3, ఆగస్టు 2021, మంగళవారం

సమస్య - 3802

4-8-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా”
(లేదా...)
“దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్”

68 కామెంట్‌లు:

  1. మన్నన సేయరే పనికిమాలినవాఁడని నింద సేతురే
    నన్నుఁ, గనుంగొనుండిదె ఘనంబుగఁ జేసెద నెన్నొ కార్యముల్
    గన్నులముందు నిట్టు నటుఁగాఁ గదలించెడి పోగు హస్తమం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి

  2. అన్నువు వచించె నిట్టుల
    యన్నా ముసిరె గనుమంటి నాసక్తమిటన్
    వన్నియ వాసిగ గృహమం
    దున్నను సూచీ బిలమున దూర్చెదఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  3. ఎన్నగ గారడి విద్యను
    మిన్నగ జూపింప బలికె మేటి విధానన్
    కన్నుల ముందే యియ్యెడ
    దున్నను సూచీ బిలమున దూర్చెద గనుమా !

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెన్నగు దండను గ్రుచ్చగ
    పున్నాగము లొసగి దారము మరచితివిగా
    కన్నా! సరిజూచెద యెం
    దున్నను సూచీబిలమున దూర్చెద గనుమా!

    రిప్లయితొలగించండి
  5. ఎన్నగకుహనాయోగులు
    బన్నముఁజేయగపరమముబందీసేయన్
    చెన్నుగచెప్పుదురిటులను
    దున్ననుసూచీబిలమునదూర్చెదగనుమా

    రిప్లయితొలగించండి
  6. ఉన్నవయస్సుతొంబది మహోన్నత జీవిత మొంది మించితే
    నన్నులమిన్న భార్యయయి హర్షము పంచుచు సాకు చుండగా
    కన్నులు శక్తి గల్గి సహకారము నియ్యగ బొందు హస్తమం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి

  7. అన్నను పిల్చి కోపమున యన్నువ తిట్టెను బుద్ధి హీనుడా
    సన్నని సంపుటమ్మదియె శత్వరి వేళను గాంచడెవ్వడున్
    వన్నియ యున్నచోట సులభమ్మగు ఖాత్రము కాంతి యింటియం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి
  8. ఉ:

    చిన్నది ముందు నిల్చి బహు చిత్రము కన్నులు గీటుచుండగన్
    సన్నని నవ్వు నవ్వి కడు చక్కని బల్కులు హాస్యమాడగన్
    నన్నిక జేరు నెప్పుడని నర్మిలి హత్తగ జూచువాడ, సం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  9. మిన్నగరోగమీతఱినిమీరదునీదరిసూదిమమందుతో
    పిన్నలుపెద్దలందరునువేరుగనాడకనాలకింపుడీ

    అన్న! కరోననిచ్చటనెహాయనిచావగనేనుసేయుదున్
    దున్ననుసూదిబెజ్జమునదూర్చెదమీరలుమెచ్చురీతిగన్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెన్నగు పుష్పమాలికను చక్కగ గ్రుచ్చగ మల్లెపూవులన్
    ఎన్నిక జేసి తెచ్చి మరి యెట్టుల మర్చితిరయ్య దారమున్?
    కన్నుల దృష్టి పెంచియును కన్గొని మెల్పుగ చప్పునద్ది యెం
    దున్నను సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెన్నగు పుష్పమాలికను చక్కగ గ్రుచ్చగ మల్లెపూల మీ
      రెన్నిక జేసి తెచ్చి మరి యెట్టుల మర్చితిరయ్య దారమున్?
      కన్నుల దృష్టి పెంచియును కన్గొని మెల్పుగ చప్పునద్ది యెం
      దున్నను సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్.

      తొలగించండి
    2. చిన్నది పుష్పమాలికను చెన్నుగ గ్రుచ్చగ ........

      తొలగించండి
  11. కన్నులు రెండునూ తెరచి కాంచుచు కాంతులు చిందు దీపముల్
    చెన్నగు రీతిగా వెలుగు చెంగట చూపెద నేర్పుకాంచుడీ
    సన్నని దారమున్ యెవరి సాయము లేకనె పెద్దలెంతమం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రెండునూ' అనడం సాధువు కాదు. 'దారమున్+ఎవరి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు.సవరిస్తాను

