8, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3333 (మూడును మూడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూడు మూడు మూడును మూడు గూడె నిచట"
(లేదా...)
"మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్"

117 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:


  పాడుచు వ్రాయుచున్ మిగుల పాటవ మబ్బగ నాంధ్రభాషనున్
  తోడుగ నుండి దాశరథి త్రోవను జూపగ రోజురోజునన్
  పోడిమి మీర శంకరులు ప్రొద్దున రాతిరి తీర్చిదిద్దగా
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్


  శంకరాచార్యులకు హార్దికాభినందనలు. నేను శంకరాభరణంలో చేరిన క్రొత్తలలో సమస్య #2222 వచ్చి చేరినది:

  https://kandishankaraiah.blogspot.com/2016/12/2222.html?showComment=1481470571240

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోడలు కూతురల్లుడును కూడుచు దారను చెల్లెలక్కనున్
  తోడుత నారు బంధువులు తోషము మీరగ పండుగందునన్
  బీడిని కాల్చు బాపడిని విందును జేయగ కూడ కొంపనున్
  మూడును, మూడు, మూడు, మఱి మూడును, నయ్యె సమస్య లియ్యెడన్

  3 + 3 + 3 + 3 = 12 అతిథులు

  రిప్లయితొలగించండి
 3. అందరికీ నమస్సులు 🙏🙏

  *తే గీ*

  సేవలందించు మీరిట సేద విడిచి
  వేడుక సమయమె మనకు వేగిరముగ
  సంతసించు విషయమిది శంకరార్య
  *"మూడు మూడు మూడును మూడు గూడె నిచట"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 4. (క్రొత్తరోగపు లక్షణాలతో వైద్యశాలలో ఉన్న అర్ధాంగి ఆరోగ్యం గురించి
  తత్తరపాటుతో అత్తమామలకు పునరుక్తులతో ఫోనులో చెబుతున్న అల్లుడు)
  వేడుక గాపురంపు నలి
  వేణిని దగ్గు శ్రమంబు నుష్ణమున్
  గూడెను ;వింతవింత ;సుమ
  కోమలి ;నాగతి యింక నెట్టులో?
  మూడును మూడు మూడు ;మరి
  మూడును నయ్యె సమస్య లియ్యెడన్ ;
  నేడుగదా !ప్రభుత్వమిడు
  నిష్ట్తురసూచన విల్వదెల్సెడిన్ .
  (శ్రమంబు -ఆయాసము ;ఉష్ణము -జ్వరము )

  రిప్లయితొలగించండి
 5. పాలకుని యెదిరించిన పదవి మూడు
  ప్రేమ యెక్కువయినగూడ బెడద మూడు
  రెంటికి మరియొకటి జేర్చ లెక్క మూడు
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  మూడు = ముగియు , కలుగు , రెండు నొకటి

  రిప్లయితొలగించండి


 6. చూడుము జిలేబులవలె కచోరి జాంగ్రి
  లవలె బల్పసందుగ నుజ్జ్వలాంగి! పప్పు
  బిల్లలవలె సమస్యలు ప్రీతి మీర
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట


  డబల్ త్రీ డబల్ త్రీకి
  శుభాకాంక్షలతో
  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. చూడు! జిలేబు లివ్వి రుచి చూడుము భేషుగ పప్పు బిల్లలై
  వేడిగ బల్పసందుగ రవీసు సమోస గులాబుజాములై
  చేడియ! మానసమ్మును కచేరి వలెన్ ప్రకటించు నీటుగా
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. పోడిమిలేమి,భీతియును,బూజ్యత కూడమి,సాంఘికంబులౌ
  చీడలు,దౌష్ట్యముల్,సిరులు,స్వేచ్ఛయు, స్వార్థము,బుద్ధిహీనతల్
  పీడను గూర్చు పాలనము,పేదరిక మ్మవినీతి చూడగన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్"

  రిప్లయితొలగించండి
 9. తే.గీ//
  మూడువేల, మూడొందల, మూడు మూడు
  బహువిధాల హంస నడక బారునందు !
  సరస కవులతోడ సమస్య సరళ మవగ
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట !!

