6-8-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే”(లేదా...)“వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే”
వినయ విధేయతలు గలిగి జనహిత కృత్యములు సల్పు సహృద యు లగుచున్ మునుకొని సతతం బును బా వన ధర్మ ము బూను జనులు భాగ్యము గనరే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వినుమనుమానమదేలామన హైందవ సంస్కృతి భువి మాన్యంబు గదాగొనకొని నీమముగా పావన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
తనమదినరిషడ్వర్గముననయముపూనికవిడచుచుమర్మముదెలియన్కనగనుతపమునపరమమువనధర్మముఁబూనుజనులుభాగ్యముఁగనరే
స్నేహితురాలు జీవన కు చేసిన హితోపదేశము.మునులాచరించి చూపినమనధర్మమ్మదియె గాదె మహిమాన్వితమౌవినుమంటిని చెలియా జీవన, ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే.
మంచి వైవిధ్యమైన పూరణ. అభినందనలు.
కందంమనమున చింతల వీడుచుననునిత్యము భ్రుకుటి పైన నంచిత దృష్టిన్గొనసాగెడు ధ్యానఁపు జీవన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే!
మత్తేభవిక్రీడితముఅనునిత్యమ్ము సుఖాసనా యుతముగా నత్యంత సన్నిష్ఠతోన్మనమందున్ విడి చింతలన్ భ్రుకుటి నానాపానమందున్ విలక్షణమౌ సత్క్రియ విచ్చ నుంచుచు సహస్రారమ్మునన్ ధ్యాన జీవన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!
వినగాసాధనపారలౌకికపుతావిన్నాశికాగ్రంబునన్కనగానేకముగాగమానసముకావ్యంబైనవల్గున్గనన్చెనకన్బాహ్యపుశోధనల్విరియనాచెంగల్వలోనాత్మలోవనధర్మమ్మునుబూనలోకులకుసౌభాగ్యంబుప్రాప్తించులే
వనజాక్షుని సేవించుచుజనసంక్షేమమును గూర్చు చక్కని కృతులన్దనివార రచించెడు సుకవన ధర్మము బూనుజనులు భాగ్యముగనరే
కనగానేకముకాగమానసమునాకావ్యంబైనవెల్గున్గనన్
అనువు దొరక నీచమనకవనితలపయి బలిమిజేయు వారలనణచన్దన విధియని దుముకెడు యౌవన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
కనుమా పూర్వము ప్రాజ్ఞులౌ కవులు సత్కావ్యమ్ము లెన్నింటినో మనదౌధర్మము గొప్పదంచు నది సమ్మానించి రక్షించినన్ మనలన్ రక్షణజేయు సత్యమది నేమంబంచు భావించి జీవన ధర్మమ్మును బూనలోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే.
ధనమే యగ్రీయంబనియనుకొననొప్పునె జనులకు నతి నిష్ఠురతన్మనమందున దీనజనావన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
మ: పనులన్ శ్రద్ధగ జేయుచున్ విధులనున్ పాటించ నిక్కచ్చిగాజనులున్ మెచ్చెడు రీతిగా పటుగతిన్ సాగింపగన్ కార్యముల్ఘనమౌ కీర్తిని బొందు వారలగుచున్ కారుణ్యమున్ జూపు జీ వన ధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తిన్చులేవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పనిగట్టుకు పెంచినచో,పెనుపొందును వృక్షజాతి విరివిగ భువిలో,కనువిందగు ప్రకృతి, హరితవన ధర్మముఁ బూను జనులు, భాగ్యముఁ గనరే!
మత్తేభము:మనిషే భూతలమంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్ పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే! వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ“వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మనిషి' అన్న రూపం సాధువు కాదు. "మనుజుండే భువియంత..." అనండి.
అలాగే సరిచేస్తాను. ధన్యవాదములార్యా 🙏
మత్తేభము:మనుజుండేభువియంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్ పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే! వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ“వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”--కటకం వేంకటరామశర్మ.
