16, ఆగస్టు 2021, సోమవారం

సమస్య - 3814

17-8-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేఁపాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్”
(లేదా...)
“వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్”

48 కామెంట్‌లు:

 1. పాపా చూడుమిపుడు కరి

  వేపాకు‌ల‌పచ్చడి దిన వేడ్క జనించెన్

  సాపాటులోన, పెరిగెను.

  చూపని‌ తెలిపితివినీవు చోద్యము గాదే,

  రిప్లయితొలగించండి

 2. వేపుడు కూరకు జతగను
  చేపల పులుసుండె జూడు చేసితినే సే
  మ్యాపాయసము మరియు కరి
  వేఁపాకులపచ్చడి, దిన వేడ్కజనించెన్.

  రిప్లయితొలగించండి
 3. రూపాలెన్నియొజిహ్వకు
  చాపల్యము దీర్చదగిన చక్కని రుచులన్
  చూపగ రుచికరమౌ కరి
  వేఁపాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్

  రిప్లయితొలగించండి
 4. ప్రాపుగ రోగ నిరోధపు
  దాపున నున్నట్టి తరువు దైవము వోలెన్
  గాపాడు నది యని దెలుప
  వేపాకు పచ్చ డి దిన వేడ్క జనించెన్

  రిప్లయితొలగించండి
 5. ఏపారగ మేని పసిమి
  కాపాడగ బలమునాకు కడవర కెపుడున్
  సాపాటునఁ నా కరివే
  వేఁపాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్.

  రిప్లయితొలగించండి
 6. రాపాడెడిరోగమురా
  నీపాపముపండెనిటులనిలకడలేదే
  తాపాలికతగ్గింపగ
  వేపాకులపచ్చడిఁదినవేడ్కజనించెన్

  రిప్లయితొలగించండి

 7. ఈ పాడురోగ మాపగ
  సాపాడున పాతరుచులు సాధనమనగా
  నావాసము నందున కరి
  వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్

  రిప్లయితొలగించండి

 8. చేపల్ వండితి నిష్టమంచు కనుమా సేమ్యాలనే దెచ్చితిన్
  బాపా యేడుపు మానుమంటినిక సాంబారున్నదే చాలదే?
  యాపై వేపుడు కూరలున్నవిట నీయమ్మమ్మయే పంపె క
  ర్వేఁపాకుల్, గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్.

  రిప్లయితొలగించండి
 9. రూపాలెన్నిధరించెనోదెలియదీరోగంబువింతైఁగనన్
  ఆపన్జాలమువిశ్వరూపమునునీయాయాసమేమౌనుగా
  కాపున్గాయగజీవనంబుగనకాకంచున్మదిన్కుందకే
  వేఁపాకుల్గోనిచేయఁబచ్చడినహోవేడ్కన్భుజింపన్దగున్

  రిప్లయితొలగించండి
 10. ఈపూట నాకు విను గరి
  వేపాకుల పచ్చడి దిన వేడ్క
  జనించెన్
  ఓపికతో భామామణి!
  యాపచ్చడి జేయుమంచు
  నడిగెను పత్నిన్.

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఏపుగ నవనవ లాడుచు
  తోపున పెరిగిన మిరపలతో చేసినదౌ
  కోపగు రుచి గలిగిన కరి
  వేపాకుల పచ్చడి దిన వేడ్క జనించెన్.

  రిప్లయితొలగించండి
 12. సమస్య :

  వేపాకుల్ గొని చేయ బచ్చడి నహో
  వేడ్కం భుజింపన్ దగున్

  ( కూరల వెల కొనలేనంతగా పెరిగిందనీ
  దొడ్లో ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన కరివేపాకుల పచ్చడే శరణ్యమనీ భార్య పద్మను పురమాయిస్తున్న భర్త )

  శార్దూలవిక్రీడితము
  -----------------

  ఓపం జాలను ఖర్చు లెక్కువయె ; నా
  కొక్కం డుపాయంబు లే ;
  దో పద్మా ! యిటురమ్ము ;మంతెన సుధీం
  ద్రోక్తుల్ జెవిం బెట్టుమా !
  కాపాడంగల జీవనౌషధి యదే !
  కానిమ్ము ; తేతెమ్ము ; క
  ర్వేపాకుల్ గొని చేయ బచ్చడి నహో !
  వేడ్కం భుజింపన్ దగున్ .

  ( మంతెన సుధీంద్రోక్తుల్ - మంతెన సత్యనారాయణ రాజు గారి పలుకులు )

  రిప్లయితొలగించండి
 13. కందం
  మాపటి వేళకు రోటన్
  దోపుచు దంచఁగ రుచియని దొండను గొనియున్
  వేపి తిరుగఁబోతకుఁ గరి
  వేపాకుల, పచ్చడిఁ దిన వేడ్క జనించెన్!

  శార్దూలవిక్రీడితము
  పాపండెప్పుడు కాదు సాధువన ద్విత్వంబెంచుఁ గొన్నింటికిన్
  లోపంబందురు పెద్దలన్న ననెనే! "రోటన్ బడన్ దొండయే
  యేపారున్ రుచి కాన దంచి, యిడగా నింపార తాళింపు క
  ర్వేపాకుల్ గొని, చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్!"

