27, జులై 2021, మంగళవారం

సమస్య - 3795

28-7-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై”
(లేదా...)
“పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్”

67 కామెంట్‌లు:


  1. విరించి.

    వేలాది ప్రతిమ లట లో
    పాలను కలిగెనని యారు బయటయె పెట్టన్
    శూలము తో యొకడా శి
    ల్పాలను దునియలుగఁ జేసె పటు విక్రముడై.

    రిప్లయితొలగించండి
  2. వాలిని దునిమెను రఘువై

    చేలములిడి సిగ్గు కాచె శ్రీ కృష్ణుండై

    బాల వటువుగన్ బలి పా

    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  3. విరించి.

    మూలకు పెట్టినట్టి పలు బొమ్మలు లోపము నున్న వాటితో
    నాలయ మంత నిండెనని యర్చకు లెల్లరు గోలపెట్టగా
    శూలము తోడవచ్చి యొక శూరుడు వ్యర్థము లైన యట్టి శి
    ల్పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  4. ఆలనుమేపెడిగోల్లడు
    చేలనువ్రాలినచికుబుకుచిన్నదిపిట్టన్
    కూలగగోట్టెనువెంబడి
    పాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని సమస్యాపరిష్కారమే అర్థం కాలేదు. వివరించండి.

      తొలగించండి
    2. పాలపిట్టనుముక్కలుగచేశాడు

      తొలగించండి
  5. తాలిమి గలిగిన వాడై
    మేలొనరించుచు సతతము మేటి ఘనుండై
    జాలము సేయక దా కో
    పాలను దునియలుగ జేసె పటు విక్రముడై

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శూలధరుని నిరతమ్ముగ
    మేలగు భక్తిని గొలవగ మెండుగ నతడే
    వీలుగ మృకండు సుతు పా
    పాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై

    రిప్లయితొలగించండి
  7. కందం
    బాలల జంపిన గురుసుతుఁ
    గూలచ వలదనుచు నాపి గోవిందుఁడనన్
    మేలని, నర్జునుఁడట జుం
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    ఉత్పలమాల
    బాలల జాలిలేక నుపపాండవులందరి మట్టుపెట్టినన్
    గూలచ బోకు బాపడని గోకుల కృష్ణుడు మధ్యమార్గమే
    మేలని జెప్ప ద్రోణసుతు మీదకు దూకుచు నర్జునుండు జుం
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  8. ఆలమునాతని రథమును
    గూలిచినను చెలగె క్రీడి కొమరుండాహా
    వాలమునరి వీరుల చా
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    రిప్లయితొలగించండి
  9. సమస్య :

    పాల నొనర్చె ముక్కలుగ
    బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

    ( తన మీది ప్రేమను వీడి కారెమపూడి రణరంగానికి వెళ్లమన్న మాంచాల మాట పాటించిన బాలచంద్రుడు)

    ఉత్పలమాల
    -----------

    " చేలము బట్టబోకు ప్రియ !
    చెంగున సిద్ధము కమ్ము పోరికిన్ ;
    వేల నెరుంగనేర రట
    వీరులు కారెమపూడి యందునన్
    బాలుడ ! లె " మ్మనన్ సతియె ;
    భళ్లున లోపల నున్న ప్రేమపు
    ష్పాల నొనర్చె ముక్కలుగ
    బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్ .

    (బల్లిదుడు - శక్తిమంతుడు )

    రిప్లయితొలగించండి
  10. పాలసు డెల్లవేళలను బాండవ
    మధ్యము బావమర్ది గో
    పాలని మాటిమాటికిని వంకలు
    పెట్టెడు వాని వంద పా
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదు
    డందరు మెచ్చుచుండగన్
    జాలము లేక చంపి, కడు చయ్యన
    జైద్యుని యుగ్రరూపియై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చైద్యుని నుగ్రరూపియై" అనండి.

