12-8-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్”(లేదా...)“సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై”
కుందేలు, తాబేలుల పరుగు పందెంఅమితమ్మగు విశ్వాసముగమనమ్మును నాపగాను గమ్యముజేరన్సమయమ్మది మించగ నాసమరమ్మును వీడి శూలి చయ్యనబారెన్ శూలి = శశము (ఆం.భా)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కిరాతార్జునీయం ఆధారంగా ఈ నా ప్రయత్నము: చం: తమతమ బాణముల్ దగిలి దైత్యుడు జచ్చె నటంచు వాదమున్సమతను వీడి యర్జునుడు శస్త్రము లెక్కును బెట్ట శంభుపైక్షమతను గుర్తెరుంగ, నిక కాచు మటంచును వేడ సన్నుతిన్సమరము మాని శూలి రభసమ్మున బారెను ప్రాణ రక్షకైవై. చంద్రశేఖర్
విమలుడు చెప్పిన పదమునుకుమతియె వక్రించె బేలకుబదులు నట యాయమతియె శూలిగ వ్రాసెనుసమరమ్మునువీడి శూలి చయ్యన బారెన్.
సుమధురజీవనయాత్రనుదమనమునెంచెనుకరోనదారుణరీతిన్చమరినకనులనుబాధనుసమరమ్మునువీడిశూలిచయ్యనబారెన్
చమరినకనులనులయమనుసమరమ్మునువీడిశూలిచయ్యనబారెన్
కుమతులె మిత్రులంచొలయు కూళుని తీరిచి దిద్ద నెంచుచున్ విమలుడు చెప్పెపాఠమవివేకికి కష్టమటంచు నెంచకన్ సుమతియె బేలయంచనగ శూలిగ మార్చుచు వ్రాసె నిట్టులన్ సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై.
సముచిత శూలము దాల్చియు సమయ మెరిగి దూకె దాను శత్రువు పైనన్ విమతుని జృంభణ తో నా సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్
కందంప్రమథాధిపు శిరమెంచ ప్రథమముగ భస్మాసురుండుఁ దద్వర పరీక్షన్సమయస్ఫూర్తిని వీడుచుసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్చంపకమాలప్రమథ గణాధిపుండిడ వరమ్ము నిశాచరుఁడా మహేశు శీర్షమున కరమ్మునుంచఁగ వరంపు పరీక్షకు నెంచి దుష్టుఁడైదుముకుచు రాగ వేగమున తోచక తా నెదిరించి చేయకేసమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై!
సవరించిన కందంకందంప్రమథాధిపు శిరమెంచ ప్రధమముగన్ 'వర' పరీక్ష దానవుఁడంతన్సమయస్ఫూర్తినిఁ దలపడుసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
యమనియమాదియోగములయాగములందునశక్తిమంతుడైఅమరినధైర్యమందునటనాటగరావణబ్రహ్మయుండగాసమముగలేనికన్నులవిచాలకశాంకరివీడిచెచ్చెరన్సమరముమానిశూలిరభసమ్మునపాఱెనుప్రాణరక్షకై
క్రొవ్విడి వెంకట రాజారావు: శ్రమతో పొందిన తిండిని నమలుచు నుండగ తటాన నక్క పరుగునన్ దుముకగ భయమ్ముతో తా సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్.
నెమలి పురవాసి శూలికితమియెక్కువ మద్యమనిన, త్రాగిన జబ్బుల్గుమిగ కలుగునని విని, విషసమ రమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్.
నెమలి పురవాసి శూలికితమియెక్కువ మద్యమనిన, త్రాగిన జబ్బుల్గుమిగ కలుగునని విని, విషసమ "రమ్మును" వీడి శూలి చయ్యనఁ బాఱెన్.
గమనమె భస్మాసుర ప్రాణములిక హరి చేతి యందున, నిజమ్ముసుమీ!అమరుడు కాడందులకేసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
కె.వి.యస్. లక్ష్మి: సమయస్ఫూర్తిని వీడుచు గమనమ్మును పెంచె తానె గమ్యము జేరన్ సమయము మీరగ చివరకు సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు: శ్రమపడి పొందినట్టిదగు చామ్యము మేయుచునుండ నంతలో దుముకుచు చెంత చేరుచును దుప్పియె మీదకురాగ భీతితో అధికపు మేనుతోడ నడయాడెడి దాని జయించలేకనే సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై!
