1, ఆగస్టు 2021, ఆదివారం

సమస్య - 3800

2-8-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే"

(లేదా...)
"ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో"

77 కామెంట్‌లు:

 1. పవలున్ఱేయినియిలలో
  అవసరమెంచుచుమసలుచునగపడడెపుడున్
  కువకువలాడగమనసును
  ఎవడేయెవ్వడెయెవాడెయెవ్వఁడెయెవడే

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సవురుగ వేణువు నూదుచు
  పవిదిగ నీపయి ననురతి ప్రకటించెడునౌ
  యువనాయక శృంగారుడు
  ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?

  రిప్లయితొలగించండి
 3. కనుము యశోదమ్మ,కన్నయ్య వెన్నను
  దొంగిలించె ననుచు,దుడుకు‌
  తనము

  తోడ నన్నతనిని చూడమనుచు
  తెచ్చి
  తివిగ నీయింటికి తినుచు నున్న

  బాలురలో యేడి ,వేలును నాకెడి
  వీడా ,ముఖమును తిప్పి తిను
  వాడ,
  వెన్నను కుక్కుచు నున్నట్టి
  వీడా భ
  యమును బడయుచు కంబము వెనుకన

  దాగిన బాలుడా,కన బడ
  కుండెనే
  నీ గీమున ,యెచట నీకు
  కన ప

  డెను,యెవడే,యెవ్వ డె, యెవాడె,యెవ్వడె,
  యెవడే, కనపడడే? యింత మంది

  గోప బాలకులందు నా పాపడు, పద

  జూపె దను నా గృహమున శిశువును, కట్టి

  వేసితి నతనిన్ రోటికి, పిల్ల‌ వాని,

  పైన‌ నిందేల నని తల్లి పలికె నపుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మనోహరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
   'గీమున నెచట..' అనండి.

   తొలగించండి

 4. విరించి.

  ఉవిదయె రమ్మని పైటను
  సవరించుచు పిలిచినంత సరసుండగు వా
  డెవఁడే రానని చెప్పున
  దెవఁడే యెవ్వఁడె యెవాడె యెవ్వఁడె యెవఁడే.

  రిప్లయితొలగించండి
 5. వివరంబెక్కడ? కానగాబడఁడుతావేదీకనంజాలమే
  పవరంబెంతయుఁజాలదేకనగనాభావంబులోనారయన్
  కవిగాఁజెప్పగావర్ణనన్కుదరదేకాయంబునల్పంబునై
  ఎవడేయెవ్వడెయెవ్వడేయెవడెతానెవ్వాడెయెవ్వండోకో

  రిప్లయితొలగించండి
 6. భవ బంధంబుల బాపుచు
  భువిలో నిడుములను బాపి మోక్ష పథంబున్
  సువిధమ్ముగ నివ్వ గలుగు
  నెవడే యెవ్వ డె యెవా డె యెవ్వడె యెవ డే?

  రిప్లయితొలగించండి
 7. శ్రీవేంకటేశ్వరుని చూచినది మొదలు పరధ్యానంలో నున్న పద్మావతితో చెలికత్తెలు...

  కందం
  అవనీనాథుని వలె వని
  యువకుండై మనముదోచి యూపిరిమఱువన్
  నవలా!పద్మా! చేసిన
  దెవఁడే? యెవ్వఁడె? యెవాఁడె? యెవ్వఁడె? యెవఁడే?

  మత్తేభవిక్రీడితము
  అవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!
  పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?
  నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడుం
  డెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   "మదిలో నర్తించె పద్మాక్షుడై యెవడే..." అనండి. (పద్మాక్షుడుండు.. సాధువు కాదు)

   తొలగించండి
  2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

   సవరించిన పూరణ:

   మత్తేభవిక్రీడితము
   అవనీనాథునిఁ బోలు తేజమును నాడా తోఁపులో గాంచితే!
   పవలున్ రేయియు నల్లనయ్య తలపుల్ పద్మావతీ! వీడవే?
   నవలా! నాయకి! నిన్నుదోచి మదిలో నర్తించు పద్మాక్షుడై
   యెవఁడే? యెవ్వఁడె? యెవ్వఁడే? యెవఁడె? తా నెవ్వాఁడె? యెవ్వండొకో?

