18, ఆగస్టు 2021, బుధవారం

సమస్య - 3816

19-8-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్”
(లేదా...)
“తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై ”

35 కామెంట్‌లు:

  1. తన యహమున దక్షుండటు
    తనయల్లుడు శివుని విడి వితానము సేయన్
    తనయజ్ఞము పాడైనను,
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  2. అనయము లంకను గాయుచు
    పవమానసుతుని చేత బడిచచ్చెగదా
    వినయవిధేయుడు నళువ
    "తనయను పరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  3. దనుజుడు వంచన తోడను
    వనమున నొంటరిగనున్న పాళము ఝషలో
    చన నపహరింప కైకసి
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. కందం
      ఇనవంశోత్తమ రాముడు,
      గనుగానక ధిక్కరించి కాంతనుఁ గొన రా
      వణు మోహమదాంధ విఘా
      త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

      చంపకమాల
      ఇనకుల వార్ధి చంద్రునిగ నెల్లరి మానసచోరుడైన రా
      ముని సతి నుంచి లంక కడు మూర్ఖత నే హితవాక్యమెంచకే
      రణమున కొగ్గ రాఘవుడు రావణు మోహమదాంతతన్ విఘా
      త నయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై

      🖌️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కినుకను బూనిన రాముడు
    వనమున భయమును గొలుపుచు వచ్చిన రాకా
    సిని తాటకిని సుకేతున్
    తనయను బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  6. తనలోరేగినకోరిక
    మనమునబుట్టినమనసిజనంతముఁజేయన్
    మౌనియుశమమనుఖడ్గము
    తనయనుఁబరిమార్చిజనులదైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. వనమున తాటకఁజూచియు
    ఇనవంశోత్తముడు రాము డేర్పడ బలిమిన్
    ఘనుడగు యక్షు సుకేతుని
    తనయనుఁబరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    యక్షుడు సుకేతుని కూతురు తాటక
    అం.భా

    రిప్లయితొలగించండి
  8. సమస్య :

    తనయను జంపి లోకులకు
    దద్దయు మేలొనరించె దేవుడై

    ( అయ్యప్ప కావించిన దుష్టరాక్షసి మాహిషీసంహారం )

    చంపకమాల
    ....................

    ఘనమగు రాజవంశమున
    గాంచనదేహపు అయ్యపాఖ్యుడై
    యనయము తల్లిదండ్రులకు
    హ్లాదము గూర్చుచు వ్యాఘ్రవాహుడై
    జనుల వధించుచున్న కడు
    ఛద్మపు మాహిషి ; దుష్టదానవీ
    తనయను జంపి లోకులకు
    దద్దయు మేలొనరించె దేవుడై .

    ( ఛద్మపు - మోసపు )

    రిప్లయితొలగించండి
  9. జనులను చంపుచు మరి మరి
    దినదినము దిగులు పరచగ, ధీరుడు సంతో
    షనువాడాడుది యగు పులి,
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  10. ఘన శూరు డైన మారుతి
    వనధిని లంఘించి లంక వడి గా జేరన్
    తన కడ్డయిన బు లస్త్య కు
    తనయను బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  11. ఘనమగు బ్రహ్మదీవనల గర్వితుడైన దశానునుండహో
    వనమున ధర్మపత్నిఁ గడువంచన తోడహరింపగా ధృతిన్
    వనధికి వారధిన్ నిలిపి వానరయోధుల గూడి కామత
    ప్తనయను జంపి లోకులకు తద్దయు మేలొనరించె దేవుడై

    రిప్లయితొలగించండి

  12. వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
    మునిజన ఘాతకుండతడు మోహము నందుచు రామపత్నినే
    వనముననుండి మ్రుచ్చిల ప్రవాహికుడైన, సుమాలి పుత్రికా
    తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుడై.

