22, డిసెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3582

23-12-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బుద్ధిని విడి రాముఁ డందె భూమిజ కరమున్”

(లేదా…)

“బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్”

69 కామెంట్‌లు:

  1. యుద్ధమురాకడతెలియక
    బద్ధుడునైజనకుతనయపావనిసీతన్
    పద్ధతిపెండిలియాడెను
    బుద్ధినివిడిరాముడందెభూమిజసీతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అన్వయమే కుదరలేదు. సమస్య కూడా పరిష్కరింపబడినట్లు లేదు. "...పెండిలి యాడె కు।బుద్ధిని..." అంటే కొంత నయం.

      తొలగించండి
    2. అవునండిమరలప్రయత్నంచేస్తాను

      తొలగించండి
    3. బద్ధుడుమానవజన్మకు
      పద్ధతితాఁబెండ్లియాడెపావనిసీతన్
      తద్దయురాక్షసులనియిరి
      బుద్ధినివిడిరాముడందెభూమిజకరమున్

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      పద్ధతిగన్ వానర సై
      న్యోద్ధతి లంకేశుఁగూల్చి, జ్యోతిన్ దేలన్
      ముద్దియ లోకులదౌ దు
      ర్బుద్ధిని విడి రాముఁ డందె భూమిజ కరమున్

      ఉత్పలమాల
      పద్ధతిఁ దప్పి రావణుఁడుఁ బావని సీతను లంక నుంచ స
      న్నద్ధముఁ జేసి వానరుల, నాశము జేసి, పరీక్షఁ గోరఁగన్
      ముద్దియ తేల నగ్ని పువుమొగ్గగ నిందలు వేయు లోక దు
      ర్బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. బద్ధుడగునట్టి వాడై
    పద్ధతిగొని జీవితమున ప్రాపును గొనగన్
    నుద్ధతి లేకయె నాదు
    ర్భుద్ధిని విడి రాముఁడందె భూమిజకరమున్!!

    రిప్లయితొలగించండి
  4. చాకలి తిప్పడు మామతో
    మొద్దును కాను నేను కడు పోటుమగండ గ్రహింపజాల నీ
    ముద్దుల పుత్రిఁ దీసికొని పొమ్మిక నాదు గృహమ్ము వీడుచున్
    హద్దులుదాటి రావణుని యావసథమ్మున నున్న పత్ని స
    ద్బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్

    రిప్లయితొలగించండి
  5. శ్రధ్ధ సమన్వితు డగుచును
    శుధ్ధ పు హృదయమ్ము తోడ శూరుడు సభలో
    క్రుద్ధత న ణ o చి తా దు
    ర్బుద్ధి ని విడి రాము దందె భూమిజ కరము న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శ్రద్ధా సమన్వితు డగుచు" అనండి.

      తొలగించండి
  6. వందనమిడె రామునకు నా‌ వాలి తుదకు

    నెమ్మి తో తన దుర్బుద్దిని విడి, రాము

    డందె భూమిజ కరమున్ కటంకటంపు

    శుధ్ద యై వచ్చి నిలబడి జోత లిడగ


    కటంకటము = అగ్ని

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    బుద్ధిగ శంకరు దల్చుచు
    పద్ధతిగా శివధనువును పైకెత్తియు తా
    నుద్ధతి నొందించెడు దు
    ర్బుద్ధిని విడి రాముడందె భూమిజ కరమున్.

    రిప్లయితొలగించండి
  8. బద్ధతసత్యసంధతయుపావనమూర్తికిశోభఁదెచ్చుగా
    క్రుద్ధుడుగాకభావమునక్రుంగకసాజపుమానవుండునై
    యుద్ధముజీవునాత్మకనునూహనుతావిధివంచితుండునై
    బుద్ధినివీడిరాముడువిమోహితుడైగ్రహియించెజానకిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరించిన తీరు అర్థం కాలేదు.

      తొలగించండి
    2. ఆమెవలనయుద్ధంవస్తుంది, అనితెలిసినా, మానవస్వభావంతోవిధివంచితుడైసీతనుగ్రహించెను

      తొలగించండి
  9. అద్ధరణీసుతన్ గనిన యంజని పుత్రుడు చెప్పినంతనే
    యద్దనుజాధముండనట యంతము సేసెమహోగ్రమూర్తియై
    యుద్ధమునందు, కాముకుడు యోషితఁ బంధిని చేసెగాదె తా
    బుద్ధిని వీడి, రాముఁడు విమోహితుఁ డై గ్రహియించె జానకిన్.

    రిప్లయితొలగించండి
  10. అద్ధరణిజఁ జెరపట్టగ
    బుద్ధిని విడి, రాముడందె భూమిజ కరమున్
    యుద్ధమున గూల్చి దుష్టుం
    డద్దనుజుడు రావణుడను హరిపటలముతో.