      తొలగించండి
  12. చిన్నది పెద్దదంచనక చేసెదె మీరలు సెప్పినట్టులన్
    మన్నిక బొందినాను గడుమాన్యు
    లచే పని నేర్పులోన నా
    కన్నను మిన్నలేరు వినుమా
    యొక దారము నాదు హస్తమం
    దున్నను సూది బెజ్జమున దూర్చె
    ద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  13. ఎన్నగ దృష్టి లోపముల నెన్నడెఱుంగని వాడ నేను! నా
    కన్నులు దేనినైన కటకమ్ముల సాయము నంద బోకయే
    మిన్నగ గాంచు! తథ్యమిది! మిక్కిలి సూక్ష్మపు ద్రవ్యరాశి యం
    దున్నను సూది, బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నగ దృష్టి లోపముల నెన్నడెఱుంగని వాడ నేను! నా
      కన్నుల దేనినైన కటకమ్ముల సాయము నంద బోకయే
      మిన్నగ గాంచ వీలగు సుమీ! పరిమాణము జూడ స్వల్ప మం
      దున్నను సూది, బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

      తొలగించండి
    2. ఎన్నగ దృష్టి లోపముల నెన్నడెఱుంగని వాడ నేను! నా
      కన్నులు దేనినైన కటకమ్ముల సాయము నంద బోకయే
      మిన్నగ గాంచు! దారమును, మిక్కిలి సూక్ష్మపు ద్రవ్యరాశి యం
      దున్నను సూది, బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

      తొలగించండి
  14. అన్నలు చూడరో! కనుల కద్భుతదర్శన మిచ్చుచిత్రమున్
    చిన్న శశాంకమేగతిని సింహము జంపగ శక్తియుక్తమౌ
    ఉన్న నుపాయమే మదిని నొప్పుగ గ్రాఫికు మాయజాలమున్
    దున్నను సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    2. సవరణతో

      అన్నలు చూడరో! కనుల కద్భుతదర్శన మిచ్చుచిత్రమున్
      చిన్న శశమ్మదే ఘన సింహము జంపగ శక్తియుక్తమౌ
      ఉన్న నుపాయమే మదిని నొప్పుగ గ్రాఫికు మాయజాలమున్
      దున్నను సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్

      తొలగించండి
  15. పున్నమి రేతిరి నందున
    వెన్నెల వెలుగున మదిరను పెక్కువ గ్రోలన్
    సన్నని కొసను నిషా మీ
    దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా

    రిప్లయితొలగించండి
  16. పున్నమికి బలి నిడుదురా
    దున్నను, సూచీబిలమున దూర్చెదఁ గనుమా
    సన్నని దారము, పూలను
    తిన్నగ కుట్టగ దయగల దేవత కొరకై.

    రిప్లయితొలగించండి
  17. ఉత్పలమాల:
    కన్నుల మాయఁజేయు కనికట్టిది కాదు- తరాలనేర్పు!,నే
    తన్నలు నగ్గిపెట్టె నిట నారుగజమ్ముల చీర దాచిరే?!
    సన్నని నూలు దారమును 'శాలి' సవాలనె చిమ్మచీకటం
    “దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్”
    ---కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  18. కన్నెలకై వస్త్రమ్ముల
    నెన్నిటినోకుట్టియుంటినేకాగ్రతతో
    వన్నియగల దారంబెం
    దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా

    రిప్లయితొలగించండి
  19. సమస్య :

    దున్నను సూదిబెజ్జమున
    దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    ( పన్నెండేళ్ల వనవాసం ముగించిన తరువాత అజ్ఞాతవాసం ఏడాదిపాటు చిన్నదైన విరాటరాజు రాజ్యంలో చేద్దామని , మీ సహకారంతో అసాధ్యమైనా చేయగలనని తమ్ములతో అంటున్న ధర్మరాజు .)

    ఉత్పలమాల
    ------------
    దన్నుగ నాకు నుండవలె
    దమ్ములు మీరలు మత్స్యరాజ్యమం
    దెన్నగ నేరికిన్ దెరలు
    దీయక స్వీయపు రూపుకెప్పుడున్ ;
    జెన్నుగ వత్సరమ్ము జన
    జేతల మౌదము ; తీవ్రకష్టమం
    దున్నను , సూదిబెజ్జమున
    దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్ .

    ( దన్నుగ - తోడుగ ; తెరలు దీయక - బయటపడక ;జేతలు - జయించినవారు )

    రిప్లయితొలగించండి
  20. అన్నకు రాదుగ కుట్టుట
    చిన్నగ సాయం బడుగగ,చెల్లిబదులిడెన్
    "యన్నానీవాగుము సం
    దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా"

    రిప్లయితొలగించండి
  21. పున్నమి రేయి మిత్రులను పూన్చితి మద్యము గ్రోలమంచు, యా
    వెన్నెల కాంతి యందుననె పెద్దగ దీప్తియె లేకపోయినన్
    చెన్నుగ గడ్డి పోచనిడ , జెప్పితి నిట్టుల , గల్లు మత్తు మీ
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గ్రోలుమంచు నా వెన్నెల.." అనండి.

