19, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3344

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామునికి వనంబులుండ రాజ్యంబేలా"
(లేదా...)
"రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్"

83 కామెంట్‌లు:


 1. నడిరేయి సరద పూరణ:

  గోముగ నవ్వుచున్ తనరి కొల్కత రాణిగ పిక్కటిల్లుచున్
  భామయె దండ మెత్తుచును వంగల భూమిని దంచి కొట్టగా
  వామపు పక్షమే మునిగి వాసిగ కూలగ కమ్యునిస్టుడౌ
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్

  రిప్లయితొలగించండి
 2. భూమిని బడసెను క్షత్రియ
  భూమీశులఁజంపి; కశ్యపునకిడె దానం
  బామహిఁ! దాపసి భార్గవ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా?

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ధీమతి యిందిరే కడకు దిక్కులు తోచక హైద్రబాదునన్
  తోముచు మోము నాదటను తోకను దించుచు పారిపోవగా
  నేమని చెప్పెదన్ తుదకు నెవ్విధి గాంచగ నందమూరుడౌ
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్?

  రిప్లయితొలగించండి
 4. కం//
  దామము లన్నియు నొదలెన్
  కాముకియగు కైక మనసు గాదనలేకన్ !
  భామినితో వెడలెడి, శ్రీ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "దామము లన్నియు వదలెను... గాదనకుండన్..." అనండి.

   తొలగించండి
 5. నీమముదప్పనివాడై
  భామామణివెంటరాగవనములకేగెన్
  కామితములనొదిలిన శ్రీ
  రా‌మునికివనంబులుండరాజ్యంబేలా

  రిప్లయితొలగించండి
 6. కం//
  భౌముడు గన శృంగారపు
  ధామును నొదలెను విరాగి తానై భువిలో !
  క్షేమము భరతుని కొసగెను
  రా ! మునికి వనంబులుండ రాజ్యంబేలా !!

  రిప్లయితొలగించండి
 7. కామిత యర్ధము జానకి
  రాముని ప్రేమానురాగ రంజితమగునీ
  ఆమనికోయిలగానమె
  రామునికి; వనంబులుండ రాజ్యంబేలా?
  ++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కామిత+అర్థము=కామితార్థము' అవుతుంది. యడాగమం రాదు.

   తొలగించండి


 8. బాల్ బేక్ ఇన్ ది కోర్ట్ :)


  ఈ ముక్క చెప్పడానికి
  మీ మనసెట్లొప్పెనో సుమీ కవి వరులా
  రా! మానవులారా శ్రీ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. క్షేమము కోరుచు తండ్రికి
  భామా సహితుం డగుచును భ్రాతా యుతుడై
  నేమముతో నేగిన యా
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా

  రిప్లయితొలగించండి


 10. కైకేయి మాట గా

  నామది కోరె రాజ! పదు నాలుగు వత్సరముల్ వనమ్ములం
  దా ముని వాటికల్ తిరిగి ధామము చేరమటంచు నాజ్ఞని
  మ్మా! మన రాజ్యలక్ష్మిని కుమారుడు నాభరతుండు చేగొనన్
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాజ్యం వద్దు సరే... మరి భార్య ఎందుకు వద్దు?

   తొలగించండి


  2. వనానికి పోయే వారికి పెండ్లామెందుకని అయ్యుంటుంది :) ఆవిడ కోరిక రాముడు మాత్రమే కదా వనానికి వెళ్లాలని ? సీతమ్మే నేనూ పోతా పోతా నని వెనుకబడి కత ముందుకు నడిపించింది :) ప్రతి మగవాని ప్రగతి, పేరు, ఫేము వెనుక స్త్రీ యే మూలము :)


   కైకేయి కోరకుంటే, రాముని వెనుక సీత వెళ్లకుంటే రామాయణమేదీ ? :)   జిలేబి

   తొలగించండి


  3. మగవారు ఆడువారి మాటల‌ వినక పోతేనే తిరోగతి :)