   తొలగించండి
 8. స్తవనీయుడు కంసారియె
  జవనుల మనసెరిగి మోక్ష జాగృతినొసగెన్
  అవసరమునకాదుకొనగ
  "నెవఁడే యెవ్వడె యెవాఁడె యెవ్వడె యెవడే"

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. అవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్
   చవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబౌనటుల్
   యూదుచున్
   నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వా
   డేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో

   తొలగించండి
  2. అవతారంబుల దాల్చుచు
   నవనీతలమందు ప్రజల ఆయాసంబుల్
   అవలీలగ దొలగించగ
   నెవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యెవడే

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   'ఔనటుల్+ఊదుచున్' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
  4. ధన్యవాదములాచార్యా! సవరించెదను.🙏🙏🙏

   తొలగించండి
  5. సవరణతో

   అవలీలన్ ఘనరాక్షసాళి దునిమెన్నాబాల్య చేష్టాళిగన్
   చవులూరించెడు వేణువున్ జనుల వశ్యంబవ్వ
   బూరించుచున్
   నవనీతంబును పాలనున్ గొనెడు కన్నయ్యంచు బిల్వంగ వా
   డేవడే యెవ్వడె యవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండకో

   తొలగించండి
 10. పవలే యందరు చూచుచుండగ
  ను నీ వంకన్ దదే కార్తితో
  అవనీ! చూచుచు నుండె వాడు
  నుడు నీ కాతండు గుర్తే కదా ?
  వివరంగా విని పించు నాకిపుడు
  సంప్రీతిన్ నిజంబంతయున్
  ఎవడే యెవ్వడె యెవ్వడే యెవ
  డు తానెవ్వాడె యెవ్వండొకో

  రిప్లయితొలగించండి
 11. మ:

  ధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్
  చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్
  లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు నవ్వాడినున్
  యెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవ్వాడినున్'? దాని తర్వాత యడాగమం రాదు.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. సవరణ పూరణ:

   మ:

   ధవలాక్షీ ఎరుపెక్కె నీదు ముఖమే తప్పించుకోలేవికన్
   చెవులన్ మోపుచునాలకించితినహో శృంగార వ్యాఖ్యానముల్
   లవలేశమ్ము నెఱుంగ నైతి కనగా లంఘించు వారెవ్వరో
   యెవడే యెవ్వడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో

   వై. చంద్రశేఖర్

   తొలగించండి

 12. విరించి.


  (అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)


  పవిరమ్మందున శత్రుమూకలను తా బాలార్చ పంచాస్యమై
  హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పా
  టవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వా
  డెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?

  రిప్లయితొలగించండి
 13. సమస్య :

  ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా
  నెవ్వాడె యెవ్వండొకో

  ( ఆకాశరాజు భార్య ధారిణీదేవి తోటలో శ్రీనివాసుని తిలకించి పులకించి తదేకధ్యానంలో మైమరచి ఆహారం తినని పద్మావతితో అంటున్నది )

  చవిగా లేవటె తల్లి ! వంటకము లెం
  చన్ పాచకుల్ లెస్సగా
  నవముల్ లేతలు కూరగాయల నహా !
  నాణ్యంబుగా వండిరే !
  ధవునిన్ గూర్చిన యూహలా ? దెలిసె నీ
  తాదాత్మ్యమున్ జూడగా ;
  నెవడే? యెవ్వడె? యెవ్వడే? యెవడె తా
  నెవ్వాడె ? యెవ్వండొకో ??

