9, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3334 (రాతికిఁ బెండ్లి యయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా"
(లేదా...)
"రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్"

92 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  భవిష్య పురాణము
  (నా తదనంతరం)

  నేతగ కాంగ్రెసున్ తనరి నెగ్గుచు నెన్నిక లన్నియున్ సదా
  భీతిని వీడుచున్ వడిగ పేరును పొంది ప్రధానమంత్రిగా
  ప్రీతిని రోమునన్ జనుచు వేదపు రీతిని భాజపా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  భాజపారాతి = భాజపా + ఆరాతి
  (అన్యదేశ్య సవర్ణదీర్ఘ సంధి)

  రిప్లయితొలగించండి
 2. చేతిం గొనుమన రుక్మిణి,
  నాతి మనోరథము దీర నర్మిలిఁ గొనిరా
  గా తాఁ గృష్ణుడు! రుక్మ్యా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  లోకాభిరామాయణం:

  నాతిని కూల్చుచున్ మిగుల నందము నిచ్చుచు మౌనివర్యుకున్
  ప్రీతిని త్రుంచుచున్ శివుని విల్లును మేదిని దద్దరిలగా
  సీతమ తోడ రామునికి;...శిక్షను మాపుచు మోక్షమీయగా
  రాతికిఁ;...బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 4. చేతమునందు మూర్తిని సజీవముగా నెలకొల్పి, ధ్యానముం
  దాఁ తనువూ మనస్సులను త్ర్యక్షుని కంకితమిచ్చి, కాముఁచే
  యాతని చిత్తమందు కడు యాదట నింపు నపర్ణ కంధకా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండుచోట్ల అర్ధానుస్వారాలను అనవసరంగా పెట్టారు. 'తనువూ' అనడం వ్యావహారికం. "కాముచే నాతని... కడు నాదట..." అని ఉండాలి.

   తొలగించండి

 5. నా పూరణ. ఉ.మా.
  **** **** **

  నాతి విధర్భ దేశ భువి నాథు సుపుత్రిక రుఖ్మిణమ్మనే...

  ఖ్యాతిగ రుఖ్మి గెల్చి యని...స్యందన మందున దెచ్చె ద్వారకున్

  పూతననిన్ వధించిన ప్రభుండుయె..;రుఖ్మిణి తోడ నా మురా

  రాతికి బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రుక్మిణి+అమ్మ' అన్నపుడు సంధి లేదు. "రుక్మిణీ సతిన్" అనండి. 'రుక్మి' అనడం సాధువు. 'ద్వారకకున్' అనడం సాధువు.

   తొలగించండి
 6. (బాణాసురుని కుమార్తె ఉషకు, ప్రద్యుమ్నుని కుమారుడు
  అనిరుద్దునికి శివకేశవుల సన్నిధిలో సంపన్నమైన కల్యాణం )
  రాతిరులుం బవళ్లు మధు
  రాధిపు మన్మని రూపురేకలన్
  జేతమునందు నుంచుకొను
  చెల్వము చిందు నుషాఖ్యకన్యకున్
  బ్రీతిగ జేయిసాచి మురి
  పెమ్ముల బంచిన బాణరాక్షసా
  రాతికి -బెండ్లి యయ్యెనట
  రమ్యముగా జనులెల్ల మెచ్చగన్ .
  (మధురాధిపు మన్మడు -శ్రీకృష్ణుని పుత్రుడైన ప్రద్యుమ్నుని పుత్రుడు;
  బాణరాక్షసారాతి-బాణాసురుని శత్రువైన అనిరుద్ధుడు )

  రిప్లయితొలగించండి
 7. వాతిని చూసిన దోషము

  పోత శమించి, మణి తోడ పురముకు జేరన్,

  నాతి మణులతో కంసా

  రాతికి బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా

  సత్యభామ ,జాంబవతి లతో‌ వివాహ సందర్భం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పురమును జేరన్' అనండి. 'వాతి' శబ్దానికి 'బాటసారి' అని రూఢ్యర్థం. పర్యాయపద నిఘంటువును ప్రమాణంగా తీసికొనరాదు.

