30, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3355

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"
(లేదా...)
"బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్"
(ఈ సమస్యను పంపిన జి. సీతాదేవి గారికి ధన్యవాదాలు)

97 కామెంట్‌లు:

 1. సమస్య :-
  "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"

  *కందం**

  బడిలో చదువులు నేర్వని
  తడబడక చదువులు నేర్చు తాతవ్వలకున్
  గుడిలో నేర్పిన రాత్రుల
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్
  ...............చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమస్య :-
   "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"

   *కందం**

   విడవని కరోన దెబ్బకు
   గడగడ లాడె జగమంత కాలు కదపకన్
   ఒడికపు లాక్డౌన్ వేళన
   బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్
   ...............చక్రి

   ఒడికము : యుక్తము, తగిన

   తొలగించండి
  2. సమస్య :-
   "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"

   *కందం**

   బడి వ్యాపారపు కేంద్రము
   కడు పెట్టు బడులను బెట్టి కరుణయు లేకన్
   బడలించెడు వారికి రా
   బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్
   ...............చక్రి

   బడలించు : పీడించు

   తొలగించండి

  3. ముక్కుపిండి లేని క్లాసులకు ఫీజులు వాయిస్తుంటే రాబడి లేదంటారేమిటండోయ్ :)   జిలేబి

   తొలగించండి
  4. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో "వేళను" అనండి.

   తొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  పడుచును లేచి వర్తకులు భళ్ళున నేడ్చుచు కొట్లు మూయగా
  తడబడకుండ పద్యములు దండిగ వ్రాయగ నాదు బోంట్లహో...
  జడియుచు వైరసమ్మకును చక్కగ నేతల నల్లదుడ్డు రా
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ ప్రయత్నం ..

  *కం||*

  వడిగా నెదిగె కరోనా
  ముడివేయక జీవితములు మూర్ఖుల వలె తా
  నడుగులు వేయగ ప్రభుతయె
  *"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో ప్రయత్నం 🙏🙏

   *కం||*

   గడుసరి దళారులకిపుడు
   వడివడిగా నల్ల ధనము వందలు వేలున్
   ముడిపడిపోయిన యా రా
   *"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"*!!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏💐🙏💐🙏

   తొలగించండి
  2. అందరికీ నమస్సులు ..🙏🙏

   GP శాస్త్రి గారికి ధన్యవాదములతో ..🙇‍♂️

   *కం||*

   మిడి మిడి జ్ఞానము తో రా
   పిడు కోర్సు ల దోచుకొనుచు పిల్లల ధనమే
   వడివడి గా కోట్లగు రా
   *"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"*!!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😊🙏😊🙏

   తొలగించండి
  3. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. బడిగంటలు లేకుండెనె
  వడివడిగనుచెప్పు వారుబడులకులేకన్
  చెడి పోయెడిచిన పిల్లల
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 5. మరో పూరణ 🙏🌹

  *కం||*

  విడువని పుస్తకములటన్
  నడుముకు గాడిదల వలెను తగిలించగనే
  యడుగు పడని విద్యార్థుల
  *"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  IIT-Orientation Preparatory Schools:

  బడులను విప్ప నాయకులు వందల లక్షలు కూడబెట్టుటన్
  గడవక తిండి తిప్పలయొ కాంతలు చేరుచు టీచరమ్మలై
  తడబడకుండ కూనలకు తప్పులు చెప్పగ, విఱ్ఱవీగెడిన్
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 7. (కరోన కారణంగా బడులను మూస్తే భారతి
  ఆనందభారతి అయింది
  వడివడి విద్య నేర్చుటకు
  పర్వులు పెట్టెడు భావిపౌరులన్
  చెడుగు కరోన బారిపడి
  జీవము చెల్వము బాయకుండగా
  చిడిముడి లేని నిర్ణయము
  చేకొని కేంద్రము రాష్ట్రపాలకుల్
  బడులను మూసివేయగనె
  భారతి మెచ్చెను మోదమందుచున్ .
  (చెడుగు -క్రూరమైన ;చిడిముడి -తొట్రుపాటు )
  )