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. ఎవఁడే వెన్నను దొంగిలె
  నెవఁడే కన్నెల వలువలనెత్తుకపోయెన్
  యెవఁడే గిరినెత్తినవా
  డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పోయెన్+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 16. కె.వి.యస్. లక్ష్మి:

  నవమోహన రాగముతో
  ఉవిదా! నీపై నెనరును యుత్సాహముతో
  వివరించెడునౌ యువకుడు
  ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వఁడె యెవడే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నెనరును నుత్సాహముతో' అనండి.

   తొలగించండి
 17. ఎవడే సృష్టికి మూలము
  ఎవడే రక్షణ జగతికినేకైకవిభుం
  డెవడే మోక్షకుడెవ్వడు
  ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే

  రిప్లయితొలగించండి
 18. నవవధు వావిడ, వరుడును
  జవస త్త్వములేని కడుముసలి చీకు, సడిన్
  చెవితో విని సతిని యడిగె
  నెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే!

  రిప్లయితొలగించండి
 19. కవితల సమీక్షలో నీ
  రవను గని శంకరాభరణమందున నీ
  స్తవమును సలిపిన దెవరో !
  యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే

  రిప్లయితొలగించండి
 20. ఎవరుగలరంతటవెలసి
  ఎవరేలుదురీభువనము? ఎవరే? వారిన్
  ఎవరువెతకిగనగలరే?
  ఎవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే?

  రిప్లయితొలగించండి
 21. ఎవడీ జగతికి మూలము
  యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే
  యెవడటివిగా ! అతడే
  భవుడు భవుండే భవుండు భవుడే గాదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మూలము+ఎవడే' అన్నపుడు యడాగమం రాదు. "మూలం బెవడే..మూల మ్మెవడే" అనండి.

   తొలగించండి
 22. భువిలో, జితేంద్రియుడితడె
  భవభయహరుడె,శివసుతుడె పవనతనయుడే
  గోవర్దనగిధరతపుడె
  ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వడె యవడే
  .. .తోకల...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర అర్థం కాలేదు.

   తొలగించండి
  2. కృతజ్ఞతలు పూజ్య శ్రీ
   గోవర్దనగిరిధర తపసి
   అనవచ్చా

   తొలగించండి
 23. వివరంబెంచక నిష్థతో నిరతమున్ ప్రీతిన్ సుపూజ్యంబుగా
  స్తవనీయంబగు నోంకృతిన్ భృకుటిలో చంచత్ విధానోక్తమై
  యవలీలన్ గనువాడు-ముక్తి పథ సద్యస్స్పూర్తి శోభిల్లగన్-
  ఎవడే యెవ్వడె యెవ్వడే యెవడె తా నెవ్వ.అడె యెవ్వండొకో?

  రిప్లయితొలగించండి
 24. ఎవరో బ్రాహ్మణపుత్రుడంట మునితో నేతించి దుర్భేద్యమౌ
  శివబాణాసనమున్ సుదుర్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దా
  నవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?
  యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   'క్షత్రియ పుత్రుడంట' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. అయినా మార్చానండి.

   ఎవరో సుందరరూపుడంట మునితో నేతించి దుర్భేద్యమౌ
   శివబాణాసనమున్ సదుద్వహనవైశిష్ట్యప్రశస్తమ్ముఁ దా
   నవలీలన్ కనదార్భటిన్ విరిచె స్వర్గాధీశుడో? శ్రీశుడో?
   యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 25. ఎవఁడే వెన్నను మ్రుచ్చిలించినది తానెవ్వండె గోవర్ధనం
  బవలీలన్ కొనగోటిపై నిలిపినా డాశ్చర్యమొప్పారగన్
  యెవడే కాళియుపైన నర్తిలినవా డెవ్వండె దీనావనుం
  డెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "... మొప్పారగా నెవడే" అనండి.

   తొలగించండి
 26. హిరణ్య కశిపుని ఆంతరంగం:

  దివిజానీకము నందరన్ గెలిచి యుత్సేకంబడంగించితే!
  భువనాలన్నియు జూచితే వెదకి సంపూర్ణంబుగా విష్ణుకై,
  స్తవనీయుండని బల్కనిందరును విశ్వాసమ్ము సేకూఱదే!
  ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో.