  రిప్లయితొలగించండి
 14. శా:

  సాపా టెన్న సుఖంబుగన్ తనువు కాసారంబు నై యొప్పదే
  చూపుల్ గల్పగ నెల్లరున్ దెలుపరే సుష్టెంచి భక్షింపగన్
  కోపంబింతయు రాక చెప్పదొడగెన్ గొంతెత్తి నీరీతి క
  ర్వేపాకుల్ గొని చేయ బచ్చడి సహో వేడ్కన్ భుజింపందగున్

  సుష్టు= మిక్కిలి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. ఈ పథ్యంబుల సేయజాలనికనో యింతీ యనాస్వాదమౌ
  నా పాకంబులనెట్టులన్ గలుగు నాకారోగ్యభాగ్యంబయో
  కాపాడంగ నికేల జాగు సరగున్ కాంతా కనీసంబు క
  ర్వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్

  రిప్లయితొలగించండి
 16. ఈ పండుగ నాడుదయమె
  సాపాటుగ వండినట్టి చండము యిడ్లీ
  తో పక్కన కొద్దిగ కరి
  వేఁపాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్

  రిప్లయితొలగించండి
 17. “ఇడ్లీ “ తప్పనుకుంటే “కడుముల్”
  🙏🏽

  రిప్లయితొలగించండి
 18. సాపాటునకిది పథ్యము
  తాపము శమియించు తెఱవు ధరలో కనగన్
  వేపాకు నాటు వైద్యము
  వేఁపాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్

  రిప్లయితొలగించండి
 19. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మోపాదిన్ గలిగించు కీటకములన్ పోకార్చి నారోగ్యముల్
  ఆపాదించగ చిమ్ముచుండు మెపుడున్ హ్లాదంబుతో నల్దిశల్
  వేపాకుల్ గొని చేయఁ బచ్చడి;నహో వేడ్కన్ భుజింపం దగున్
  సాపాటున్ కరివేప పచ్చడిని స్వాస్థ్యంబుల్ ప్రవర్థిల్లగా!

  రిప్లయితొలగించండి
 20. ప్రాపించన్ ఘనతల్ ప్రపంచ గణుతిన్నమ్మూలికా వైద్య వి
  ద్యా పొంకంబులకున్! ప్రియంబు చెలగన్ అల్లంబు కావేరి కొ
  మ్ముల్ పొయ్యింట ప్రసిద్దమై జనతయున్ మోహంబునన్ మెచ్చగన్
  పోపున్ చేర్చుచు మంచి వైద్యముగ నైపుణ్యంబు మీరన్ క్రియన్
  వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్

  (కావేరి : పసుపు )

  రిప్లయితొలగించండి
 21. భూపాలావళి క్షేమమంచు తమవౌ ముద్దైన కార్యంబులన్
  మేపంజూడగ నైనవారి బరువై మించంగ కోశంబు మే
  మేపాపంబును జేయలేదనుచు మెమ్మెమ్మేయ నంగా భ్రమన్
  వేపాకుల్ గొని చేయ పచ్చడినహో వేడ్కన్ భుజింపన్ దగున్

  భ్రమన్ = పిచ్చెక్కి

  రిప్లయితొలగించండి
 22. ఓ పద్మాక్షి! పొలమ్ముఁ గాంచి కరమౌయుత్తేజమున్ పొంది నే
  నేపారన్ బనిచేసి వచ్చితిని, నాకింపున్ ప్రసాదింపగా
  సాపాటున్ వడిఁ దెమ్ము క్షుత్తుపెరిగెన్ సౌఖ్యమ్ముగానింట క
  ర్వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్

  రిప్లయితొలగించండి
 23. సాపాటులోనయీకరి
  వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్
  పాపా!సూనృత మియ్యది
  యీపూటకునీ వుకూడ యియ్యది తినుమా

  రిప్లయితొలగించండి
 24. ఈ పత్రం బట మం దగు
  వే పోవును బాధ యెల్ల వీనినిఁ దినినన్
  సైఁప నిఁకఁ నిది కరము లా
  వేఁ పాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్

  [లావు + ఏఁపు + ఆకుల = లావేఁపాకుల; ఏఁపు = బాధ; కరము లావు, ఏఁపు వ్యస్త పదములు కాన టు గాగమమునకుఁ దావు లేదు, ఏఁపు కర్తృ పదము]


  ఓపం జాలదు గుండె నెయ్యి దినఁగా నొక్కింతయే నన్న! సం
  తాపాంభోధిని ముంచుఁ జక్కెర తమిం దాఁ గొన్న నట్లన్న! ఘో
  రాపన్నం బట యుప్పు దిన్న నిఁకఁ బ్రాణాపాయమే యన్న! నా
  వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్

  రిప్లయితొలగించండి

 25. కోపంబేలర తీపివస్తువని సంకోచించుచుంటిన్ గదా
  యా పాసెమ్మును ముట్టబోకు మధుమేహంబున్న నీకయ్యదే
  యౌ పాషాణమటంచు ప్రాణదుడు తానానాడె వాచించెనే
  వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. పాపా!చెప్పుదునీకెయొక్కటి భారంబు నాయన్క క
  ర్వేపాకున్ గొని చేయపచ్చడి నహోవేడ్కన్ భుజింపందగున్
  మాపున్ జేయుమయంచు జెప్పుమ యుమామాహే శ్వరాశర్మకున్
  నీపుణ్యంబును జేయగోరుదునునే నిష్టంబుగాజేయుమా

  రిప్లయితొలగించండి
 28. ఈపూటేమిటి శాకమొండెదవు
  నేనేదేని దేలేదయో!
  శాపంబెవ్వరు పెట్టిరో ధరలకున్
  సైయంచు బెర్గెన్వెసన్
  రా పత్నీ! యిటు నామనంబు మి
  గులన్ రం జిల్లగా నీవు క
  ర్వేపాకుల్ గొని చేయు పచ్చడి న
  హోవేడ్కన్ భుజింపందగున్

  రిప్లయితొలగించండి