   తొలగించండి


 8. ప్రీతిని భళి మనువాడగ
  నాతని చేయగ తపమ్ము నాతియు భళిరా
  జోతల కిరాతికి పురా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. రీతిగ మానసమ్మును పరీక్షయు చేయుచు నేండ్లకొద్దిగా
  జోతల తో కఠోరముగ జోగిని యై దృఢమైన లక్ష్యమై
  నాతియె చేయగా తపము నాతని పెన్నిధి గా భళా పురా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. చేతములుల్లసిల్లువిధి శ్రీప్రదుడౌ రఘురామమూర్తికిన్
  భూతలమందు చైత్రమున ఫుల్లసరోజముఖావనీజతో
  నాతతభక్తియుక్తులగు నార్యగణంబులమధ్య దానవా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 11. చేతులు చరచిరి యప్పుడు
  చేతము లుప్పొంగ కనిరి శివపార్వతులన్
  భూతము లాడంగ పురా
  రాతికి పెండ్లయ్యె మిగుల రమ్యముగ నహో

  రిప్లయితొలగించండి
 12. ప్రీతిన గొనుమని యగ్ని
  ద్యోతను రుక్మిణి బనుపగ తోయజ నేత్రుం
  డేతెంచికొనగ కంసా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  ఆతతదివ్యలక్షణసమన్వితుడై రఘురామమూర్తి భూ...
  జాతను పెండ్లియాడునని సంబరమందుచు నొంటిమిట్టకున్
  ప్రీతిగ జేరిరందరును వేడుక జూడగ., లోకకంటకా...
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్!!

  రెండవపాదంలో... *ఒంటిమిట్టకున్*... పాఠాంతరము.. *భద్రశైలమున్*

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. ప్రీతిగ రుక్మిణి బంపగ
  దూత యె తెలుపగ వెడలియు దోర్బల శక్తి న్
  నాతిని చేకొన కం సా
  రాతికి బెండ్ల య్యె మిగుల రమ్యముగ నహా

  రిప్లయితొలగించండి
 15. పాతుకు బోయిన నమ్మిక
  రీతి వివహము కొనసాగలేదని యనిన్
  జాతి రివాజు ప్రకారము
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా

  రిప్లయితొలగించండి
 16. ఆతడు నాస్తికుండు పరమాత్ముడు లేడనువాడు మూర్ఖతన్
  భూతలమందు విగ్రహము పూజల నందుట దూరువాడు గ
  ర్వాతిశయంబునన్ బలికె నాసభలోపల "దేవళంబునన్
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్"

  రిప్లయితొలగించండి
 17. ప్రీతీ! వినవే, సద్యో
  జాతుని చాపమ్ము విరువ సద్గుణవతియౌ
  సీతమ్మ తోడ దనుజా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహో

  రిప్లయితొలగించండి
 18. కం//
  కోతిని వెడలక గట్టిరి
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా !
  వ్రాతను చెరుపుట తరమా
  బాఁతిని జెందితి నిజముగ బ్రహ్మకు దెలుసా !!

  రిప్లయితొలగించండి
 19. ఉత్పలమాల
  ఉత్పలమాల
  భూత గణాధిపా రయమె బ్రోవుమటంచు సురల్ నుతించఁగన్
  ఘాతక తారకాసురుని గర్వమడంచ తదీశ్వరాంశ సం
  భూత కుమార సంభవముఁ బూనికగా నుమతోడ మన్మథా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 20. అందరికీ నమస్సులు 🙏🙏

  *కం||*

  జాతికి బరువని తలచిన
  నీతియునియమములు లేని నీచుండే తా
  రాతను మార్చగ మ్రొక్కెను
  *"రాతికిఁ, బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 21. మోతగ శివకళ్యాణము
  దాతలు శివరాతిరికిని తలచిరి చేయన్ |
  మాత, మహేశ్వరికి పురా
  "రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా"

  రిప్లయితొలగించండి
 22. శీతనగాధిరాజ సుత చిన్మయరూపుని చిద్విలాసునిన్
  భూతగణాధినాధు బరిపూతమనస్కుని నమ్మి గొల్వగా
  నా తరుణేందుమౌళి దరళాక్షిని దా వరియించె నంధకా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 23. కం:పూతన ప్రాణహరుండీ
  భూతలమందు జనియించి భూదేవునకున్
  ప్రీతిగవరమిడిన‌ మురా
  *రాతికి బెండ్లయ్యె మిగులు రమ్యముగనహా*

  కం:సీతను పరిణయమాడగ
  భూతల మందవతరించి భూతేశు విలున్
  ప్రీతిగ విరిచిన నసురా
  *రాతికి బెండ్లయ్యె మిగులు రమ్యముగనహా*

  కం:భూతేశుడు వనమందున
  శీతాచలసుతనుగాంచి చేకొన నెంచెన్
  మాతయు నొప్పంగ పురా
  *రాతికి బెండ్లయ్యె మిగులు రమ్యముగనహా*

