30, ఆగస్టు 2021, సోమవారం

సమస్య - 3827

31-8-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్”
(లేదా...)
“ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్”

31 కామెంట్‌లు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరియగు భక్తిని జూపుచు
  నిరతము నీమమ్ముతోడ నెరవగు తీరున్
  పరిచర్యలతో విధుశే
  ఖర పాదము గొల్చి కాంత గనె సత్పుత్రున్.

  రిప్లయితొలగించండి
 2. అరసియుభావనపతినా
  పురహరునాత్మనుతలచియుపోందికతోడన్
  విరిసినకళతోశశిశే
  ఖరపాదముఁగోల్చికాంతగనెసత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 3. తిరముగ నామ స్మరణము
  నిరతము జప తప యుతంపు నిష్ఠగ భక్తిన్
  కరముగ నొనర్చి శశి శే
  ఖర పాదము గొల్చి కాంత గనె సత్పుత్రు న్

  రిప్లయితొలగించండి
 4. నరలోకమునందు సుతుని
  వరముగ పొందేరు నరకవాసము దప్పన్
  ధర ముని యానతి శశి శే
  "ఖరపాదముఁగొలిచి కాంత గనె సత్పుత్రున్"

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

   సరియౌ భక్తిని జూపుచున్ పొలుపుగా సంసేవ లర్పించుచున్
   నిరతమ్మంతయు ప్రార్థనల్ చలుపుచున్ నీమమ్ముతో నోర్పుగా
   పరిచర్యల్ వెలయించుచున్ ఘనముగా పంచాస్యుడా చంద్రశే
   ఖర పాదార్చన జేసి పుత్రుని గనెం గంజాక్షి మోదమ్మునన్.

   తొలగించండి
 6. స్థిరచిత్తంబునతండ్రియాననమునిస్తేజంబుగాఁజూచియున్
  పరముండాశివుడంచుమానసములోభావంబుఁజూపట్టగన్
  చిరునవ్వున్వెలయించెనారమణితాచింతన్సదాచంద్రశే
  ఖరపాదార్చనఁఁజేసిపుత్రునిఁగనెంగంజాక్షిమోదంబునన్

  రిప్లయితొలగించండి
 7. కె.వి.యస్. లక్ష్మి:

  హరునే నమ్ముచు భక్తిని
  నిరతము భజనలను సల్పి నియమము తోడన్
  కరములు మోడ్చియె శశిశే
  ఖర పాదము గొల్చి కాంత గనె సత్పుత్రున్.

  రిప్లయితొలగించండి

 8. ఉరగాభరణుడు భర్గుడు
  కరకంఠుడు శూలిధరుడు కాలంజరుడౌ
  మరుగొంగ చంద్రమశ్శే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.

  రిప్లయితొలగించండి
 9. సమస్య:
  *ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.*

  నరకము దాటించుటకై
  వరపుత్రుం గోరి జంట వారాణసినన్
  గిరిజా రమణున్ శశి శే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్.

  రిప్లయితొలగించండి

 10. ధరణీవేల్పులు చెప్పగా పడతి సంతానమ్ముకై భక్తితో
  భరువున్ గూడి నిరంతరమ్ము పలు శైవక్షేత్రముల్ తిర్గుచున్
  కరకంఠుండగు నైకమాయుడు నదీకాంతుండెయౌ చంద్రశే
  ఖర పాదార్చనఁ జేసి పుత్రునిం గనెం గంజాక్షి మోదమ్మునన్.

  రిప్లయితొలగించండి
 11. హరహర శంభోయనుచున్
  పరమేశ్వర కృపనుగోరి పరవశలీలన్
  నిరతము భక్తిగ శశిశే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 12. కందం
  ధరపై శారద పీఠపు
  గురు భారతి తీర్థులను త్రికూటేశ్వరుఁ దా
  నెరనమ్మి భక్తి శశిశే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె! సత్పుత్రున్!

  మత్తేభవిక్రీడితము
  స్థిరభక్తిన్ హరుసేవలన్ దనరెడున్ శృంగేరి పీఠాధిపున్
  ధర జేజేలిడి 'భారతీ' యనెడి సీతారామ నామాఖ్యునిన్
  గొరతన్ లేక యనంతలక్ష్మి నియతిన్ గోటప్పడౌ చంద్రశే
  ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్

  రిప్లయితొలగించండి

 13. జరిగెన్ బెండిలి యాడి నాల్గు
  శకముల్ సంతానమున్ లేక తా
  దిరిగన్ మిక్కిలి తీర్థ యాత్రలు
  సదా దేవుళ్ళకున్ మ్రొక్కుచున్
  కరమొప్పన్ మనమందు నిరత
  మున్ గాలాత్ము జంద్ర శే
  ఖరపాదార్చన జేసి పుత్రున్ గనెన్
  కంజాక్షి మోదంబునన్

  రిప్లయితొలగించండి
 14. మ:

