1-9-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్”(లేదా...)“అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్”
బంధుజను లీర్ష్యపరులుగాసంధిని చెడగొట్ట రక్త సంబంధులిలన్కంధరము వంచగ తుదిదశ"అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్"
ఇంధనముగాగదేహముసంధించుచుజీవుడెపుడుసాధనశరమున్వంద్యుడుగాగనువిషయములంధత్వముపుణ్యజన్యమైప్రాప్తించున్
క్రొవ్విడి వెంకట రాజారావు: బంధము లన్నియు పోనిడి సంధించిన దుష్కృతంపు చర్యల తోడన్ మందిని నొగుల్చు పాపికి అంధత్వము పుణ్య జన్యమై ప్రాప్తించున్.
మంధర వలె జగడంబు ల నీ ధరణిని సృష్ఠి చేయు నీ ర్ష్యా ళువు తో బంధం బును వీడుట యను నంధ త్వ ము పుణ్య జన్యమై ప్రాప్తి o చున్
బంధంబేమియులేనిజీవనమునన్పాటిల్లుభద్రంబుతోసంధుల్గాననిమానసంబుదగతాశాంతింపపూరంబుగాబంధుత్వంబునుకానకేవిషయమేభావింపలేకన్భువిన్అంధత్వమ్మదిపూర్వజన్మక్రుతపుణ్యప్రాప్తమూహింపగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సవరించిన పూరణలునిగర్వి, అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ కార్యసాధకుడైన మిత్రునితో నొక సఖుడు :కందంబంధుల్స్నేహితులందరిసంధిని జతగూడు కార్యసాధక! చెడు నీవెందున గాంచవె? నీదౌయంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్!శార్దూలవిక్రీడితముబంధుల్ స్నేహితులందరిన్ మిగుల సంభావించు సౌజన్యమైసంధిన్గూడుచు కార్యసాధకుడవై సాధించి కార్యమ్ములన్బంధంబందున మంచినందరిఁ దగన్ భావించిగాంచునయ్యంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్తమూహింపఁగన్
అంధత్వంబను దిగులునఆంధోళన వలదు వలదు ఆశా దృష్టేఇంధనమైనిన్నునడుపుఅంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధుత్వము విడి కప్పురగంధి వలువలూడ్చిరంట ఖలులు సభన్ రాబందుల రీతిని తలచిననంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్.
క్రొవ్విడి వెంకట రాజారావు:బంధమ్ముల్ విడకుండ స్వార్థగుణముల్ వర్జించి దుష్టత్వమున్ సంధానంబు నొనర్చకున్ పరుల నాసాంతమ్ము బాధింపకున్చిందుల్ ద్రొక్కక పుణ్యమే చలిపినా చేకూరెనే నేటి యీఅంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపంగన్.
సంఘము లో దుష్టలను బంధించాలంటే స్నేహాన్ని కోల్పోతాము, సంస్కర్త గా ఉండాలంటే బంధుత్వానికి దూరమౌతాము.అందుకు మంచైనా చెడైనా మనకెందుకులే .. చూసి చూడనట్లు .. అంధునిగా.. ఊహించు కొనుటే పూర్వజన్మ పుణ్యము ...ఊహ. గా ఈ ప్రయత్నము: శా: బంధింపం గను దుష్ట శక్తులనగన్ బాధించు మిత్రుత్వమున్బంధుత్వమ్మది దూరమౌను విధిగా పాల్గొన్న సంస్కర్త్రు గాసంధించం గను మంచి చెడ్డ లొకటై సాగింప జీవాతువైయంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్జీవాతువు=జీవగర్రవై. చంద్రశేఖర్
1 వ పాదం లో ...మిత్రుత్వమున్ / మిత్రత్వమున్ &. 2 వ పాదం లో సంస్కర్తు / సంస్కర్తృ గా చదువ గలరు
అంధుండైనను మనసునుబంధించి చరింప భక్తి పథమును విడకన్సంధించి చూడనాతనిఅంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
ధృతరాష్ట్రుని అంధత్వం)సంధాతయైన కృష్ణునిబంధన మొనరించుచుండు పాపపు కర్మన్సందర్శన కుదరని యాయంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బాంధవ్యమున నిలువవలెబంధములన్న పలుకవలె మంచిగ నెపుడున్బంధువులతప్పులయెడలఅంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
అంధుండైననునేమి యెల్లరకు తానానంద సంధాతయైవిందుల్చేయుచు సన్నిసర్గ గరిమన్ భేదంబులన్ జూపకన్డెందంబందున కిల్బిషమ్ములకు చోటే లేని ధన్యాత్ముకున్అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
బంధుత్వమ్మును నిల్ప నోగులను సంభావించుచున్ నిత్యమున్ఛందోభంగములన్ సహించి కవులన్ సంతృప్తినొందించ శ్రీగంధమ్మున్ గడుఁ ప్రేమతోఁ బులుముచున్ కార్యమ్ములీడేర్చనౌనంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
బంధము, పాప ఫలమిదియెనంధత్వము, పుణ్యజన్యమై ప్రాప్తించున్గంధముగ యంటి శ్రేయోబంధుర సంచయము, కర్మ మర్మంబిదియౌ
ఛాందస దీక్షను దొలగగనంధత్వము పుణ్యజన్మమై ప్రాప్తించున్కందర్పహరుని స్మరణమందాకిని మజ్జనమ్ముమా పద శ్రద్ధా
మూడవ పాదంలో కందర్పహరుని స్మరణము గా చదువ ప్రార్ధన!