  మరొక పూరణ
  ఉ.మా:భూతల మందు శిష్టులను బ్రోవగ పుట్టిన రామచంద్రుడే
  భ్రాతను గూడియా పతిత పావన మూర్తి యు మౌని యాజ్ఞచే
  నాతిగ మార్చుచున్ శిలనునంతకు విల్లును ద్రుంచ దానవా
  *రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్"*

  రిప్లయితొలగించండి
 24. కందం
  కందం
  చేతన నహల్య కొసఁగి వి
  ఘాతమున హరువిలుఁ ద్రుంచి కన్నియ కుజతోఁ
  బ్రీతి రఘుపతికి దనుజా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!

  రిప్లయితొలగించండి
 25. నాతి మరాఠి తనకు గుజ
  రాతికిఁ బెండ్లయ్యె, మిగుల రమ్యముగ నహా
  జాతి కొసగె వ్యాపారపు
  రీతియు ధీరత నెఱుఁగు శరీరజు డొకనిన్౹౹

  రిప్లయితొలగించండి
 26. ఉ:

  నీతికి నిల్చి నాడిలన నిశ్చల చిత్తము నెల్ల వేళల
  న్నూ తము నేటికిన్ జనుల నూహల తీరము శీల మెంచగన్
  జాతికి రామ రాజ్యమును జ్ఞప్తికి దెచ్చెడి సూత్రధారి నా
  రాతికి బెండ్లి యయ్యె నట రమ్యము గా జనులెల్ల మెచ్చగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 27. కందం
  కందం
  ప్రీతిగ నగ్నిద్యోతను
  చేత వలపు వార్తనంపఁ జెలి రుక్మిణి సం
  ప్రీతి హరి ముగింపన త
  ద్భ్రాతికిఁ, బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా!

  భ్రాతి = A great matter or affair (ఆంధ్ర భారతి)

  రిప్లయితొలగించండి
 28. గురువు గారికి నమస్సులు.
  నూతన కవియున్ వ్రాసెను
  రాతికి బెండ్లయ్యె రమ్యముగ నహో
  రాతిని నాడది చేసిన
  సీతాపతికి శతనమస్సుశ్రీఘ్రంబయ్యెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కవి రచియించెను.. మిగుల రమ్యముగ... రాతిని మగువగ జేసిన... సీతాపతికిన్ నమస్సు శీఘ్రం బిడుదున్" అనండి.

   తొలగించండి
 29. గీతకు మిత్రు డొక్కడును గేహము నందున విందు జేయగా
  కాతర మందె నా యువతి గాన్చెను మిత్రడు యూరడించి యా
  జేతులు జాచ కౌగిటను జేరెను ప్రేమతొ పెద్దలొప్ప నా
  రాతికి బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మిత్రుడు + ఊరడించి' అన్నపుడు యడాగమం రాదు. 'ప్రేమతొ' అని తో ప్రత్యయన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

   తొలగించండి
 30. నాతియపార్వతికిపురా
  రాతికిబెండ్లయ్యెమిగులరమ్యముగనహో
  ప్రీతినిజల్లిరిపూలను
  చేతోమోదమ్ముగలుగసైరిభవాసుల్

  రిప్లయితొలగించండి
 31. చూతము రండి వినోదము
  ప్రీతిని జగతిఁ బరికించి వేడుక మగదౌ
  బాతును నుంచ సరసి వా
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా

  [వారు +ఆతి వారాతి; ఆతి = ఒక జాతి బాతు]


  భూతల రక్షణార్థము నభోధవు నానతి నుత్సహించి తా
  నాతత పుష్ప బాణముల నక్షరుఁ గ్రుచ్చ మనోజ బాణ సం
  పాత సుతప్త శంభురత పార్వతి వేఁడఁగ మత్స్యలాంఛ నా
  రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్

  రిప్లయితొలగించండి
 32. భూతలనాధుడేతనకువోఢగగోరినగౌరికిన్ పురా
  రాతికిబెండ్లియయ్యెనటరమ్యముగాజనులెల్లమెచ్చగన్
  నాతులగోరికల్మిగులనచ్చిననట్లుగదీర్చుచోభువిన్
  రోతలులేనిదైదనరిఱొచ్చులులేకనునుండ్రుహాయిగన్

  రిప్లయితొలగించండి
 33. భీతి యెఱుంగనట్టి రణ భీముడు సూర్యకులోద్ధవుండటన్
  చేతను విల్లు బట్టుకుని సింజనిఁ లాగిన తక్షణంబదే
  మ్రోతిడి విర్గ మోదమున ముగ్ద యయోనిజ తోడ దానవా
  రాతికిఁ బెండ్లియయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్.