      తొలగించండి
  11. ఆలను కాచెడి కృష్ణుడు
    కూలగ చేసెను తరువుల కువలయమందున్
    తాలిమితోవైరుల పా
    పాలను దునియలుగ చేసె పటు విక్రముడై

    రిప్లయితొలగించండి
  12. ఉ:

    కూలగ వచ్చె వారధని క్రొత్తగ కట్టిరటంచు దెల్పగా
    గోలగ లోకులెల్లరును గుంపున గూడి సమాశ్రయింపగన్
    వైళము నింజనీరు తగు వాటము నెంచి పరిశ్రమింప లో
    పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

    వైళము =శీఘ్రముగా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శూలధరున్ ననారతము సొంపగు భక్తిని సంస్తుతించుచున్
    మేలగు రీతి నాతనిని మెండుగ వేడు గజాసరుండునున్
    మాలిమితో హరుండు తన మాయను జూపుచు బ్రోచి వాని పా
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  14. పోలికలేకయుద్ధమునపోరునుసల్పుచుపార్ధుపుత్రుడున్
    చాలినతండ్రితేజమునచాపముబట్టుచుభీకరుండునై
    పాలనుబడ్డశత్రువులుపంతముతోడనుచేయుదుర్విలా
    పాలనోనర్చెముక్కలుగబల్లిదుడైజనులెల్లమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  15. కె.వి.యస్. లక్ష్మి:

    లీలను జూపుచు కృష్ణుడు
    శైలమునెత్తి ప్రజ గాచి సర్పపు మదమున్
    తూలించి వానివౌ పా
    పాలను దునియలుగ చేసె పటు విక్రముడై.

    రిప్లయితొలగించండి
  16. నేలయు నింగియునొకటై
    నీలభములు గర్జనలతొ నెగడుచు గురియన్
    నేలకునొరిగిన తరుజొం
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గర్జనలతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "గర్జనలను" అనవచ్చు.

      తొలగించండి
    2. నేలయు నింగియునొకటై
      నీలభములు గర్జనలను నెగడుచు గురియన్
      నేలకునొరిగిన తరుజొం
      పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

      తొలగించండి
  17. (కరోన సందర్భం లో )

    బాలుని వెలుపలకంపగ
    వీలుపడని కారణమున వేశ్మము నందే
    లాలనదోడ పితయె జుల
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    వేశ్మము = ఇల్లు

    రిప్లయితొలగించండి
  18. కూలెనురుక్మి,యపుడు కర
    వాలముతో గొరిగె గుండు వసుదేవసుతే,
    చాలాగడములనుచు జుల
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వసుదేవసుతే' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  19. గాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగా
    నేలనుగూలె వృక్షములు నిల్చెను వాహన రాకపోకలున్
    బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొం
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాహన రాకపోకలు' దుష్టసమాసం. "నిల్చెను వాహనముల్ పథంబునన్" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ, సవరిస్తాను

      తొలగించండి
    3. గాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగా
      నేలనుగూలె వృక్షములు నిల్చెను వాహనముల్ పథంబునన్
      బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొం
      పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

      తొలగించండి
  20. యేలనొ! కల్సిరాకనొక
    ఏనుగుచెర్వుననీరుద్రాగగా
    కాలునుమోపితొండముతొ
    కడ్పులునిండగత్రాగియుండకన్
    గోలనుజేసినీటిపయి
    కొట్టుచుతేలుచుఈదులాడగా
    కాలునుపట్టెనక్రము
    సకామునవిష్ణువె చంపివాటి, శా
    పాల నొనర్చె మక్కలుగ
    బల్లిదుడైజనులెల్లమెచ్చగన్
    ....తోకల....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. "ఏలనొ' అనండి. 'తొండముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "తొండమున" అనవచ్చు.

      తొలగించండి
  21. కాలునివలె క్రోధాగ్నుల
    నోలాడుచు ద్రోణసుతుడు నుపపాండవని
    ర్మూలనమొనర్చితద్రూ
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    రిప్లయితొలగించండి
  22. కాలములో, క్రోధమునను
    కూలగ కోర్కెలు, తపమున కౌశికుడయ్యెన్
    మేలౌ బ్రహ్మర్షిగ, కో
    పాలను దునియలుగఁ జేసె, పటు విక్రముఁడై.

