24, ఆగస్టు 2021, మంగళవారం

సమస్య - 3821

 25-8-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చూడ నేఁగును సిగ్గిలి చూడదయ్యొ”
(లేదా...)
“చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్”

33 కామెంట్‌లు:

  1. తేటగీతి
    భంగపడిన నూర్వశి శాపవశమున పతి
    విరటు కొల్వ బృహన్నల వేషమంద
    సతిగ సైరంధ్రి నర్తనశాల వైపు
    చూడ నేఁగును సిగ్గిలి చూడదయ్యొ!

    ఉత్పలమాల
    ఓడిన నూర్వశీలలన యోర్వక శాప మొసంగఁ గ్రీడికిన్
    బేడియనన్ బృహన్నలగ పేర్మిని జేర విరాటకొల్వునన్
    నీడగ కృష్ణ మాలినిగ నేర్పున నర్తనశాల వైపుగన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్!

    రిప్లయితొలగించండి

  2. చందమామను బోలిన యందగాడు
    శివధనుస్సు విరిచెనని చెప్పినంత
    రామ చంద్రుని గాంచగన్ రమణి సీత
    చూడనేగును సిగ్గిలి చూడదయ్యొ.



    చూడ కురంగ లాంఛనుని సొంపును గల్గిన వాడు వచ్చెనే
    నేడిక విల్లునెత్తునని నెచ్చెలి రాముని గూర్చి చెప్పగన్
    వాడి చొకారమున్ గనగ పావని సీత కుతూహలమ్ముతో
    చూడగ నేగు, సిగ్గుపడి చూడదు, చూడక యండలేననున్.

    రిప్లయితొలగించండి
  3. వాడని మోముతోడ తన
    వాడని నమ్ముచు బావ తోడుతన్
    వేడుకగా చమత్కృతుల
    ప్రేమను దెల్పగ డెంద మందు తా
    రాడెడి యూహలన్ విరియు
    రాగము తోడుత తల్పు ౘాటునన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి
    చూడదు చూడక యుండలేననున్!

    రిప్లయితొలగించండి
  4. వీఁడగరాగబంధములువెన్నునిఁగోరుచుజీవుడాత్మలో
    ఆడనిదీపమాయనగనన్యముభావనలేకయుండగా
    ఆమడదూరమేగియానముమానుచువెన్కఁజూచెనే
    చూడగనేగుసిగ్గుపడిచూడదుచూడకయుండలేననున్

    రిప్లయితొలగించండి
  5. ఆమడదూరమేగిహ్రుదియానముమానుచువెన్కఁజూచెనే
    టైపు తప్రునుసరిదిద్దితిని

    రిప్లయితొలగించండి
  6. సమస్య:
    *చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్.*

    ప్రయత్నం:

    వేడగ రుక్మిణీ సతియె వృష్ణుడు వేగమె యేగుదెంచఁ దా
    దోడుగ ద్వారకానగరి తోయజ నేత్రుని చెంతజేరుచున్
    వాడిగ వైషమేషవుడి పంచశరమ్ముల వింతధాటికిన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్.

    రిప్లయితొలగించండి
  7. వంట వాడుగ భీముడు వలలు డయ్యె
    విరటు గొల్వున సైరంధ్రి వేడ్క తోడ
    వంట శాలకు వెళ్ళియు వలపు గల్గి
    చూడ నేగియు సిగ్గిలి చూడదయ్యొ !