Taipu tappu: adhikapu kaadu. amitapu
సమస్య :సమరము మాని శూలి రభ సమ్మున బారెను ప్రాణరక్షకై ( కౌరవసేనాధిపతియై మధ్యందిన మార్తాండునిలా పరాక్రమించిన కర్ణుని ధాటికి తట్టుకోలేక రణరంగం వీడిన శూలయుద్ధనిపుణుడు ధర్మరాజు )చంపకమాల ...................విమలుడు దానశోభితుడు వీరుడు కర్ణుడు దుర్నిరీక్షుడై చెమటల బట్ట జేయగనె చెంగున దేరును జేరి యెక్కుచున్ గుములుచు నింటికేగె రణ కోవిదశీలు డజాతశత్రుడే ;సమరము మాని శూలి రభ సమ్మున బారెను ప్రాణరక్షకై .( శూలి - శూలయుద్ధవిశారదుడు )
అమితోత్సాహపుగణమునసుముఖతతో తిరుగునేత శూలవ్యాధిన్స్థిమితముదప్పగసంకులసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
(బాణాసురుడు కుమార్తెతోనున్న అనిరుద్ధుని బంధించ, కృష్ణుడు యుద్దముచేయ శివుడు చేష్టలుడిగి నిలిచిపోయిన ఘట్టం) సమస్య: సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకైచ: సుమమును బోలినట్టియుష సుందరుడౌ యనిరుద్ధు స ద్మమునకు తెచ్చిగర్భమును దాల్చగ గన్గొని తండ్రి వాని బం ధమునను పెట్ట శ్రీహరి విదారము చేయగ, తాళలేక తాన్ సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై
అమరావతి భటుడొక్కడునమితోత్సాహంబునొంది యాజికి వెడలన్విమతుల బాణపు ధాటికిసమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్
శూలి=శూలరోగముకలవాడు
అమరద్విష భస్మాసురు ని మనం బెఱిఁగి శివుఁ డసమ నేత్రుం డకటా కుములుచు వ్యర్థంబౌ వాక్సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్విమల యశస్వి ఫల్గుణుఁడు వే చెలరేఁగఁగ భండనోగ్ర భూగమన విశారదుండు దృఢ కాయుఁడు గాంచిన భీకరారి రాడ్భ్రమ నర గాండివచ్యుత సుపర్వ వితాన విఘాత సైన్యమున్ సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను బ్రాణ రక్షకై [శూలి = శూలము ధరించిన యొకానొక కౌరవ వీరుఁడు]
సమరము జేయవచ్చియును శత్రుగణంబుల దూకుడుంగనిన్ సమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకైసమయము జూచి వచ్చి మఱి సైన్యము దోడుగరాగ ,దప్పకన్ విమతుల యంతుజూసెదను భీకర యుద్ధముజేసి వారితోన్
కుమతియొకడు శూలముగొనిసుమతిని హింసింపజొచ్చె సొమ్ముల కొరకైసమయానికిజేర జనులుసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
సుమతియొకండు మార్గమున సొమ్మునుజేకొని పోవుచుండగాసమయముజూచి యొంటరిగ సాగెడు నాతని నడ్డగించెనోకుమతి ధరించి శూలమును; కొందరి రాకనుచూచి చెచ్చెరన్సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై
అమరిననా నాటకమున ప్రమథాధిపునిగనతండు భయశీలుండైబ్రమసెను తాడును పామనిసమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
కుందేలు, తాబేలుల పరుగు పందెం
రిప్లయితొలగించండిఅమితమ్మగు విశ్వాసము
గమనమ్మును నాపగాను గమ్యముజేరన్
సమయమ్మది మించగ నా
సమరమ్మును వీడి శూలి చయ్యనబారెన్
శూలి = శశము (ఆం.భా)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికిరాతార్జునీయం ఆధారంగా ఈ నా ప్రయత్నము:
తొలగించండిచం:
తమతమ బాణముల్ దగిలి దైత్యుడు జచ్చె నటంచు వాదమున్
సమతను వీడి యర్జునుడు శస్త్రము లెక్కును బెట్ట శంభుపై
క్షమతను గుర్తెరుంగ, నిక కాచు మటంచును వేడ సన్నుతిన్
సమరము మాని శూలి రభసమ్మున బారెను ప్రాణ రక్షకై
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండివిమలుడు చెప్పిన పదమును
కుమతియె వక్రించె బేలకుబదులు నట యా
యమతియె శూలిగ వ్రాసెను
సమరమ్మునువీడి శూలి చయ్యన బారెన్.
