8, ఆగస్టు 2021, ఆదివారం

సమస్య - 3807

9-8-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగఁడుత్తముఁడని విడాకుల నువిద గోరె”
(లేదా...)
“మగం డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్”
(ఛందో గోపనము)

61 కామెంట్‌లు:


 1. విరించి.

  తనమగడొక జూదరి తీక్ష్ణతైల ప్రియుడు
  వారకాంతల మరిగిన ప్రత్యవరుడు
  చిన్న వాడైన నేమినా చెల్లెలి మగ
  డుత్తముడని విడాకుల నువిద గోరె.

  రిప్లయితొలగించండి
 2. మెత్తని మానసంబుఁగల మేలిమి వానిని చేరగా మగం
  డుత్తము డంచు పేర్కొని;యయో సతిఁగోరుకొనెన్ విడాకులన్
  చెత్త సమస్యలన్ మునిగి చిత్తుగ తాగిన మత్తు బాబునిన్-
  రిత్తలుఁగావు సఖ్యత వరించిన జంటల పుణ్య గాదలున్.

  రిప్లయితొలగించండి
 3. మంచి మాటలు బల్కుచు మరులు జూపి
  నటన తోడుత సతతంబు నవ్య మైన
  పుంత లను ద్రొక్కు వారిలో మోసపు మగ
  డుత్తముడని విడాకుల నువిద గోరె

  రిప్లయితొలగించండి
 4. ఛందోగోపనము
  ---------------
  మగం డుత్తముడంచు బేర్కొని య
  యో సతి గోరుకొనెన్ విడాకులన్

  ( చెప్పలేనంత బాగా చూసుకొనే భర్త కలిగిన తనపై
  స్నేహితురాళ్లు ఈర్ష్య బూనినందుకు మనసు విసిగిన
  విరిగిన ఒక అమాయకురాలు అత్తగారితో ... )

  " అత్తమ ! యేమి చెప్పుదును
  నన్నిట మిన్నయె నీదు పుత్రుడే !
  విత్తము నంత నాకొసగు ;
  వేడుచు సేవలు నాకు జేయునే !
  నెత్తిన నన్ను మోయునని
  నెచ్చెలు లేడ్తురు ; దేవుడౌ మగం
  డుత్తము " డంచు బేర్కొని య
  యో ! సతి గోరుకొనెన్ విడాకులన్ .

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సతము మత్తున నూగుచు సాగు చుండి
  సతికి సంతుకు నెగులును జతపఱచెడి
  దారిని చరించు కళలోన తనదగు మగ
  డుత్తముడని విడాకుల నువిద గోరె.

  రిప్లయితొలగించండి
 6. విరించి.

  సొత్తును దొంగిలించి యది జూదము నాడట గెల్చినట్టి యా
  విత్తముతోడ నేగుగద వేశ్యల గూడగ నెంచి యచ్చటన్
  మత్తును గోరి మద్యమును త్రాగుట తప్ప నా మగం
  డుత్తముడంచు బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 7. కసిరిగోనంగమాటలకందకుండు
  విసిరికోట్టంగవాకిలివెలుపలుండు
  వదలడెన్నండునాకోంగువాడెమగమగ
  డుత్తముండనివిడాకులనువిదగోరె

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చద్ది యన్నము‌ను తినుచు‌ సరసమైన

   టిఫెనులను తలచగ లేడు, టీని నోట

   బెట్టబోడు,కాఫీ యన విసుగు జూపు,

   పెదిమల‌నడుమ సిగరెట్డు పెట్డబోడు,

   దవడల నడుమ‌ జర్దాను దాచ లేడు

   విస్కి పేరెత్త నతనికి వెగటు కలుగు,

   బ్రాంది బాటిలు చూసిన భయము‌ కలుగు,
   ,
   బీరు షాపును చూసిన‌ బెదరి పోవు,

   రమ్ము కొరకు నే రమ్మన రచ్చ చేయు,

   కమ్మ నైన పలావును కాల ద్రోయు

   కూలు డ్రింకైన నెప్పుడు గ్రోల బోడు,

   కారు స్కూటరు లెప్పుడె క్కంగ లేడు,

   సైకెలెక్కి రమ్మను చుండు‌ సంతసముగ,

   పడక డింటి విషయమును‌ బయలు పరచ

   జాల, జనులెల్ల తలచు ‌‌‌ని జమ్ముగ‌ మగ

   డుత్తముడని, విడాకుల‌ నువిద కోరె

   ననుచు‌‌ ‌నబ్బురము‌ వలదు,మనసు విరిగె,

   నాకు చేయగ జాలను నమ్మకముగ

   కాపుర మనుచు‌ మహిళ యొకతె పలికెను

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మైక్రోసాఫ్ట్ అధినేత విడాకుల నేపథ్యంగా...


  తేటగీతి
  గణన యంత్రము నడిపించు గతిని ప్రజకు
  తెలియ జేసియు, నాకేమొ తెలియకుండ
  నన్యకాంతతో గతమున నలరిన మగఁ
  డుత్తముఁడని విడాకుల నువిద గోరె

  ఉత్పలమాల
  పత్తున యంత్రపున్ గణన పద్ధతి లోకమునంద నాద్యుడై
  విత్తపు నార్జనన్ సుఖము వేడుక పంచియు దాచెనొక్కటే!
  యత్తరి నొక్కతెన్ మరిగి హాయిని బొందుట తప్ప నా మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  రిప్లయితొలగించండి
 10. మత్తిల ద్రాగుచున్ సతము మాద
  క ద్రవ్యము స్వీకరించుచున్
  జిత్త విహీనుడైన పతి జేకొని
  మిక్కిలి బాధ కోర్చితిన్
  సత్తెము, కాడు నాకు దగు సజ్జన
  శీలుడు , గాడు నా మగం
  డుత్తముడంచు బేర్కొనియ
  యో సతిగోరు కొనెన్ విడాకులున్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మత్తున జోగుచున్ సతతమంతయు కాముకుడై చరించుచున్
  పొత్తును వీడి గేహినిని పూర్తిగ ద్రోయుచు క్రౌర్యమెంచునౌ
  చిత్తముతో చలించెడి విచిత్రమునౌ కళలోన నామగం
  డుత్తముడంచు బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్.

  రిప్లయితొలగించండి
 12. సతిని చులకనజేయును సతతమతఁడు
  కష్టములు మెండు కలతల కాపురమున
  తప్పు చేయగనెటులనదగు తన మగఁ
  డుత్తముఁడని విడాకుల నువిద గోరె

  రిప్లయితొలగించండి
 13. ఉ:

  పుత్తడి బొమ్మ నీవనుచు ముచ్చట దీర్చగ నోర్పుతోడుతన్
  చిత్తము నెల్లవేళలను క్షేమము గోరి హితమ్ము బల్కనై
  హత్తు కొనంగ, నట్టి యుపయంత గుణంబున కృంగి, నా మగం
  డుత్తము డంచు బెర్కొని యయో సతి గోరు కొనెన్ విడాకులన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. ఉత్తమోత్తముడని తనచిత్తమందు
  తలచి తపనతో బెండ్లాడె తరుణియొకతె
  కడకు వగచి తనకు తాళికట్టిన మగ
  డుత్తముఁడని విడాకుల నువిద గోరె

  రిప్లయితొలగించండి
 15. బొత్తిగ పిల్లలున్ తనకు పుట్టక, వంశము నిల్ప భర్తకున్
  క్రొత్తగ పెళ్ళిచేసి, తన గొప్పమనస్సును చాటుచున్ మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో! సతి గోరుకొనెన్ విడాకులన్,
  చిత్తము నందునన్ దిగులు చెమ్మలు నిండిన కళ్ళతోడుతన్.

