బంధు జనము లన్న బంధమ్ము మిన్న కా లు నిలువ దొక చోట వనిత కెప్డు చుట్టములను బ్రీతిఁ జూడఁగ నీదు మే నత్త తిరిగి వచ్చె నాలు గూళ్లు
ఉత్తల మయ్యె లోకులకు నోర్వగ లేక మహానలమ్మునుం దత్తఱ మంద జంతువులు ధారుణి వాయువు రేఁగినంత న త్యుత్తమ సుప్రచండ పవనోద్ధృత దుర్భర వేగ ధాటి కా నత్త రయంబునం దిరిగె నాలుగు గ్రామము లొక్క జామునన్
శివునిముద్దుబిడ్డసేనానిరయమున
రిప్లయితొలగించండినాయుధంబుబూనియవనిదిరుగ
తల్లిదండ్రియెదుటతానుగభ్రమియించి
నత్తతిరిగివచ్చెనాలుగూళ్లు
నత్త-వినాయకుడు
వేగిరమె తనయకు పెండ్లి సలుపకున్న
రిప్లయితొలగించండివయసు మీరుననుచు భయము నొంది
పెద్ద దాని వరుని వెదుకగ నాదు మే
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
రిప్లయితొలగించండిఎన్నికలను గెలిచి యేలెద మండల
మనుచు బంతమూని యలసట కిక
తావు లేదనుచు భృతకులతో కలిసి మే
నత్త తిరిగివచ్చె నాలుగూళ్ళు.
ఉన్న నొక్క సుతను నుత్తమ మేనల్లు
రిప్లయితొలగించండికొసగి చేసె పెండ్లి కోర్కె తోడ
వెడలె యాత్ర జేయ వేడ్క మీరంగ మే
నత్త తిరిగి వచ్చె నాలుగూ ళ్లు !
నాకు యిష్టమైన నా మేనయత్తకు
రిప్లయితొలగించండికష్టమొచ్చినటుల కలను గంటి
తెల్లవారు జాము తెలిసెను నాకు మే
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
మెత్తని వాడె యల్లుడని మిక్కిలి ప్రేమగ, నన్న పుత్రునిన్
రిప్లయితొలగించండిచిత్తమెరింగి పెంచెనల, చెన్నగు రూపము తోడ నున్న నో
బిత్తరి కన్యతోడ కరపీడన చేయగ నెంచి, వాని మే
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్
రిప్లయితొలగించండిముత్తియ చిత్రరాజముల బోడిక పంపగ నందునుండి తా
నుత్తమ వంశజుండును మహోన్నతమౌ గుణ శీలుడెవ్వడో
పుత్తడి బొమ్మవంటి తన పుత్రిక కున్ సరి జోడు నెంచ మే
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామము లొక్క జామునన్.
తత్తరపాటుతోడనటతాల్మినికోల్పడిక్రుష్ణుగానకే
రిప్లయితొలగించండిచిత్తముమాయతోడనటచిందులువేయగరాధయంతటన్
అత్తఱిఁడీకటిన్దునిమియాదవుమాధవుబట్టగానుమే
నత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములోక్కజామునన్
ప్రగతి పథమునందు పయనింతమనిచెప్పి
రిప్లయితొలగించండిగద్దెనెక్కి గుర్రు నిద్దరోయెఁ
నేలుకొనెడు ప్రభువు మేలుకొనకమున్నె
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
ముత్తెపు హారమేసుకొని ముచ్చట
రిప్లయితొలగించండిగా తన కొప్పనందునన్
మెత్తని మల్లె పూవులను మిక్కిలి
పెట్టియు యందమొప్పగా
పుత్తడి బొమ్మ నాట్యమును
ముల్లెను గాంచియు చేయబోయి మే
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రా
మము లొక్క జామునన్
చేతకాని వాడననుకొను వానికి ప్రోత్సహించెడు గురువుగారి ఉపదేశం
రిప్లయితొలగించండిఆటవెలది
దేవుఁడిచ్చెనిట్టి దీనంపు నడకని
దిగులుచెందకుండఁ దెలివిఁగలుగ
గంగిరెద్దుపైన కప్పిన బొంతలో
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
ఉత్పలమాల
మెత్తనివాడనంచు నను మేదిని మెచ్చదటంచు న్యూనతన్
విత్తపునార్జనన్ విడువ విజ్ఞత కాదుగ జీవితంబునన్!
జిత్తము నిల్పి పూనుకొని చేరుచు గుర్రపు జీనులోనికిన్
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్!
మేనరికపు పెళ్ళి మేలుకా దనుచున్న
రిప్లయితొలగించండియున్న కనులు కుట్ట యందమైన
వజ్రమంటి సుగుణవరుని తెచ్చుకొన మే
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు.
యున్న టైపాటు యన్న అని వ్రాయాలి.