  రిప్లయితొలగించండి

 8. సుడిగలవారలందరును,సున్ననుజేసిరిపాలనమ్మునే
  తడిగలరాష్ట్రమంతటిని దండుగజేసిరియార్ధికమ్ముగా
  బుడతలువీరులెమ్మనుచు బుద్ధిగ మొట్టగమోడిమాటతో
  బడులనుమూసివేయగనె భారతిమెచ్చెను మోదమందుచున్
  ************************++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 9. వడిగా కరోన జొరబడ
  బుడతల యారోగ్యమెంచి ముందస్తుగనే
  సడలించ నిబంధనలను
  బడులన్నియు మూతబడగ భారతిమెచ్చెన్

  భారతి అనే ఒక విద్యార్ధిని

  కడమ పరీక్షలంచు బహుకష్టము నొందుచు సిద్ధమైననున్
  నడిమిని లాకుడౌనునను నల్గురుగూడుట నేరమౌటచే
  బుడతల బాగుగోరుచును బోర్డుపరీక్షల రద్దుజేయుచున్
  బడులవి మూసివేయగనెభారతిమెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 10. బడివిడిచిన ముదుకలు మరి
  బడిగల్లువడుక జదవగ బడిపెద్ద కడన్
  బడియును దీసిరి రాతిరి
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్


  బడియును దీసిరి...దిగదీయు ??


  రిప్లయితొలగించండి
 11. బుడిబుడినడకలభారతి
  బడికివెడలుతల్లిఁదండ్రిబలిమినిబెదరన్
  సుడిగాకరోనదెబ్బకు
  "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"

  రిప్లయితొలగించండి


 12. అడుగిడగ కరోనాయే
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్
  దడియక పిల్లలు స్కైపుల్
  వడి యుపయోగించి యింట పాఠములరయన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. చం॥
  పుడమిని భీకరంబు విషపూరిత వైరసు వ్యాప్తి చెందగా

  వడిగ ప్రభుత్వమే తగిన బాధ్యత తోడుత బందు చేయగా

  నొడికిని దూరమైన.. తన బాలల ప్రాణము ముఖ్య మంచు నా

  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి


 14. అడుగిడగా కరోన జనులన్భయభీతుల చేయ జెచ్చెరన్
  బడులను మూసివేయఁగనె, భారతి మెచ్చెను మోదమందుచున్,
  జడియక పిల్లలెల్లరు ప్రసారపు మాధ్యమ మందు నేర్చుచున్
  వడివడి యింట నుండి చదువంగ నిదానముతోడు బుద్ధిగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. "అడుగిడగా కరోన జనులందఱ భీతుల జేయ..." అనండి.

   తొలగించండి


 15. భారతి అనే అమ్మాయికి నచ్చింది :) సో మెచ్చెన్  దడదడలాడించు కరో
  న డిగనురుకగా సెలవులనంగ జిలేబీ
  లిడను సమయము దొరుకగా
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 16. సుడిగాలివలె కరోనా
  వడిచుట్టుకొనగ జనులు నివాసమె గతిగా
  దడియగ, మేలొనరింపను
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. నడవడికయు,సుజ్ఞానము,
  చెడు మంచాదులను బోధచేయక తమ రా
  బడియె ప్రధానమనెడి మన
  బడులన్నియు మూతపడగ భారతి మెచ్చెన్.


  బాపట్ల సత్యనారాయణ సాయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మంచి+ఆదుల=మంచి యాదుల...' అవుతుంది.

   తొలగించండి


 18. మడి ఆచారము లన్నియు
  వడి జనులకవసరమాయె వార్ని కరోనా!
  దడిపించినావు కదుటే
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  అడుగిడె దేశమందొక మహావిలయాకృతి., దాని గెల్వగా
  గుడులను మూసినారొకఁట గుంపులుగా చరియింపరాదనన్
  వెడనది విస్తరింపకయె విజ్ఞతతోడ నరేంద్రమోది యీ
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. కడుపున పెరిగెడి పిండము
  పడగనె బడిలోనచేర్చ పాటుల గనుచున్
  దడపుట్టించే స్థితిగని
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి


 21. సడిచేసెడు ట్రాఫిక్కులు
  దడదడలాడించు రైలు తలపై బండ్లున్
  వడి చర్చి, మస్జిదు గుడులు
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. కం//
  గడబిడ కరోన జేయగ
  బడలిక జెందిన చదువరి ప్రార్ధన సలుపన్ !
  కడు చోద్యంబుగ భువిలో
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్ !!