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పద్ధతియైన గాధిజుని పల్కుల నాజ్ఞగ స్వీకరించి తా
    బుద్ధిగ శంకరున్ దలచి పొందుగ నాతని చాపమెత్తియున్
    ఉద్ధతి లేని చిత్తమున యుర్విని తానె వరీయుడన్నదౌ
    బుద్ధిని వీడి రాముడు విమోహితుడై గ్రహియించె జానకిన్.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ నమస్సులు🙏
    తగవు చెప్పే పెద్దమనుషుల తో చాకలి వాని మాటలు....

    మొద్దును కాను వినగ మీ
    సుద్దుల, నగ్నిన్ గడుగుచు శుద్ధత నమ్మన్,
    పెద్దల తీరది, సంశయ
    *బుద్ధిని విడి రాముడందె భూమిజ కరమున్*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  13. రాముడు, జానకి సామాన్యులు గా ఈ నా ప్రయత్నము:

    ఉ:

    వద్దని చెప్పు కోపమున, వచ్చెడు పెండిలి దిర్గబంపుచున్
    ముద్దుగ నున్న కన్యకయె పూనిక తోడు లభించు నంచనన్
    హద్దులు దాటు ప్రాయమున యంగన చిక్కుట దుష్కరంబనన్
    బుద్ధిని వీడి రాముడు విమోహితుడై గ్రహియించె జానకిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. పెద్దలుసమ్మతిదెలుపన్
    శ్రద్దగతావిల్లువిరిచిచక్కగనపుడున్
    శుద్దమనంబునసంశయ
    బుద్దినివిడిరాముడందెభూమిజకరమున్

    రిప్లయితొలగించండి
  15. బుద్ధిని వీడి రాముడు వి
    మోహితుడై గ్రహియించె జానకిన్

    ( గురువు ప్రశ్నలు - శిష్యుల సమాధానాలు )

    " శుద్ధమనంబునన్ బదులు
    సొంపుగ బల్కుడు ; సత్య ధర్మసం
    బద్ధము రామకావ్యమున
    బాత్రలు రాముడు రావణాసురుల్
    యోద్ధల గూర్చి " ; " మోహితు డ
    యోనిజ రావణు డాహరించెనే
    బుద్ధిని వీడి " ; " రాముడు వి
    మోహితుడై గ్రహియించె జానకిన్ . "

    రిప్లయితొలగించండి


  16. అద్ధరణిజను హరింపగ
    బుద్ధిని విడి, రాముఁ డందె భూమిజ కరమున్
    యుద్ధమున రావణుని దు
    ర్బుద్ధి‌ని నడచి మన దేశపు పురాణమునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. పద్ధతిగ రామచరితను
    బద్ధుడయి చదువ దాని వావిరి నడుగన్
    బుద్ధిరహితుడిట్లు దెలిపె
    “బుద్ధిని విడి రాముఁ డందె భూమిజ కరమున్”

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    ఒక పౌరుడు...

    ఇద్ధర ధర్మమౌనె? యిది యెక్కడి నీతి ? పవిత్రమైనదౌ
    పద్ధతియే? పతిన్ విడిచి పత్ని మరెచ్చటనో వసింప! నా
    బుద్దికి దోసమిద్ది., చను! పొమ్మిక! తానొక వెఱ్ఱి కావునన్
    బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. ఉద్ధతి నీశచాపదళనోన్నతకీర్తి
    రఘూత్తముండునా
    శుద్ధమనస్వి మైథిలి నశోకవనాంతరవాసదుఃఖసం
    బద్ధను నగ్నిపూతను వివాదనివర్తితనున్ గుతర్కదు
    ర్బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  20. బుద్ధి కగోచరుండిహపు బుద్ధి కతీతుడు సత్య ధర్మపుం
    బుద్ధికి బద్ధుడద్ధరజ బుద్ధి హృదాలయ సంస్థితుండు స
    న్నద్ధుడు మైథిలీ హృదయ నామరసార్ణవ సోము డాంధ్యపుం
    *“బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్”*

    రిప్లయితొలగించండి
  21. పద్ధతియౌ ప్రణాలికన పార్థివి నెత్తెను రావణుండహో
    బుద్ధిని వీడి ; రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్
    సిధ్ధము జేసి వానరుల సేనల తోడుగ లంకకేగగన్
    యుద్ధము నందు నాయసుర యోధుని జంపగ నెల్లమె చ్చగన్