    రిప్లయితొలగించండి
  23. కాలమును వెదకి చూడుము
    పాలించెనెపుడు కరుణగ పశుపతి తానే
    ఆలించుచు భక్తులతా
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై

    రిప్లయితొలగించండి
  24. ఆలయముల దేవుని రూ
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
    వేలుపుపై లలి విడెనా !
    యేల యిటుల జరుగుచుండె నేలిక జడమా ?

    రిప్లయితొలగించండి
  25. పాలనొసంగు సాకు గొని బాలుని యక్కున జేర్చి ప్రేమతో
    జోలను పాడుచున్ విషముఁ జొన్పగ వచ్చినఁ గాంచి పాలతో
    పీలిచి ప్రాణవాయువులు , వెన్నుడు పూతన పొందినట్టి శా
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  26. ఆలమునందునా దురితులందరు గూడి రథంబు గూల్చినన్
    బాలుడు సింగమై దుమికె వారలనుక్కడగింప వేగమే
    వాలము దూసి శాత్రవులపై చెలరేగుచు నిల్చి వారి చా
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  27. వాలమురహి వానరముల
    బాలుడు దాజెక్క శిలనుబంధువు మిగులన్
    హేళన జేయుచు నాశి
    ల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై

    రిప్లయితొలగించండి
  28. చాలిక యింద్రయాగములు! చక్కగ గొల్చెదమీ మహాగిరిన్
    మేలగు పుణ్యకార్యమని మేఘపువర్ణుడు జెప్పినంత బై
    డాలముతో శచీపతి విడంబములేకయె వర్షధారలన్
    నేలను నాకమున్ గలుప నీడగ కొండను కేలబట్టి తా
    పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  29. ఆలికినిఁ బాక పరిపా
    కాల సమానుఁడ నరయఁగఁ గానే యంచున్
    వ్రేలను ముంచుచుఁ గాయుచుఁ
    బాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై


    కీలి నిభ ప్రభా కలిత కీర్తి వికీర్ణ సుఘోర దర్శ నా
    భీల వరూధినీ సహిత భీద పరాక్రమ సుప్రచండ బా
    హా లస దుగ్ర శాత్రవ జయార్భట చిహ్న సునిర్మి తేద్ధ స్తూ
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  30. వాలము లేకయుండగను వానరమూకల జెక్కు పుత్రునిన్
    చాలును శిల్ప చెక్కడము శ్రద్ధగ బొమ్మిక పాఠశాలకున్
    మేలగు జీవితంబునకు,మెప్పును బొందెద వంచు బల్కిశి
    ల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  31. కందం
    లీలగ యశోద గాంచెను
    బాలుని మనుతిన్ననోట పద్నాలుగు లో
    కాల! నటులఁ కృష్ణుఁడు పా
    పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై!

    ఉత్పలమాల
    ఏల పరాత్పరా! రణము యీ గురు బంధుల గూల్చ లేననన్
    జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్
    లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూ
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో ఉత్పలమాల

      ఉత్పలమాల
      ఏల పరాత్పరా! సమర మీ గురు బంధుల గూల్చ లేననన్
      జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్
      లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూ
      పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

      తొలగించండి
  32. ధన్యవాదాలు గురుదేవులకు సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  33. కూలగదోయునే మనల కుప్పగ యారురిపుల్ గదా యనిన్
    పాలకుడంతటన్ తలచి పట్టుగ నంతము చేయునా తరిన్
    బోలము రీతిగా గురుని బోధతొ యంతర వైరులా ప్రతా
    పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  34. పాలు పెరుంగు దొంగిలుచు పల్లెతలాడెడి కల్లలంచునా
    బాలుడు తల్లి నేమరచు బాల్య విశేషములందు గాంచ గో
    పాలుడు వల్లవాంగనల వల్వలు దోచెనటంద్రు గాని పా
    పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  35. ఉత్పలమాల:
    -----------
    మేలును జేయగాదగును,మేదినిపైనను బీదవారికిన్
    పూలనుబెట్టివారలిక,పూజలుజేయగనుండ శ్రద్ధతో
    కూళలుజేరికొందరిట, కుట్రకుతంత్రములల్ల వారి పా
    పాలనొనర్చె ముక్కలుగ ,బల్లిదుడై జనులంత మెచ్చగన్.

    రిప్లయితొలగించండి