబు పొం
గంగ, వివాహమాడె నొక కన్యను, మోదము చెంగలింపఁగన్!"
పూజ్యులకు ప్రణామాలు🙏
రిప్లయితొలగించండినా ప్రయత్నం....
మనసగు వరుడు మరిమరి కోరి మనువాడ
పిలువ, జరుగు పెండ్లి విందులందు
సన్ని హితులు పెక్కు సంతసంబున మును
గంగ పెండ్లియాడె కన్య యొకతె
వాణిశ్రీ నైనాల
మనసు దోచు నట్లు మాటలాడెడు వాడు
రిప్లయితొలగించండిసద్గుణాల పుట్ట సరసుడైన
యత్త కొడుకు పైన ననురాగమే కలు
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె.
లొంగగ జేసె దౌష్ట్యమున లోకగతిన్ గన నీకరోన దా
రిప్లయితొలగించండిగంగ గృహంబునన్ బ్రతుక గల్గుట, కాదన జిక్కి కూలుటే
యంగన నందరాదనుచు నాతడు నాక్రిమి శక్తి వీడి క్రుం
గంగ, వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
సమూహమునుండి నాసభ్యత్వము తొలగించబడియున్నది.కారణముతెలియదు.దయచేసి నాపేరును
రిప్లయితొలగించండిAdd చేయవలసినదిగా శంకరార్యులను ప్రార్ధించుచున్నాను.
Cellphone No--9849653585
పేరు:యల్లంరాజుదుర్గాప్రసాదరావు నెల్లూరు.
రిప్లయితొలగించండి-9849653585
నింగియు, వాయువున్, ధరయు, నిండుమనంబును సాక్షి నిన్ను గా
రిప్లయితొలగించండినంగనె నిచ్చగించితిని నమ్మవె నెచ్చెలి నాదు మాటలన్
రంగడుబల్కెనింక గడు రమ్యముగా నిక సాక్షి జూపుతూ
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
అంగన వార్తనందుకొని యాతురమున్ జని దా విదర్భకున్
రిప్లయితొలగించండిచెంగట జేరి చేడియను చేగొని దెచ్చెను ద్వారకాపురిన్
మంగళరూపుడచ్యుతుడు మంగళ వాద్యములన్ని వేడ్క మ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినయమునల్లునిచరణంబులుదగగడు
రిప్లయితొలగించండిగంగపెండ్లియాడెగన్యయొకతె
కాళ్ళుకడుగుటనగకన్యనిత్తునునీకు
సరిగజూచుకొనుముసంతునిడగ
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె"(సమస్య)
రిప్లయితొలగించండిఆ.వె:
సకలసద్గుణాల చక్కనైనవరుడు
వెతుకుకుంటువచ్చె వియ్యమాడ
వరముకలిగెనంటు పరవశంబునమున
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె.
పెండ్లి జరుప నెంచి పెద్దలను పిలువ
రిప్లయితొలగించండివరుడు వలదటంచు వధువు పలికె
పీటలపయి పెండ్లి కాటంక మగుట నా
గంగఁ, బెండ్లియాడెఁ గన్య యొకతె
ఉ:
రిప్లయితొలగించండిరంగడు నాటకీడు కడు రంగములందున పేరు గాంచగన్
సంగము గూడె నంత నొక చక్కని భామతొ సాహచర్యమున్
భంగము గల్గ నట్టులుగ పద్గురు మెచ్చగ నాటకాన భా
గంగ వివాహ మాడె నొక కన్యను మోదము సంచలింపగన్
వై. చంద్రశేఖర్
అంగరంగ వైభ వాతిశయమ్మున
రిప్లయితొలగించండినంగ విలసనమ్ము నారయంగ
రంగ నంగ జాభు రంగునఁ బసిడిఁ దూఁ
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె
తుంగ తరంగ భృంగ గణ దుస్సహ రంగ దశేష కేశ స
త్సంగ హృషంతరంగ స్మర సంగ మనో విరహాంగనా మణిన్
గంగను శంతనుండు గని కంజదళాంబక లోలనేత్ర యా
గంగ, వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
[ఆగంగ = ఆగఁగ]
భంగముగాదలంచకనుబర్వతరాజగుహైమవంతుడున్
రిప్లయితొలగించండిభంగునిపాదపద్మములుబావనరీతినిశుద్ధిజేయగా
గంగవివాహమాడె,నొకకన్యనుమోదముచెంగలింపగన్
భృంగుడువాహనంబుగలభీష్ముడుప్రీతినిబెండ్లియాడెగా
ముంగిట ముగ్గువేయు తరి ముద్దియ భంగిమ గాంచెనాతడా
రిప్లయితొలగించండియంగన యందచందములనద్భుత మంచు దలంచె నిట్టులన్
నింగిని వీడి యచ్చరయె నేలను జేరెనటంచు ప్రేమ పొం
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్.