   ఉదాహరణకు దశరథుడు కైకేయి కి నో అని వుంటే రాములోరు ఇంటి పట్టున వుండి యే సాదా సీదా రాజుగానో తిరోగతి :)   జిలేబి


   తొలగించండి
 11. రాముడు మానవమాత్రుడు
  రామునిపాదుకలచేతరాజ్యముసుఖమే
  ఏమదిరామాయణమున
  రామునికివనంబులుండరాజ్యంబేలా?
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 12. మరోపూరణ

  భూమీశుల జంపి బడసె
  భూమిని జమదగ్ని సుతుడు భూరిగ తా ని
  ష్కాముండైవిప్రుకి భృగు
  రామునికి వనంబు లుండ రాజ్యంబేలా  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నిష్కాముండగు విప్రుడు భృగు..." అనండి.

   తొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నీమపు వశిష్టు డనె నౌరా..." అనండి.

   తొలగించండి
  2. ఆముని విశ్వామిత్రుడు
   క్షేమములనుగూర్చునట్టిశబలనుగోరన్,
   నీమపువశిష్ఠుడనెను నౌ
   రా!మునికివనంబులుండరాజ్యంబేలా?
   కొరుప్రోలు రాధాకృష్ణారావు

   తొలగించండి
 14. బ్రహ్మర్షి కావాలంటే రాజర్షి కావవాలి

  రిప్లయితొలగించండి

 15. క్షేమముగోరు మానవుడు శ్రీప్రదుడున్ బురుషోత్తముండునౌ
  స్వామిని గూర్చి శంకపడి పల్కగ జూచునె యెప్పుడైన నీ
  "రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్
  ప్రేమలవేల"యంచు సిరివేడుచు గొల్చునుగాక నిచ్చలున్.

  రిప్లయితొలగించండి
 16. సుగ్రీవుడు వాలితో మొదట యుద్ధం చేసి బాగుగా దెబ్బలు తిని వస్తాడు . అప్పుడు రాముడు అతనిని ఓదార్చి మరల యుద్ధమునకు వెడల మంటాడు. ఆ సమయమున సుగ్రీవుడు ,"ఆర్యా నాకు వనము లున్నయి. నాకు రాజ్యం ఎందుకు. బ్రతికి ఉంటే బలుసాకు తిని బతక వచ్చు మరల వాలితో యధ్దమునుకోరితే నేరము కదా
  అని పలికిన సందర్భం  సోమ మపుడు వగచి తెలిపె

  రామునికి ,వనంబులుండ రాజ్యంబేలా,

  యీ మర్కటమునకు వలదు
  ,
  నే మరల రణము ను కోర నేరం బగునే

  సోమము = కోతి

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  మేనకాగమనానంతరం మరల తపము జేసెడి విశ్వామిత్రుడు...

  ఏమిది! బ్రహ్మదేవ! తపమెంతయొ నేనొనరించినాడనే !
  నేమమునన్., మఱేల గమనింపరు నన్నిల బ్రహ్మవేత్తగా?
  నేమిటి కారణమ్మనగ నిట్లు వచించె విరించి "గాధిపు...
  త్రా! ముని కేల భార్య? మఱి రాజ్యము లేల? వనంబు లుండఁగన్"!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 18. భామయు తమ్ముడు తానును 
  నీమముతో వనములందు నివసింతుమనెన్  
  ప్రేమను పలుకగ తగు నా 
  "రామునికి వనంబులుండ రాజ్యంబేలా"  

  రిప్లయితొలగించండి
 19. క్షేమము కొరకై పృథవిని
  కామితములు లేనివాడుకారణజన్ముడు
  నీమముకొర కైత్రేతన
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పృథివిని' అనండి. రెండవ పాదం చివర గురువుండాలి. అలాగే 'త్రేతను' అని ఉండాలి.

