28, ఆగస్టు 2021, శనివారం

సమస్య - 3825

29-8-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెనిమిటికే కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్”
(లేదా...)
“పెనిమిటికే కదా ప్రసవవేదన గల్గును మిక్కుటంబుగన్”

27 కామెంట్‌లు:

 1. కనెగాసాంబుఁడుతానే
  మునిశాపమునిజముగాగముసలమునంతన్
  అనయముయాదవకులమున
  పెనిమిటికేకలుగుప్రసవవేదనకడిదిన్

  రిప్లయితొలగించు
 2. అనయమునర్ధమీశ్వరుడునాతికిశక్తికినెప్పుడున్సదా
  చెనకుటస్రుష్టిఁజేయుటయజీవులబిడ్డలవోలెఁజూచుటల్
  మనుగడమాయలన్నిటినిమస్తకమందునదాల్చినాడుగా
  పెనిమిటికేగదాప్రసవవేదనగల్గునుమిక్కుటంబుగన్

  రిప్లయితొలగించు
 3. ధనహీనుడు పలికెను ప్ర
  జనమున కగు ఋణము దీర్చ శక్యమె నాకున్
  గనగను వనితకు కాదుర
  పెనిమిటికే కలుగుఁ బ్రసవ వేదన గడిఁదిన్.

  రిప్లయితొలగించు
 4. కనుగొని ముద్దులాడి యగు కన్నియ పెండిలి యాడి, ప్రేమతో
  ఘనమగు జీవితమ్మునిడ, గర్భము దాల్చి శ్రమమ్ముతోడ యా
  తన పడు చున్ జరించు సహధర్మిణి బాధను చూడలేక నా
  పెనిమిటికే కదా ప్రసవవేదన గల్గును మిక్కుటంబుగన్

  రిప్లయితొలగించు
 5. కందం
  తనసతి కనుముందు శిశువు
  జననము కష్టమ్మనంగ శస్త్రచికిత్సన్
  ధనమునమర్చఁగ లేడన
  పెనిమిటికే కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్

  చంపకమాల
  తన సతి తాల్చ గర్భమును తప్పవు నొప్పులుఁ గాన్పు ముందుగా
  ననయము పద్యపూరణల కంకితమై సృజనాత్మకమ్ముగన్
  గనఁగ శ్రమించు వాడనఁగ కాదనలేముగ నిత్యగర్భమై
  పెనిమిటికే కదా ప్రసవవేదన గల్గును మిక్కుటంబుగన్

  రిప్లయితొలగించు
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అనువుగ సంసారమ్మును
  ఘనముగ పిల్లల చదువులు కళ్యాణమ్ముల్
  తనరించుటందు నిచ్చలు
  పెనిమిటికే కలుగు బ్రసవ వేదన గడిదిన్.

  రిప్లయితొలగించు
 7. తన సతి కను నొక శిశు వని
  మనమున నాశించు భర్త మదికిన్ గలిగె న్
  ఘన శస్త్ర చి కిత్స కొఱకు
  పెనిమిటి కే కలుగు బ్ర సవ వేదన గడిదిన్

  రిప్లయితొలగించు

 8. వినుమని చెప్పసాగె నొక పేద విచక్షణ గల్గు వానితో
  కనగను కాన్పుకోసమగు ఖర్చును జూడగ మోపెడయ్యె నా
  ధనమును బొందువేళ మది దల్చితి నిట్టుల, దీనులిండ్లలో
  పెనిమిటికే కదా ప్రసవ వేదన గల్గును మిక్కుటంబునన్.

  రిప్లయితొలగించు
 9. తనలో సగమైన సకియ
  తనువున బాధను కనుగొన తానే వగచున్
  వినదగు నిక్కపు బలుకులు
  పెనిమిటికే కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్

  రిప్లయితొలగించు
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అనువుగ నింటినిన్ నడపుటందున పిల్లల విద్యకున్ మరిన్
  ఘనముగ వారి పెండిలికి ఖర్చులు చేయుటలోన చూడగా
  ననయము గాఢమైనవగు యాతన లిట్టివె ఢీకొనంగగా
  పెనిమిటికే కద ప్రసవ వేదన గల్గును మిక్కుటంబుగన్.

  రిప్లయితొలగించు
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 12. కె.వి.యస్. లక్ష్మి:

  అనువగు సంసారమ్మున
  మునుకడగా బిడ్డ నిడెడి ప్రోయాలిన్ తా
  కనుచును నానందించెడి
  పెనిమిటికే కలుగు బ్రసవ వేదన కడిదిన్.

