4, ఆగస్టు 2021, బుధవారం

సమస్య - 3803

 5-8-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్”
(లేదా...)
“అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్”

72 కామెంట్‌లు:

 1. అతివినయముజూపుటయన
  సతతముధూర్తజనులకది సరిపడునిలలో
  మతిలేనిమాటలేయన
  నతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

  రిప్లయితొలగించండి

 2. సతతము మద్యము గ్రోలెడు
  పతియన్నను రోసి యాంధ్ర పడతి యతని ప
  త్ని తొలగ వెతతోడ పలికె
  నతి వినయము కల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్.

  రిప్లయితొలగించండి
 3. గతితప్పుచు కపటంబున
  సుతిమెత్తగ మాటలాడి జొనుపుచు గత్తుల్
  పతనంబును గోరునెడల
  అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

  పై లక్షణాలు గలిగిన ఎవరైనా ధూర్తులే!

  రిప్లయితొలగించండి
 4. కందం
  ప్రతివారిని మన్నించుచు
  సతతముఁ గ్రమశిక్ష తోడ సాధింప పనుల్
  మతి నసహనమున జూడఁగ
  నతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్!

  చంపకమాల
  ప్రతియొక వారికిన్ దగిన పద్ధతి గౌరవమంద జేయుచున్
  సతము ప్రణాళికాయుతులు సద్గుణులై నెరవేర్చ కార్యముల్
  మతిని సహింపరై రగిలి మత్సర దృష్టినిఁ జూచు వారలే
  యతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

  ఆంధ్రులు = తెలుగువారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "ప్రతి యొక వ్యక్తికిన్.." అనండి.

   తొలగించండి
  2. 🙏గురుదేవులకు ధన్యవాదములు🙏

   సవరించిన పూరణ:

   చంపకమాల
   ప్రతియొక వ్యక్తికిన్ దగిన పద్ధతి గౌరవమంద జేయుచున్
   సతము ప్రణాళికాయుతులు సద్గుణులై నెరవేర్చ కార్యముల్
   మతిని సహింపరై రగిలి మత్సర దృష్టినిఁ జూచు వారలే
   యతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

   తొలగించండి
 5. పితవిశ్వామిత్రునాజ్ఞన్
  సుతులునుదక్షిణపథమునచూచిరినెలవున్
  సతతముశత్రులమాటిది
  అతివినయముగల్గినట్టియాంధ్రులుధూర్తుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి

 6. ప్రతిదిన మక్షతత్వము, హలమ్మును వీడక వారకాంతతో
  రతమును గోరువాడని వరానన యాంధ్రపడంతి వీడగా
  సతియెడబాటుతోడ నవసాదము చెందిన వాడు పల్కెనే
  యతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. సతతము కల్లల బల్కుచు
  గతి తప్పిన వార లగుచు కపట మనస్కుల్
  పతితు లు దుర్వర్త ను లై
  యతి వినయము కల్గి నట్టి యాంధ్రు లు ధూర్తు ల్

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వితముగ పాలన జేయక
  సతతము పౌరుల నొగుల్చు సాముల వెంటన్
  మతిదప్పి తిరుగు చుండెడి
  అతివినయముగల్గినట్టియాంధ్రులుధూర్తుల్

  రిప్లయితొలగించండి
 10. సతతమునమ్మకంబుననుశక్తులుగాగనుదారిఁజూపిరే
  అతివినయమ్ముధూర్తులగునాంధ్రులలక్షణమందురెల్లడన్?
  మతిభ్రమియింపమీరలునుమందులుగాగనుపల్కిరేభళా
  సుతులునుగారెవీరలునుసుందరభారతదేశమాతకున్

  రిప్లయితొలగించండి
 11. సతతము సాధువర్తనము సజ్జనకోటి సమాగ మంబునున్
  వితతపు సత్యభాషణము వెన్నెల జిల్కెడు మందహాసమున్
  చతురతతో మెలంగు మన సౌమ్యుల నాంధ్రుల నిట్టు లందురా
  "అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్"?

  రిప్లయితొలగించండి
 12. హితవు గలుంగు మాటల నహింస మతమ్ము గలింగి మెల్గుచున్
  బతుకుచునంత నందరికి బంధువులై మెలిగేటి యాంధ్రులన్
  ధృతిని కనంగ నోర్వని కుదృష్టి పిశాచ గణంబులే యనున్
  అతి వినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణ మందురెల్లెడన్

  రిప్లయితొలగించండి
 13. సతతము యహింస యనుచును
  బ్రతుకును నైవేద్యముగను బలినిడె యోధుల్
  ప్రతిచర్య బ్రిటను వారిది
  "అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్"

  రిప్లయితొలగించండి
 14. చం:

  ప్రతిఫల మెంచి చూడనగు పల్కులు నేర్చిన వింత సభ్యతే
  సతతము నొక్కతీరుగను సాకులు జెప్పుచు సాగుచుండగన్
  మతలబు నేమిటన్న పరమార్థము గాంచగ నింద మోపనై
  యతి వినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణ మందు రెల్లెడన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. చంపకమాల:
  సతతము "గారు" గార'నుచు శత్రువు నైన ను పల్కరించి నా
  తతమగు ప్రేమఁజూపు సమతా మహితాత్ములు ధూర్తులౌదురా?
  అతివినయమ్ము నైజమది! యాంధ్రులనిట్లన రాదు నయ్యయో !!
  *నతి వినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్!*
  ---కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 16. మతిగల తజ్ఞులు, మనవా
  రతివిన యము గల్గినట్టి యాంధ్రులు, ధూర్తుల్
  శతవిధ ముల నపనిందల
  తతి మోపిన తొనకరు ధృవతారల వలెనే!