  రిప్లయితొలగించండి
 34. మిత్రులందఱకు నమస్సులు!

  [ప్రద్యుమ్నుఁడు శంబరాసురుని సంహరించి, దానవ నాశమునకై తనకు సహకరించిన (మాయవతిగా మాఱిన) రతీదేవిని వివాహమాడిన ఘట్టము]

  పాతకుఁడైన శంబరుని వధ్యునిఁ జేసియు, దైత్యసైన్యమున్
  బ్రేతగతం బొనర్చి, తన ప్రేమను బొందిన కన్యకన్ రతిన్
  మాతకు రుక్మిణీసతికి మన్మథుఁ డప్పుడు సూప, శంబరా

  రాతికిఁ బెండ్లి యయ్యెనఁట రమ్యముగా జనులెల్ల మెౘ్చఁగన్!

  రిప్లయితొలగించండి
 35. ఒకానొక వనితకు చాలా కాలంగా ఎన్ని పెండ్లి ప్రయత్నాలు చేసినా, పెళ్లి కుదిరని సందర్భంలో, రాళ్లకు పెళ్లి చేసినచో, ఆమెకు దోషములు తొలిగి త్వరలో పెండ్లి అగునని తెలిసి రాళ్లకు వైభవంగా పెళ్ళి నిర్వహించారని.. *పూరణ*

  కం.
  నాతికి దోషములన్నియు
  రాతికి బెండ్లిజరిపన పరారగు ననగా
  ప్రీతిగ సమ్మతి దెలిపిరి
  రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా

  రిప్లయితొలగించండి
 36. రాతినినాతిజేసెనని,రాజ్యమునంతయుమెచ్చుచుండగా
  ఖ్యాతిగడించెరాఘవుడు, కానలకేగిన ధర్మమూర్తిగా
  భీతియెగ్రమ్మ రావణుని, భీకరపోరునగెల్చినట్టి దానవా
  రాతినిపెండ్లియాడెనటరమ్యముగాజనులెల్లమెచ్చగా
  +=+++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 37. మాతృక కోరశంకరుని మన్మథుడేసెను పంచభాణముల్
  చేతము లోన కింకడర చెచ్చెర చంపి యనంగునుగ్రుడై
  యా తిగకంటి ప్రేమమున హైమవతిన్ గని మెచ్చగా పురా
  రాతికి బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 38. ఘాతకి తాటకను దునిమి
  రాతికి శాపమును బాపి రయమున ధనువున్
  ప్రీతిగ ద్రుంచిన నసురా
  రాతికి బెండ్లయ్యె మిగుల రమ్యముగనహో!

  భీతిని గొల్పుచు నఖ సం
  ఘాతముల నసురునిజంపి గాండ్రించు నరున్
  ప్రీతిని ప్రసన్నుజేయ కి
  రాతికి బెండ్లయ్యె మిగుల రమ్యముగనహో!

  శీతమయూఖునిన్ గెరలు చిన్మయరూపుడు రామమూర్తి యా
  ఘాతకి తాటకన్ దునిమి గాధిమునీశ్వరు నాఙ్ఞమేరకే
  ప్రీతిని ద్రుంచగా హరునివిల్లును మైథిలితోడ దానవా
  రాతికి బెంండ్లియయ్యెనట రమ్యముగా జనులెల్లమెచ్చగన్

  రిప్లయితొలగించండి
 39. గురుతుల్యులందరికీ వందనములు 

  నా ప్రయత్నము 

  చేతికొలంది పూజలను చేసిన వారలె; నవ్య భక్తితో         
  కైతలు వ్రాయుచుంటియిల కౌముది తీరము నుండినట్లుగా  
  సీతను పెండ్లి కూతురిగ శ్రీకర రాముని నిల్పినట్లుగా    
  రాతికి బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చగన్

  కస్తూరి శివ శంకర్

  రిప్లయితొలగించండి
 40. పాతను తోసిరాజనుచు, పావనమాయెను రామరాజ్యమే
  సూతమహామునే భువిన , సూక్తులుజెప్పగనమ్మిరందరున్
  సీతయె గొప్పసాధ్వియని . శ్రీకరమొప్పగజేయ దానవా
  రాతికిపెండ్లియయ్యెనట, రమ్యముగాజనులెల్లమెచ్చగన్
  ++++++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి