19, ఆగస్టు 2021, గురువారం

సమస్య - 3817

20-8-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద”
(లేదా...)
“ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్”

32 కామెంట్‌లు:

 1. పాండవాగ్రజు డె వరన బాలకు డనె
  ధర్మజుం : డా o జ నేయుని తండ్రి యె గద
  వాయు దేవుడ టంచును వాడె తెలిపి
  తన దు తెలివి నిరూపించె ఘనము గాను

  రిప్లయితొలగించండి
 2. పవనతనయునిపోలికపాండుసుతుఁడు
  నమ్మియున్నట్టినీతికినయముమీర
  బంటుతానుగనుండునుభక్చివెలయ
  ధర్మజుండాజనేయునితండ్రియెగద

  రిప్లయితొలగించండి
 3. వాయు పుత్ర భీమాగ్రజు డయ్యెనుగద -
  ధర్మజుండాంజనేయుని తండ్రియె గద-
  వాయువు నరుని మన్నించె పవనసుతుడు
  వెలసెను రథజెండాపైన మేలుజేయ!

  రిప్లయితొలగించండి
 4. నలువకు‌ తండ్రియా‌ నరహరి, రాముడు దశరధునిసుతుండు,తరచి చూడ

  శంతను డెప్పుడు జనకుడు
  గా దేవ
  వ్రతునకు,ముక్కంటి పట్టి విఘ్న

  నాథుడు గాదె,మన్మథునికి
  శ్రీ హరి
  పితరుండు కాంచగ,సుతుడు గాదె

  లవకుశులెప్పుడు రాముని తనయులు
  జన్మించె కుంతికి జముని వలన

  థర్మజుం,డాంజనేయుని తండ్రి యెగద.

  వాయు దేవుడు చేయుము భంగ పడక


  శాస్త్ర పఠనమనచు‌ బల్కె శాస్త యొకడు

  శిష్యుల పలుకులు‌ వినుచు చెలిమి తోడ

  రిప్లయితొలగించండి

 5. నిర్మల చెప్పమంటినిది నెచ్చెలి కుంతికి పుట్టెనెవ్వరో
  ధర్ముని తోడ? తెల్పు పృషతాంపతి యెవ్వని తండ్రియంటి? దు
  ష్కర్మ నొనర్చెడిన్ శకుని గర్హ్యుడెవండన చెప్పెనిట్టులన్
  ధర్మజు, డాంజనేయునకు దండ్రి, సుయోధను మేనమామయున్.

  రిప్లయితొలగించండి
 6. నాటక ప్రేక్షకుల దృష్టిలో...

  తేటగీతి
  పాండవాగ్రజు పాత్రలో పరవశించి
  యనిలునిగ నటియించియు నంజనికట
  సుతునొసంగిన నటుడని నుతులగొనిన
  ధర్మజుండాంజనేయునితండ్రియె కద!

  ధూళిపాళ పాత్రల నేపథ్యంగా....

  ఉత్పలమాల
  మర్మమెఱింగినట్టి నటమాన్యుడనంగను ధూళిపాళయే
  నిర్మల చిత్తవృత్తిఁ గడునేర్పునఁదీరుచు ధర్మరాజుగన్
  శర్మముగూర్చ వాయువుగ చక్కగఁ దా శకుఁడన్న పాత్రలన్
  ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్!

  రిప్లయితొలగించండి
 7. మర్మమెరుంగలేము మతిమాలిన వావుల నీయనెంచగా
  ఘర్మము నెంతనోడ్చినను గన్గొగలేకయె జుట్టుపీకుచున్
  దుర్మరణమ్మె మేలనుచు దూకెద కూపము నెవ్విధంబుగన్
  ధర్మజు డాంజనేయునకు తండ్రి సుయోధను మేనమామయౌ

  రిప్లయితొలగించండి

 8. ధర్మజ్ఙుం డాంజనేయుని తండ్రియె కద
  యనితనుతప్పుదిద్దెగదయ్యవారు
  వాచకమునచ్చుతప్పులువాటిలెగద
  "ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద"

  రిప్లయితొలగించండి
 9. ఛాత్రులనొకచోటను చేర్చి శాస్త్రిగారు
  వారలను పరీక్షింపగ ప్రశ్నలడగ
  బదులిడెనొక మతియెలేని ప్రతిఘు డిటుల
  ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద.

