నడిరేయి సరదా పూరణ: వేళాపాళను గాంచకుండ నయయో విడ్డూరమౌ తీరునన్కేళిన్ మిస్సమ చిత్రమున్ తనరుచున్ కిట్టించు షూటింగునౌవేళన్ గూడెను రాముడాదటనహో;...వేసారి బృందమ్మునన్ కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు;...సావిత్రితోన్
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) ఈ తడవ గుండమ్మ కథ: వేళాపాళను గాంచకుండ నయయో విడ్డూరమౌ తీరునన్కేళిన్ గుండమ గాథనున్ తనరుచున్ కిట్టించు షూటింగునౌవేళన్ గూడెను రాముడాదటనహో;...వేసారి బృందమ్మునన్ కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు;...సావిత్రితోన్
ఓ పాదంలో ఓ పదం మార్చి రెండు సినిమాలు కొట్టాయి లో లాగించేసారివ్వాళ :) జిలేబి
🙏ఏమి చెయ్యడం? అసలే శార్దూలం. అందులో "ళ" ప్రాస. సమస్య పాదం అసంబద్ధమైన పౌరాణికం. దాన్ని నాల్గవ పదంలో ఉంచాలని తపన. 😊
😀😀🙏🙏
అంతా సినీ మాయ :)విష్ణువు రామారావే?కోష్ణపు చూపుల నటియకొ? కూచి జిలేబీ,కృష్ణ, నటుడు, సావిత్రిని?కృష్ణుఁడు; సావిత్రిఁ ; గూడి కిలకిల నవ్వెన్!జిలేబి
కం//తృష్ణము గలిగిన గొల్లలుపృష్ణినిగని వెరవుజెంది కృష్ణుని మ్రొక్కన్ !వృష్ణినెదుర్కొని రహితోకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్ !!
మాలాదీపక సన్నివేశములతో మాయాబజార్ చిత్రమందాలావాటి ఘటోత్కచుండు తనివిన్ దానారగింపంగనేపోళీలా యరిసెల్ జిలేబుల భళీ పూబోడి కల్యాణరాకేళీమగ్నత నుండి, నవ్వెనఁట యా కృష్ణుండు, సావిత్రితోన్!జిలేబి
*పువ్వాటు కల్యాణరాకేళీ మగ్నత నుండిదుష్టమో శిష్టమో తెలియదు :)జిలేబి
విష్ణుని లీలలు తెలుపగ నుష్ణములో శీతలమని నూరట జెందన్ తృష్ణగ యమునా తటిపై కృష్ణుడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కృష్ణకు వలువలొసంగెనుకృష్ణుడు,సావిత్రి గూడి కిలకిల నవ్వెన్నిష్ణాతుండౌ యాపతితృష్ణయు తీరిక వనమున దివసాంతమునన్
నాళీకాసనముఖ్యు లీభువిపయిన్ నవ్యాపదన్ ద్రుంచగావ్యాళాహంకృతినాశకున్ గొలిచినన్ భక్తావనాఖ్యోరు సత్ కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు, సావిత్రితోన్వ్యాళేంద్రాభరణుండు చేరి శుభముల్ పల్కంగ సన్మిత్రుడై
మైలవరపు వారి పూరణ నీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరిం...ఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు విష్ణుండు భ..క్తాళిన్ దుస్థితి గాంచుచున్ కనులు మూయన్., వింత స్వప్నమ్మునన్ కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరింఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు !వామ్మో !ఇట్లాంటివి పోచిరాజు వారి బ్రాండు ట్రేడుమార్కున్ను! మైలవరపు వారు కూడా ఈ త్రోవ పట్టేసారేంటి యివ్వాళ :)జిలేబి
నీళా- విష్ణుభార్యలలో నొకతెభూ - భూదేవి ?కమలాలయా లక్ష్మిప్రథిత - వారలతో ప్రసిద్ధిగతన్వి - తనివోవుకామితానంత - ఎనలేని కామితరింఛోళి - సమూహముతోనిత్య సమాగమ ఉత్సుక మతి స్తుత్యుడగు విష్ణువుఇన్ సింపిల్ - విష్ణువు కలగాంచె :)హమ్మయ్య!జిలేబి
కృష్ణుడన రామరావే కృష్ణుడుగా వేఱొకండు కిట్టడు ప్రజకు న్వృష్ణివి నీవన కానని "కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్"
కృష్ణయెసావిత్రియనసుదేష్ణకుసైరంధ్రియయ్యితీరుగనటనల్,కృష్ణునిపాత్రలసినిమాకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్"కొరుప్రోలు రాధాకృష్ణారావు
కృష్ణుడు సావిత్రి నటులు కృష్ణుని పరిహాస మాడ కెరలుచు మిగుల న్ తృష్ణ గ నయ్యె డ హా యని కృష్ణుడు సావిత్రి గూడి కిలకిల నవ్వెన్