  రిప్లయితొలగించండి
 23. బడబాగ్నిరగిల్చెకణం
  వడివడిగాప్రాకి పోయి ప్రళయమొనర్చన్
  బుడతల బ్రతుకులు పదిలమె
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్!!

  రిప్లయితొలగించండి

 24. నా పూరణ.
  **** **** **

  బడులవి రాష్ట్ర దేశ ప్రజ పాలన జేసెడి పెద్దవారి రా

  బడులను పెంచు గాని...కన భావితరమ్ముల దీర్చిదిద్దునే??

  బడులవి శ్రేష్ఠ విద్యలను పంచుచు బాలల వృద్ధి కించు దో

  డ్పడక మనోవికాసమును వాసి నొసంగునె?? యిట్టి వ్యర్థమౌ

  బడులను మూసివేయగనె భారతి మెచ్చెను మోదమందుచున్"


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 25. నడి రేయినబడి చదువులు
  బుడతడు ముందున నిలబడవుంచుట కొరకై
  నడిచెడిపోటీచదువుల
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 26. బడుగులపై భారముగా    
  బడులలొ నాంగ్లమ్ము నుంచి భాషను చంపన్                
  నుడువగ వలదన ఆంగ్లపు      
  "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"  

  రిప్లయితొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అడరుచు నెలకొని యుండిన
  బడులందున నార్జనమ్మె పరమము కాగన్
  అడదడ గూర్చిన క్రియతో
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 28. చెడుగు కరోనకు భయపడి
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్
  గడిపెద నికపయి సహజుల
  నడుమన నాటలు సలుపుచు నయముగ ననుచున్

  రిప్లయితొలగించండి
 29. వడిఁ వ్యాపించు కరోనా
  నొడుపుగ కట్టడిని సేయ నుర్వీతలమున్
  గుడులు, సినిమాలు సంతలు
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 30. అడుగులు తడబడ బుడతకు
  నడకను నేర్పింప చూపనాణ్యతకై మా
  బడికిన్ పంపమనెడి రా
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 31. దడపుట్టించు కరోనకు
  అడుగులు వేయగ, ప్రభుత్వఆజ్ఞకురాష్ట్రం
  గుడులన్నియు సకలముగా
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 32. రిప్లయిలు
  1. ఇడజాల కనంతేచ్ఛల
   గుడులన్నియు మూఁత పడగ గోపతి యలరెన్!
   బుడుతలకు మంచి నేర్పని
   బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్!

   తొలగించండి
 33. బడియనకాదురబంధన
  బడియనుబంధమునుజూడప్రకృతిగమారన్,
  బడులనువికృతిగమార్చెడి
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అడరుచు వీధి కొక్కటిగ నంటి ధనమ్మును గుంజి సాగుచున్
  తడబడు రీతి బోధనల తారెడి సంస్థల నెంచి వాటిని
  న్నడదడి కోపమున్నదలి యాజ్ఞలు జేయుచు మందలించుచున్
  బడులను మూసివేయగనె భారతి మెచ్చెను మోదమొందుచున్.

  రిప్లయితొలగించండి
 35. బడులన నేర్చు విద్యను శుభంబుకు,లోకహితంబుకే యనన్
  చెడునకు వాడి నాశనము చేయు కరోనను సృష్ఠి చేయగన్
  పడియది బిడ్డలెందరినొ బాధలొనర్చుట జూచి ఖేదమై
  బడులను మూసివేయగనె భారతి మెచ్చెను మోదమందుచున్


  బాపట్ల సత్యనారాయణ సాయి

  రిప్లయితొలగించండి
 36. వడిగా కరోన విరుచుకు
  పడగా తట్టుకొనలేక ప్రజలల్లాడన్
  కడువెస పిల్లల కావగ
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 37. అడ లి కరోనా దెబ్బకు
  కడువడి బాలలను గాచు కాంక్ష యె హెచ్చ న్
  తడ యక నిర్ణయ మున్ గొని
  బడు లన్నియు మూత బ డగ భారతి మెచ్చె న్

  రిప్లయితొలగించండి

 38. ఇడుముల గల్గజేయుచును నిమ్మహి నందు కరోన భూతమే

  వడివడిగా జెలంగి తన బాహుల జాపుచు వ్యాప్తి జెంది తా

  జెడుగుడులాడి మర్త్యులు నశించగ మారణకాండ సల్పగన్

  గుడులు, ప్రభుత్వ సంస్థలను , కొట్టులు, కోర్టులు,వాహనమ్ములన్

  బడులను మూసివేయగనె భారతి మెచ్చెను మోదమందుచున్"