    రిప్లయితొలగించండి
  8. కన్ను గారాబు కూతురు కన్యయపుడు
    సిగ్గువీడుచు దుష్యంతుసేమమరయ
    కాలిముల్లునుదీయగ కాంక్షనెపము
    చూడనేగునుసిగ్గిలిచూడదయ్యె

    రిప్లయితొలగించండి
  9. నీడగ వెంబడించు బ్రతి నిత్యము
    దారులు గాచి మర్దలిన్
    వీడక చూచుచుండు గడు ప్రేమ
    మయంబగు చూపుతోడ నా
    జాడ నెరింగి బావను సుసాధ్వి
    మనోహరి వారిజాక్షియున్
    జూడగ నేగు సిగ్గుపడి చూడదు
    చూడక యుండ లేననున్.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. క్రమముగా

      వాడలవాడలన్ జరుగు వారిజ లోచను నుద్వహంబులన్
      వీడని ఛాయవోలె దనవెంబడి దిర్గెడి కోడెగాని రా
      పాడెడి పుష్పబాణముల వంచగలేక వియోగ మగ్నయై
      చూడగనేగు ,సిగ్గుపడి చూడదు ,చూడక యుండలేననున్!

      తొలగించండి
  11. జాడయు జెప్పె నెచ్చెలియు జానకి మెచ్చగ రాము వచ్చెనన్
    వేడుక గల్గె రాముగన వేచెను దోటను సంచరించుచున్
    వాడుక లేని గార్యమది వాంఛయు హెచ్చిన గ్రొత్త వింతగా
    “చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్”

    రిప్లయితొలగించండి
  12. మునివరుని తోడ వచ్చిన పురుషునిగని
    చెలియలతని యందము గూర్చి జెప్పుచుండ
    దాళజాలక జనకుని తనయ వేగ
    జూడ నేఁగును ; సిగ్గిలి చూడదయ్

    రిప్లయితొలగించండి
  13. అంతిపుర గవాక్షము నుండి యింతి సీత
    మౌనివరు వెంట నరుదెంచు మరుని సాటి
    సఖుని రామచంద్రుని దృగంచలము నుండి
    చూడ నేఁగును సిగ్గిలి చూడదయ్యొ

    రిప్లయితొలగించండి
  14. సాగి వచ్చు వరుడు సొగసరి యనివిని
    తుంటరి వధువు జిజ్ఞతో తొలుత తానె
    మేన కోడలి తోడుత మేడ నెక్కి
    చూడ నేఁగును సిగ్గిలి చూడదయ్యొ.

    రిప్లయితొలగించండి
  15. మంత్రసానిగశిక్షణ మందదలచి
    శిక్షణాలయమందున జేరి యొకతె
    ప్రసవ వేదనబడుచున్న పడతిదరికి
    చూడ నేఁగును సిగ్గిలి చూడదయ్యొ

    రిప్లయితొలగించండి
  16. సమస్య :

    చూడగ నేగు సిగ్గుపడి
    చూడదు చూడక యుండలేననున్

    ( మేనాహిమవంతుల పుత్రిక పార్వతి పరమేశ్వర
    సేవకై పసిడిపూలసజ్జతో వెళ్లుతున్న సన్నివేశం )

    ఉత్పలమాల
    ------------

    వేడుక మీర హైమవతి
    విశ్వగురుండగు చంద్రమౌళిపై
    వీడని ప్రేమబంధమది
    పెల్లుగ మానసమందు నిండగా
    " నేడిక స్వామి నన్ను గను ;
    నిక్కము గా " నని పూలసజ్జతో
    జూడగ నేగు ; సిగ్గుపడి
    చూడదు ; " చూడక యుండలే " ననున్ .

    రిప్లయితొలగించండి
  17. వీడకనుండుజీవనపు
    వీథినజంట కపోతంబులే
    పాడినిదప్పకెప్పుడును
    పాయకనుండునుపేర్మిగుండెలో
    గాడతనెంతనోనిమిష
    కాలమునందున ఆరువందలై
    వేడుకచేయకొట్టుకొను
    వెంబడితిర్గుచుకల్సిపోవుచూ
    చూడగనేగుసిగ్గుపడి
    చూడదు చూడక యుండలేననున్
    ....తోకల...