జనులకు ధర్మము మూలముకనుగొని పాటించదగును కలకాలంబుల్వినయముతోగూడిన జీవన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
వినుమా ! మానవ జన్మమేమిగుల నీవిశ్వంబులోసర్వదాఘననీయంబని విశ్వసింతురిలసత్కార్యంబులంజేయగన్మనసానందముజెందు నిక్కముగ సమ్మానంబు సిద్ధించు, జీవన ధర్మంబును బూను లోకులకు సంప్రాప్తించు లాభించులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఎనయంగా సమదృష్టినిన్ జెలగుచున్ హేయంపు టాలోచనల్ కనరానీయక మానసమ్మడర సత్కర్మంబులన్ సల్పుచున్ తనరారాన్ మనుజుండు సిద్ధి నిడు గీతా శాస్త్ర మందించు జీ వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునందనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కావున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ యోగ్యకార్యంబుగా వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
ఆర్యాధన్యవాదాలుసవరణ:వనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునందనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కావున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ స్వకార్యంబుగావన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
కనిపించేనిలనాకమే, నిరతమౌకల్యాణమేగల్గుగాశనివారమ్మిదియాదివారమనుచున్ సందేహమేలన్? జనుల్యనిశమ్ముల్ శ్రమ కోర్చి చేయగ పనిన్, యంతమ్మలక్ష్మీత్వభావన, ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మనమందున్ చెడు యోచనల్ విడిచి సంభావించుచున్ బెద్దలన్ కనుచున్ పేదల ప్రేమతో సతతమున్ కావించి సత్కర్మలన్ఘనుడౌ చక్రధరున్ తలంచుచు ధృతిన్, కాంక్షించి మోక్షమ్ము జీవన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వనముల్ మానవజాతికిన్నొసగునవ్యాజంపు బ్రేమంబునన్ఘనమౌ వర్షము, బ్రాణవాయువును బాగైనట్టి సస్యంబులన్దనువున్ గాచెడి నౌషధంబులను వేతాపంబులన్ దీర్చు నావనధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
అనయము శివునిం జూచుచుమనమున ధ్యానించుచుండు మనుగడ గలరైవినయము దానములను పావనధర్మము బూనుజనులు భాగ్యము గనరే
ధన సంపాదనకై విదేశ భృతి ప్రాధాన్యంబుగానెంచినన్మన మూలంబులు విస్మరింపకెపుడున్ మాన్యంబుగా దాల్చుచున్ఘనమౌ భారత సంస్కృతిన్ జగతినగ్ర్యంబంచునుత్కృష్ట జీవన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
జన సంచయమ్మునకు మేలొనరు పనులఁ జేయు వారు నొప్పుగ నింకన్ మన శాస్త్రచ యోక్తము పా వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరేవనజాతాసన వాస వాది వర దేవవ్రాతముం బ్రీతిఁ గొల్చిన నేపారెడు పుణ్య మబ్బును ధరన్ శ్రేష్ఠమ్ముగా నమ్ము పూసిన వృక్షమ్ముల నెల్లఁ గూడి పశు పక్షివ్రాత సంపోష ణా వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వినయంబొప్పుచు దానధర్మములు దావేవేగ గావించుపావనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులేవినుచో సత్యము మీరలందరును భోవీరేశ్వరాయా!వెసన్ గనగన్ సౌఖ్యములన్నియున్ ధరనువేకైవశ్యమౌధరన్
వినయ విధేయతలు గలిగి
రిప్లయితొలగించండిజనహిత కృత్యములు సల్పు సహృద యు లగుచున్
మునుకొని సతతం బును బా
వన ధర్మ ము బూను జనులు భాగ్యము గనరే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినుమనుమానమదేలా
రిప్లయితొలగించండిమన హైందవ సంస్కృతి భువి మాన్యంబు గదా
గొనకొని నీమముగా పా
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితనమదినరిషడ్వర్గము
రిప్లయితొలగించండిననయముపూనికవిడచుచుమర్మముదెలియన్
కనగనుతపమునపరమము
వనధర్మముఁబూనుజనులుభాగ్యముఁగనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్నేహితురాలు జీవన కు చేసిన హితోపదేశము.