తొలగించండివిత్తము వృద్ధి చేయుచునె వేగము బెంచగ నెడ్ల తావునన్
రిప్లయితొలగించండిముత్తెము వోలు యంత్రము ప్రమోదము గొల్ప నమర్చ బండికిన్
జిత్తరు వొంద వైభవము జేకుర నా శకటమ్మె పాఱెనే
"నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్"
పెత్తనాల మారి యింతి పొద్దెరుగక
రిప్లయితొలగించండిస్మార్టు ఫోను వెరవు మరగి యుండి
జనగమన పరిమిత సమయములందు మే
నత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
అత్తెరిదుంకెవానరము
రిప్లయితొలగించండిఅంబుది శక్తికిరామనామమే
బిత్తరబోవకూర్మమము బీకరముర్కుచుగెల్చనట్లుగా
సత్తువకల్గికొండలను
చక్కగనెక్కునుకాళ్ళులేనిదే
చిత్తముదైవనామమున
చిత్రముజర్గును సత్యమందునే
నత్త రయంబునన్ దిరిగె
నాలుగు గ్రామములొక్క జామునన్
...తోకల...
మొత్తుచు కొండకోనలను బొర్లుచు ముంచుచు
రిప్లయితొలగించండినూరువాడ దా
సత్తువజూపుచున్ నదము సాగగ నందలి జీవజాలమౌ
ముత్తెపు చిప్పలున్ ఝషము పుట్టపురుంగులు
పీతలాదిగా
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామము లొక్కజామునన్
సుత్తిని వేయకో హితుడ సూక్ష్మమునెంచగ నాలసించుచో
తొలగించండినత్తనడంకలన్ జనుల నానుడి యుండగ
మేలమాడెదో
పుత్తమునందు గేహమును మోయుచుసాగెడుజీవి
దానెటుల్
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామము లొక్కజామునన్
పుత్తము = పృష్ఠము
బారసాల యనుచు పయనమై నాదుమే
రిప్లయితొలగించండినత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు
కాలునిడవ కుండు కారణంబుననామె
తిరుగుచుండు నూళ్ళు ధీరయగుచు
బంధు జనము లన్న బంధమ్ము మిన్న కా
రిప్లయితొలగించండిలు నిలువ దొక చోట వనిత కెప్డు
చుట్టములను బ్రీతిఁ జూడఁగ నీదు మే
నత్త తిరిగి వచ్చె నాలు గూళ్లు
ఉత్తల మయ్యె లోకులకు నోర్వగ లేక మహానలమ్మునుం
దత్తఱ మంద జంతువులు ధారుణి వాయువు రేఁగినంత న
త్యుత్తమ సుప్రచండ పవనోద్ధృత దుర్భర వేగ ధాటి కా
నత్త రయంబునం దిరిగె నాలుగు గ్రామము లొక్క జామునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅత్తిలి,కొత్తపేట,తడ యాదగిరిన్వడి నేగినాదుమే
రిప్లయితొలగించండినత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములొక్కజామునన్
సత్తెపుకాలపున్,మనిషి ఛాందసమెక్కువయౌటచే దమిన్
సత్తువలేకపోయినను శక్తిని గూర్చుకు తిర్గుచుండునే
కొత్త ద్విచక్ర వాహనము కోరికతో కొనుగోలుచేసి మా
రిప్లయితొలగించండిరత్తయ కోర్కె తీరకనె రాజమహేంద్రికినేగె నొంటిగా
చిత్తమునందు నుత్సుకతచే తనుజేకొని వాహనమ్ము మే
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్
ఉ:
రిప్లయితొలగించండిపుత్తడి బొమ్మ దాననుచు బుల్లెటు బండిని ద్రిప్ప నెంచనై
కొత్తది బేరమాడి గొన గుర్తుగ భామిని చెంత చేరగన్
తత్తరపాటు లేక మది తాను ప్రయత్నము జేతునంచు మే
నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామము లొక్క జామునన్
వై. చంద్రశేఖర్
జిత్తులమారి యల్లునికి చిక్కెను పైకము మాయమాయె, మే
రిప్లయితొలగించండినత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్
తత్తరపాటెరుంగదతి ధైర్యముగా గనిపెట్టె దాగినన్
చిత్తొనరించెనెత్తుగడ జేర్చెను వానిని బందిఖానకున్
[26/8 5:39 PM] Malli Siripuram:
రిప్లయితొలగించండిఆ.వె//
శుభ్రపరచి కొంత శుభములు చేయగ
యూరినందు మురికిచేరె ననుచు !
వాగులందు దిరుగ సాగెడి "చాకలి
నత్త" తిరిగి వచ్చె నాలుగూళ్ళు !!
[26/8 5:41 PM] Malli Siripuram:
ఆ.వె//
క్రొత్తగనిక యేమి కొందు ననుచు తాను
బొంగరముగ దిరిగె సింగపూరు !
నగర వింతలన్ని నలువురికి దెలుప
అత్త తిరిగి వచ్చె నాలుగూళ్ళు !!
సత్తువ లేని దా యలతి
రిప్లయితొలగించండిజన్మి, చరించగ లేదు దిక్కులం,
దొత్తిలి గుల్లలందు తన
యోరిమిలో దగ యోగ మందునన్
మత్తిలి దొర్లుచుండు నట,
మప్పగ నొప్పునటే వచింపగన్
"నత్త రయంబునన్ దిరిగె
నాలుగు గ్రామము లొక్క జామునన్"!