  రిప్లయితొలగించండి
 17. జత గలిపెదరు ని
  యతి , వినయము గల్గినట్టి యాంధ్రులు ; ధూర్తుల్
  యతిగ వి నయమును జూపుచు
  సతతము నష్టపరచెదరు జనులకు భువిలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 18. బ్రతుకగ శక్తి నంతయును పందెముగా నిడి సాగు నాంధ్రులన్,
  మెతకదనమ్మునన్ జెలఁగు మిత్రుల, కొందరు తప్పు బట్టుచున్
  సతతము వారిపైననె యసత్యము లెన్నియొ నెక్కు బెట్టగా
  నతి వినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణ మందు రెల్లెడన్!

  రిప్లయితొలగించండి
 19. సతతము కేలుమోడ్చుచును చక్కగనవ్వుచు కాన్కలిచ్చుచున్
  సతమతమౌచు వ్యాజ్యముల సాగిలి కేంద్రపు నాయకత్వమున్
  అతిగతి గానరాని పలు యార్ధికచిక్కుల జిక్క సాజమే
  అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లరున్

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. అతిగతి లేని యట్టి జనులందర మోసముజేయజూచుచున్,
  ప్రతిపదమందునన్ సుధలు వర్షిల మాటల పేర్మిజూపుచున్,
  గతిఁ గన పాలకోత్తముల కావరి చేష్టల జూడఁ దోచెనే,
  యతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 22. చతురులుగా పేరొందిన
  నతివినయము గల్గినట్టి యాంధ్రులు, ధూర్తుల్
  మతిలేని వారి చేతల
  గతి దప్ప ప్రగతి కలఁగిరి కళ మాసెనయో

  రిప్లయితొలగించండి
 23. చతురులుగా పేరొందిన
  నతివినయము గల్గినట్టి యాంధ్రులు, ధూర్తుల్
  పితలాటపు మంత్రులతో
  మతిమాలిన నేత దెచ్చె ​పరిహాసంబే

  రిప్లయితొలగించండి
 24. మతిమాలిన నేతలిపుడు
  ప్రతినాయకులై ప్రభువుల పాదములొత్తన్
  పితలాటకము గని యనెద
  రతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

  రిప్లయితొలగించండి
 25. కె.వి.యస్. లక్ష్మి:

  ఇతరుల మంచిని చూతురు
  నతివినయము గలిగినట్టి యాంధ్రుల్; ధూర్తుల్
  మతిసెడి జనులకు నిచ్చలు
  వెతలను గూర్చుచు నడరును వెంబరు లౌచున్.

  రిప్లయితొలగించండి
 26. సతతము గలహము లాడుచు
  నతలాకుతలంబుజేసి యాప్తుల యాస్తుల్
  నతులను జేయుచు నెదుటన
  అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

  రిప్లయితొలగించండి
 27. చతురులు కార్యసాధకులు సన్మతులాంధ్రులు సద్వివేకులై
  స్తుతమతులైన బెద్దలను చొక్కముగా మది నాదరింతురే
  మతిచెడినట్టివారలును మందులె బల్కెదరీ విధంబుగా
  నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 28. కతిపయ దినంబులు మహో
  న్నత రీతిఁ బ్రియములు వల్కి నటియించుచు మి
  త్రత వర్తిల్లు నరాధము
  లతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్


  సతతము గౌరవం బిడుట సచ్చరి తాంధ్రుల లక్షణంబునై
  నుత జన సమ్మతం బయి మనోహరమై విలసిల్ల ధాత్రిలో
  వితత దురాప వాదములు ద్వేష గుణమ్మున రేఁగు చుండఁగా
  నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 29. సతతముగౌరవించుచును సజ్జనభావము గల్గుచుండగా
  నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రులక్షణ మందురెల్లెడన్
  మతిచెడువాని పల్కులవి మర్మపుమాటలు బల్కనోపునే
  యతివినయమ్ము లాంధ్రులని హారతులిచ్చెను దేశదేశముల్

  రిప్లయితొలగించండి
 30. సతతము దీక్ష తోడ వ్యవసాయము చేయుచు నూత్న పద్ధతం
  దతులిత మైన పేరుగొని యందరికిన్ గడుఁ బ్రేమపంచుచున్
  బ్రతుకుచు నుండ నీర్ష్యగొని వారలపై, వచియింతురివ్విధిన్
  “అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్”

  రిప్లయితొలగించండి
 31. ప్రతి విషయంబునందు పరిపాటిగ ద్రోహము జేయు కేంద్రమం
  దతివినయమ్ముతో పదములంటెడి నేతలు స్వార్థబుద్ధితో
  పతనముగాగ నేడిటుల పౌరుష హీనుల మేలుకొల్పగా
  నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 32. ప్రతి విషయంబునందు పరిపాటిగ ద్రోహము జేయు కేంద్రమం
  దతివినయమ్ముతో పదములంటెడి నేతలు స్వార్థబుద్ధితో
  పతనముగాగ బాధ్యతగ పౌరుషమున్ రగులంగ జేయగా
  నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 33. శ్రీ మాతా!శివశివ! కారే!
  అతివినయము గల్గినట్టి యాంద్రులు ధూర్తుల్
  అతిగావాగకుయెప్పుడు
  మతిబోవుచుపిచ్చియెక్కి మైకముదప్పున్
  ....తోకల...

  రిప్లయితొలగించండి
 34. మొదటి పాదంలో ప్రాస తప్పడమే కాదు, పద్యాన్ని దీర్ఘాక్షరంతో మొదలు పెట్టారు.

  రిప్లయితొలగించండి