మునులాచరించి చూపిన
మనధర్మమ్మదియె గాదె మహిమాన్వితమౌ
వినుమంటిని చెలియా జీ
వన, ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే.
మంచి వైవిధ్యమైన పూరణ. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిమనమున చింతల వీడుచు
ననునిత్యము భ్రుకుటి పైన నంచిత దృష్టిన్
గొనసాగెడు ధ్యానఁపు జీ
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
తొలగించండిఅనునిత్యమ్ము సుఖాసనా యుతముగా నత్యంత సన్నిష్ఠతోన్
మనమందున్ విడి చింతలన్ భ్రుకుటి నానాపానమందున్ విల
క్షణమౌ సత్క్రియ విచ్చ నుంచుచు సహస్రారమ్మునన్ ధ్యాన జీ
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!
వినగాసాధనపారలౌకికపుతావిన్నాశికాగ్రంబునన్
రిప్లయితొలగించండికనగానేకముగాగమానసముకావ్యంబైనవల్గున్గనన్
చెనకన్బాహ్యపుశోధనల్విరియనాచెంగల్వలోనాత్మలో
వనధర్మమ్మునుబూనలోకులకుసౌభాగ్యంబుప్రాప్తించులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనజాక్షుని సేవించుచు
రిప్లయితొలగించండిజనసంక్షేమమును గూర్చు చక్కని కృతులన్
దనివార రచించెడు సుక
వన ధర్మము బూనుజనులు భాగ్యముగనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనగానేకముకాగమానసమునాకావ్యంబైనవెల్గున్గనన్
రిప్లయితొలగించండిఅనువు దొరక నీచమనక
రిప్లయితొలగించండివనితలపయి బలిమిజేయు వారలనణచన్
దన విధియని దుముకెడు యౌ
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికనుమా పూర్వము ప్రాజ్ఞులౌ కవులు సత్కావ్యమ్ము లెన్నింటినో
మనదౌధర్మము గొప్పదంచు నది సమ్మానించి రక్షించినన్
మనలన్ రక్షణజేయు సత్యమది నేమంబంచు భావించి జీ
వన ధర్మమ్మును బూనలోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనమే యగ్రీయంబని
రిప్లయితొలగించండియనుకొననొప్పునె జనులకు నతి నిష్ఠురతన్
మనమందున దీనజనా
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండిపనులన్ శ్రద్ధగ జేయుచున్ విధులనున్ పాటించ నిక్కచ్చిగా
జనులున్ మెచ్చెడు రీతిగా పటుగతిన్ సాగింపగన్ కార్యముల్
ఘనమౌ కీర్తిని బొందు వారలగుచున్ కారుణ్యమున్ జూపు జీ
వన ధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తిన్చులే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపనిగట్టుకు పెంచినచో,
రిప్లయితొలగించండిపెనుపొందును వృక్షజాతి విరివిగ భువిలో,
కనువిందగు ప్రకృతి, హరిత
వన ధర్మముఁ బూను జనులు, భాగ్యముఁ గనరే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభము:
రిప్లయితొలగించండిమనిషే భూతలమంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్
పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే!
వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ
“వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనిషి' అన్న రూపం సాధువు కాదు. "మనుజుండే భువియంత..." అనండి.
అలాగే సరిచేస్తాను. ధన్యవాదములార్యా 🙏
తొలగించండిమత్తేభము:
తొలగించండిమనుజుండేభువియంత నాదనఁగ దుర్మార్గంపు నాధిక్యతన్
పెను జీవాలు నశించె, తుల్యతఁ జెడెన్, పెన్ముప్పు వాటిల్లె లే!
వనముల్నిండుగ పక్షి జంతు తతులున్ వర్ధిల్లు కారుణ్య జీ
“వన ధర్మమ్మును బూన, లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!!”
--కటకం వేంకటరామశర్మ.