బంధ విమోచనము సు సుతసంధానము విత్త యోగ సద్గుణ చయ సత్సంధానము సంతత వీ తాంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్అంధుల్ గారె నరోత్త మోత్తములు లోలాక్షీ ప్రలోభమ్ముచే నంధీభూతులె యెంత వారయినఁ గా మాకాంక్ష మీఱంగ దోరింధానేద్ధ ముఖారవింద పర నారీ లోక వీక్షా నిమిత్తాంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపఁగన్ [దోః+ఇంధాన+ఇద్ధ=దోరింధానేద్ధ]
ఇంధనమువలన గలుగునునంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్ బంధము లన్నియు పుడమిని కంధరమున్ నలుపు గలుగు ఖచరుని గొలువన్
అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్ నంధత్వంబున నుండువారలును దానానంద ముప్పొంగగాబంధాలెన్నియొకల్గి సంతసముతోవ్యాపారాపారీణులైయంధత్వంబును మర్చిపోవుచును దైవారాధనంబే యికన్
బంధుప్రీతిని జూపుచుదంధనమొనరించు రేని దౌష్ట్యములకటా బంధకమే మేలీతని కంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధువు లటంచు కొందరు బంధుత్వము కలుపుకొనుచు బాధలు పెట్టన్కుందక నటించ సతతమ్మంధత్వముపుణ్యజన్యమప్రాప్తించున్మరొక పూరణసంధిని నిరాకరించుటయంధత్వము;పుణ్యజన్యమై ప్రాప్తించున్బంధము నిలిపెడు తీరునబంధులకండై నిలిచిన పాశము హెచ్చున్
బంధుజను లీర్ష్యపరులుగా
రిప్లయితొలగించండిసంధిని చెడగొట్ట రక్త సంబంధులిలన్
కంధరము వంచగ తుదిదశ
"అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్"
ఇంధనముగాగదేహము
రిప్లయితొలగించండిసంధించుచుజీవుడెపుడుసాధనశరమున్
వంద్యుడుగాగనువిషయము
లంధత్వముపుణ్యజన్యమైప్రాప్తించున్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబంధము లన్నియు పోనిడి
సంధించిన దుష్కృతంపు చర్యల తోడన్
మందిని నొగుల్చు పాపికి
అంధత్వము పుణ్య జన్యమై ప్రాప్తించున్.
మంధర వలె జగడంబు ల
రిప్లయితొలగించండినీ ధరణిని సృష్ఠి చేయు నీ ర్ష్యా ళువు తో
బంధం బును వీడుట యను
నంధ త్వ ము పుణ్య జన్యమై ప్రాప్తి o చున్
బంధంబేమియులేనిజీవనమునన్పాటిల్లుభద్రంబుతో
రిప్లయితొలగించండిసంధుల్గాననిమానసంబుదగతాశాంతింపపూరంబుగా
బంధుత్వంబునుకానకేవిషయమేభావింపలేకన్భువిన్
అంధత్వమ్మదిపూర్వజన్మక్రుతపుణ్యప్రాప్తమూహింపగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవరించిన పూరణలు
తొలగించండినిగర్వి, అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ కార్యసాధకుడైన మిత్రునితో నొక సఖుడు :
కందం
బంధుల్స్నేహితులందరి
సంధిని జతగూడు కార్యసాధక! చెడు నీ
వెందున గాంచవె? నీదౌ
యంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్!
శార్దూలవిక్రీడితము
బంధుల్ స్నేహితులందరిన్ మిగుల సంభావించు సౌజన్యమై
సంధిన్గూడుచు కార్యసాధకుడవై సాధించి కార్యమ్ములన్
బంధంబందున మంచినందరిఁ దగన్ భావించి
గాంచున
య్యంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్తమూహింపఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంధత్వంబను దిగులున
రిప్లయితొలగించండిఆంధోళన వలదు వలదు ఆశా దృష్టే
ఇంధనమైనిన్నునడుపు
అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధుత్వము విడి కప్పుర
రిప్లయితొలగించండిగంధి వలువలూడ్చిరంట ఖలులు సభన్ రా
బందుల రీతిని తలచిన
నంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబంధమ్ముల్ విడకుండ స్వార్థగుణముల్ వర్జించి దుష్టత్వమున్
సంధానంబు నొనర్చకున్ పరుల నాసాంతమ్ము బాధింపకున్
చిందుల్ ద్రొక్కక పుణ్యమే చలిపినా చేకూరెనే నేటి యీ
అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపంగన్.
