12, జులై 2021, సోమవారం

సమస్య - 3780

 13-7-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్”
(లేదా...)
“చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్”

59 కామెంట్‌లు:

  1. వదలగ లక్షలు,కోట్లును,
    మదిలోనను కట్నములను మరిగెడు చోటన్
    కొదవౌను దొడ్డ సంస్కృతి --
    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి

  2. (విరించి)


    చదువులు చెప్పించుటయే
    యధములు వ్యాపారమంచు నపరిమితముగా
    ను దొరపు విద్యాలయముల
    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్.

    రిప్లయితొలగించండి
  3. మృదు భావమ్ములు మనమున
    కుదురుగ గూర్చుండబెట్ట గురువుల తరమా?
    సదనమునన్ బుద్ధులిడని
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్.

    రిప్లయితొలగించండి
  4. మదిలో గురువుల యెడ మరి
    పదిలముగా భక్తి యుంట పరిపాటి కదా
    చదువది లేకను రాణిం
    చదు;విచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    విచ్చునె = వికసించునా!

    రిప్లయితొలగించండి
  5. సదమలకాంతిగజన్మల
    వదలనితోడైనిలచుచువాసిగవెంటన్
    మదిలోభావముకాగా
    చదువిచ్చునెమానవునికిసంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి
  6. కందం
    చదివించిన గురుడొక్కఁడె
    కద! కౌరవ పాండవాళి గమనములందున్
    చిదగొదలఁ గన విదితమగు
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్?

    మత్తేభవిక్రీడితము
    ముదమారన్ గొని కుంభసంభవుడటన్ ముద్దార నేర్పించినన్
    జదువుల్ కౌరవపాండవాళి కొకటే సంస్కారమందించెనే?
    మదిలో సత్వమునన్ మృదోక్తులును సంభావించుటల్ నేర్వకే
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

    రిప్లయితొలగించండి
  7. కుదురుగ భారత సంస్కృతి
    చెదరని భక్తి ప్రపత్తుల శేముషి బెంచే
    సదమల బుద్ధుల నీయని
    చదువిచ్ఛు నె మానవులకు సంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెంచే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. చదువే సుందరరూపమై దగు రహస్స్థానస్థితైశ్వర్యమౌ
      నదియే బంంధువునౌ విదేశములలో నక్షయ్యవిత్తమ్మగున్
      మది ధర్మాధ్వములన్ గమించ ఘనసమ్మానమ్మె ,
      తద్భిన్నమౌ
      చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

      కంజర్ల రామాచార్యులు.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సమస్య :
    చదువేరీతి నొసంగు మానవులకున్
    సంస్కారసౌశీల్యముల్

    ( బడికి పొమ్మంటున్న అన్నశేషమరాజుతో పోనని , తాను సాయినని పలుకుతున్న సత్యనారాయణరాజు )

    మత్తేభవిక్రీడితము
    ---------------
    మదికిన్ జేరవు నీదు పల్కు ; లిదియే
    మాయే కదా చూచినన్ ;
    జెదరన్ జేయకు నాదు ధ్యేయమును ; ని
    శ్చేష్టుండు గాబోకుమా !
    కదలన్నేరను ; సాయి నే ; యనుజుడన్
    గాదోయి ! పోవోయి ! యీ
    చదువేరీతి నొసంగు మానవులకున్
    సంస్కారసౌశీల్యముల్ ?

    రిప్లయితొలగించండి
  10. మదమత్తేభమునట్టురావణుడుసామంబున్సదావీడుచున్
    సుదతిన్సీతనుదెచ్చెగాఖలుడుతాసౌఖ్యంబుకాంక్షించుచున్
    విధమేరీతినిఁజూడగావలయువాగ్విజ్రుంభవిద్యల్గనిన్
    చదువేరీతిననోసంగుమానవునకున్సంస్కారసౌశీల్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాగ్విజృంభ..' అనాలి. కాని దానివల్ల గణభంగమౌతుంది.

