28, ఏప్రిల్ 2020, మంగళవారం

సమస్య - 3353

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్" 
(లేదా...)
"సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్"

96 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  పొగతాగిన పోదురు గద
  సిగ పట్లన తెలియు మనకు స్త్రీల గొడవలే
  తగునా యిది తెలుపు మెటుల
  *"సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్"?*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 2. పగలును రేయినతాగుచు
  పొగలనుచిమ్ముతు సెగగనుఉండెడువాడున్
  మగసిరి అనుకొనుఎప్పుడు
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "రేయిని ద్రాగుచు... చిమ్ముచును సెగగ నుండెడు... మగసిరి యనుకొను నెప్పుడు" అనండి.

   తొలగించండి

 3. నడిరేయి సరదా పూరణ:

  జగడమ్ముల్ కనరాని కాపురమునున్ జంజాటమే లేనిదీ
  జగమం దెచ్చట నున్నదే? సరసమౌ జన్మంబు సాగించుటన్
  మగువా! మోదము, వైరమందు, మనకున్ మద్యమ్మనర్థంబగున్...
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 4. (సిగరెట్, సిగపట్లు దైహికమైన మానసికమైన బాధలు కలిగిస్తాయి )
  జగమున ఖేదము గూర్చును
  సిగరెట్- సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్
  వగపును జగడము నాపును
  సగమగు తిండియు,సమతయు సఖుడా !వినుమా !

  రిప్లయితొలగించండి
 5. కం//
  పగవాడై నను గాల్చిన
  మగవానికి సొబగు గూర్చ మగరాయుండై !
  తెగువాడే మగజాతికి
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్ !!

  రిప్లయితొలగించండి
 6. తగవవి దుర్లక్షణములు
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
  సుగుణము పుస్తక పఠనము
  తగు మార్గంబదె జనులను ధన్యుల జేయున్

  రిప్లయితొలగించండి

 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  (సత్యజిత్ రే కాలములో):

  మగువా! శంకర మానసంపు తనయా! మర్యాదనున్ వీడకే
  మిగులన్ మోదమునిచ్చు పూరణమునున్ మెప్పొందగా జేయగన్
  తగవుల్ బెట్టెడి కైపదమ్మ! గణముల్ ధన్యమ్మునన్ కూర్చగా
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈ పూరణకు, సత్యజిత్ రే కాలానికి లింకు?

   తొలగించండి
  2. 🙏

   సత్యజిత్ రే కాలములో బెంగాలులో సిగరెట్టు కాల్చని భద్రపురుషుడు కానరాడు. అదొక fashion. ఒక విలేఖరి వారిని ప్రశ్నించారు:

   "ఇటీవల మీ సినిమాలలో హీరోలందరు ఎందుకు సిగరెట్లు కాలుస్తారు?"

   "నా సినిమాలలో హిందీ సినిమాలలో వలె ముష్టి యుద్ధాలు, చేతులు త్రిప్పి గంతులు వేసే నాట్యాలు, కౌగిలింతలు ఉండవు. అన్నీ డైలాగులతోనే ఉంటాయి. నా హీరోలకు వారి చేతులతో ఏమి పని
   చేయించాలోనని చాలా కాలం తికమకపడి సిగరెట్లు కాల్పిస్తున్నాను"

   ఈ మధ్యనే మన దేశములో:

   "Smoking is dangerous to health"

   లాటి పిచ్చి పిచ్చి రాతకోతలు వస్తున్నాయి. అందరు దొంగచాటుగా త్రాగ వలసి వస్తోంది. నన్ను చూడండి లక్షణంగా ఉన్నాను 77 వ ఏట.

   చేతనైతే మన రాష్త్రములో మద్య నిషేధం అమలు పరచ గోరెదను (నేను కల్లు త్రాగను 😊).

   Somerset Maugham wrote:

   "A man who doesn't talk must smoke".

   Nowadays:

   "A man who doesn't talk must browse the web"

   సరదాకు వ్రాసాను. జగడానికి రాకండి దయచేసి 😊

   తొలగించండి
 8. జగమంతయు"రెట్ "మయమై
  సొగసుగ నరచేతిఫోను శోధన లొసగన్,
  రగిలిన నాలోచన వా
  సిగ "రెట్ "సిగపట్లు మనకు శ్రేయము గూర్చున్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు
  రెట్=విశ్రాంత

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
   "రగిలిన యాలోచన" అనండి.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. జగమంతయు"రెట్ "మయమై
   సొగసుగనరచేతిఫోను శోధన లొసగన్,
   రగిలిన యాలోచన వా
   సిగ "రెట్ "సిగపట్లు మనకు శ్రేయము గూర్చున్
   కొరుప్రోలు రాధాకృష్ణారావు
   రెట్=విశ్రాంత

   తొలగించండి
 9. కం//
  మగవానికి హానికలుగు
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్
  నిగనిగ లాడెడి గుండుకి
  పగటింతల నూనె వ్రాయ భారము తగ్గున్ !!

  రిప్లయితొలగించండి
 10. కం//
  వగచకు నీకును నాకును
  సిగరెట్, సిగపట్లు, మనకు శ్రేయముఁ గూర్చున్ !
  జగమెరిగిన సత్యమెగద
  పొగ త్రాగక నుండలేవ పోకిరి మగడా !!

  రిప్లయితొలగించండి
 11. కం//
  మగనికి యింష్టంబౌనట
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్ !
  నగుమోమును చాలింపవె
  మగవానిని లొంగదీయ మగువకె చెల్లున్ !!

  రిప్లయితొలగించండి
 12. పొగత్రాగుట వలదందురు
  నగవులనే మాయజేయు నాశనకారై
  పగతురబెంచును,యెట్లీ
  సిగరెట్ సిగపట్లుమనకు శ్రేయముగూర్చున్
  ++++++++***++————
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నాశనకారి+ఐ' అన్నపుడు సంధి లేదు. "పెంచును+ఎట్లీ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
 13. మగనిన్ జూచి వచించె నొక్కసతి యోమాన్యా! ప్రమాదంబు లీ
  జగమందున్ ఘటియిల్లు ప్రాణమునకున్ సత్యంబు నీవీగతిన్
  దగునా నిత్యము జేయుచుండుటలు? నాథా!మానుమా యిప్పు డీ
  సిగరెట్టున్ సిగపట్లు రెండు, మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్.

  రిప్లయితొలగించండి
 14. గగనమగు పసిడి గోరెడు
  మగువలు కూడ బొగదాగ మరగిన వేళన్
  నగల కొరకు గాక నిపుడు
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 15. తగవు నరనారుల కరయ
  సిగరెట్ సిగపట్లు, మనకు శ్రేయము గూర్చున్
  నిగనిగ లాడు పెదవులకు
  సొగసరి సిగలకును, వాని జోలిని విడినన్!

  రిప్లయితొలగించండి


 16. భుగభుగ సెగగక్కు నొకటి!
  పగ తోడుత రక్తికట్టు వడి మరియొకటీ
  రగిలింప జిలేబి నెరవు
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 17. పొగతోడై రగులంగ వేడి జతగా బుగ్గారు నుద్రిక్తతల్
  పగతో గూడుచు చల్లకవ్వముగ సై పల్లార్చు కొట్లాటలన్
  జగడాలేలనటంచు కూర్చొనకురా సన్నాసిలా మానవా
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్!


  నారదీయము

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వలె'ను 'లా' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 18. "చిగురించెన్ శివపూజకై" యనుచు వ్రాసేపాట పూర్తవ్వకన్
  సగమందే కలమాగిపోయె నయొ! విశ్వంగారు వేచుంటిరే,
  తగినట్టందపు భాష భావముల కూదాలోయి వ్రేళ్ళన్ ఒకే
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్౹౹
  (స్వర్ణకమలం పాట రాయటానికి శాస్త్రి గారు చాలా కష్టపడ్డారు అనే ఊహతో)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్రాసే, అవ్వకన్, వేచుంటిరే..' మొదలైన ప్రయోగాలు సాధువులు కావు.

   తొలగించండి
 19. పొగ త్రాగకు మనినంతనె
  జగడము లాడేవు నీవు సరికాదంటిన్
  మగడా వినుమిది మానిన
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 20. సవరించితిని గురూజీ 🙏
  కం//
  మగవానికి హానికలుగు
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్
  నిగనిగ లాడెడి గుండుకు
  పగటింతల నూనె వ్రాయ భారము తగ్గున్ !!

  రిప్లయితొలగించండి
 21. సవరించితిని గురూజీ 🙏
  కం//
  మగవానికి నిష్టంబౌ
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్ !
  నగుమోమును చాలింపవె
  మగవానిని లొంగదీయ మగువకె చెల్లున్ !!

  రిప్లయితొలగించండి
 22. 🙏సరి చేసితిని గురువర్యా!

  జగమెరిగిన సత్యంబీ
  సిగరెట్ సిగపట్లు; మనకు శ్రేయముఁ గూర్చున్
  మగడును పెళ్ళాలెప్డు మ
  రుగుపాటుల మాని నడువ రుజువర్తనులై.

  రిప్లయితొలగించండి

 23. మైలవరపు వారి పూరణ:

  తగునా! కోపము! మానివేయుదును! కాంతా! సుంత శాంతింపవే!
  సిగరెట్లే కద! మందు కాదు కద! రాజీవాక్షి! నీ మీద యా
  నగ నే బల్కుచునుంటినన్న మగనిన్ బంధింపదే కౌగిటన్!?
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఈ సమస్య 16 జనవరి 2019 లో శంకరాభరణం లో ఇచ్చి యున్నారు.
   మా ఆత్మీయమిత్రులు శ్రీ ప్రభాకరశాస్త్రి గారు దానిని బ్లాగు లో భద్రపరచినారు.
   వారికి ధన్యవాదాలతో ఆ పూరణ... 👇

   G P Sastry (gps1943@yahoo.com)జనవరి 16, 2019 6:23 AM
   మైలవరపు వారి పూరణ

   మగువా ! నే పొగత్రాగుచుంటినన దుర్మార్గంబుగా దోచెనా ?
   సిగరెట్లన్ మరి తాకబోవనికపై ., ఛీత్కారమున్ మాని యీ
   సిగపట్లన్ విడనాడుమా ! పొలతిరో ! చింతింప దూరంబుగాన్
   సిగరెట్లున్ సిగపట్లు రెండు., మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

   తొలగించండి
 24. పగలను బెంచును గదరా
  సిగరెట్ సిగపట్లు : మనకు శ్రేయము గూర్చున్
  తగవులు మానియు సుమధుర
  జగతిని సృష్టించి మమత సమతలు బెంచ న్

  రిప్లయితొలగించండి
 25. శంకరాభరణం
  మంగళవారం...28/04/2020

  సమస్య:

  "సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్"

  నా పూరణ. మత్తేభ విక్రీడితము
  **** **** **

  వగలన్ గూర్చును ధూమపానము కదా!ప్రాణంబులన్ దీయదే??

  జగడంబుల్ శతృకోటి నిమ్మహిని విస్తారమ్ముగన్ బెంచదే??

  తగదెవ్వారికి నిట్టి దుష్టకృతులున్... ధాత్రిన్ త్యజించంగ నీ

  సిగరెట్టున్ సిగపట్లు రెండు... మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్"

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 26. మిత్రులందఱకు నమస్సులు!

  [సిగరెట్ల విషయంలో ప్రళయంతో మొదలైన భార్యాభర్తల సంభాషణ చివరకు ప్రణయానికే దారితీసినదనుట]

  "మగువా! నీ నగుమోముఁ జూపవె సఖీ! మన్నింపవే నన్నిఁకన్!
  సిగరెట్లన్ మఱి త్రాగఁబోనె చెలియా! చెల్లింతు నీ పట్టునే!
  సిగపట్లెందుకె?" యన్న యా మగనిఁ దాఁ జేరెన్ సుఖించెన్! గనన్

  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్!!

  రిప్లయితొలగించండి
 27. [07:42, 4/28/2020] PKSKumar: ఈ నాటి శంకరా భరణము వారి సమస్య


  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముగూర్చున్

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  ఒక తాగుబోతు, తిరుగుబోతు, వదరుబోతు కొడుకు జబ్బున పడగా అతని తండ్రి చెప్పు మాటలు  పరకాంత పొందును వాంఛించి
  మరణము
  పొందె దశముఖుడు పృధ్వి పైన,


  పరధన మాశించి పతనంబు నొందెను
  కురు వంశ భూపతి ధరణి పైన,


  హాని చేయును నీకు,మానుము
  రయముగ
  మూడుముక్కలు,మధ్యము
  కృశమధ్య


  మ,సిగరెట్, సిగపట్లు,మనకుశ్రే
  యముకూర్చు
  నెపుడు స్వార్జితమగు నిధిని పొంద ,  తలచుము పరకాంతనెపుడు తల్లి వోలె,

  ధూమ పానము మానిన తొలగి పోవు

  రోగములు, దైవ కీర్తనల్ బాగు జేయు

  ననుచు నొక శుంఠకు దెలిపె జనకుడొకడు  కృశమధ్యమ = స్త్రీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసం మొదటి పాదం ఉత్తరార్ధంలో యతి తప్పింది.

   తొలగించండి


 28. సన్నాసి సాధువేనాండి ?

  సన్నాసియై మానవా ....


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సాధువే...
   సన్నాసి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
   వై. వి.
   సన్యాసి.

   తొలగించండి
 29. తగదని వైద్యుడు చెప్పగ
  తెగబడి కాల్చుట యుచితమ, దేహము చెడదే ?
  తగవులు పెంచుచు నేవిధి
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 30. పగయేమాత్రము లేదు నీపయిన సద్భావమ్మె నాకుండెనే
  జగడాలెందుకు నీకునాకు కడు నిస్వార్థంబుతో చెప్పితిన్
  మగడా మానుమటంచుగాదె యిక నన్ మన్నించు చున్ మానినన్
  సిగరెట్టున్ సిగపట్లు రెండు, మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్.

  రిప్లయితొలగించండి
 31. తగదేవేళలయందీ
  సిగరెట్ సిగపట్లుమనకు,శ్రేయముగూర్చున్
  పగలెవ్వరితోలేకుం
  డగనెయ్యంబునమెలగినడాయునుకీడుల్

  రిప్లయితొలగించండి
 32. నేటి సమస్యలకు నా పూరణలు:

  ౧.

  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్"

  పూరణ;

  పగవారలె సుమ్మీ యిక
  పొగ త్రాగెడు వారికెప్డు బూరిగ రోగం
  బెగయగ యిట్లనుటేలా
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్!!

  ౨.

  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్"


  పూరణ:

  సిగలో పూవులు ముద్దుగూర్చగను యేస్త్రీయైన గోరుంగదా
  మగధీరుల్ విడువన్ పొగల్ ఘనముగా మారెన్ గదారింగులై
  యెగరెన్ రాజసముంగనుంగొనగ నేడేలా మరిన్ గూర్చవే
  సిగరెట్టున్ సిగపట్లు రెండు, మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్!!

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కూర్చగను+ఏ' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 33. మగువలు ముదమున సిగరెట్
  మగల సరి మొదలిడ, కనుల మరుగవు నెలతల
  తగువులు, సిగపట్లెందుకు
  సిగరెట్ బిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి
 34. సిగరెట్ వ్యసనము మాన్పగ
  సిగపట్లకుభార్యదిగెను చిడిముడిపడుచున్
  సెగతాకిభర్తమానెను
  సిగరెట్, సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్.

  రిప్లయితొలగించండి
 35. మ:

  తగవున్ గోరుట నాడు జూచితిమి పంతంబట్టు భార్యామణిన్
  పొగ త్రాగంచన వేడ్కగా పతిని పెంపొందింప గర్వోన్నతిన్
  యిగ నేడో మరి వాదులాడు గడనోయీ ధూమపానంబనన్
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. విగ తాపత్రపఁ జిత్తా
  పగత శ మాబ్జ నయనలకుఁ బంతము మీఱన్
  మగువలకుం జెలరేఁగుఁ గ
  సిగరె ట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  [కసిగరె = కోపముగరె (బళిరె వలె); ట్ = నిస్పృహకు ధ్వన్యనుకరణము; శ్రేయము గూర్చున్: నిందార్థమున ]


  తగు సౌహార్దము కాల చోదిత ఘనత్రాసమ్ము లింతింత మూఁ
  గఁగఁ గేశావన దీప్తసుప్రణయ శృంగారమ్ము లందందుఁ దోఁ
  చు గతిన్ మస్తక మందు నారఁ దడి వే చుట్టంగఁ బోరాడఁగన్
  సిగ రెట్టున్ సిగ పట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్

  [సిగ రెట్టున్ = సిగకు కట్టుకొను ముతక బట్టయు; రెట్టు = ముతుకబట్ట]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 16/1/2019 నాటి పూరణములు:

   వగవక యించుక యైనను
   నెగతాళికి నింటను సఖియె తడఁబడుచు నా
   యిగురాకుఁబోణి యట్లనె
   సిగ రెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

   [రెట్టునకు రెట్ పర భాషా వనిత మాట; సిగ రెట్టు = కొప్పునకు చుట్టుకొను ముతక బట్ట]

   తగ దీ యందము లిచ్చెడిం బులక రింతల్ నీకు నెన్నండునుం
   దగునే వాడఁగ నెత్తి కింతటి రుజాత్తంబైన ద్రవ్యమ్ములన్
   మగువా చెప్పెద వీవు వింతగ నసంబంధంబ వేయేల యో
   సి గ రెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్?
   [గరు+ఎట్లున్ = గరెట్లున్ ; గరు = గగుర్పాటు; పులకరింత, జుట్టు పూఁతలు రెండు నెట్లు శ్రేయములు]

   తొలగించండి
  2. మీ పాతవి, క్రొత్తవి అన్ని పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   క్రొత్త వృత్త పూరణములోని క్రమాలంకార రసము నాస్వాదించి నట్లు తలంచెదను.

   తొలగించండి
 37. తగునాచెప్పుడుమీరలున్ నొగినిదాదాత్మ్రంబుతోగూడగా
  సిగరెట్టుసిగపట్లురెండుమనకున్ శ్రేయంబులంగూర్చెడిన్
  పగతోనెవ్వరిజూడకుండగనునేపారంగబ్రేమించుచో
  జగమేసంతసమొందుచుండుచునుదాశాంతింబ్రబోధించుసూ

  రిప్లయితొలగించండి
 38. వగవన్ దేనికి దుష్ప్రవర్తనము సంప్రాప్తించినన్ బోదు నీ
  కు గలన్ కాలము చెల్లిపోవు వృథయై కోపాగ్ని లో మున్ గినన్
  దగ వారించితి నాలకింపుమిదె పుత్రా మేలుకై, వీడినన్
  సిగరెట్టున్ సిగపట్లు రెండు, మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 39. పార్టీ వేదికపై రాజకీయనాయకులు....

  కందం
  తగు నాదాయము గూర్చును
  పొగలెడు రాష్ట్రఁపు ఖజాన మోదాంచితమౌ
  యగచాట్లిడి పతికి సతికి
  సిగరెట్ సిగపట్లు! మనకు శ్రేయముఁ గూర్చున్! !

  మత్తేభవిక్రీడితము
  పొగ త్రాగంగను రేపు మద్యమదియే పోగాలమేపారగన్
  తగవౌచున్ సిగపట్లకెంత్రు పతితో దారామణుల్ క్రోధులై
  తగు నాదాయము గూర్చి రాష్ట్రమున కాధారమ్మనన్ దూగుతో
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్
  రిప్లయితొలగించండి
 40. సిగలో మల్లెల తురుమిన
  మగువ చిరునగవులతోడ, మరుశరములతో
  నగుపడ నచ్చట నెవ్విధి
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?

  రిప్లయితొలగించండి
 41. పొగయై రోగం బిచ్చును,
  పగ బెంచుచు నాలుమగల వైనము జెఱచున్,
  దగనీ రెంటిని మానిన,
  సిగరెట్; సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్!

  రిప్లయితొలగించండి
 42. పగలున్ రేయని భేదమెంచకను సంప్రాపించు రోగంబులన్
  నగుబాటుల్ మదినెంచకన్ మనలనానారీతులం గూల్చునా
  సిగరెట్లెందుకు వీడబోవుదలపన్ సిగ్గౌను యేరీతిగా
  సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్?

  రిప్లయితొలగించండి
 43. పూజ్యులకు ప్రణామాలు🙏

  తగునా నీకిది యనుచును
  వగచి, మగువ బుద్ది గరుప పగలే లనుచున్
  మగడిని వేడెన్ మానిన
  *సిగరెట్, సిగపట్లు, మనకు శ్రేయము గూర్చున్*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 44. రగులన్ చల్లని వాయువుల్, పొగగొనన్ ప్రాప్తించు సంతృప్తి వే
  మగువన్ కూడి గృహమ్ములో చెలఁగునున్మాదంపుకాలమ్మునన్
  తగవేయౌ సిగపట్లు సమ్ముదమిడున్ తధ్యమ్ముగా నాతఱిన్
  సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్

  రిప్లయితొలగించండి
 45. పొగతోడ చెఱుపు నెయ్యది?
  తగవుల నేమి కలుగు? నవి దరిచేరనిచో?
  జగతిని మనకేమి యమరు?
  సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్

  రిప్లయితొలగించండి