విష్ణువుగా నెరుగక నిల కృష్ణుడు,సావిత్రిగూడి కిలకిల నవ్వెన్ విష్ణు కొమరుండు లేకసహిష్ణుత గోవులహరించి హేళనగొనుచున్
లీలామానుష విగ్రహుండు, వ్రజనారీ వేష్టితుండై నిశిన్ గేళీమగ్నతనుండి నవ్వెనట యాకృష్ణుండు,సావిత్రితోన్ కైలాసంబున నాట్యమాడె హరుడే కైవల్యసంధాయియైకోలాటమ్ముల నందిభృంగి గణముల్ గూడంగ మోదమ్మునన్
కృష్ణుని పాత్రలనైననువిష్ణువు శివుడైన గాని వేరేదైనన్నిష్ణాతుడవీవే యనకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
విష్ణునియవతారమెయీకృష్ణుడు,సావిత్రిగూడికిలకిలనవ్వెన్ దృష్ణనురామారావేకృష్ణునిరూపంబునందుకేళులమధ్యన్
మిత్రులందఱకు నమస్సులు![బాలలు ఆటలాడు తరుణమునఁ గృష్ణుఁడనువాఁడు, సావిత్రియను బాలికతో నాడుచు, నవ్వినాఁడను సందర్భము]కాళీమాతకు మ్రొక్కి, యాటల తఱిం గయ్యమ్ముఁ గాకుండ, గయ్యాళిన్నీళను నాడ నీక, యచటన్ హద్దుంచి, వే బాలలేవేళం దప్పక యాటలాడఁ గెరలన్, వీక్షించి యవ్వారలన్,గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్!
కృష్ణార్జున నాటకమున కృష్ణగ సావిత్రి క్రీడి కృష్ణయె, యతనిన్ నిష్ణుడ వని యామె పొగడకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కాళీయున్నణగించి లోకహితుడై కాళింది తీరమ్మునన్వేళాకోళములాడు గోపికలతో ప్రేమానురాగమ్ములన్కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు; సావిత్రితోన్భోళాశంకరుడిట్లు దెల్పె నరుణాంభోజాక్షునిన్ లీలలన్
గురువు గారికి నమస్సులు.జిష్ణువనకర్థమగదయవిష్ణువు,జగమున్ వసించువిమలసరసుడై తృష్ణగ నటింప కలియుగకృష్ణుడు,సావిత్రి గూడికిలకిలనవ్వెన్.
కర్థము గ చదువ ప్రార్థన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కృష్ణా తీర నివాసులు వైష్ణవులే యిరువురుం గవలు సావిత్రీ కృష్ణు లొక తల్లి బిడ్డలుకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్ వేళాకోళము లెల్లఁ బాపి వ్రజమున్ వీక్షించుచున్ నిత్యముంగాలాతీతుఁడు వాసుదేవుఁ డకటా కాంతా విలోలుండు నా లీలారూపుఁడు గోపకాంతల రసక్రీడావిశేషమ్ములం గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్ [వేళాకోళములు = చిక్కులు; సావిత్రి = యమునా నది; నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్ = యమునా నదితోఁ గలిసి కృష్ణుఁడు నవ్వెనఁట]
సావిత్రి యను యువతి నెత్తిన నీటి కుండతో నున్నపుడు కృష్ణుడు విసిరిన రాయి .. ఊహ.శా:గోళీ కాయలనాడు గృష్ణు విసరన్ కుంభంమ్ము నున్ దల్గ హోఖాళీ కాబడ నీరు జిమ్మ తడిసెన్ కాయంబు నారాణి దైహాళిన్ గూడిన జూపు కొంటె తనమున్నానందమే పంచగాకేళీ మగ్నత నుండి నవ్వెనట యా కృష్ణుండు సావిత్రితోన్వై. చంద్రశేఖర్
వేళా పాళయె లేక వాగునతడే, ప్రేమించు విద్యావిహీనాళిన్ జేకొని పానశాల జని తా స్నైగ్ధ్యమ్ముతో నీచుడై వేళాకోళము లాడుచున్ బలికెనాపెచ్చారి తానివ్విధిన్ గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్
కందంతృష్ణగ నభిమానులటన్కృష్ణగ సావిత్రిఁ జూచి కేల్దాకు నుతిన్నిష్ణాత వేషము చెదరకృష్ణుడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్శార్దూలవిక్రీడితముతాళమ్మేయుచు మేటి నాయికనుచున్ తద్ద్రౌపదీ వేషినిన్మాళల్తో యభిమానబృందమట సమ్మానింప సావిత్రియైహేళాధాటికి వేషమే చెదరి నవ్వించంగ ఘట్టమ్ముదౌకేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్
కాళీనామకసర్పరాజునుపదాక్రాంతుంగజేయంగనేకేళీమగ్నతనుండినవ్వెనటయాకృష్ణుండుసావిత్రితోన్ వేళాకోళముగాదుసత్యమునునేవిన్నాణముంజేసితిన్లీలానాటకసూత్రధారియతడేరైటేనభామామణీ!
తృష్ణకలిగెమానసమునకృష్ణకు సావిత్రిమనసుగెలువగనంతన్ కృష్ణునితానిష్టపడినకృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కేళాకూ ళినియా టలాడు సతులం గేళుళ్త టాకంబు నన్కాళీరూ పుడిలా భయాన కముగా కాళీద లంపున్ మహాకాళిందిన్ గనుకే సమూల ముగనున్ కాళీయు దొక్కేసె నా కేళీ మగ్నత నుండి నవ్వెనటయా కృష్ణుండు సావిత్రి తో
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
వేళాపాళను గాంచకుండ నయయో విడ్డూరమౌ తీరునన్
కేళిన్ మిస్సమ చిత్రమున్ తనరుచున్ కిట్టించు షూటింగునౌ
వేళన్ గూడెను రాముడాదటనహో;...వేసారి బృందమ్మునన్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు;...సావిత్రితోన్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఈ తడవ గుండమ్మ కథ:
వేళాపాళను గాంచకుండ నయయో విడ్డూరమౌ తీరునన్
కేళిన్ గుండమ గాథనున్ తనరుచున్ కిట్టించు షూటింగునౌ
వేళన్ గూడెను రాముడాదటనహో;...వేసారి బృందమ్మునన్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు;...సావిత్రితోన్
తొలగించండిఓ పాదంలో ఓ పదం మార్చి రెండు సినిమాలు కొట్టాయి లో లాగించేసారివ్వాళ :)
జిలేబి
🙏
తొలగించండిఏమి చెయ్యడం? అసలే శార్దూలం. అందులో "ళ" ప్రాస. సమస్య పాదం అసంబద్ధమైన పౌరాణికం. దాన్ని నాల్గవ పదంలో ఉంచాలని తపన. 😊
😀😀🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅంతా సినీ మాయ :)
విష్ణువు రామారావే?
కోష్ణపు చూపుల నటియకొ? కూచి జిలేబీ,
కృష్ణ, నటుడు, సావిత్రిని?
కృష్ణుఁడు; సావిత్రిఁ ; గూడి కిలకిల నవ్వెన్!
జిలేబి
కం//
రిప్లయితొలగించండితృష్ణము గలిగిన గొల్లలు
పృష్ణినిగని వెరవుజెంది కృష్ణుని మ్రొక్కన్ !
వృష్ణినెదుర్కొని రహితో
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్ !!
రిప్లయితొలగించండిమాలాదీపక సన్నివేశములతో మాయాబజార్ చిత్రమం
దాలావాటి ఘటోత్కచుండు తనివిన్ దానారగింపంగనే
పోళీలా యరిసెల్ జిలేబుల భళీ పూబోడి కల్యాణరా
కేళీమగ్నత నుండి, నవ్వెనఁట యా కృష్ణుండు, సావిత్రితోన్!
జిలేబి
తొలగించండి*పువ్వాటు కల్యాణరాకేళీ మగ్నత నుండి
దుష్టమో శిష్టమో తెలియదు :)
జిలేబి
విష్ణుని లీలలు తెలుపగ
రిప్లయితొలగించండినుష్ణములో శీతలమని నూరట జెందన్
తృష్ణగ యమునా తటిపై
కృష్ణుడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కృష్ణకు వలువలొసంగెను
రిప్లయితొలగించండికృష్ణుడు,సావిత్రి గూడి కిలకిల నవ్వెన్
నిష్ణాతుండౌ యాపతి
తృష్ణయు తీరిక వనమున దివసాంతమునన్
నాళీకాసనముఖ్యు లీభువిపయిన్ నవ్యాపదన్ ద్రుంచగా
రిప్లయితొలగించండివ్యాళాహంకృతినాశకున్ గొలిచినన్ భక్తావనాఖ్యోరు సత్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు, సావిత్రితోన్
వ్యాళేంద్రాభరణుండు చేరి శుభముల్ పల్కంగ సన్మిత్రుడై
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరిం...
ఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు విష్ణుండు భ..
క్తాళిన్ దుస్థితి గాంచుచున్ కనులు మూయన్., వింత స్వప్నమ్మునన్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండినీళాభూకమలాలయాప్రథితతన్వీకామితానంతరింఛోళీనిత్యసమాగమోత్సుకమతిస్తుత్యుండు !
వామ్మో !
ఇట్లాంటివి పోచిరాజు వారి బ్రాండు ట్రేడుమార్కున్ను! మైలవరపు వారు కూడా ఈ త్రోవ పట్టేసారేంటి యివ్వాళ :)
జిలేబి
తొలగించండినీళా- విష్ణుభార్యలలో నొకతె
భూ - భూదేవి ?
కమలాలయా లక్ష్మి
ప్రథిత - వారలతో ప్రసిద్ధిగ
తన్వి - తనివోవు
కామితానంత - ఎనలేని కామిత
రింఛోళి -
సమూహముతో
నిత్య సమాగమ ఉత్సుక మతి స్తుత్యుడగు విష్ణువు
ఇన్ సింపిల్ - విష్ణువు కలగాంచె :)
హమ్మయ్య!
జిలేబి
కృష్ణుడన రామరావే
రిప్లయితొలగించండికృష్ణుడుగా వేఱొకండు కిట్టడు ప్రజకు
న్వృష్ణివి నీవన కానని
"కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్"
కృష్ణయెసావిత్రియనసు
రిప్లయితొలగించండిదేష్ణకుసైరంధ్రియయ్యితీరుగనటనల్,
కృష్ణునిపాత్రలసినిమా
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు
కృష్ణుడు సావిత్రి నటులు
రిప్లయితొలగించండికృష్ణుని పరిహాస మాడ కెరలుచు మిగుల న్
తృష్ణ గ నయ్యె డ హా యని
కృష్ణుడు సావిత్రి గూడి కిలకిల నవ్వెన్
విష్ణువుగా నెరుగక నిల
రిప్లయితొలగించండికృష్ణుడు,సావిత్రిగూడి కిలకిల నవ్వెన్
విష్ణు కొమరుండు లేకస
హిష్ణుత గోవులహరించి హేళనగొనుచున్
లీలామానుష విగ్రహుండు, వ్రజనారీ వేష్టితుండై నిశిన్
తొలగించండిగేళీమగ్నతనుండి నవ్వెనట యాకృష్ణుండు,సావిత్రితోన్
కైలాసంబున నాట్యమాడె హరుడే కైవల్యసంధాయియై
కోలాటమ్ముల నందిభృంగి గణముల్ గూడంగ మోదమ్మునన్
కృష్ణుని పాత్రలనైనను
రిప్లయితొలగించండివిష్ణువు శివుడైన గాని వేరేదైనన్
నిష్ణాతుడవీవే యన
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
విష్ణునియవతారమెయీ
రిప్లయితొలగించండికృష్ణుడు,సావిత్రిగూడికిలకిలనవ్వెన్
దృష్ణనురామారావే
కృష్ణునిరూపంబునందుకేళులమధ్యన్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[బాలలు ఆటలాడు తరుణమునఁ గృష్ణుఁడనువాఁడు, సావిత్రియను బాలికతో నాడుచు, నవ్వినాఁడను సందర్భము]
కాళీమాతకు మ్రొక్కి, యాటల తఱిం గయ్యమ్ముఁ గాకుండ, గ
య్యాళిన్నీళను నాడ నీక, యచటన్ హద్దుంచి, వే బాలలే
వేళం దప్పక యాటలాడఁ గెరలన్, వీక్షించి యవ్వారలన్,
గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్!
