22, ఆగస్టు 2021, ఆదివారం

సమస్య - 3819

23-8-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరువుఁ దీయువారె బంధు హితులు”
(లేదా...)
“పరువును దీయువారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

62 కామెంట్‌లు:

 1. సుంతవింతలేదుసుమతులుమిత్రులు
  కష్టమందునిలచికాపుగాయు
  పంచిప్రేమమనకుపరిిపంధికినిగల
  పరవుఁదీయువారెబంధుహితులు

  రిప్లయితొలగించండి
 2. చేయ రాని పనులు చేయుచు పైపైకి
  మంచి ముసుగు తోడ మసలు చుండు
  దుష్ట లైన వారి దురిత స్వభావాల
  పరువు దీయు వారె బంధు హితులు

  రిప్లయితొలగించండి
 3. మంది యున్న చోట మన శత్రు
  మూకల
  పరువుఁ దీయువారె బంధు హితులు ,
  మనకవసర ముండ మన దగ్గరకు వేగ
  పరువుఁ దీయువారె బంధు హితులు

  పరువు = గౌరవము , పరుగు

  రిప్లయితొలగించండి
 4. రక్తమొకటియైన రక్తసంబంధులు
  ఉర్వి జనులకెల్ల నుండు వారు
  ఆపదలెదురైన నార్తితో రక్షింప
  పరువుఁ దీయువారె బంధు హితులు

  రిప్లయితొలగించండి

 5. ఈర్ష్య కలిగినట్టి హీనాత్ము లెల్లరుల్
  పరువుఁ దీయువారె, బంధు హితులు
  కష్టమంచు నీవు కన్నీరుపెట్టినన్
  దారిచూపి ప్రోచు వారె కాదె.

  రిప్లయితొలగించండి

 6. చుట్టునున్న వారు చుట్టాలనుచు నీవు
  మురిసి నంత నీవు మొండివేను
  నీదు సొమ్ము మ్రింగి నిన్నుదూరుచునెప్డు
  పరువు తీయు వారె బంధు హితులు.

  రిప్లయితొలగించండి
 7. తఱిగనిక్రుష్ణుడంతటనుహాయనినర్జునుమేలమాడుచున్
  విరివిగబాణవ్రుష్ణినటవేగురిపించెనునీసడించుచున్
  కరమునుబావగాగనటకాదనలేడుగభద్రసంగతిన్
  పరువునుదీయువారలెశుభంబునుగూర్చుహితుల్సుబాంధవుల్

  రిప్లయితొలగించండి
 8. సిరులను కల్గియున్నతరి చెంతను జేరుచు పిచ్చలించుచున్
  శరణము గోరి సంతతము స్తావము జేసెడు వారలెల్ల నీ
  విరుకున పడ్డనాడు నిను హీనుడలంజుడటంచు దూరుచున్
  పరువును దీయువారలె శుభంబును గూర్చు హితుల్ సబాంధవుల్.

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో...

   ఆటవెలది
   లక్కయింటిలోన రాజేయ జూచినన్
   సొంతవారలనుచు చింతలేల
   వంచనమున పార్థ! వనవాసమంపుచున్
   బరువుఁ దీయువారె బంధు హితులు?

   చంపకమాల
   పరులుగ లక్కయింటమిము ప్రాణము దీయగ నెంచ నర్జునా!
   మురిసెదవేల బంధులని పోరుకుదింపిన ధార్తరాష్ట్రులన్
   తరుణికి వల్వలూడ్చి సభ దావమునంపఁగ జూదమాడియున్
   బరువును దీయువారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్?

   తొలగించండి
  2. చక్కని పూరణలార్యా! అభినందనలు!💐💐

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. గురుదేవులకు మరియు శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు.

   తొలగించండి
 10. ఇంటరంభవంటి యిల్లాలి విడనాడి
  పరుల పంచ జేరు ప్రల్లదునకు
  బుద్ధి గరుప దేహ శుద్ధిచేసి యతని
  పరువుఁ దీయువారె బంధు హితులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ హా ! చ క్క ని పూ ర ణ !

   " పరుని భార్య గోరు " ‌అంటే ఇంకా చక్కగా ఉంటుంది

   ఇట్లు = గు రు మూ ర్తి ఆ చా రి

   తొలగించండి
 11. రిప్లయిలు
  1. యిరుసతి /ఇరుసత = 14 ( 2 *7) సంవత్సరములు గా చదువ గలరు

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. మార్పులతో
   చం:

   పరపతి పాడు జేతుమని పందెము గెల్వగ ధార్త రాష్ట్రులే
   యిరుసత వత్సరమ్ములును నింతి సమేత మరణ్య వాసులై
   వరములు బొంది రెల్లెడల పాండవు లండగ నస్త్ర శస్త్రముల్
   పరువును దీయు వారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్

   తొలగించండి
 12. పురుషుల లోన మేటియగు పుంగవు లుందురు, క్రుధ్ధులై సదా
  పొరుగున యుండి బాగుపడ బొత్తిగ నోర్చగ లేక కుళ్ళుతో
  పరువును దీయువారలె ; శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్,
  గురువులు, నిత్య వృధ్ధతిని గోరుచు గాచెద రన్ని వేళలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మేటి అన్న తర్వాత పుంగవులెందుకు? 'పొరుగున నుండి... నోర్వగ లేక..' అనండి.