  రిప్లయితొలగించండి
 10. నిర్మల సద్గుణాత్ముడును భీముని
  యగ్రజు పేరు దెల్పుమా?
  ధర్మ పరుండు సజ్జనుడు ధన్యు
  డు కేసరి తండ్రి యేరికిన్?
  ధర్మ విహీనుడున్ శకుని దల్చగ
  నెవ్వరి కెట్లు బంధువౌ?
  ధర్మజు, డాంజనేయునకు తండ్రి,
  సుయోధను మేనమామయున్

  రిప్లయితొలగించండి
 11. వాయు సుతుడగు భీమకు భ్రాత యౌను
  ధర్మజుం , డాంజనేయుని తండ్రియె కద
  వాయు దేవుడు, మరిక నా వావి జూడ
  ధర్మజుండాంజనేయుని దమ్ము డగును

  రిప్లయితొలగించండి
 12. సమస్య :

  ధర్మజు డాంజనేయునకు
  దండ్రి సుయోధను మేనమామయున్

  ( ఛిలకమర్తి వారి గణపతి పిల్లలను పోగుచేసుకొని చెబుతున్న తలతిక్క చదువు )

  ఉత్పలమాల
  ...................

  మర్మము లేక చెప్పెదను
  మానసమందున నిల్పుకొండిరా !
  చర్మము నూడగొట్టెదను
  జక్కగ పాఠము రాకపోయినన్ ;
  నర్మపు పల్కు లేనెరుగ ;
  నాణ్యపు పంతులు నేనె నమ్ముడీ !
  ధర్మజు డాంజనేయునకు
  దండ్రి ; సుయోధను మేనమామయున్ .

  రిప్లయితొలగించండి
 13. వీధి నాటక పోటీల వేళ లోన
  పాత్ర ధారుల విడిదిలో పరిచరించు
  బాలకుడుసహచరునితో పలికె నిటుల
  ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద

  రిప్లయితొలగించండి
 14. యముని యంశాన జన్మించె అతడెవండు
  వాయువెవ్వాని తండ్రియై వరలినాడు
  వారినామముల్దెల్పుము వరుసగాను
  ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద

  రిప్లయితొలగించండి
 15. ఒక నాటకంలో భాగంగా ముగ్గురు తండ్రి, కొడుకు, మేనమామ ల పాత్ర పోషణ ఆధారంగా ఈ ప్రయత్నము:

  ఉ:

  ధర్మజు డండ గూడునని తానొక నాటక మందు జేరగన్
  మర్మమటంచు పోషణము మాటల నెంచి సుయోధనుండనన్
  నిర్మము డైన రూపమున నిల్వగ నల్లుడు నాంజనేయుడై
  ధర్మజు డాంజనేయునకు దండ్రి సుయోధను మేనమా మయన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. అచ్చుతప్పులన్నీదిద్దె అయ్యవారు
  వాటిలెగనవి విద్యార్ధె వ్రాయగాను
  జయని రాసెను జ్ఞకిమారజ్ఞానముగను
  "ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద"

  రిప్లయితొలగించండి
 17. ధర్మము వీడనట్టి మహితాత్ముడు పాండు సుతుం డెవండొకో
  యర్మిలితోడ జీవులకు నాయువు నిల్పెడి వాయు వెవ్వరో
  మర్మపు జూదమందు నసమానుఁడు సౌబలుఁ డేరి మామయో
  ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పాండురాజ కుమారుల ప్రథము డెవరు?
  ఎవని వాలాగ్ని కాహుతయ్యేను లంక?
  గజ షడాశ్యుల కేమగు కంధరుండు?
  ధర్మజుం: డాంజనేయుని: తండ్రియె కద!