  రిప్లయితొలగించు
 13. తమిళ నాడులో ఒకభర్త తాళి కట్టించుకొన్నాడు. దాని ఆధారంగా నా ప్రయత్నము:

  చం:

  మనువు నొకింత ముచ్చటగ మారె ధరింపగ తాళి భర్తయే
  తనువులు సంగ మింప నది తత్వము నింతియె దాల్చ గర్భమున్
  కనుటను నాటకంబుగను గన్పడ జేయగ నెంచ వింతగా
  పెనిమిటికే కదా ప్రసవ వేదన గల్గును మిక్కుటంబుగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 14. రిప్లయిలు
  1. వెనుకటి రోజులలో మరి
   కనుటయె మరుజ న్మకుసరి,కత్తెర తోనన్
   కన జని మత్తున, కత్తెర
   పెనిమిటికే, కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్.

   తొలగించు
 15. వనమున గల మైలను గని
  యనఘము జేయగ వణిక్కు డంకముగ నిడెన్
  వనమూలిక గలిపి గుడువ
  పెనిమిటికే కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్

  రిప్లయితొలగించు
 16. పెనవేసినభందమిదని
  వినతికెక్కెనుఆలుమొగల విదమునుగనగా
  దినదినసుఖదుఃఖంబున
  పెనిమిటికెకలుగుబ్రసవవేదనగడిదిన్
  ...తోకల...

  రిప్లయితొలగించు
 17. మునుపటికాలమందుపలుముచ్చటలిచ్చట మిన్నుముట్టగన్
  ఘనముగనత్తమామలునుకల్లలులేకయుసాగిపోవగన్,
  సునిశితవేళలందునిటసొంతపువారలు
  దూరదూరమై
  పెనిమిటికే కదా ప్రసవవేదన గల్గును మిక్కుటంబుగన్
  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించు
 18. ఘనమగు ప్రేమ బంధమున కంటికి రెప్ప యనంగ భార్య తా
  ననయము గాంచు చుండ కడు యార్ద్రత నిండిన డెందమందునన్
  దన పతి మోదమే సతము, తన్మయ మందున దేలి పోవు నా
  పెనిమిటికే గదా ప్రసవ వేదన గల్గును మిక్కుటమ్ముగన్

  రిప్లయితొలగించు
 19. వినుముర కుటుంబ బాధలు
  పెనిమిటికేకలుగు,బ్రసవవేదన గడిదిన్
  గనగను భరించ రానిది
  వనితలకున్ మరల జన్మ భరణిని సుమ్మీ

  రిప్లయితొలగించు
 20. ఘనుఁడా వంశోద్ధారకు
  జననం బయ్యెడు ముదంపు సమయములో గే
  హినికిన్ లోపల వెలుపల
  పెనిమిటికే కలుగుఁ బ్రసవ వేదన గడిఁదిన్


  వనితకుఁ గల్గుఁ బుట్టిన దివమ్మున మాత్రమ కష్ట మెంచఁగాఁ
  దనయుఁ డొసంగు నిక్కటులు తద్దయుఁ దండ్రికి జీవి తాంతముం
  గను నపు డాలి కిప్పుడమిఁ, గన్న ఫలమ్మది చెందుఁ బిమ్మటం
  బెనిమిటికే కదా, ప్రసవ వేదన గల్గును మిక్కుటంబుగన్

  రిప్లయితొలగించు
 21. తనకిక వారసుండొకడు దక్కునటన్న ముదంబు గాంచగా
  పెనిమిటికే కదా, ప్రసవవేదన గల్గును మిక్కుటంబుగన్
  వనితకునైన గాని దన బాధను సైచును వంశవృద్ధియే
  తనదగు బాధ్యతంచు, గన దల్లియె దైవము సృష్టికర్తయున్

  రిప్లయితొలగించు
 22. మునుపటిరోజులు మారెను
  కనక కనక కన్న భార్య కానుపునందున్
  తనకన్న పడగ నిడుముడి
  పెనిమిటికే కలుగుఁ బ్రసవవేదన గడిఁదిన్

  రిప్లయితొలగించు
 23. వినుము కుటుంబపోషణయు బెద్దలరక్షణ భార్యకోరికల్
  పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్
  దినకర! వీరికోరికలు దీర్టగ నెంతయొ భారమైనయున్
  బనిగొని చేయుచుండుచును బంధులమన్నన లందుకొమ్ముమా

  రిప్లయితొలగించు
 24. ఘనమగు భావ బంధురపు కమ్మని
  తీయని మాతృభాషలో
  నన యము హృద్య పద్యముల,
  నద్భుత కావ్యములన్ రచించుచున్
  గనగను నాకు దోచు సుమి కావ్య
  పు కన్నెను వెల్లడించ నా
  పెనిమిటికే గదా ప్రసవ వేదన కల్గును
  మిక్కుటంబుగన్

  రిప్లయితొలగించు