   తొలగించండి
 13. సమస్య :

  పరువును దీయువారలె శు
  భంబును గూర్చు హితుల్ సుబాంధవుల్

  ( వనప్రియులు , శ్రమప్రియులు , మాతృభూమి
  ప్రియులు మాత్రమే మనకు హితులు, బంధువులు)

  చంపకమాల
  ...................

  తరువుల బెంచుచున్ జగతి
  తల్లడపాటును దీర్చువారలున్ ;
  బరువుల మోయుచున్ దమదు
  బాధ్యత మర్వని త్యాగజీవులున్ ;
  చెరగని భక్తియుక్తులవి
  చిందగ దేశపుగీర్తి కోసమై
  పరువును దీయువారలె - శు
  భంబును గూర్చు హితుల్ , సుబాంధవుల్ .

  రిప్లయితొలగించండి
 14. వంట చేయగోరి నింట బియ్యము గొల్చి
  చేట లోన బోసి చెరుగ బోవ
  సాయమందుకొనుచు సన్నపనిగ యేరు
  పరువుఁ దీయువారె బంధు హితులు౹౹

  రిప్లయితొలగించండి
 15. కరమగు యిచ్చతోడుతను కావలి గాయుచు హద్దులందునన్
  నిరతము దేశరక్షణము నిండు మనస్సున చేసి మించుచున్
  దురితములన్ చరించు కడుదుష్టుల వంచుచు కానివారిదౌ
  పరువును దీయువారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్

  రిప్లయితొలగించండి
 16. మాట మార్చి పలుకు మనిషి నడత, వాని
  పరువుఁ దీయు;వారె బంధు హితులు
  బాధ లోన యొకని వ్యధలు తీర్చుచు,
  దిగులు తొలగ జేయు ధీర మతులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "బాధలోన నొకని వ్యథలను..." అనండి.

   తొలగించండి
 17. పరిణతి లేని వారె పిడివాదము జేతురు వారలెన్నడున్
  పరువును దీయువారలె; శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్
  గురువుల బోధలన్ గల నిగూఢ విశేషములెంచి జూపుచున్
  పరమపదంబు జేర్చగల భారత సంస్కృతి మేల్దలంతురే

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. పరసతి దెచ్చితంచు వరభాషణ జేయుచు వంకబెట్టుచున్
   సరగున జేరిపోయెగద శత్రువుతోడను ద్రోహియై యనిన్
   నరవరు నాశ్రయించి పదునాలుగు లోకములందు
   లంకకున్ (నన్నకున్)
   బరువును దీయువారలె శుభంబును గూర్చుహితుల్ సుబాంధవుల్?

   తొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. సాధు జనులనెపుడు సంతోషబఱచగ
  దురిత కర్మ జేయు దుష్టజనుల
  పరువు దీయువారె బంధు హితులుగద
  సాధురక్షణంబె జగతి కోరు

  రిప్లయితొలగించండి
 21. కరుణయొకింతలేక పరకాంతల పంచనజేరి భార్యలన్
  పరమకిరాతకంబుగను పల్లటబెట్టు దయావిహీనులన్
  తరువుకుకట్టి నిర్దయగ తన్నులతో మరియాద సల్పుచున్
  పరువును దీయువారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్

  రిప్లయితొలగించండి
 22. దురితము లెన్నియోసతముదోర్బల మొప్పగ జేయువారిదౌ
  పరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్
  కరమును మేలుజేయుట సుకర్మమునౌనను భావనంబుతో
  పరులను హింసజేయుటయు బర్వును దీయుట మేలుగాదుగా

  రిప్లయితొలగించండి
 23. కులపు గొప్ప నెంచి కుజను లొనర్చు పొ
  గడ్తల కెద నుబ్బి గర్వ మంది
  టక్కరుల కొసంగ డబ్బును గపటంపుఁ
  బరువుఁ దీయువారె బంధు హితులు


  గురుతర కష్ట మేర్పడఁగఁ గో యన వెన్కకుఁ జూడకుండఁగాఁ
  బరువును దీయువారలె? శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్
  గురుతర కష్టమేర్పడఁగఁ గూర్మినిఁ గావఁగ సత్వరమ్ముగాఁ
  బరువును దీయు వారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్
  [పరువు = పరుగు]

  రిప్లయితొలగించండి
 24. దరువు వేసె నేడు దయలేని రోగము
  మరణ భయము లేక మాస్కు దాల్చి
  పరుల సేవ కొరకు ప్రాణము బెట్టుచు
  "పరువు దీయువారె, బంధుహితులు-

  రిప్లయితొలగించండి
 25. వరపునసాహితీసుతుడు
  వాక్సుసుదామృతనోటనుండగా
  నిరతముపద్యగద్యరచ
  నేస్థిరమై,యవదానమందునే
  సిరులుదయించు, బృత్యకుల
  చేష్టలు,గంటలు, పూరణంబులో
  పరువునుదీయువారలె
  శుభంబునుగూర్చుహితుల్ సుబాంధవుల్
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 26. శత్రువులెభయపడు, శాంతమూర్తులుకారు
  దుర్జనులవదలరు, దుష్టులనిల
  దూరముంచదలచితులనాడు ,ధూర్తుల
  పరువుఁ దీయువారె బంధు హితులు

  రిప్లయితొలగించండి