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 39. పడగతొనున్న కరోనకు
  బడులన్నియు మూఁతపడఁగ, భారతి మెచ్చెన్
  చెడుయును,అనువేదనిచె
  ప్పుతాతబామ్మయుతనమనవులతో నుండన్

  రిప్లయితొలగించండి
 40. వడగాడ్పుల సెగలు పెరుగ
  బుడతలు దాటక గడపను బుధ్ధిగ నింటన్
  గడుపగ దినములు చల్లగ
  "బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"

  రిప్లయితొలగించండి
 41. వడివడి విస్తరించెనది ప్రాణములన్ హరియించు రోగమై
  గడసరిదౌ కరోన నిక కట్టడి చేయు పథమ్మదె లాకుడౌనుతో
  గుడులును మండపమ్ములును కూరలు నమ్మెడు సంతలన్నియున్
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 42. జడులందఱుగుమిగూడిరి
  బడులన్నియుమూతపడగ,భారతిమెచ్చెన్
  చెడుదియకరోనబారిని
  పడకనుగాపాడుకతనప్రభువులపనికిన్

  రిప్లయితొలగించండి
 43. *వేదన
  పలుక రాక ముందె పసిపాప పోవలె
  తల్లి చేయి వీడి తాను బడికి
  ముద్దు తీర కుండ ముందస్తు ముచ్చట?
  తెలివిఁ దెచ్చు కొనుము తెలుగువాడ!

  ముందస్తుముచ్చట = ప్రీస్కూల్

  **************

  *పూరణ (స్వప్నము)

  గడుసరులైన వర్తకులు గట్టిరి యా శిశు పాఠశాలలన్
  బడిపడి తల్లిదండ్రులును బాసట యైరి సుఖాల భ్రాంతిలో
  బుడుతల కాటపాటలను బూర్తిగ దూరము సేసినట్టి యా
  "బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్"

  రిప్లయితొలగించండి
 44. గడగడమనివణికించెడి
  చెడురక్కసియగుకరోనచిందులగాంచన్
  చిడిముడిపడుచిన్నారుల
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 45. వడిగ కరోన మానవుల పైబడి యారడి పెట్టు చుండగా
  గడగడలాడు చుండ ప్రజ కాంచి, ప్రభుత్వమె యెంచి గండమున్
  యడచ కరోన ముప్పువడి నన్నివిధమ్ముల కావ పిల్లలన్
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్
  అసనారె

  రిప్లయితొలగించండి
 46. పూజ్యులకు నమస్సులు

  జడవక చదువుకు పిల్లలు
  నెడతెగక చదివిరి వ్రాయ నిచట పరీక్షల్
  వెడలగ వేసవి విడుపుకు
  బడులన్ని యు మూత పడగ భారతి మెచ్చెన్
  ***

  మరో ప్రయత్నం...

  వడిగ నెలకొల్పె నెన్నో
  బడులను సామర్ధ్యము కరువయు గడబిడగన్
  నడుప వలదనె ప్రభుత, యా
  *బడులన్నియు మూత పడగ భారతి మెచ్చెన్*

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

  రిప్లయితొలగించండి
 47. బడులనపూర్వకాలమునపాతబడుల్ చదువన్నదైవమే
  బడిగుడియైతరించెగురుభావముమెండుయదిప్పుడంతమై
  బడియనచుల్కనైవగచెప్రాప్తిఁగరోనచెలంగదేశమున్
  "బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 48. బడుగుల జీవితాలకును భారము నయ్యను నాకరోనయున్
  పిడుగుల లాంటి పిల్లలకు బెద్దగు చద్వులు కష్టమాయెగా
  చెడుగుడు లాటియాటలకు చెంగున బోవుట సాధ్యమౌదులే
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 49. కడఁగి రఘురామ సన్నిభుఁ
  డొడయుఁ డొకం డిటఁ జదువుల నూఱక నీయం
  గడు దిట్ట పంపు నిడ రా
  బడు లన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్