   తొలగించండి
 20. రాముని భక్తులు కొల్లలు
  రామాయణ గాధలెల్ల రసమయ గుళికల్
  రాముఁడు జగదభిరాముఁడు
  "రామునికి వనంబులుండ రాజ్యంబేలా"

  వనము=సమూహము
  శబ్దరత్నాకరము

  రిప్లయితొలగించండి
 21. 1.
  తామిక పదునాల్గేడులు
  నీమముతోరాజ్యలక్ష్మి నేలుము భరతా!
  యీముని సంఘము నేలగ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా?
  2.

  క్షేమము దలపెడు దశరథ
  రాముండవతారమెత్త రాగా ధరణిన్
  తామిటుదలచెను భార్గవ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా?

  రిప్లయితొలగించండి
 22. భీమునికి పాకశాలయె రాజ్యం
  సామినికిని తారకంబెసర్వము సృష్టిన్
  నేమము రాక్షసహననమె
  "రామునికి వనంబులుండ రాజ్యంబేలా? "

  రిప్లయితొలగించండి
 23. క్షేమము విడనాడి జనుల
  బాముల బాపంగ మారి ప్రతినను జేసె న్
  నీ మపు వాడై నక్స ల్
  రామునికి వనంబు లుండ రాజ్యం బేలా

  రిప్లయితొలగించండి
 24. ధన్యవాదములు గురువు గారు,మొదటిసారి పంపినాను.

  రిప్లయితొలగించండి
 25. కామక్రోధములను విడి
  నేమము తోతపమొనర్చు నిష్ఠాపర ని
  ష్కాముడగు యోగియె కద
  రా, మునికి వనంబులుండ రాజ్యంబేలా.

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. లంకలో సీతమ్మ వారితో రావణాసురుడు...

   ఉత్పలమాల
   ఈ మహి నష్ట దిక్పతులు నింటికి సేవలఁ జేయవచ్చెడున్
   హేమ సుదీప్త లంక దివి! నేలెడు రావణు నన్ వరించుమా
   కామితమందగన్! మునులఁ గాచెడు వృత్తిని మున్గి తేలెడున్
   రాముని కేల భార్య మఱి రాజ్యములేల వనమ్ములుండగన్

   తొలగించండి
 27. ఏమని యడిగితి రిటులా !
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా !
  ఏమని జెప్పుదు ? ప్రభువుకు
  ప్రముఖము తన దేశ జనుల పాలన గాదే ?

  రిప్లయితొలగించండి
 28. ఏమని చెప్పుదు? చిత్రమె!
  యాముని రాముని మనమున నాంతర్యమ్మున్
  కోమలి మైథిలి తోడుగ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా?

  రిప్లయితొలగించండి
 29. నీమము దీర్పగా నెటుల నీవ్రము నుండు స తన్న చింత శ్రీ
  రాముని కేల? భార్య మఱి "రాజ్యము లేల వనంబు లుండఁగన్
  ధామము రాణివాసముఁ వృథా! యభిరామమె యీ వనాశ్రమా
  రామము, వీడి పోవుటకు రాదె మనస్స"ని కోరుచుండగన్౹౹

  రిప్లయితొలగించండి
 30. ఆ ముని దోడ నే దినము నాశ్రమ రక్షణ కంచు నేగెనో
  నీమముగాను గానలనె నీరజ నేత్రునివాసమాయెనే
  యేమిది రాజ ధర్మమను నింతిని గానల పాలు జేయునీ
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్

  రిప్లయితొలగించండి
 31. సరిజేసితిని గురూజీ 🙏
  కం//
  దామము లన్నియు వదలెను
  కాముకియగు కైక మనసు గాదనకుండన్ !
  భామినితో వెడలెడి, శ్రీ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా !!

  రిప్లయితొలగించండి
 32. సరిజేసితిని గురూజీ 🙏
  కం//
  భౌముడు గన శృంగారపు
  ధామును వదలెను విరాగి తానై భువిలో !
  క్షేమము భరతుని కొసగెను
  రా ! మునికి వనంబులుండ రాజ్యంబేలా !!

  రిప్లయితొలగించండి
 33. మిత్రులందఱకు నమస్సులు!

  [రావణుఁడు రామునిఁ దిరస్కరించుచు సీతతోఁబలికిన సందర్భము]

  "భామ! మహాబలుండ! ధనవంతుఁడ!దిక్పతులన్ జయించితిన్!
  వేమఱు నింద్రునిం దఱిమి, వెంచితిఁ గీర్తిని! నిట్టి నన్ను నీ
  వే మది నిల్పి, భర్తగ వరించినఁ, జేసెద రాణిగాను! నా

  రాముని కేల భార్య? మఱి, రాజ్యము లేల? వనంబు లుండఁగన్!"

  రిప్లయితొలగించండి
 34. ధీమతి తండ్రి వరమ్ముల
  ప్రేమముతో గౌరవించి విపినము చేరెన్
  శ్రీమతినిఁ ప్రకృతిని వలచు
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. కామాదులదరిజేరక
   నేమముతోయోగనిదురనెఱపుచుమిగులన్
   దామసవృత్తినిమెలగెడు
   రామునికివనంబులుండరాజ్యంబేలా

   తొలగించండి
 36. రాజ్యభారం చేపట్టమని కోర వచ్చిన భరతునతో శ్రీమచంద్రుడు...

  కందం
  రామ వనవాసము, భరతుఁ
  డీ మహి నేలుట పితరున కిష్టము, జటలన్
  నీమమ్మున ననుజ! పవి
  త్రా! మునికి వనంబులుండ రాజ్యంబేలా?

  రిప్లయితొలగించండి
 37. Ch. వెంకటేశ్వర్లు
  కం||
  పామరుల మాట వినగన్
  రాముడు కుములుతు యటవికి రాణిని పంపెన్
  రాముని మతిభ్రమింపగ
  *రామునికి వనంబులుండ రాజ్యంబేలా*

  రిప్లయితొలగించండి
 38. రామునికేలభార్యమఱిరాజ్యములేలవనంబులుండగన్
  రామునిపుట్టుకేయరయరావణుజంపుటజానకమ్మనున్
  గామునిబారినుండియికకాచునిమిత్తమురాజ్యమీడెనే
  రాముడనంగనేర్వుమచాచరజీవులబోషకుండుగాన్

  రిప్లయితొలగించండి
 39. ఉ:

  రాముడు, రామ జన్మమన రావణ సంహరణమ్మె హేతువై
  భూమిక నొగ్గ సీతకును పూర్ణత బొందగ లోక రక్షణన్
  సీమను వీడ రాముగని సిగ్గెగ సంగగ నిట్లు దెప్పుటే !
  రామునుకేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 40. గురువు గారికి నమస్సులు.
  సోమునకుచంద్రుడుశిరమున్
  భీమునకుగదయువిభూషభీషనతయిచ్చున్.
  ప్రేమగ బల్కెద ధ్రువతా
  రా!మునికి వనంబులుండ రాజ్యంబెలా?

  రిప్లయితొలగించండి
 41. :
  క్షేమము పొందెను వనములు
  రామునినామంబుచాలు రాజ్యమునేలన్!
  రాముడుజగదభిరాముడు
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా.

  కం:
  రాముడు విశ్వజనీనుడు
  దార్శనికతచూపతండు ధర్మనిరతుడై
  కామించడురాజ్యపదవి
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా!

  కం:
  నీమముగ తపము సేయుచు
  కామపు దరిచేరకుండ కపటము లేేకన్
  హోమజపాగ్నికి సారథి
  రా ,మునికి వనంబులుండరాజ్యంబేలా!

  రిప్లయితొలగించండి
 42. భూమిసు రావాసమ్ములు
  భామా రత్న ద్వితీయ వసుధేశునకున్
  ధీమద్వానప్రస్థ వి
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా


  తామరచూలి చెయ్వులను దాటఁగ శక్యమె యేరి కైననున్
  సోమ నిభాస్య నేఁ గననిచో నిఁక నేఁగుమ నీవు లక్ష్మణా
  ధామము కాన నాపహృత దార విచార కబంధ మగ్నుఁడీ
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్

  రిప్లయితొలగించండి
 43. ఆ ముని కౌశికుండు కని నంతను మేనక నా క్షణమ్మె తా
  నీమము లన్ని మానె కడు నిష్ఠను జేయు తపమ్ము వీడె నా
  భామ కరమ్ము బట్టి మది పట్టము గట్టెను మౌనిలోక సు
  త్రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్.

  రిప్లయితొలగించండి
 44. కామనలన్నిటిని విడి
  నీమమీతో బ్రహ్మపదము నెక్కొను తరినిన్
  క్షేమంబగు వాసమదే
  రా!మునికి వనములుండ రాజ్యంబేలా?

  నీమము ధర్మపాలనము నిశ్చలచిత్తుడు నిర్వికారుడౌ
  కోమల శాంతమానసుడు క్రుంగక పొంగక వీతరాగుడౌ
  రామునికేల భార్య మరి రాజ్యములేల? వనంబులుండగా
  నాముని సంచయంబునకు హ్లాదముబంచగ మోక్షదాయియై

  రిప్లయితొలగించండి
 45. అందరికీ నమస్సులు 🙏🙏

  నా ప్రయత్నం 🙇‍♂️

  *కం||*

  ప్రేమను పంచెడి సీతా
  రాముని తోడౌ నిరతము రమణీయముగా
  క్షేమము కోరెడి సతిగల
  *"రామునికి వనంబులుండ రాజ్యంబేలా"*?

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 46. నామము లేమొ యొక్కటె ధనస్సును పర్శువు లేనుమార్పులున్
  రాముడు రక్కసుల్ పరశు రాముడు రాజుల ద్రుంచె గోపమున్
  రాముడు విల్లునున్ విరిచి రాముని గర్వమడంచ వెళ్ళెనా
  రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్

  రిప్లయితొలగించండి
 47. పూజ్యులకు ప్రణామాలు 🙏
  నా పూరణ.....
  కం"

  రాముడు వనమందున్నను
  దేముడు, ప్రజకై రణముల తెగబడ యోగ
  క్షేమము నెరపిన వీరుడు
  *రామునకు వనంబులుండ రాజ్యంబేలా!*

  వాణిశ్రీ నైనాల

  రిప్లయితొలగించండి
 48. దీమసముగదానవులను
  నామమడచహరియెకాననములకునేగెన్
  నీమమునిర్వర్తింపగ
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా

  రిప్లయితొలగించండి
 49. భామిని, యనుజుల తోడను
  సేమముగ దినములు గడుప స్తిమితమనంబున్
  భూమిజ తలచెను పతిగని
  రామునికి వనంబులుండ రాజ్యంబేలా"

  రిప్లయితొలగించండి
 50. ఈమహి నేలితేను కడు నింపుగ, చేసితి నూరు జన్నముల్
  నోములు పండ నిద్రునిగ నూతనమౌ స్థితి దక్కెనాకు నా
  శ్రీమతివై చరించు మిక, చేసెద రాణిగ నిన్ను పాత సు
  త్రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్

  రిప్లయితొలగించండి
 51. సామము దానమంత్రములు, సర్వమెరింగిన రామమూర్తియే
  నీమముతోడభార్యగొని,నిందలుమోసి వనాళికేగెలే
  కాముకుడైన రావణుడు,కాంక్షలుడుంగగబల్క ధర్మమా?
  రామునికేల భార్యమఱి?రాజ్యములేల వనమ్ములుండగా!!
  +++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 52. కందం

  ఆమని ఆలాపనలన్
  కోమల శీతల విలాస ఊయల లూగన్
  యేమది నిండదు మరి ఔ
  రా! మునికి వనంబులుండ రాజ్యంబేలా

  రిప్లయితొలగించండి


 53. ఈమహి లోన భూ పతుల నెల్లర చంపెద నంచు మానుగా
  తామదిలో ధృఢమ్ముగను దల్చుచు భార్గవరాము డచ్చటన్
  నేమము దప్పకన్ దునిమె నీల్గెడి వారిని గాని నెం చనా
  *రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్"*

  రిప్లయితొలగించండి