      తొలగించండి
    2. వాగ్విశ్వంబువిద్యల్గనిన్, అనిఅంటేబాగుంటుందాగురువుగారు

      తొలగించండి
    3. వాగ్విశ్వంబువిద్యల్గనిన్

      తొలగించండి
  11. పదిలంబైన విధమ్ములోచదువడే పాఠ్యమ్ములన్ నెమ్మి, కో
    విదులౌవారల శిక్షణమ్ముగొనుచున్ పెంపొందు సన్నాహమే
    మదిలో చేరక మూఢుడై నడచు సామాన్యంపు మార్గమ్ములో
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్ ?

    రిప్లయితొలగించండి

  12. గదిలో బాలుర బంధిసేయుచు బలత్కారమ్ముగా నొజ్జలే
    గదమాయించుచు చెప్పువిద్దెలవి సత్కార్యంబు కాబోదుగా
    పదిరాళ్ళన్ సమకూర్చగా వెలసెనా వాణిజ్య సంసత్తులో
    చదువేరీతి నొసంగుమానవులకున్ సంస్కారసౌశీల్యముల్.

    రిప్లయితొలగించండి

  13. మదిలో ప్రేరణ నొందజాలకను స
    మ్యగ్దృష్టియేలేక యా
    విదిత జ్ఞాన సరిత్ప్రభ న్విరియు
    సంప్రీతార్థరాహిత్యము
    న్నెదియో జాలని విద్యల న్బడయ
    నేలా మిత్రమా! వట్టిదౌ
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్?!

    రిప్లయితొలగించండి
  14. మొదలిడిన నాటి నుండియు
    నుదరపు పోషణ కొరకయి యొప్పెడిరీతిన్
    హృదిని కదలించ జాలని
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్ ?

    రిప్లయితొలగించండి
  15. చదువుల్ ప్రస్తుత కాలమందు
    మిగులన్ సంపత్తి జేకూర్చగా
    బదునుల్ బెట్టుచునుండె మా
    నసములన్ బ్రత్యేకమౌ శ్రద్ధతో
    వదలెన్ ధర్మము నీతియున్ ని
    జముగా వాఛించ నిస్తేజ మా
    చదువేరీతి నొసంగు మానవుల
    కన్ సంస్కార సౌ శీల్యమున్

    రిప్లయితొలగించండి
  16. మ:

    నిదురే మాను విధంబుగన్ చదువగా నిత్యంబు రేయింబవల్
    పదునున్ బెట్టితి బుద్ధినిన్, దలచి ప్రాప్తంబెంచ నుద్యోగమున్
    వెదకన్ గన్పడె నెల్లడన్ కటువుగా భీష్మించ లంచమ్ముకై
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదువొసగునువిజ్ఞానము
      చదువే సంస్కారమొసగు సామాన్యులకున్
      మదిరేచని సంశయమిది
      “చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్”

      తొలగించండి
  18. చదువుల్ నేర్వనివార లజ్ఞులగుటల్, సర్వప్రపంచమ్మునం
    దెదలం గుందుట లెల్ల జూతుము గదా యేకాలమందైన దా
    బదిలంబైన సుఖంబు గూర్చు సుమహద్భాగ్యంబు లందించు, నీ
    చదువే రీతినొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్.

    రిప్లయితొలగించండి
  19. బ్రదుకన్ నేర్పగ జాలవీ చదువుతో భ్రాంతుల్ గలుంగున్ గదా
    వెదుకన్ సద్గుణముండదే నిరత మావేశంబు గల్గించునే
    అదుపున్ దప్పుచు నున్నదీ సతత మాదాయంబు బొందంగ యీ
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "...బొందంగ నీ చదువే..." అనండి.

      తొలగించండి
  20. సదమల మదితో నేర్పుగ
    నెదురుగ నుండిన గురువులె యిత్తురు గుణముల్
    కుదరక గృహమున నాన్ లైన్
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్!