జనులకు ధర్మము మూలము
రిప్లయితొలగించండికనుగొని పాటించదగును కలకాలంబుల్
వినయముతోగూడిన జీ
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివినుమా ! మానవ జన్మమే
రిప్లయితొలగించండిమిగుల నీవిశ్వంబులోసర్వదా
ఘననీయంబని విశ్వసింతురిల
సత్కార్యంబులంజేయగన్
మనసానందముజెందు నిక్క
ముగ సమ్మానంబు సిద్ధించు, జీ
వన ధర్మంబును బూను లోకు
లకు సంప్రాప్తించు లాభించులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎనయంగా సమదృష్టినిన్ జెలగుచున్ హేయంపు టాలోచనల్
రిప్లయితొలగించండికనరానీయక మానసమ్మడర సత్కర్మంబులన్ సల్పుచున్
తనరారాన్ మనుజుండు సిద్ధి నిడు గీతా శాస్త్ర మందించు జీ
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునం
రిప్లయితొలగించండిదనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కా
వున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ యోగ్యకార్యంబుగా
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
ఆర్యా
తొలగించండిధన్యవాదాలు
సవరణ:
వనముల్ జీవనభాగ్యదాయకములై ప్రాణిప్రకాశమ్మునం
దనయంబున్ దమజన్మధన్యత గనున్ హర్షంబు చేకూర్చు కా
వున నవ్వానికి రక్షగూర్చుటయె యీ భూమిన్ స్వకార్యంబుగా
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిఅనునిత్యమ్ము సుఖాసనా యుతముగా నత్యంత సన్నిష్ఠతోన్
మనమందున్ విడి చింతలన్ భ్రుకుటి నానాపానమందున్ విల
క్షణమౌ సత్క్రియ విచ్చ నుంచుచు సహస్రారమ్మునన్ ధ్యాన జీ
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే!
కనిపించేనిలనాకమే, నిరతమౌకల్యాణమేగల్గుగా
రిప్లయితొలగించండిశనివారమ్మిదియాదివారమనుచున్ సందేహమేలన్? జనుల్
యనిశమ్ముల్ శ్రమ కోర్చి చేయగ పనిన్, యంతమ్మలక్ష్మీత్వభా
వన, ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
మనమందున్ చెడు యోచనల్ విడిచి సంభావించుచున్ బెద్దలన్
రిప్లయితొలగించండికనుచున్ పేదల ప్రేమతో సతతమున్ కావించి సత్కర్మలన్
ఘనుడౌ చక్రధరున్ తలంచుచు ధృతిన్, కాంక్షించి మోక్షమ్ము జీ
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వనముల్ మానవజాతికిన్నొసగు
రిప్లయితొలగించండినవ్యాజంపు బ్రేమంబునన్
ఘనమౌ వర్షము, బ్రాణవాయువును బాగైనట్టి సస్యంబులన్
దనువున్ గాచెడి నౌషధంబులను వేతాపంబులన్ దీర్చు నా
వనధర్మమ్మును బూను లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
అనయము శివునిం జూచుచు
రిప్లయితొలగించండిమనమున ధ్యానించుచుండు మనుగడ గలరై
వినయము దానములను పా
వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే
ధన సంపాదనకై విదేశ భృతి ప్రాధాన్యంబుగానెంచినన్
రిప్లయితొలగించండిమన మూలంబులు విస్మరింపకెపుడున్ మాన్యంబుగా దాల్చుచున్
ఘనమౌ భారత సంస్కృతిన్ జగతినగ్ర్యంబంచునుత్కృష్ట జీ
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
జన సంచయమ్మునకు మే
రిప్లయితొలగించండిలొనరు పనులఁ జేయు వారు నొప్పుగ నింకన్
మన శాస్త్రచ యోక్తము పా
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే
వనజాతాసన వాస వాది వర దేవవ్రాతముం బ్రీతిఁ గొ
ల్చిన నేపారెడు పుణ్య మబ్బును ధరన్ శ్రేష్ఠమ్ముగా నమ్ము పూ
సిన వృక్షమ్ముల నెల్లఁ గూడి పశు పక్షివ్రాత సంపోష ణా
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వినయంబొప్పుచు దానధర్మములు దావేవేగ గావించుపా
రిప్లయితొలగించండివనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే
వినుచో సత్యము మీరలందరును భోవీరేశ్వరాయా!వెసన్
గనగన్ సౌఖ్యములన్నియున్ ధరనువేకైవశ్యమౌధరన్