  రిప్లయితొలగించండి
 16. ఉత్పలమాల:
  అత్తకుమారుడంచు మనసై మనువాడ విధాత చిత్రమే
  విత్తన ముండి క్షేత్రమున వికృతి గల్గ తనేమి సేయు సంతుకై
  చిత్తమునొచ్చ తప్పదిక చేసెద రెండవ పెండ్లి నే "మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్”
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. అంతే కాక 'వికృతి' భగణం కాదు, నగణమే. 'నొచ్చ' అనడం సాధువు కాదు.

   తొలగించండి
  2. సవరించగలను. ధన్యవాదములార్యా

   తొలగించండి
  3. ఉత్పలమాల:
   అత్తకుమారుడంచు మనసై మనువాడ విధాత చిత్రమే
   విత్తన ముండి క్షేత్రమున వైధృతి గల్గ తనెట్లు తండ్రియౌ
   చిత్తముక్రుంగె తప్పదిక చేసెద రెండవ పెండ్లి నే "మగం
   డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్”
   --కటకం వేంకటరామశర్మ.

   తొలగించండి
 17. కొత్తగాలగ్నము కోరుకొనితెచ్చెను
  చేసుకొనినగలెన్నొ వేసుకొనియె
  మోజుతో ముత్యాల ముక్కెర ముక్కుకు
  చేయించి గాజులు చేతికమరె
  చెవికుందనముల చేయించితెచ్చెను
  చెవులతో నిండుగ చెలిమిచేసె
  సోక్కపునెక్లసు నిక్కముగనురాళ్ళ
  హారము ఎర్రని అరుణమైయ్యే
  చీరెలుమరిరైకలన్ని విరివిగాను
  తెచ్చియిచ్చెనిజముగాను తేజమెచ్చె
  నేనుఅడుగకుండనెతెచ్చె నేర్పగాను
  ఈనగలమెడబారమై యంత, మగడు
  డుత్తముడనివిడాకుల నువిదగోరె
  ...తోకల...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొన్ని పాదాల్లో గణభంగం.
   "...కోరి తెచ్చెను గద చేసికొని నగలు వేసుకొనియె... చేయించ గాజులు...చెవికుందనమ్ముల...సొక్కపు.. అరుణమయ్యె... రైకలనెన్ని కోరుకొనిన (ఈ పాదంలో యతి తప్పింది).. నేర్పుగాను ... భారమై యిపుడు (యతి తప్పింది)..." అనండి.

   తొలగించండి
  2. కృతజ్ఞతలు పుజ్యశ్రీ
   ఓపికతొ ప్రతిపాదాన్ని చూచి
   తగురీతిని చూచిస్తున్న మీకు నమోవాచకములు
   గురుదేవా

   తొలగించండి
 18. మత్తున నెల్లవేళల నిమగ్నుడునై నిదురించు, లేచెనా
  విత్తము దెమ్మటంచు పెను వేదనకుం గురి చేయు, నింటి యూ
  సెత్తడు, సొమ్ము నీయనిచొ హింసలఁ దేల్చగ నెట్లు దా మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని, యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "ఈయనిచొ' అని చోను హ్రస్వంగా ప్రయోగించారు.

   తొలగించండి
  2. ధన్యవాదములండీ మార్చుతాను

   మత్తున నెల్లవేళల నిమగ్నుడునై నిదురించు, లేచెనా
   విత్తము దెమ్మటంచు పెను వేదనకుం గురి చేయు, నింటి పయూ
   సెత్తడు, సొమ్ము నీయ నన నేర్చగ మంటల నెట్లు దా మగం
   డుత్తముఁడంచుఁ బేర్కొని, యయో సతి గోరుకొనెన్ విడాకులన్

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 19. చిత్తమునందు దైవమును చింతనచేయక నెల్లవేళలన్
  మత్తుగ గ్రోలి మద్యమును మత్తునిగా పచరించు నట్టియు
  న్మత్తుడు నామగండుగన మందుడు మూర్ఖులయందు నామగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  రిప్లయితొలగించండి
 20. ఇకపయినెపుడు జరుగబోదివ్విధమని
  యెన్ని దినముల నుండియో హితుల గూడి
  తుష్టిగ సురను తాగుటందున దన మగ
  డుత్తముఁడని విడాకుల నువిద గోరె

