14, జులై 2021, బుధవారం

సమస్య - 3782

15-7-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే”
(లేదా...)
“కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్” 

67 కామెంట్‌లు:

  1. మారుని తండ్రి మురిపముగ

    కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే

    వైరిగ తలచిన పార్ధుని

    కోరిక తీర్చగ రధమును కుదురుగ నడపన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. సూరి వసుదేవు సుతుడై

    కారాగారమున పుట్టెగద, కర్ణుండే


    కూరిమి తోడ జనించెను

    ధారణుని‌ వరమున‌ కుంతి
    తరళేక్షణకున్

    రిప్లయితొలగించండి
  3. సమస్య :

    కారాగారమునన్ జనించెను గదా
    కర్ణుండు గాంధారికిన్

    ( గురుస్వామి ప్రశ్నలకు వీరాస్వామి సమాధానాలు )

    శార్దూలవిక్రీడితము
    -----------------
    " వీరాస్వామి ! వచింపు ప్రశ్నలకు - శ్రీ
    విష్ణుం డెటన్ బుట్టె ? నా
    శూరుండైన మహావదాన్యు డెవడో
    చూడంగ వాక్రుచ్చుమా ?
    బీరాలాడుచు సంచరించు కొడుకుల్
    పెంపొంది రెవ్వారికిన్ ? "
    " కారాగారమునన్ జనించెను గదా ;
    కర్ణుండు ; గాంధారికిన్ . “

    రిప్లయితొలగించండి
  4. శూరాగ్రేసరుడైనను
    వీరాక్రుతిజన్మమందువెలవెలఁబోయెన్
    రారాజుగ్రుహముననియెడి
    కారాగారమునఁబుట్టెగదకర్ణుండే

    రిప్లయితొలగించండి
  5. తీరా చూడగ కృష్ణుడు
    కారాగారమునఁ బుట్టెఁ గద; కర్ణుండే
    పూరెమ్మల బుట్టను నది
    వారగ రాధకును జిక్కె ప్రారబ్ధమునన్

    రిప్లయితొలగించండి
  6. క్రూరుల న ణ చగ కృష్ణుడు
    కారాగారమున బుట్టె గద : కర్ణుo డే
    పోరియు రణమున విజయుని
    వీరత్వము ముందు నోడి వీడెన సువులన్

    రిప్లయితొలగించండి

  7. విరించి.

    ఆ రుక్మిణి పతి కృష్ణుడు
    కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే
    నారీ శిరోమణి పృథకు
    ధారుణిని వలన జనించె ధాత్రిని గాదే.


    నారీ ద్రౌపతి మానరక్షకుడు శ్రీనాథుండు జన్మించె నే
    మేరన్ దెల్పుడి? యంగరాజెవడు? దుర్మేధుండుగా పిల్చెడిన్
    రారాజెవ్వరి పుత్రుడో తెలుపుమా? రాజీవనేత్రా వడిన్
    కారాగారమునన్ జనించెను కదా, కర్ణుండు, గాంధారికిన్.

    రిప్లయితొలగించండి
  8. ఆ రాధా రమణుం డట
    కారాగారమునఁ బుట్టెఁ గద; కర్ణుండే
    జేరెను కౌరవ పక్షము
    ధీరత నొప్పంగ గుంతి దేహజుడగుచున్!


    రిప్లయితొలగించండి
  9. చేరంబోయినసూర్యబింబమునునాజేజిచ్చెభాస్వంతునిన్
    నేరంబాయెనుకుంతికిన్నిలువనీనీచంపులోకంబులో
    వీరుండయ్యునునోడెగానతడునావేవెల్గుపుత్రుండునై
    కారాగారమునన్జనించెనుగదాకర్ణుండుగాంధారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది. కాని సమస్యకు పరిష్కరం?

      తొలగించండి
    2. చీకటిలోకమనెడికారాగారములో, కట్టడియనెడిగంతనుకట్టినకుంతికిజన్మించినాడుగదా

      తొలగించండి
  10. శ్రీరాధా హృదయేశు డెచ్చట రహిన్ చిచ్చక్తిగా వచ్చెనో?
    శ్రీరాదేయుడు;దానధర్మముల వాసింజేయు వాడెవ్వడో?
    ధౌరేయుల్ కురు సోదరుల్ జనన మందన్ వెల్గె నే తల్లికో?
    కారాగారమునన్ జనించెను గదా--కర్ణుండు--గాంధారికిన్.

    క్రమాలంకార పూరణము

    రిప్లయితొలగించండి
  11. నారాయణుడే కంసుని
    కారాగారమున బుట్టెగద; కర్ణుండే
    రారాజుకు మిత్రునిగా
    కౌరవ పక్షమున నిలచె కవచమువోలెన్

    వీరావేశముతో కిరీటి హరినే విల్లెత్తి కొట్టెంగదా
    శ్రీరాముండడవిన్ సుమిత్ర తనయున్ శిక్షించబూనెం గదా
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్
    పేరుంగాంచిన యాశకారునివియౌ ప్రేలాపనల్ జూడగా

    రిప్లయితొలగించండి
  12. నా రెండవ పూరణము:

    ధారాళంబుగ జెప్పబూనుమని యం
    త న్నేను స్పష్టంబుగ
    న్నా రాత్రంతయు పాఠము న్దెలుప నౌ
    రా! యేమిచిత్రంబురా!
    తీరా దానిని యొప్పజెప్పు మన నీ
    తీరు న్వచించేవురా
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్!