సంఘము లో దుష్టలను బంధించాలంటే స్నేహాన్ని కోల్పోతాము, సంస్కర్త గా ఉండాలంటే బంధుత్వానికి దూరమౌతాము.అందుకు మంచైనా చెడైనా మనకెందుకులే .. చూసి చూడనట్లు .. అంధునిగా.. ఊహించు కొనుటే పూర్వజన్మ పుణ్యము ...ఊహ. గా ఈ ప్రయత్నము:
రిప్లయితొలగించండిశా:
బంధింపం గను దుష్ట శక్తులనగన్ బాధించు మిత్రుత్వమున్
బంధుత్వమ్మది దూరమౌను విధిగా పాల్గొన్న సంస్కర్త్రు గా
సంధించం గను మంచి చెడ్డ లొకటై సాగింప జీవాతువై
యంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
జీవాతువు=జీవగర్ర
వై. చంద్రశేఖర్
1 వ పాదం లో ...మిత్రుత్వమున్ / మిత్రత్వమున్ &. 2 వ పాదం లో సంస్కర్తు / సంస్కర్తృ గా చదువ గలరు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంధుండైనను మనసును
రిప్లయితొలగించండిబంధించి చరింప భక్తి పథమును విడకన్
సంధించి చూడనాతని
అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
ధృతరాష్ట్రుని అంధత్వం)
రిప్లయితొలగించండిసంధాతయైన కృష్ణుని
బంధన మొనరించుచుండు పాపపు కర్మన్
సందర్శన కుదరని యా
యంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బాంధవ్యమున నిలువవలె
రిప్లయితొలగించండిబంధములన్న పలుకవలె మంచిగ నెపుడున్
బంధువులతప్పులయెడల
అంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
అంధుండైననునేమి యెల్లరకు తానానంద సంధాతయై
రిప్లయితొలగించండివిందుల్చేయుచు సన్నిసర్గ గరిమన్ భేదంబులన్ జూపకన్
డెందంబందున కిల్బిషమ్ములకు చోటే లేని ధన్యాత్ముకున్
అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
బంధుత్వమ్మును నిల్ప నోగులను సంభావించుచున్ నిత్యమున్
రిప్లయితొలగించండిఛందోభంగములన్ సహించి కవులన్ సంతృప్తినొందించ శ్రీ
గంధమ్మున్ గడుఁ ప్రేమతోఁ బులుముచున్ కార్యమ్ములీడేర్చనౌ
నంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
బంధము, పాప ఫలమిదియె
రిప్లయితొలగించండినంధత్వము, పుణ్యజన్యమై ప్రాప్తించున్
గంధముగ యంటి శ్రేయో
బంధుర సంచయము, కర్మ మర్మంబిదియౌ
ఛాందస దీక్షను దొలగగ
రిప్లయితొలగించండినంధత్వము పుణ్యజన్మమై ప్రాప్తించున్
కందర్పహరుని స్మరణ
మందాకిని మజ్జనమ్ముమా పద శ్రద్ధా
మూడవ పాదంలో కందర్పహరుని స్మరణము గా చదువ ప్రార్ధన!
తొలగించండిబంధ విమోచనము సు సుత
రిప్లయితొలగించండిసంధానము విత్త యోగ సద్గుణ చయ స
త్సంధానము సంతత వీ
తాంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
అంధుల్ గారె నరోత్త మోత్తములు లోలాక్షీ ప్రలోభమ్ముచే
నంధీభూతులె యెంత వారయినఁ గా మాకాంక్ష మీఱంగ దో
రింధానేద్ధ ముఖారవింద పర నారీ లోక వీక్షా నిమి
త్తాంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపఁగన్
[దోః+ఇంధాన+ఇద్ధ=దోరింధానేద్ధ]
ఇంధనమువలన గలుగును
రిప్లయితొలగించండినంధత్వము,పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధము లన్నియు పుడమిని
కంధరమున్ నలుపు గలుగు ఖచరుని గొలువన్
అంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపగన్
రిప్లయితొలగించండినంధత్వంబున నుండువారలును దానానంద ముప్పొంగగా
బంధాలెన్నియొకల్గి సంతసముతోవ్యాపారాపారీణులై
యంధత్వంబును మర్చిపోవుచును దైవారాధనంబే యికన్
బంధుప్రీతిని జూపుచు
రిప్లయితొలగించండిదంధనమొనరించు రేని దౌష్ట్యములకటా
బంధకమే మేలీతని
కంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధువు లటంచు కొందరు
రిప్లయితొలగించండిబంధుత్వము కలుపుకొనుచు బాధలు పెట్టన్
కుందక నటించ సతత
మ్మంధత్వముపుణ్యజన్యమప్రాప్తించున్
మరొక పూరణ
సంధిని నిరాకరించుట
యంధత్వము;పుణ్యజన్యమై ప్రాప్తించున్
బంధము నిలిపెడు తీరున
బంధులకండై నిలిచిన పాశము హెచ్చున్