  కొరగాకుండెను నింతకాలము నహో కూయంగ సంతానమై
  కరువే లేదు గొనంగ దత్తతనుచున్ ఖండింప నో తీరుగన్
  కరుణన్ బ్రోవు మటంచు దీక్షగొన, నేకాంతంబునౌ చంద్రశే
  ఖర పాదార్చన జేసి పుత్రుని గనెన్ గంజాక్షి మోదమ్మునన్

  కూయంగ=మొఱపెట్టుకొనుట

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మ:

   స్వరముల్ బాడుచు భక్తి భావనలతో సర్వాత్మునిన్ గొల్చగన్
   మొరలాలించు మటంచు వేడుకొననై ముక్కంటి దాక్షిణ్యతన్
   వరమౌ వేములవాడ దర్శనముగా వాటమ్మునౌ,రాజ శే
   ఖరపాదార్చనజేసి పుత్రుని గనెన్ గంజాక్షి మోదమ్మునన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 15. నిరతము నిరతిగ గౌరీ
  వరు శంకరు పాపహరుని ఫాలాక్షు శివున్
  పురహరు భర్గుని శశిశే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 16. తరుణీమండలి త్రోవజూపగను సత్సంతాన కేంద్రమ్మునన్
  అరుదౌ ఔషధ సేవనంబున ననాయాసంబుగా గర్భమున్
  త్వరలో దాల్చగ జాగరూకతల దాపాటించి యా వైద్యశే
  ఖరపాదార్చన సేసి పుత్రుని గనెం గంజాక్షి మోదమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కరకౌ దాస్యము బాపగ
   నరుదౌ బలవంతుడైన నండజురూపున్
   వరముగ బడయగ పతిశే
   ఖరపాదము గొల్చికాంత గనెసత్పుత్రున్

   తొలగించండి
 17. (మార్కండేయుని జననం)

  పురుషుడు మృకండు తోడ కొ
  మరుని కొరకయి యధికముగ మలయుచు కాశీ
  పురమున పతితో శశిశే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 18. నిరతముధ్యానించునతడు
  హరినే, పలుకే వరమని అందరు తలతుర్
  గిరిధారిదయే, యతిశే
  ఖరపాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 19. వరమైదొరికెను వరుణీ
  వరుణీపతిభక్తియైన సద్గణతరుణీ
  తరుణిమొగడుశేఖరు, శే
  ఖరపాదముగొల్చికాంతగనెసత్పుత్రున్
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 20. ధరణిన్ దంపతులొందకున్నసుతునిన్ తథ్యమ్ముగా వారికిన్
  దొరకున్ నారకమంచు మానసములో దుఃఖమ్ము పాటిల్లగా
  వరమౌనేంద్రుడొసంగ సూచనల సంభావించుచున్ చంద్ర శే
  ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్

  రిప్లయితొలగించండి
 21. హరనారాయణులిర్వులన్ గొలిచిరత్యంతానురాగంబులన్
  సరిగన్ తండిరి వేంకటేశ్వరులు శ్రావ్యంబౌ సుగీతంబులన్
  తరియింపన్ శివనామ మంత్ర జపమై తల్వంగ నా చంద్రశే
  ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్

  రిప్లయితొలగించండి
 22. ధర కైలాసము కాశికాపురి యటన్ దర్శించి విశ్వేశునా
  నిరతారాధ్యుని నీవె దిక్కనుచు దా నీమంబునా చంద్రశే
  ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్
  కరుణన్ శంకరుడే చిరాయువిడె మార్కండేయనామాఖ్యుకున్

  రిప్లయితొలగించండి
 23. గరిమంపు విష్ణు భక్తి య
  లరు ప్రహ్లాదుని ఘనుని హిరణ్యాక్షు మహా
  సురగణ నాథుని నిజపతి
  ఖర పాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్

  [ఖరపాదము = వేఁడిమి గల పాదము]


  ఖర ఫాలాగ్ని విరాజితున్ శివుని ముక్కంటిన్ మహాదేవునిన్
  హరు నాగాభరణున్ దిగంబరుని దేవారాధ్యునిన్ శంభునిన్
  నిరతం బుంచి మనమ్మునం దునిమి సందేహమ్ము ఖండేందు శే
  ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్

  రిప్లయితొలగించండి
 24. అరమరిక లేకయుండగ
  నిరతము దాసేవజేయ నిర్మలబుద్ధిన్
  గరముం భక్తిని శశిశే
  ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్

  రిప్లయితొలగించండి
 25. కరమున్ మానసమందునన్ నిలిపి యాకాశీవిభున్ చంద్రశే
  ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్
  నరయంగా నదియేకదా శివుని మాహాత్మ్యంబులోకంబునన్
  భరణీ!నేర్వుమ యీశ్వరార్చనకు సాఫల్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించండి
 26. హరహర మహదేవా యన
  త్వరితముగాకరుణజూపదాక్షాయణియున్
  వరమును వేఢుచు విధుశే
  ఖరుపాదముగొల్చికాంతగనెసత్పుత్రున్.

  రిప్లయితొలగించండి