    రిప్లయితొలగించండి
  13. నేరారోపణగా దలంచకు సఖా! నీవిట్లు చింతించగా
    ప్రారంభించుటె గాని సాగదొక పర్యాయంబు నందింతగా
    భారంబౌ నటు దోచు గాథ వచియింపన్, విన్న వాడిట్లనెన్
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్

    రిప్లయితొలగించండి
  14. నారి పృథ సుతులకై హరి
    కారాగారమునఁ బుట్టెఁ గద ; కర్ణుండే
    యా రమణి కొమరుడయ్యును
    వారి నెదిరి బోరు సలుప భావ్యంబగునే !

    రిప్లయితొలగించండి
  15. ధీరోదాత్తుడు కృష్ణుడు
    కారాగారమునఁ బుట్టెఁ గద; కర్ణుండే
    నేరకగోరిన కుంతి కు
    మారునిగా బుట్టెనుగద మనభారతమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భారతమున్'... సప్తమ్యర్థంలో ద్వితీయ కుదరదనుకుంటాను.

      తొలగించండి
    2. సవరణతో....

      ధీరోదాత్తుడు కృష్ణుడు
      కారాగారమునఁ బుట్టెఁ గద; కర్ణుండే
      నేరకగోరిన కుంతి కు
      మారునిగా బుట్టెనుగద మనకావ్యమునన్

      తొలగించండి
  16. మీరా బాయికినిష్టుడైన హరియే మేధావిగా లీలనన్

    కారాగారమునన్ జనించెను గదా, కర్ణుండు, గాంధారికిన్

    భారమ్మౌ శత పుత్ర మందలును, పాపాత్ముల్, దురాత్ముల్ కురుల్,

    పేరాశా పరు రాజ రాజ హితులన్, ప్రీతిన్ వధించెన్నహో

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శతపుత్ర మంద' దుష్టసమాసం. పద్యభావంలో అస్పష్టత ఉన్నది.

      తొలగించండి
  17. శౌరిన్ దేవకి కన్న స్థాన మెదియో? చండాంశునిన్ గొల్చి తా
    గోరన్ గుంతికి నేమి చేకురె నటన్? గ్రూరాత్ములౌ కౌరవుల్
    తా రేయింతి కుమారులం చడుగ ఛాత్రశ్రేష్ఠు డిట్లాడె నా
    కారాగారమునన్, జనించెను గదా కర్ణుండు, గాంధారికిన్.

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ఔరా నీవె వచించఁ జాలుదొ? యపర్యార్థమ్ములం, జూడుమా!
      క్రూరాత్ముండు సుయోధనుండు ఘనుడౌ కుంతీసుతుండ ట్లుగా
      నీరీతిం గన మాద్రికిం గలిగి నట్లే ధార్తరాష్ట్రాధిపుల్
      కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్.

      కంజర్ల రామాచార్యులు
      వనస్థలిపురం.

      తొలగించండి
  19. వీరాగ్రేసరుడైన కృష్ణుడెచటన్
    ప్రేమించి జన్మించె సోద్యంబుగన్
    దూరాలోచన లేని కుంతికెవరున్
    దొల్దొల్త జన్మించె దేజంబుతో
    ధీరండైన సుయోధనుండె
    వరికిన్ ధీశాలియైపుట్టెడిన్
    కారాగారమునన్ జనించెనుగదా, కర్ణుండు ,గాందారికిన్

    రిప్లయితొలగించండి
  20. శా. శ్రీరాముండవతారమెత్తి భువిలో శ్రీకృష్ణుడై బుట్టెనే
    కారాగారమునన్ జనించెను గదా! కర్ణుండు గాంధారికిన్
    గారామౌ తొలిబిడ్డకున్ సఖునిగా కైంకర్యమున్ జేసెగా!
    రారాజే తన కంగరాజ్యమిడెగా, రాజన్న సద్భక్తిచే!

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. కందం
      రారాజు వీడి రాననె
      నే రమ్మన్నను సుతుడని నెమ్మనమున, గాం
      ధారికి కడుపున సుగుణా
      కారా! గారమునఁ బుట్టెఁ గద కర్ణుండే!!

      శార్దూలవిక్రీడితము
      నేరమ్మంటినిఁ గన్నబిడ్డ యనుచున్, నిర్మోహమాటమ్ముగన్
      రారాజున్ సఖు నంగదున్ విడిచి తా రాలేని భావంబునన్
      సారించెన్ దన దృష్టి వేరెటుగనో శంకించి, సమ్మోహనా
      కారా! గారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్!!

      తొలగించండి
    2. తమవైపు రానన్న కర్ణుని గురించి నిర్వేదముతో చెబుతూ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ తో...