    రిప్లయితొలగించండి
  21. పదవులలో స్థిరపడి సం
    పద సమకూర్చుకొనెడి సదుపాయంబగుచున్
    పదుగురికుపయోగపడని
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి
  22. 🌹కందము🌹

    చదివించిరి శాస్త్రమ్ములు

    పొదువుగ నౌకరి కొరకు విపులమున్ననిరా

    ముదుసలలుకు మొక్కమనుచు

    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    🌹మత్తేభము🌹

    అదిగో చూడుడు నేర్చిరయ్యనట గాంధారీ సుతుల్, పాండవుల్

    మదిలో బేధము లేక ద్రోణుడును మర్మం బచ్చటన్ నేర్పగన్

    పధమున్దప్పిరి ధార్త రాష్ట్రులు ఘనుల్ , పాంచాలికిన్ భర్తలున్

    విధమున్వీడక కానకేగిరి కదా విద్యార్ధులచ్చోటునే

    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  23. చదివితిరిగ మీరిట్లుగ
    చదువగ సదసద్వివేక చతురత కలుగున్
    విదితమయయి యిటులంటిరె!
    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి
  24. సదమల మదితో గురువును
    వదలక సేవించి నేర్వ పరమగు విద్యన్
    మదిలో చీకట్లు తొలగి
    చదువిచ్చునె మానవులకు సంస్కారమ్మున్!

    అదుపున్ జేయగలేని మానసముతో నత్యాసలన్ గ్రుంగుచున్
    పదిలంబౌ పరమార్దమున్ గనక విభ్రాంతిన్ విమూఢాత్ములై
    బ్రదుకే శాశ్వతమంచు సంపదల సంపాదించు తత్కాలమౌ
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభం మొదటిపాదమున యత్యాశలన్ గా చదువ ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్
    చదువే యిచ్చును నేర్వుమా కమల! సంస్కారంబు సౌశీల్యమున్
    విదితంబేయిది నీకు వేరుగను సమావేశంబు గావించినీ
    మదికిన్ జెప్పగ జాలనేనిపుడు సామాన్యంబు గుర్తించుమా

    రిప్లయితొలగించండి
  27. చదువది ఎంతగచదివిన
    సదమల సంస్కారభరిత చతురత లేకన్
    చదువుకు విలువేమున్నది
    చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్

    రిప్లయితొలగించండి
  28. పదిలము గనిపింపని నిజ
    హృదయమ్ముల నింప స్వార్థ మివ్విధి నేఁడిం
    పొదవని పోటి సెలంగఁగఁ
    జదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్


    వదనాంభోజ వికాస హేతు వయి స్వస్వాంతామలీ భూతమై
    కదనద్వేష మనః ప్రభావ మిడి సత్కారార్హులం జేయఁగా
    సదసద్భేద వివేక బుద్ధి నిడి నిశ్శంకన్ మహోత్కృష్టమౌ
    చదువే, రీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్

    [చదువే = చదువు మాత్రమే; రీతిన్ =పద్ధతిన్ / ఆచారమున; కదనము = పాపము, యుద్ధము]

    రిప్లయితొలగించండి
  29. మత్తేభము:
    కదిలే కాలము నేర్పునెన్నొ చదువుల్ కష్టమ్ములే పాఠముల్
    పదిమందిన్ గమనించి నేర్చుకొన రే భాషించు రీతుల్ జనుల్!
    కదలాడే మరబొమ్మ లున్ యధిక సౌకర్యాల చేకూర్చెడీ
    “చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్? .
    ---కటకం వేంకటరామశర్మ

    రిప్లయితొలగించండి
  30. చదివెన్ వేదము బుండరీకుడకటా జారత్వమున్ దేలెనే
    చదివెన్ శాస్త్రము బిల్వమంగళుడు వేశ్యాలోలతన్ జిక్కెనే
    చదువేరీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్
    చదువున్ దోడుగ సత్ప్రవర్తనమవశ్యంబౌనుగానెన్నడున్

    రిప్లయితొలగించండి
  31. సదమలమతివీడి సతము
    వదలుచుసత్కార్యములనుపాపియువోలెన్
    సదనమున సతినిగొట్టిన
    *చదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్*

    రిప్లయితొలగించండి