  పడఁతులు పూరుషోత్తములు పన్నుగ నింటను జిక్కియుండఁగా
  నడలుచు వింత జీవికిని నాత్రము చిత్తము నందు రేఁగఁగన్
  గడుసరి పిల్ల యల్లరిది గంతుల కంత మెఱుంగ నంచు నీ
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 50. జడులుగమారిరందఱునుచయ్యనమూలనువైచెబొత్తముల్
  బడులనుమూసివేయగనె,భారతిమెచ్చెనుమోదమందుచున్
  జడిసియునాకరోనకునుజయ్యనమూయగబాఠశాలలున్
  బడులనుమూయకుండునెడబాలలురోగముబారినొందుసూ

  రిప్లయితొలగించండి
 51. మడుగులు నొత్తుటీచరుకుమార్కులు వేయుటసంస్క్రుతబ్బగా
  బడులకు వెళ్ళుపిల్లలకుపాఠమురాకయుమందబుద్ధులై
  చెడుఅలవాట్లుఅబ్బిబడిచేరిన పిల్లలతల్లిదండ్రులున్
  బడులను మూసివేయఁగనె, భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 52. చం.

  గడగడ లాడ జేయు నొక గండరగండ కరోన వైరసున్
  బడబడ బారకుండ పెను బాసట నిల్వ ప్రభుత్వ సంగతిన్
  బుడిబుడి మాటలాడు పసి బుద్దుల రక్ష కనుంగు రీతినిన్
  బడులను మూసి వేయగనె భారతి మెచ్చెను మోదమొందుచున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 53. గొడవే గద పిల్లలతో
  బడులన్నియు మూఁతపడఁగ; భారతి మెచ్చెన్
  గడపను దాటక పాఠము
  లొడుపుగ నేర్పించు నవ ప్రయోగముల గనన్

  రిప్లయితొలగించండి
 54. అడుగులు వేయ బూనగనె
  యందరు గూడి వరాల బిడ్డకున్
  నడుములు క్రుంగు బర్వునిడి నైజముదప్పి శ్రమంబునిచ్చి యా
  బుడుతని స్కూలుకంప, గని, భూతలమందు విచిత్ర రోగమున్
  బడులను మూసివేయఁగనె,
  భారతి మెచ్చెను మోదమందుచున్!

  రిప్లయితొలగించండి
 55. కందం
  నడతురు గుంపుగ పిల్లలు
  గుడుతురు తము పంచుకొంచు కూడునటంచున్
  బడతురు కరోన యంచున్
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  చంపకమాల
  నడతురు గుంపుగా బడికి నల్వురు మించుచు బాల బాలికల్
  గుడుతురు పంచుకొంచు తము కూడగ దెచ్చిన నోగిరమ్ములన్
  బడతురు మాయరోగమని పాలకు లెల్లరు నిశ్చయించుచున్
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్!

  రిప్లయితొలగించండి
 56. తడబడుచున్ భుజాగ్రమున తద్దయు క్రుంగిలి పుస్తకాలతో
  వడివడి పాఠశాలలకుబాయక పోదురు బాల బాలికల్
  గడబిడగాకరోన యనుకంపనజూపక రెచ్చిపోవగన్
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 57. ఎడయక నెల్ల బాలురకునీప్సితమౌ చదువెల్ల నిష్టతో
  నుడువుచు బీదసాదలకనూనపు భోజనమందజేయుచున్
  విడివడె దుష్ట భావనలు వేలును కోట్లగు నక్రమంపు రా
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్

  రిప్లయితొలగించండి
 58. కడివెడు చదువుల కొరకని
  మడిగట్టుకు చదివి నంత మాన్యులు కాగా
  పడి పూజలు మిక్కుటముగ
  బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 59. వడిగా వచ్చిన వైరసు
  జడుపును కల్గించుచుండ జవముగ ప్రభుతే
  తడబడక దానినణచగ
  బడులన్నియు మూతపడగ భారతి మెచ్చెన్
  మరొకపూరణ

  సడిచేయకవచ్చిజనుల
  కడు భీతులుగానుచేయ గడబిడ పడుచున్
  గడపలు దాటని స్థితిలో
  బడులన్నియు మూతపడగ భారతి మెచ్చెన్

  రిప్లయితొలగించండి
 60. సడలని తాళముo గనుము సన్నగిలెన్ గద త్రాగుబోతు లీ
  పుడమిని 'మందు' లేక చెడిపోవుట, యేలెడు వారి కెంతయో
  సిడిముడి యైన గాని శ్రమ జీవుల రక్తము బీల్చు మత్తు రా
  బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్.

  రిప్లయితొలగించండి