సుమధురజీవనయాత్రను
రిప్లయితొలగించండిదమనమునెంచెనుకరోనదారుణరీతిన్
చమరినకనులనుబాధను
సమరమ్మునువీడిశూలిచయ్యనబారెన్
చమరినకనులనులయమను
రిప్లయితొలగించండిసమరమ్మునువీడిశూలిచయ్యనబారెన్
రిప్లయితొలగించండికుమతులె మిత్రులంచొలయు కూళుని తీరిచి దిద్ద నెంచుచున్
విమలుడు చెప్పెపాఠమవివేకికి కష్టమటంచు నెంచకన్
సుమతియె బేలయంచనగ శూలిగ మార్చుచు వ్రాసె నిట్టులన్
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై.
సముచిత శూలము దాల్చియు
రిప్లయితొలగించండిసమయ మెరిగి దూకె దాను శత్రువు పైనన్
విమతుని జృంభణ తో నా
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్
కందం
రిప్లయితొలగించండిప్రమథాధిపు శిరమెంచ ప్ర
థమముగ భస్మాసురుండుఁ దద్వర పరీక్షన్
సమయస్ఫూర్తిని వీడుచు
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
చంపకమాల
ప్రమథ గణాధిపుండిడ వరమ్ము నిశాచరుఁడా మహేశు శీ
ర్షమున కరమ్మునుంచఁగ వరంపు పరీక్షకు నెంచి దుష్టుఁడై
దుముకుచు రాగ వేగమున తోచక తా నెదిరించి చేయకే
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసవరించిన కందం
తొలగించండికందం
ప్రమథాధిపు శిరమెంచ ప్ర
ధమముగన్ 'వర' పరీక్ష దానవుఁడంతన్
సమయస్ఫూర్తినిఁ దలపడు
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
యమనియమాదియోగములయాగములందునశక్తిమంతుడై
రిప్లయితొలగించండిఅమరినధైర్యమందునటనాటగరావణబ్రహ్మయుండగా
సమముగలేనికన్నులవిచాలకశాంకరివీడిచెచ్చెరన్
సమరముమానిశూలిరభసమ్మునపాఱెనుప్రాణరక్షకై
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రమతో పొందిన తిండిని
నమలుచు నుండగ తటాన నక్క పరుగునన్
దుముకగ భయమ్ముతో తా
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్.
నెమలి పురవాసి శూలికి
రిప్లయితొలగించండితమియెక్కువ మద్యమనిన, త్రాగిన జబ్బుల్
గుమిగ కలుగునని విని, విష
సమ రమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్.
నెమలి పురవాసి శూలికి
తొలగించండితమియెక్కువ మద్యమనిన, త్రాగిన జబ్బుల్
గుమిగ కలుగునని విని, విష
సమ "రమ్మును" వీడి శూలి చయ్యనఁ బాఱెన్.
గమనమె భస్మాసుర ప్రా
రిప్లయితొలగించండిణములిక హరి చేతి యందున, నిజమ్ముసుమీ!