  రిప్లయితొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
  కామః క్రోధస్తథా లోభః తస్మాదేతతత్త్రయం త్యజేత్ !!

  మూడగు శత్రువుల్ నరకమున్ దరిజేర్చెడి ద్వారముల్! నినున్
  నీడగనంటియుండునవనిన్ గన కామము క్రోధలోభముల్!
  క్రీడి! బరిత్యజించుమని కృష్ణుడనెన్ పలుమార్లు గీతలో!
  మూడును మూడు మూడు మఱి మూడును మూడు సమస్య లియ్యెడన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో పూరణ 🙏

   వాడిలు జొచ్చి దొంగవలె పాలను వెన్నను మ్రుచ్చిలించుచున్
   కోడలికత్తకున్ తగవు గొల్పును మూతికి సుంత పూయుచున్!
   జూడగ పారిపోవును! యశోద! గనుంగొన వాని దౌష్ట్యముల్
   మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్యలియ్యెడన్!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. పాలు త్రాగంగ లేవని బాలుడేడ్వ
  మూడె కాలమ్ము మనకని  ముదిత మూల్గ   
  ఊడిపడుదునని కరోన ఉరుముచుండ
  "మూడు మూడు మూడును మూడు గూడె నిచట"

  రిప్లయితొలగించండి
 12. గురువు గారికి నమస్సులు.
  వేద ఘోషను పంచిన వేష్టి యతడు
  పనస యందున పరిమళ ప్రతిభ తోడు
  చాత్రులెల్లరు పలుమారు చదువ నేడు
  మూడు మూడు మూడును మూడు నిచట

  రిప్లయితొలగించండి
 13. చివరి పాదము సమస్యలో నేను పొరపాటున వేరే పాదము వ్రాసినాను.
  మూడుమూడుమూడునుమూడుగూడెనిచట

  రిప్లయితొలగించండి
 14. నిర్విరామముగ తెలుగు నేలపైన
  సాగె శంకరాభరణపు జైత్రయాత్ర
  చూడగ సమస్య లవిజేరె మూడువేల
  మూడు వందల ముప్పది మూడనంగ
  మూడు మూడు మూడును మూడుగూడె నిచట.

  రిప్లయితొలగించండి
 15. నిత్య భత్యము కరువయి పత్యమాయె
  పనికి వెళ్ళుద మన్నను ప్రాణభయము
  ఆలుబిడ్డలు నాకలిఁ కలమటింప
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట.

  రిప్లయితొలగించండి
 16. ప్రతిదినమ్ముసమస్యల దృతి నిడంగ
  గడచె పలు వత్సరమ్ములు కడువడిగను
  శంకరాభరణమునవి సాగి సాగి
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి

 17. నా పూరణ.
  **** **** *
  (నేటికి ఈ బ్లాగున గురువర్యులు కంది శంకరయ్యాఖ్యులు ఇచ్చిన సమస్యలు 3333 అయిన సంధర్భంగా నా పూరణ)

  ఉ.మా.
  **** ***

  చూడర! నాటినుంచి పరిశోభిలు చక్కని యే సమస్యనున్

  వీడక, శంకరాభరణ వేదిక యందు సమస్యలన్నియున్

  పాడి గణించి గాంచగను వచ్చెడు సౌష్ఠవ సంఖ్య యిద్దియే!

  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 18. కూడి కవీంద్రసం ఘముల కూర్మిని బెంచుచు శంకరుండిలన్
  వేడుకతోడుతన్ తెలుగు వెల్గగ వేలకు వేలరష్ములన్
  నేడిటు శంకరా భరణ నీమము నిష్ఠల భాసిలన్ కనన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్.