  రిప్లయితొలగించండి
 21. అత్తను మామనున్ మిగుల నాదరముంగను, నాడుబిడ్డలన్
  నెత్తిన బెట్టుకొంచు తననేస్తుల బిల్చును యెల్లవేళలన్
  పెత్తనమంతయున్ దనది పేరుకు నేనిట భార్యనౌదు నా
  నెత్తికి చాకిరేమిగులు నిక్కము లోకులదృష్టిలో మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్”

  రిప్లయితొలగించండి
 22. సవరించిన పద్యం

  విరించి.

  సొత్తును దొంగిలించి యది జూదము నాడట గెల్చినట్టి యా
  విత్తముతోడ నేగుగద వేశ్యల గూడగ నెంచి యచ్చటన్
  మత్తును గోరి యప్పసము మద్యము త్రాగునె తప్ప నా మగం
  డుత్తముడంచు బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్.

  రిప్లయితొలగించండి
 23. మత్తున దేలుచున్ సతము మానినినారడి పెట్టు నామె నో
  రెత్తగ నీడు కాపురమికెట్టుల సాగు మగండు వ్యర్థుడౌ,
  మెత్తని మాటలన్ మగువ మెచ్చగ చిత్తము గెల్చెడిన్ మగం
  డుత్తముఁడంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  రిప్లయితొలగించండి
 24. చిత్తము నెంచగా నెపుడు చేరి వసించగ నన్య భామలన్
  విత్తము ఖర్చు చేయునపవిత్రపు బంధములందునిచ్చతో
  నత్త సుతుండు యోగ్యునిగ నన్యుల ముందునటించు నామగం
  డుత్తముడంచు, బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  రిప్లయితొలగించండి
 25. సంతసించెను నెంతయో శైలజ మగ
  డుత్తముడని,విడాకులనువిద గోరె
  దినముదినముబీడించ పతి,సరి యైన
  మార్గమనుకొని జేసెను మానవతిగ

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. అత్తకు జేసె వందనము హర్షము నొందితి మిక్కిలిన్ మగం
  డుత్తముడంచు బేర్కొని ,యయోసతిగోరుకోనెన్ విడాకులన్
  జిత్తుగ ద్రాగివచ్చి పతి చిత్తుగబాదగ నెల్లవేళలన్
  మత్తును గారణంబుగను మారెను నట్లుగ మంచివాడులే

  రిప్లయితొలగించండి
 28. పెండ్లి సేసిరి తెలియక వీని తోడఁ
  బెద్ద లప్పుడు గొప్పగఁ బిదప సత్య
  మెల్లఁ దెలిసె నా కకట గా దెన్నఁడు మగఁ
  డుత్తముఁ డని విడాకుల నువిద గోరె


  ఉత్తల మాయె మొత్త మట నుత్తినె విత్తిరి సందియంపుఁ బె
  న్విత్తన మిత్తలోదరికి నెమ్మదిఁ గ్రొత్తగ నిత్తె మందఁగాఁ
  తత్తర పాటు చిత్తమునఁ దత్తరుణీమణి కాదు నా మగం
  డుత్తముఁ డంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్


  ఇత్తరి వీరి లోన మఱి యెవ్వరు మారిరి యొక్క యేఁటిలోఁ
  గ్రొత్తఁ దనమ్ము పూరుషులకుం గర మిష్టమ చంచలమ్ములా
  చిత్తము లాడు వారి కిలఁ జెప్పు మొకప్పుడు తానె నా మగం
  డుత్తముఁ డంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్

  రిప్లయితొలగించండి
 29. ఆధునిక నాగరిక సొంపు లాకళింప
  కాపురమున పొందిక పొసగని మహిళకు
  తెలియదు, తన మారని పాత కాలపు మగ
  డుత్తముడని, విడాకుల నువిద గోరె

  రిప్లయితొలగించండి