అమరుడు కాడందులకే
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిసమయస్ఫూర్తిని వీడుచు
గమనమ్మును పెంచె తానె గమ్యము జేరన్
సమయము మీరగ చివరకు
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశ్రమపడి పొందినట్టిదగు చామ్యము మేయుచునుండ నంతలో
దుముకుచు చెంత చేరుచును దుప్పియె మీదకురాగ భీతితో
అధికపు మేనుతోడ నడయాడెడి దాని జయించలేకనే
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై!
Taipu tappu: adhikapu kaadu. amitapu
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిసమరము మాని శూలి రభ
సమ్మున బారెను ప్రాణరక్షకై
( కౌరవసేనాధిపతియై మధ్యందిన మార్తాండునిలా పరాక్రమించిన కర్ణుని ధాటికి తట్టుకోలేక రణరంగం వీడిన శూలయుద్ధనిపుణుడు ధర్మరాజు )
చంపకమాల
...................
విమలుడు దానశోభితుడు
వీరుడు కర్ణుడు దుర్నిరీక్షుడై
చెమటల బట్ట జేయగనె
చెంగున దేరును జేరి యెక్కుచున్
గుములుచు నింటికేగె రణ
కోవిదశీలు డజాతశత్రుడే ;
సమరము మాని శూలి రభ
సమ్మున బారెను ప్రాణరక్షకై .
( శూలి - శూలయుద్ధవిశారదుడు )
అమితోత్సాహపుగణమున
రిప్లయితొలగించండిసుముఖతతో తిరుగునేత శూలవ్యాధిన్
స్థిమితముదప్పగసంకుల
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(బాణాసురుడు కుమార్తెతోనున్న అనిరుద్ధుని బంధించ, కృష్ణుడు యుద్దముచేయ శివుడు చేష్టలుడిగి నిలిచిపోయిన ఘట్టం)
రిప్లయితొలగించండిసమస్య: సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై
చ: సుమమును బోలినట్టియుష సుందరుడౌ యనిరుద్ధు స
ద్మమునకు తెచ్చిగర్భమును దాల్చగ గన్గొని తండ్రి వాని బం
ధమునను పెట్ట శ్రీహరి విదారము చేయగ, తాళలేక తాన్
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమరావతి భటుడొక్కడు
రిప్లయితొలగించండినమితోత్సాహంబునొంది యాజికి వెడలన్
విమతుల బాణపు ధాటికి
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్
శూలి=శూలరోగముకలవాడు
రిప్లయితొలగించండిఅమరద్విష భస్మాసురు
రిప్లయితొలగించండిని మనం బెఱిఁగి శివుఁ డసమ నేత్రుం డకటా
కుములుచు వ్యర్థంబౌ వా
క్సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
విమల యశస్వి ఫల్గుణుఁడు వే చెలరేఁగఁగ భండనోగ్ర భూ
గమన విశారదుండు దృఢ కాయుఁడు గాంచిన భీకరారి రా
డ్భ్రమ నర గాండివచ్యుత సుపర్వ వితాన విఘాత సైన్యమున్
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను బ్రాణ రక్షకై
[శూలి = శూలము ధరించిన యొకానొక కౌరవ వీరుఁడు]
సమరము జేయవచ్చియును శత్రుగణంబుల దూకుడుంగనిన్
రిప్లయితొలగించండిసమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకై
సమయము జూచి వచ్చి మఱి సైన్యము దోడుగరాగ ,దప్పకన్
విమతుల యంతుజూసెదను భీకర యుద్ధముజేసి వారితోన్
కుమతియొకడు శూలముగొని
రిప్లయితొలగించండిసుమతిని హింసింపజొచ్చె సొమ్ముల కొరకై
సమయానికిజేర జనులు
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్
సుమతియొకండు మార్గమున సొమ్మునుజేకొని పోవుచుండగా
రిప్లయితొలగించండిసమయముజూచి యొంటరిగ సాగెడు నాతని నడ్డగించెనో
కుమతి ధరించి శూలమును; కొందరి రాకనుచూచి చెచ్చెరన్
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను ప్రాణరక్షకై
అమరిననా నాటకమున
రిప్లయితొలగించండిప్రమథాధిపునిగనతండు భయశీలుండై
బ్రమసెను తాడును పామని
సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్