    రిప్లయితొలగించండి
  13. వినయవిదేయ రాముడును వె
    ళ్ళెను యాగము గావ కానకున్
    వనమున యాగమెల్లపుడు
    బాడొనరించెడు రాక్షసాంగనన్
    ధనువున నొక్క వేటునను
    తాటక దుర్గుణ నా సుకేతునిం
    దనయను జంపి లోకులకు ద
    ద్దయు మేలొనరించె దైవమై

    రిప్లయితొలగించండి
  14. కనలగజీవజాలమునుకాంతియులేకనిశీధమందునా
    నినుడునువాడిబాణములనింగినిపోడ్చెగభాసమందుచున్
    వనరుచుకల్వకామినియువాడెనువేడియునంటనీరధీ
    తనయనుజంపిలోకులకుతద్దయుమేలోనరించెదేవుడై

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. చం:

      సునయన రూపమున్ పొదివి జూచిన గృష్ణుడి ముద్దు జేయుచున్
      మనముగ నొక్కరీతి తగు మాటున కార్యము నిర్వహించనై
      చనువుగ నెత్తి బాలుడిని స్తన్యము నోటను బట్ట రాక్షసీ
      తనయను జంపి లోకులకు దద్దయు మేలొనరించె దేవుడై

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  16. ఘనుడౌ ముని విశ్వామి
    త్రుని జన్నము గావ దశరథుఁ సుపుత్రుడు దా
    వనమందు నా సుకేతుని
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    తాటక తండ్రి సుకేతుడు.

    రిప్లయితొలగించండి
  17. అనఘుడు రాముడు తరలెను
    పనివడి మునిజనులయజ్ఞ పరిరక్షణకై
    అనియత రక్కసి యక్షుని
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  18. పిననాటి దినములందున
    తను యతి ప్రాసల నిలుపక తప్పుల తోడన్
    నొనరించిన తన కవితా
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  19. వనమున నున్న జానకిని వంచనతోఁ గొని పోయి తోటలో
    నునిచి దయా విహీను డయి యుక్కిరిబిక్కిరి చేయుచుండగా
    ఘనమగు యుద్ధరంగమున కైకసి పుత్రు నెదిర్చి, కావ భూ
    తనయనుఁ, జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై

    రిప్లయితొలగించండి
  20. పనితన మందు పేరుగల వైద్యుడు వైద్య చికిత్సలో న చే
    సిన పొర పాటు చేత పెను చింతకు తాన్గురియయ్యె చిన్నదౌ
    తనయనుఁ జంపి, లోకులకుఁ దద్దయు మేలొనరించె,
    దేవుఁడై
    మనె తన వైద్య సేవలను మానక తక్కువ డబ్బుతోడుతన్

    రిప్లయితొలగించండి
  21. తనసతి కోర్కె దీర్చుటకు తక్షణమే రఘురామ చంద్రుడా
    వనమున మాయలేడి గొనివచ్చుటకేగెను వెంటనంటి గాం
    చన హరిణమ్ముఁ గాంచి తనచాపము నెక్కిడి తూపువైచి భీ
    త నయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై

    రిప్లయితొలగించండి
  22. తన శర పరంపరలతో
    ఘనచరితుడు రాముడు రణ కర్కశుడగుచున్
    దనుజుడు రావణు సంక్షుభి
    త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి

  23. వినుసిగ దేవరన్న కడు ప్రీతిని జూపుచు గొల్వనేమిరా
    మునిజన ఘాతకుండతడు మోహము నందుచు రామపత్నినే
    వనముననుండి మ్రుచ్చిలిన వంచకుడైన పలాశి కామత
    ప్త నయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుడై.

    రిప్లయితొలగించండి


  24. దనుజుడు వంచన తో సీ
    తనపహరించి చెరబట్ట దాశరథియె యం
    బునిధిని దాటి తమకత
    ప్త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  25. మునియగు విశ్వామిత్రుని
    ఘనమగుయఙ్ఞంబుగావ కఠినాత్ముండై
    పనిగొని పులస్ధ్యు ముద్దుల
    తనయను బరిమార్చి జనులదైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  26. ఘన దీర్ఘ బాహు రక్షిత
    వనస్థ బంధన చతుర కబంధ మహా దై
    త్యునిఁ బద సానన కుక్ష్యం
    త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్


    ఘనముగ ఘోర దైత్య లయ కార్యము లిట్లు దొడంగెఁ జేయఁగాఁ
    జను గవ పాలు త్రాగెడు మిషం గొని లీలగఁ బ్రాణ వాయువుల్
    మును మును బాలకృష్ణుఁ డల పూతన బాల గణఘ్న రాక్షసీ
    తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై

    రిప్లయితొలగించండి
  27. ముని వెనుకను జని రాముడు
    గనెనా రక్కసులనంత కాననమందున్
    వెనుకడుగిడక సుకేతుని
    తనయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్

    రిప్లయితొలగించండి