    రిప్లయితొలగించండి
  22. శ్రద్ధాళువు మున్యాజ్ఞకు
    బద్ధుండై పూని శూలపాణి ధనువునన్
    బ్రద్దలు సేసియు స్వేచ్ఛా
    బుద్ధినివిడి రాముడందె భూమిజ కరమున్

    తండ్రి అనుమతితోనే సీతను పెండ్లాడాడని భావన! 🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృద్ధత, సోదరీమణికి కీడును సేసిన
      రామయోగికిన్
      బుద్ధిని జెప్పగాదలచి పూనిసుశీలను
      దొంగలించె స
      ద్బుద్ధిని వీడి; రాముడు విమోహితుడై
      గ్రహియించె జానకిన్
      పద్ధతిగా రణంబునను పాపినిజంపి
      యశః కరంబుగన్

      విమోహితుడు = మోహము లేనివాడు

      తొలగించండి
    2. వృద్ధుడు తండ్రిమాటవిని ప్రీతిని కానల కేగనెంచగా
      సిద్ధము తానునంచు సతిసీతయె బల్కగ, కష్టమెంచుచున్
      వద్దని నెంతజెప్పినను వాదము
      సేయగ జూచి మూర్ఖపుం
      బుద్ధినివీడి రాముడు విమోహితుడై
      గ్రహియించె జానకిన్

      మూర్ఖపు బుద్ధి = మొండిపట్టు

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "వద్దని యెంత..." అనండి.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

      తొలగించండి
  23. పూరణ
    ---------------------------------------------
    కం.
    హద్దులు దాటిన రావణ !
    దిద్దుకొ నీ తప్పులనగ దిగెనే రణమున్
    పొద్దులు తిరుగక శాంతము
    బుద్దిని విడి రాముడందె భూమిజ కరమున్
    ---------------------------------------------
    - గానుగుల
    విజయవాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యానికి నా సవరణలను వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి




  24. ఇద్ధర నరుడై పుట్టుచు
    శ్రద్ధగ విద్యలను నేర్చి జనకుని సభలో
    నద్ధను ద్రుంచుచు హరియను
    "*బుద్ధినివిడిరాముడందెభూమిజకరమున్*


    బుద్ధియు లేనిచాకలియుమూర్ఖముగానట పల్కెనిట్టులన్
    బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్”*
    పద్ధతి గాదటంచునట వాదనచేసెనటంచు దెల్పగా
    శ్రద్ధగ నాలకిం చుచునురాముడు కానకు పంపెతా సతిన్

    రిప్లయితొలగించండి
  25. సద్ధర్మము పాటించుమ
    బుద్ధి వహించి చరియించు భూసుత యేలా
    యిద్ధర రావణ దుష్టపు
    బుద్ధిని విడి, రాముఁ డందె భూమిజ కరమున్


    అద్దిర ముద్దబంతి వలె నందము లొల్కుచు నున్న దంచుఁ దాఁ
    దద్దయు సంతసించి మదిఁ దామరసాక్షినిఁ గ్రూరచిత్త నా
    మొద్దును బేరు లింపుగను బోలఁగ రాముని జానకీసతిన్
    బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్

    రిప్లయితొలగించండి
  26. బద్ధుండై ధర్మమునకు
    సిద్థపడెనురాముడు సతి సీతను వీడన్
    శుద్ధినిదెలుపగననలుఁడు
    బుద్ధిని విడి రాముఁ డందె భూమిజ కరమున్

    రిప్లయితొలగించండి
  27. ఉద్ధతిజెఱనిడె సీతను
    బుద్ధినివిడి,రాముడందెభూమిజకరమున్
    పద్ధతిగవిల్లువిఱిచియు
    పెద్దలయాశీసులందిపేర్మినినపుడున్

    రిప్లయితొలగించండి
  28. ఉద్ధతితోడబల్కెనట నొక్కడుచాకలివాడుత్రాగియున్
    బుద్ధినివీడిరాముడు విమోహితుడై గ్రహియించెజానకిన్
    బద్ధుడునౌచుదాశరధి పంపెనుసీతను దారుణంబుగా
    క్రుద్ధత,జెందుచున్ మనగకాననమందుననుండునట్లుగా

    రిప్లయితొలగించండి
  29. బద్ధుండై ధర్మమునకు
    సిద్థపడెనురాముడు సతి సీతను వీడన్
    శుద్ధినిదెలుపగననలుఁడు
    బుద్ధిని విడి రాముఁ డందె భూమిజ కరమున్

    రిప్లయితొలగించండి
  30. బుద్ధుండై ఋషి వచన వి
    శుద్ధత నిలుపంగ తాను సోముని ధనువున్
    శ్రద్ధను విరిచిన, గర్వపు
    బుద్ధిని విడి, రాముఁ డందె భూమిజ కరమున్!


    రిప్లయితొలగించండి