  రిప్లయితొలగించండి
 19. ధర్మ మడుగంటె నిల లోన దారుణం పు
  రోగ బాధలు మెండయ్యె వేగ ముగను
  మృతుల సంఖ్య కరోనా వి మించు చుండె
  మూడు మూడు మూడు ను మూడు గూడె నిచ ట

  రిప్లయితొలగించండి
 20. రంధ్రు లెన్నగ తెల్పుమా రా ట్వరాహ!
  నీదు యవతారముల లెక్క నిగ్గు తేల్చు
  గ్రామ సింహమా! తరమె నా గ్రంథి విప్ప
  బుద్ధి మోకాలి యందున్న పురుగు వీవు
  మూడు మూడు మూడును, మూడు నేడు గూడె...
  .... నేరెళ్ళ వేణుగోపాలాచార్య
  ..........
  మూడు+మూడు+మూడు=9
  మూడున్+ఏడు=10

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  సమస్యల సంఖ్య మూఁడువేల మూఁడువందల ముప్పదిమూఁడైన సందర్భమున మాన్యులు శ్రీ కంది శంకరయ్య మహోదయులకు శుభాభినందనలు!

  నేఁడు మహత్త్వపూర్ణమగు నిర్వహణమ్మున శంకరార్యులే
  వాడుక చొప్పునం బ్రియ శుభాంచిత శీర్షిక నొక్కనాఁడుఁ దా
  వీడక, శంకరాభరణ బృందము నందున నిచ్చినట్టివౌ

  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

   రెండోపాదంలో అఖండయతి వచ్చినది కావున...దానిని శుభంకర...అని సవరిస్తున్నాను. పరిశీలించగలరు.

   నేఁడు మహత్త్వపూర్ణమగు నిర్వహణమ్మున శంకరార్యులే
   వాడుక చొప్పునం బ్రియ శుభంకర శీర్షిక నొక్కనాఁడుఁ దా
   వీడక, శంకరాభరణ బృందము నందున నిచ్చినట్టివౌ

   మూఁడును మూఁడు మూఁడు మఱి మూఁడును నయ్యె సమస్య లియ్యెడన్!

   తొలగించండి


  3. శుభాంచిత అనడం వల్ల ఎట్లా అఖండ యతి అవుతుందండి ?


   జిలేబి

   తొలగించండి
 22. నేడు నేడిది జనులార నేర్పు గాను
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట
  చూడు చూడు తెలుగు పద్యముల వెలుగులు
  వాడిమీఱుచు నుండెర ప్రాత విద్య
  కంది వారికి మనసార వందనమిదె

  రిప్లయితొలగించండి
 23. ఔర, నౌరౌర యని యెల్ల రబ్బుర పడ
  శంకరార్యు సారధి గాను సాగు నిచట
  పొద్దు పొద్దునె శారద పూజ యనగ
  సొంపుగ సమస్య పూరణ లింపుగాను
  పద్యముల పండితులు జేయ ప్రజలు మెచ్చ
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి
 24. మల్లి సిరిపురం శ్రీశైలం 🙏
  తే.గీ//
  హరి,హరాదులను గొలుచు హాలికుండు
  జగములోని తెలుగుభాష సొగసు జూచి !
  నొకటి రెండౌచు ప్రబలుచు నొప్పుగాను
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట !!

  రిప్లయితొలగించండి
 25. మేడలు గట్టినట్లుగను మేరు నగమ్ములు పుట్టినట్లుగన్
  చేడియలెల్ల పేరటము చేసిన యట్లుగ బాలబాలికల్
  పాడుచు నాడినట్లుగను భర్గుడు తాండవ మాడినట్లుగన్
  తాడును పేని నట్లుగను దంతి గమించిన యట్లు వేడుకన్
  కోడె వయస్సు చిన్నది పకోడి పసందుగ పెట్టినట్లుగన్
  వేడిగ దోసె తిన్నటులు వేదములన్ని పఠించినట్లుగన్
  వేడుక శంకరాభరణ వేదిక పై రవళించి మించి హే!
  *మూడును మూడుమూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   వేడుకతో నితంబినులు వెన్నెల రేయి చరించినట్లుగన్
   వీడని హాయి హర్ష సుకవీంద్రుడు స్వప్నము గాంచినట్లుగన్ (నివర్తి మోహన్ కుమార్)
   వాడని చంపకంబుల సువాసన లెల్లెడ నిండినట్లుగన్
   కూడె నిటన్ సుభావ పద కోమలతా సుకవితా వితానముల్. (కంది శంకరయ్య)

   తొలగించండి
  2. రూఢిగ పద్యవిద్యకును రోచిసులద్దిన పాఠశాలయే!!
   గురువుగారికీ,శ్రీహర్షగారికి అందమైన పద్యాలనందించి నందులకు ధన్యవాదములు,అభినందనలు!!

   తొలగించండి
 26. కలుపనగుగదతొమ్మిదికచ్చితముగ
  మూడుమూడుమూడును,మూడుగూడెనిచట
  మూడుమూడులతోడనుముచ్చటగను
  చిత్రముగవచ్చెనుసమస్య శ్రీనివాస!

  రిప్లయితొలగించండి
 27. ఆడుదిలేనిజీవితము, ఆంక్షల యంబరమెక్కియూగుటే
  వేడుకమాసిపోవుగద,వేదననింపెడుగుండెకోతతో
  తోడుగలేదురాదనుచు,,తొం దరపెట్టెడుకాలవాహినిన్
  మూడునుమూడుమూడుమఱిమూడునునయ్యె, సమస్యలియ్యెడన్
  ++++++++++++++++++==============
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 28. ధనకనకవస్తువాహన ధన్యతుండె
  దానధర్మభక్తిశాంతి ధైర్యముండె
  చణత ధీవాక్కు రాముని జాతియందు
  మూడు మూడు మూడును మూడు గూడెనిచట.

  రిప్లయితొలగించండి
 29. మూడు గుణమ్ములన్ వరలు మువ్వురు మూర్తులు ముజ్జగమ్ములన్
  చూడగ సత్యమై వెలుగ శోభిలుచుండును లోకమంతటన్
  మూడును మూడు మూడు; మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్
  పాడు గుణమ్ము క్రోధమును పాపమొసంగెడి కామ లోభముల్

  రిప్లయితొలగించండి
 30. ఎవ్వ రేమి సెప్పినను జోటివ్వఁ డకట
  సంధికి సుయోధనుం డిట నంధుఁడై ని
  కృష్ట చారిత్ర దుష్ట చతుష్టయ చయ,
  మూడు మూడు మూడును మూడు, గూడె నిచట

  [చయము+ఊడుము+ఊడుము+ఊడును = నిచయ మూడు మూడు మూడును; ఊడుము =పాఱుము; ఊడును = రాలును; ఊడును మూడు =ప్రాణ మాన ధనములు మూడు రాలును]
  గమనిక: మూడులో నర్ధానుస్వార మిడిన: మూఁడు మూఁడు మూఁడును మూఁడు = నిస్సంశయముగా ముగియును.


  ఏడవ యేడునన్ దినము లేడులు పాడిఁగఁ గూడ వేడుకల్
  వాఁడును వీఁడు వీఁడు మఱి వాఁడును వీఁడును జూచుచుండఁగా
  వాడుక వాడి వాడి పరిపాటిగ వీడక ద్వాదశమ్ములే
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  రిప్లయితొలగించండి
 31. మూడు వేలును మున్నూట ముప్పదికిని
  మూడు కలుపగ నెంతౌను మురళి యనగ
  తెలిపె దెలుగున వాడతితెలివి జూపి
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి

 32. ఉత్పలమాల
  తాడును పాముఁజేసెడిని దారను నక్కగ ప్రేమఁ బిల్చెడిన్
  పేడినిఁ దండ్రిఁ జేసెడిని పేర్మి సుపర్వుల వావి మార్చెడిన్
  వాడల వంకపెట్టెడిని వైనములెన్నియొ గాడిఁ దప్పెడిన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  రిప్లయితొలగించండి
 33. ఉ:

  వాడెను మోము నాది గన వంటలు వార్చుట మానకుండు టై
  పాడు కరోన రోగమన పట్టపు రాణికి స్వర్గధామమై
  వేడుకలాయ రోజులుగ వీక్షణ మొందుచు దూరదర్శినిన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 34. వేడుకఁ గొల్పఁ బద్యసుకవిత్వము వ్రాయఁ గణమ్ము లడ్డు, పో
  రాడగ పాదపాదమున నడ్డు పడున్ యతులట్లె, దాటినన్
  జోడుగఁ బ్రాసలడ్డు కొనుఁ, జొప్పడ మెత్తురొ! యన్న యడ్డు, లీ
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్.

  ప్రతిపాదములందు 4 చొప్పున 3 పాదాలలో కలిసి మొత్తం 12 అడ్డులు.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 35. పద్య రచనకు వేదిక పాదుగొల్పి
  సంధి సూత్రంబు లెఱిగించి సాధనమున,
  శంకలన్నియుదొలగించిశంకరార్య
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్య విద్యకువేదికపాదుగొల్పి
   పూరణముగోరి ముచ్చటముచ్చటించి
   ఛందమెఱిగించిచక్కగసాయమగుచు
   మూడుమూడుమూడునుమూడుగూడెనిచట
   కొరుప్రోలు రాధాకృష్ణారావు

   తొలగించండి
 36. ఏడులెయేడులేగడవయిప్పటికయ్యెనుగాదెయిట్లుగన్
  మూడునుమూడుమూడుమఱిమూడునునయ్యెసమస్యలియ్యెడన్
  మూడునుమూడునున్గలుపముచ్చటగౌనుగతొమ్మిదిన్గదా
  ఏడిదరామచఃద్రగురువిట్లుగజెప్పిరిలెక్కలెన్నియో

  రిప్లయితొలగించండి
 37. కూడగ పద్యపూరణలు కోవిదు లైన కవీశ్వరాఖ్యులే
  వేడుక తోడ వ్రాసినవి వేలకు వేలు గణింపగా నవే
  మూడును దాటి వందలును మూడు క్రమించెనటంచు చెప్పెనే
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  రిప్లయితొలగించండి
 38. శంకరార్యులకు నమస్సులతో 🙏

  మరో పూరణ ..

  *తే గీ*

  వేల పద్యములు గనుట విసుగు లేక
  ఎన్ని కనులుండవలెనిల నెవరి కైన
  శంకరార్యులు గలిగె సంకోచమేల
  *"మూడు, మూడు, మూడును, మూడు గూడె నిచట"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙇‍♂️🙏🙇‍♂️🙏

  రిప్లయితొలగించండి
 39. తేటగీతి
  తాడుఁ బామనెడి జనని దార యనెడి
  పేడి నానయనెడి రాజుఁ పేద యనెడి
  మరచి పోలెని బ్లాగు సమస్యలనెడి
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి
 40. అందరికీ నమస్సులు

  ఈ రోజు సమస్య... నా చిరు ప్రయత్నం....

  ఒకటిగ మొదలై తదుపరి నొకటి రెండు

  మూడయి విలసిల్లె నిచట మూడు పువ్వు

  లారు కాయలవగ శంకరాభరణము

  మురిసె శంకరార్యుల కృషి పుణ్య ఫలము

  *మూడు మూడు మూడను మూడుగూడె నిచట*
  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 41. మూడును మూడు యారుగద మూడును గూడిన తొమ్మిదే గదా
  మూడును మూడు ముచ్చటవ ముద్దగు లేనిచొ ఆరుమూడెగా
  మూడును మూఢుడౌగ తను ముప్పది మందికి మూడుమార్చినన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  రిప్లయితొలగించండి
 42. మూడుపూలారుకాయలు ముచ్చటగను
  పద్యసౌరభవిభవమ్ము ప్రతిదినమ్ము
  శంకరాభరణమునందు సాగినేడు
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి
 43. పోడిమిశంకరార్యగురుపుష్పవనంబిటనన్ని వేళలన్
  వేడుక పద్యపూరణలు వెల్లువగావికసించు పుష్పముల్
  వీడక నీదినంబునకువీరి వనంబును శోభ గూర్చగన్
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్

  రిప్లయితొలగించండి
 44. అలసటెరుగని నాచార్యు లలఘురీతి
  నిత్యమొకటిగ నీయగ నియతిగొనుచు
  కైపదము లేటికేడులున్ కరుణతోడ
  మూడు మూడు మూడును మూడు గూడెనిచట
  నేర్చిరెందరో కవితల నేర్పుమీర
  వారి ఋణమది దీర్చగా నేరితరము?!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాడు కరోన ప్రాకగను వాడలనన్నిట భీతినొందుచున్
   రాడుగ పాలవాడు మరిరారుగ సేవిక లింటిఛాయలన్
   ఊడుపు,నంట్లు దోముటయు,నోర్పునబండెడు బట్టలుత్కుటన్
   మూడును మూడుమూడు మరిమూడును నయ్యె సమస్య లియ్యెడన్
   చేడియ జీవనమ్మిచట చేదుగమారెను లాకుడౌనునన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 45. మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్యలియ్యెడన్
  కూడిన ద్వాదశంబె యగు కోవిద!శంకర!రోజు రోజునేన్
  కూడగ మూడువేలపయి నొప్పుగమూడగు నూర్లు ముప్పదౌ
  మూడును సంఖ్య వచ్చినది ముచ్చట గొల్పెను మీ సమస్యయున్ .

  రిప్లయితొలగించండి
 46. సరిజేసితిని గురువుగారూ 🙏
  తే.గీ//
  హరి,హరాదులను గొలుచు హాలికుండు
  జగములోని తెలుగుభాష సొగసు జూచి !
  యొకటి రెండౌచు ప్రబలుచు నొప్పుగాను
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట !!

  రిప్లయితొలగించండి
 47. వాడును వీడు నాతడును వచ్చిరి యూరపునుండి వారితో
  మూడె కరోన యిండ్ల మరి ముగ్గురి కా పయి సేవకాళికిన్
  మూడెను ముగ్గురిండ్ల నిక మూడక మానునె వారి వారికిన్?
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్.

  రిప్లయితొలగించండి

 48. వాడని పద్య రత్న సుమ
  భాస విలాస వికాస వీధిలో
  వేడుక మీర సత్కవుల
  పేర్మిని కూర్మిని సంతరించగన్
  జూడుడు శంకరాభరణ
  శోభను బెంచి రచించ, నేటితో
  మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్!

  రిప్లయితొలగించండి
 49. మహమ్మారి కరోనా రాకతో ప్రాణ భయముతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడి కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని నా పూరణ...

  రక్కసి కరోన వేగమె ప్రబలు చుండ
  బడులు గుడులన్ని మూసిరి భయము చేత
  కష్టములు సర్వమొకసారి కలసి రాగ
  మూడు మూడు మూడును మూడు గూడె నిచట

  రిప్లయితొలగించండి
 50. ఆట విడుపునకై శంకరాభరణము
  మొదలు వెట్టి సమస్యల ముడుల నిడుచు
  నేండ్ల కేండ్లు గడచె నేడు నీవిధముగ
  "మూడు మూడు మూడును మూడు గూడె నిచట"

  రిప్లయితొలగించండి