    రిప్లయితొలగించండి
  18. తోడుగ రాగ లక్ష్మణుఁడు తోయజనేత్రుఁడు రామచంద్రుడున్
    వేడుకగా మునీంద్రు వెను వెంటను వచ్చుచు నుండ గాంచి పూ
    బోడి మహీజ మన్మథుని బోలిన రాము దృగంచలమ్ములన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్

    రిప్లయితొలగించండి
  19. పోడిగ నన్యదేశమునఁ బొంది సువిద్యను వచ్చి ప్రీతితో
    వేడగ నత్తమామలనుఁ బెండిలి కోసము వారి పుత్రికన్
    వేడుక కల్గ బావఁగనఁ బ్రేమముతోడ లతాంగి వానినిన్
    చూడఁగ నేఁగు, సిగ్గుపడి చూడదు, చూడక యుండలేననున్

    రిప్లయితొలగించండి
  20. ప్రేమ ఒకరితో పెండ్లి మరొకరితో జరిగిన ఘటన గా నా ప్రయత్నము :

    ఉ:

    తోడుగ నుండగోరి మరి తోడొకరయ్యె రటంచు జాలిగన్
    వీడగ ప్రేమ బంధమును వేదన మీర భరించ నెంచనై
    కూడిన వాని వెంట నడ కోరిక వెంబడ ప్రక్కచూపులన్
    చూడగ నేగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  21. రాముచేతిలో ధనువది రమ్యముగను
    ఫెళ్ళు మనుచును విఱుగగ బ్రీతితోడ
    చూడనేగును సిగ్గిలి చూడదయ్యె
    సరసి యగు సీత చెలికత్తె సన్నుతించ

    రిప్లయితొలగించండి
  22. బిడియ మెక్కువ నారికి జడియుఁ దిరుగ
    నలుగు రున్న జగము లందుఁ దొలఁగు నన్య
    పురుషులను గాంచి నంతనె పువ్వుఁ బోఁడి
    చూడ నేఁగును సిగ్గిలి చూడ దయ్యొ


    కూడదు నమ్మ బోటులను కొమ్మలు చంచల చిత్త లౌదురే
    యాడఁగ నేఁగు సిగ్గు పడి యాడదు యాడక యుండ లే ననుం
    బాడఁగ నేఁగు సిగ్గు పడి పాడదు పాడక యుండ లే ననుం
    జూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండ లే ననున్

    రిప్లయితొలగించండి
  23. వేడుక మీరగా గిరిజ భీముని మానసమందునన్ గనన్
    జూడగనేగు సిగ్గుపడిచూడదు చూడకయుండ లేననున్
    వీడగరాని ప్రేమయది వేవురు చెప్పిన లేదులాభముల్
    వాడిగ కంతుబాణముల భారము సోకిన నంతియేకదా

    రిప్లయితొలగించండి
  24. తోడును కోర వచ్చునది దూరపు బంధువు బావ యేనియున్
    వేడుక పెళ్లి చూపులన వింతగ నాతిని క్రొత్త భావముల్
    కూడ కుతూహలమ్మొదవ గుమ్మము వెన్కను చేరి నాతనిన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్!

    రిప్లయితొలగించండి
  25. వేడుక లందునన్ వధువు పెళ్ళికు మారుని మాటు మాటుగన్
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు; చూడక యుండలేననున్
    కోడలి తోడ దూరముగ, కొల్వును చేయగ బిడ్డ వెళ్ళు చు
    న్నాడని తల్లి ,భిన్నతయు న్యాయమె భార్యకు
    తల్లికిన్ కదా!

    రిప్లయితొలగించండి
  26. పోడిమి రాముడా వర తపోధను దోడుత నేగుదెంచగా
    మేడను నిల్చి నెచ్చెలులు మిక్కిలి చక్కని వాడు జానకీ
    చూడుము నీకితండె తగు జోడగునో లలనా యనంగ దా
    చూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండలేననున్

    రిప్లయితొలగించండి