      తొలగించండి
    3. గురుదేవులకు ప్రణామములు. సవరించిన పూరణ పరిశీలింప ప్రార్థన:

      శార్దూలవిక్రీడితము
      నేరమ్మంటినిఁ గన్నబిడ్డ యనుచున్, నిర్ద్వంద్వమౌ రీతిగన్
      రారాజున్ సఖు నంగదున్ విడిచి తా రాలేని భావంబునన్
      సారించెన్ దన దృష్టి వేరెటుగనో శంకించి, సన్మంగళా
      కారా! గారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్!!

      తొలగించండి
  22. ధీరోదాత్తుడు శౌరి పుట్టెనెచటన్? దివ్యాంశు ప్రేమమ్ముతో
    శూరుండైన కుమారు కుంతికనె నా సుశ్లోకు, పేరేమియో?
    పేరాశన్ చరియించ నూర్గురు సుతుల్ పెంపొంది రెవ్వారికిన్?
    కారాగారమునన్ జనించెను గదా, కర్ణుండు, గాంధారికిన్
    (గాంధారి చేసిన తప్పువలన పిండము నూరు ముక్కలైనది కదా)

    రిప్లయితొలగించండి
  23. శా:

    ఓరోరీ యిటులేమి చెప్పెదవటో నొప్పింప వాక్ధాటి తో
    యేరా కృష్ణునిజన్మమున్ దెలుపనై యింపైన రాగమ్మునన్
    నోరారం బలుకంగ తప్పు నిటులన్నువ్వేమి పౌరాణికౌ
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్

    పౌరాణిక=పురాణము చెప్పువాడు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. శౌరి వసుదేవసుతు డై
    *కారాగారమున బుట్టె గద, కర్ణుండే*
    యారవిదయతో పుట్టెను
    నేరక మంత్రము జపింప నెలతుక కపుడే

    రిప్లయితొలగించండి
  25. క్రూరాత్ముండగు కంసు జంపనెట దా గోవిందుడై బుట్టెనో
    తా రాధా సుతుడంచు బేరు వడసెన్ దత్యుండు దానెవ్వరో
    దూరంబై జని ధర్మమున్ విడుచు పుత్రుండేరికిన్ బుట్టెనో
    కారాగారమునన్ జనించెను గదా, కర్ణుండు, గాంధారికిన్

    రిప్లయితొలగించండి
  26. క్రూరుల శిక్షకు శ్రీపతి
    కారాగారమున బుట్టెగద,కర్ణుండే
    వీరుడు భీభత్సునితో
    బోరుసలిపి పరమపదము బూర్తిగ బొందెన్

    రిప్లయితొలగించండి
  27. శ్రీరామా కరుణించ వాయిక ప్రభో సీమాంధ్రవారిన్ దగన్
    వారీరీతిగ నిచ్చుచుంటిరి యిటన్ వారింప వీలుండునే!
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్
    నౌరాబంధము జెప్పరానిది గదా కర్ణుండు గాధారికిన్

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. భారత రణ కారకుఁ డగు
      నా రాధేయుండు నుత మహా వీరుండున్
      నారీమణి కన్యోదర
      కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే


      కౌరవ్యుండు యుయుత్సు తోడ స శతైకం బయ్యెఁ బుత్రాలియే
      నారీరత్నము వుట్టె దుశ్శలయె యన్నల్ గాఁగ వారందఱుం
      గౌరవ్యావలి షోడశాత్మజుఁడు దుష్కర్ణానుజుండై యుఖా
      కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్

      [కౌరవ్యావలి = దుర్యోధన సమూహము; ఉఖా కారాగారము = కుండ యను కారాగారము; దుర్యోధ నాదులలోఁ బదునాఱవ వాఁడు,దుష్కర్ణుని తరువాత గాంధారికిఁ గుండలోఁ బుట్టిన వాఁడు కర్ణుఁడు ]

      తొలగించండి
  29. నీరద శ్యాముఁడు కృష్ణుఁడు
    కారాగారమునఁ బుట్టెఁ గద, కర్ణుండే
    కోరగ కుంతియె తాకం
    జారుని, జనియించెమంత్ర జపమహిమమునన్

    రిప్లయితొలగించండి
  30. ఆ రాధారమణుండు బుట్టెనెట దానారాధ్యు డావిష్ణువే?
    వీరుండయ్యును యుద్ధమందెవడు సంవేదమ్మునే మీరెనే?
    శూరుల్ బుత్రశతంబు గూల నెవరా శోకంబునన్ మున్గిరో?
    కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్.

    రిప్లయితొలగించండి
  31. ఔరాయెంత విచిత్రమీ నొడువు నాకాశ్చర్యమై యొప్పెనీ
    ఘోరంబెన్నడు నెంచనైతిని మదిన్ ఘోషించె నాడెందమే
    మీరీ రీతిగ బల్కగాతగున? తామేమంచు వాక్రుచ్చిరో
    "కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్"?

    రిప్లయితొలగించండి
  32. రారాజు నధికుడి ననె, య
    కారణముగ రణము కోరె, గర్వాంధుండై
    వారించునా? చెలిమియను
    కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే

    రిప్లయితొలగించండి