కృష్ణార్జున నాటకమున
రిప్లయితొలగించండికృష్ణగ సావిత్రి క్రీడి కృష్ణయె, యతనిన్
నిష్ణుడ వని యామె పొగడ
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కాళీయున్నణగించి లోకహితుడై కాళింది తీరమ్మునన్
రిప్లయితొలగించండివేళాకోళములాడు గోపికలతో ప్రేమానురాగమ్ములన్
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు; సావిత్రితోన్
భోళాశంకరుడిట్లు దెల్పె నరుణాంభోజాక్షునిన్ లీలలన్
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిజిష్ణువనకర్థమగదయ
విష్ణువు,జగమున్ వసించువిమలసరసుడై
తృష్ణగ నటింప కలియుగ
కృష్ణుడు,సావిత్రి గూడికిలకిలనవ్వెన్.
కర్థము గ చదువ ప్రార్థన
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికృష్ణా తీర నివాసులు
రిప్లయితొలగించండివైష్ణవులే యిరువురుం గవలు సావిత్రీ
కృష్ణు లొక తల్లి బిడ్డలు
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
వేళాకోళము లెల్లఁ బాపి వ్రజమున్ వీక్షించుచున్ నిత్యముం
గాలాతీతుఁడు వాసుదేవుఁ డకటా కాంతా విలోలుండు నా
లీలారూపుఁడు గోపకాంతల రసక్రీడావిశేషమ్ములం
గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్
[వేళాకోళములు = చిక్కులు; సావిత్రి = యమునా నది; నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్ = యమునా నదితోఁ గలిసి కృష్ణుఁడు నవ్వెనఁట]
సావిత్రి యను యువతి నెత్తిన నీటి కుండతో నున్నపుడు కృష్ణుడు విసిరిన రాయి .. ఊహ.
రిప్లయితొలగించండిశా:
గోళీ కాయలనాడు గృష్ణు విసరన్ కుంభంమ్ము నున్ దల్గ హో
ఖాళీ కాబడ నీరు జిమ్మ తడిసెన్ కాయంబు నారాణి దై
హాళిన్ గూడిన జూపు కొంటె తనమున్నానందమే పంచగా
కేళీ మగ్నత నుండి నవ్వెనట యా కృష్ణుండు సావిత్రితోన్
వై. చంద్రశేఖర్
వేళా పాళయె లేక వాగునతడే, ప్రేమించు విద్యావిహీ
రిప్లయితొలగించండినాళిన్ జేకొని పానశాల జని తా స్నైగ్ధ్యమ్ముతో నీచుడై
వేళాకోళము లాడుచున్ బలికెనాపెచ్చారి తానివ్విధిన్
గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్
కందం
రిప్లయితొలగించండితృష్ణగ నభిమానులటన్
కృష్ణగ సావిత్రిఁ జూచి కేల్దాకు నుతిన్
నిష్ణాత వేషము చెదర
కృష్ణుడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
శార్దూలవిక్రీడితము
తాళమ్మేయుచు మేటి నాయికనుచున్ తద్ద్రౌపదీ వేషినిన్
మాళల్తో యభిమానబృందమట సమ్మానింప సావిత్రియై
హేళాధాటికి వేషమే చెదరి నవ్వించంగ ఘట్టమ్ముదౌ
కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్
కాళీనామకసర్పరాజునుపదాక్రాంతుంగజేయంగనే
రిప్లయితొలగించండికేళీమగ్నతనుండినవ్వెనటయాకృష్ణుండుసావిత్రితోన్
వేళాకోళముగాదుసత్యమునునేవిన్నాణముంజేసితిన్
లీలానాటకసూత్రధారియతడేరైటేనభామామణీ!
తృష్ణకలిగెమానసమున
రిప్లయితొలగించండికృష్ణకు సావిత్రిమనసుగెలువగనంతన్
కృష్ణునితానిష్టపడిన
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్
కేళాకూ ళినియా టలాడు సతులం గేళుళ్త టాకంబు నన్
రిప్లయితొలగించండికాళీరూ పుడిలా భయాన కముగా కాళీద లంపున్ మహా
కాళిందిన్ గనుకే సమూల ముగనున్ కాళీయు దొక్కేసె నా
కేళీ మగ్నత నుండి నవ్వెనటయా కృష్ణుండు సావిత్రి తో