  రిప్లయితొలగించండి
 19. హైందవ యితిహాస పఠనమందు మిగుల
  ప్రేమ గల పరదేశపు మించుకంటి
  వావివరుసలు తెలియక పలికె నిట్లు
  "ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద"

  రిప్లయితొలగించండి
 20. మర్మము తెల్పి బిడ్డలకు మంచిగ పద్యము వ్రాయనేర్పు చో
  ధర్మము కాకపోయినను తట్టిన మాటల తోడ పద్యమున్
  నిర్మితి చేసిచూపమన, నేర్పుగ పాదము వ్రాసి రిట్టులన్
  "ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్"

  రిప్లయితొలగించండి
 21. మర్మ మెఱింగి భీము డల మారుతి సాయము చేత కృష్ణకై
  శర్మము నిచ్చు చెంగలువ స్తంబము నిచ్చె, నమస్కరించె నా
  ధర్మజుఁ డాంజనేయునకుఁ! దండ్రి, సుయోధను మేనమామయున్
  పేర్మిని ప్రేమనిన్ మరచి వీరల పీడకు కుట్రపన్నిరే౹౹

  రిప్లయితొలగించండి
 22. నిర్మల మానసంబుగల నెయ్యుడ ,
  భీముని యన్న యెవ్వరా?

  మర్మమెరింగి దెల్పుమన మారుత
  మెవ్వరి దండ్రియా ? మరిన్

  ధర్మజు తోడ జూదమున దస్యుని పాత్రను దాల్చె నెవ్వరా ?

  ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్

  రిప్లయితొలగించండి
 23. నిర్మలధర్మవేత్తలకు
  నిక్కము పుట్టరెభక్తిచింతనుల్
  కర్మలపాపజన్ములకు
  కల్మషబుద్దులువెంటనుండవా
  మర్మముతెల్సినెంచుమిది
  మార్గముబోదపడంగనక్కటా
  ధర్మజుడాంజనేయునకుదండ్రి,
  సుయోధనుమేనమామయున్
  ....తోకల...

  రిప్లయితొలగించండి
 24. నిర్మలభక్తి నొక్కెడల నిత్యశుభాస్పదు డంజలించ నా
  ధర్మజుఁ డాంజనేయునకుఁ, దండ్రి! సుయోధను మేనమామయున్
  గర్మఠులార! మీరునిక గౌరవులార! తదీయశక్తిలో
  మర్మ మెరింగి పోరవలె మానము నిల్పుకొనంగ నిందనెన్.

  రిప్లయితొలగించండి
 25. ధర్మపాలన తత్పరుడార్య!యెపుడు
  ధర్మజుండాం,జనేయుని తండ్రియెకద
  వాయుదేవుడు నాల్లవ వాడు పంచ
  భూతములయందు ప్రాణుల బ్రోచునతడు

  రిప్లయితొలగించండి
 26. ధర్మ పరాయణుండనగ ధాత్రి యశంబును గాంచెనెవ్వరో
  ధర్మజు సోదరుండమితదార్ఢ్యమునందె నిజాంశమేరిదో
  దుర్మతి యెవ్వరా కపట ద్యూత కుతంత్రము పన్నెనయ్యెడన్
  ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్

  రిప్లయితొలగించండి
 27. ధర్మజు గూరిచిన్ విమల దానిటు చెప్పెను రామరాజుతో
  ధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్
  ఘర్మము నుండి వచ్చుటన గన్గొనలేకను సత్య,మట్లుగా
  షర్మిళ! చెప్పెగాని,విను సాధుజనాదరణుండెయ్యెడన్

  రిప్లయితొలగించండి
 28. పల్గుణా ప్రాణులకు నెల్లఁ గల్గఁ జేయు
  సుఖము ననిశమ్ము పెద తండ్రి సుమ్ము మనకు
  వాయు దేవు నేరు మనుచుఁ బలికె నింక
  ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద


  ధర్మజ వాయు తచ్ఛకుని తండము ద్వాపర సుప్ర సిద్ధమే
  ధర్మయు తాక్ష , చాలన, కుతంత్ర కళా కలి తాక్ష లోభ వ
  త్కర్మ రతాంతరంగ సు వికాసులు మువ్వు రహో క్రమమ్మునన్
  ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్

  రిప్లయితొలగించండి