సంగయ పెండ్లి యాడగను చక్కగ చేరగ మండపమ్ముకున్
రిప్లయితొలగించండిముంగలియింటివానిపయి మోజు ఘటిల్లెవధూటికంచు చే
రంగను వార్త, లాతి రుచిరాంగి యొడంబడ, మంత్ర ఘోష మ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
ఆటవెలది
రిప్లయితొలగించండివనిత మనము నెఱుఁగ మునివేష ధారియై
ఫల్గుణుండు రాగ పడఁతి మెచ్చె
నన్న కృష్ణుని దయ నెన్ని బాజాలు మ్రో
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె
ఉత్పలమాల
అంగన మిమ్ము మెచ్చెనని యచ్యుతు మ్రొక్కుచు బ్రాహ్మణుండనన్
మంగళ గౌరి కోవెలకు మానిని రమ్మని రాక్షసమ్మునన్
జెంగట వేచి స్యందనము జేరిచి మానస వీణ వేగ మ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంగన ముద్దుగుమ్మమరి యందము జూడగ అప్సరస్స యే
రిప్లయితొలగించండిబుంగను నీటమున్చగను బొద్దగు యవ్వను డక్కడుండి లా
గంగను మున్గెనిద్దరును గంగయు శంతను జూసినవ్వ వే
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్
పెళ్ళియీడువచ్చి తుళ్ళింతయెదలోన
రిప్లయితొలగించండిమాయదారివయసు మాటవినదు
మల్లిగానిమీదమరులుమదినిపెరు
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె
రంగుల చైత్రమాసమున రమ్యపురీతిని బెండ్లియాడగా
రిప్లయితొలగించండిరంగము సిద్ధమైనతరి రాక్షసిబోలు కరోన పరాక్రమించగా
భంగముగాగ నాశ పలుభద్రత లెంచుచు నింటిలోనె వే
గంగ వివాహమాడె నొకకన్యను మోదము చెంగలింపగా!
అంగన యందచందములు హ్లాదమునింపగ మానసంబునన్
సంగముగోర శంతనుడు,జవ్వనిబెట్ట నిబంధనమ్ములన్
భంగము జేయనంచు దన వారసుడా సురవాహినీ సుతుం
డంగజ దూరుడౌటయను నద్భుతదీక్షను భీష్ముడంచు సా
గంగ,వివాహమాడె నొకకన్యను మోదము చెంగలింపగా!
కంగనరౌతుకన్నతను ,కాస్తమెరుంగుగనున్నమేలనిన్
రిప్లయితొలగించండిమింగెడుచూపులున్ననొక ,మీనకులాంగన వద్దులెమ్మనన్
బెంగలుభామయేవలదు ,భేషుగ కేరళకుట్టినింక వే
గంగవివాహమాడెనొకకన్నెనుమోదము, చెంగలించగా
++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
రంగడు నాసఖుండు వివరంబుగనాతనిగూర్చి దెల్పెదన్
రిప్లయితొలగించండిసింగవరంబునందతఁడు జేయును సేద్యము విద్యలందు పా
రంగతుడే ముదంబు తనరార మనంబున ప్రేమగంట మ్రో
గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్