  రిప్లయితొలగించండి
 27. శివుడో విష్ణువొ బ్రహ్మయో కవియొ సుశ్రీకార సంరంభియో
  భవుడో కృష్ణుడొ సృష్టికర్తయునొ శ్రీపాండిత్య భూషుండునో
  రవియో రాముడొ జన్నిగట్టుయునొ కార్యారంభ దత్తుండునో
  ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "జన్నిగట్టొ మఱి కార్యారంభ..." అనండి.

   తొలగించండి
 28. రవ మాడ్కిన్ గడు దీమసమ్ముఁ జను నిన్ రంజిల్లగా జేసి తా
  నవలీలన్ చెలి! ప్రేమలోమునుగగానత్యంత సంసక్తితో
  తివిరెన్, గైకొని నీ యనుజ్ఞ వెస నుద్దీపించి నీయిచ్ఛ వా
  డెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో

  రిప్లయితొలగించండి

 29. నవనీత చోరుడాతడు;
  భవుడై రక్షించువాడు; పద్మాక్షుండున్;
  పవనసుతుడు; భావజుడును;
  ఎవఁడే - యెవ్వఁడె - యెవాఁడె - యెవ్వఁడె - యెవఁడే?!

  (శ్రీ కృష్ణుడు, శివుడు, విష్ణువు, హనుమంతుడు, మన్మథుడు)


  ఎవరే లీలగ నూద నా మురళి నే
  డింపారె బృందావనిన్
  స్తవనీయంబయి గోపికా హృదయ వి
  స్తార ప్రకామ స్థితిన్
  నవ రాగోక్తుల లాస్య మాడె నటు వి
  న్నారే! యశోదేయుడే?!
  ఎవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో!

  రిప్లయితొలగించండి


 30. (అభిమన్యు వీరమరణవార్త విన్న కిరీటి శోకముతో చెంతనున్నవారితో పలికిన పలుకులు)


  పవరమ్మందున శత్రుమూకలను తా పాలార్చ పంచాస్యమై
  హవణింపంగను తమ్మిమొగ్గరముఁ సంహారమ్ము కచ్చోట పా
  టవికుండొక్కడు హేతువయ్యెనట దుష్టాత్ముండెవాడంటి? వా
  డెవఁడే యెవ్వఁడె యెవ్వడే యెవడె తానెవ్వాడె యెవ్వండొకో?

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 32. నవమోహనుడా రాముడు
  సవినయముగ ముని వెనుకను జనుచుండనటన్
  యువతులు గుసగుసలాడిరి
  యెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే

  రిప్లయితొలగించండి
 33. కవనము జెప్పెద వినుడీ
  భవితను గుఱిచియు నికగతిఫలముల గూర్చిన్
  వివరముగ నని పలుకువా
  డెవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే

  రిప్లయితొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 35. అవనత వదనులు పర ద
  ర్ప వినాశకు లగ్ని నిభులు వన మేఁగఁగఁ బాం
  డవ పంచ కౌఘమున నరుఁ
  డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే


  భువి రాజిల్లిన శక్ర సన్నిభ మహా పుణ్యాత్ములే సద్యశ
  శ్ఛవి మద్గాత్రులు ధర్మ తత్పరు లిలన్ షట్చక్రవర్త్యావలి
  ప్రవరల్ సెప్పుమ సారసాక్షి కని చిత్రం బింపుగా నెచ్చెలీ
  యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో

  రిప్లయితొలగించండి
 36. జవరాండ్రందఱి కోకలన్ గవిసి వశ్యంబొందగావించువా
  డెవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో
  యవనీనాధుడు కాడొకో దలచస్వర్గాధీశుడోగృష్ణుడో
  వివరం బొప్పగ దెల్పుమా కమల! వేవేలంగ బ్రార్ధించెదన్

  రిప్లయితొలగించండి