      తొలగించండి
  22. పన్నుగ దంతముల్ ప్రిదిలె వంగెను మధ్యమ టంచు చేతిలో
    దన్నుగ నూతకర్ర నిడి దైహికదుర్బలు డైతి వైననున్
    బింకము వీడవన్న, నుడివెన్ వడి వృద్ధుడు నిట్లు బస్సునం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. కన్నుల చురుకుదనమ్మును
    మిన్నగ గలవాడనేను మిత్రమ వింటే
    సన్నగ దారము చలమం
    దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా

    రిప్లయితొలగించండి
  24. *“దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్”*
    యెన్నని విన్ననీగతిని నెప్పటికప్పుడు నూత్న రీతినిన్
    విన్నను చోద్యమౌ నటుల వింతగ దోచుచు నెల్లవారికి
    న్నెన్నికలందు మాటలివి యెల్లలు దాటగ సాధ్యమే కదా!

    రిప్లయితొలగించండి
  25. కురుక్షేత్ర యుద్ధానంతరం కనపడని దుర్యోధనునికై వెదకుతూ ఆక్రోశించిన భీముఁడు....

    కందం
    మున్ను సభలో పరిభవముఁ,
    బిన్నలు పెద్దలొరుగుటకుఁ బెను కారణమై
    తిన్నగ డాగిన ఖలుడౌ
    దున్నను సూచీబిలమున దూర్చెదఁ గనుమా!

    ఉత్పలమాల
    మన్నన వీడి కృష్ణ కవమానము జేసి దురాత్మకుండుఁ దా
    నెన్నుచు యుద్ధమున్ రుధిరమింతగ పారగ కారణంబునై
    తిన్నగ దాగెనెచ్చటనొ?తీర ప్రతిజ్ఞలు ధార్తరాష్ట్రుడన్
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్!

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. అన్నుల మిన్నలు నన్నిటఁ
    గన్నఁ గడింది పొగడంగఁ గమనీయముగాఁ
    గ్రన్నన దారము, నేలను
    దున్నను, సూచీబిలమునఁ దూర్చెదఁ గనుమా


    ఎన్నఁడు పొల్లు వోదు సుమి యే నిడ మాటను భూమి క్రుంగినన్
    మిన్నది నేలఁ గూలినను మిత్ర శశాంకులు దారి తప్పినం
    గ్రన్నన నేఁగి మీ రిభ నికాశముఁ దెండిట కగ్గి పెట్టెపై
    దున్నను సూది బెజ్జమునఁ దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  28. అన్నా!కట్టుమ ఱాటికి
    దున్నను,సూచీబిలమున దూర్చెదగనుమా
    కన్నుంగవ మూసితెఱచి
    కన్నంతనె బాల!యిపుడె కలకాదుసుమా

    రిప్లయితొలగించండి
  29. పిన్నలు మీరు పెద్దలను వెంగెములాడెదరేల మాదెగా
    మిన్నగు కంటి చూపనగ మించిననేమి వయస్సు చూడుమా
    సన్నని నూలుపోగులని సందియమేలనిటిమ్ము నీడనం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి
  30. అన్నరొ గడ్డివాములకు నడ్డము వచ్చెనుగట్టుమా వెసన్
    దున్నను,సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్
    గన్నులు మూసిదెర్వగనె గాంచుడు దారమునిప్పుడే వెసన్
    నెన్నగ జాలకష్టమిది యేబది యేండులు దాటువారికిన్

    రిప్లయితొలగించండి
  31. నిన్ననెవచ్చెమాంత్రికుడు
    నేర్పగజూపెనుమంత్రవిద్యలే
    క్రన్ననచేతిబెత్తమును రయ్యనతిప్పుచువస్తుమార్పిడితో
    తిన్నగతాడుపామనుచు,
    తేలునుజూపెనుఎండ్రికిచ్చగా
    కన్నులచూపి,రేపుతన
    కౌషలమేచ్చపుకారుజేసెనా
    దున్నను సూదిబెజ్జమున
    దూర్చెద మీరలు మెచ్చురీతిగన్
    ....తోకల...

    రిప్లయితొలగించండి
  32. ఎన్నగనాదు నేత్రయుగమెంతయు తీక్ష్ణతమంబు మిత్రమా
    మిన్నగ జూడగల్గునవి మిక్కిలి స్పష్టత గల్గియుండు నే
    సన్నని దారమైననది సంచలనంబున నుండి హస్తమం
    దున్నను సూది బెజ్జమున దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్

    రిప్లయితొలగించండి