2, సెప్టెంబర్ 2021, గురువారం

సమస్య - 3830

3-9-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామా సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా”
(ఛందోగోపనము)
(లేదా...)
“నీ కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా”
(ఛందోగోపనము)

27 కామెంట్‌లు:

 1. అద్దిర కోరికన్ దశరథాధిప! కోసల రాజపుత్రికన్
  ముద్దుగఁ బెండ్లియాడి మఱి పొందితివీవు సుమిత్ర పత్నిగా
  వద్దనకుండ కేకయ నృపాలుని బిడ్డను గోరినావు నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!

  రిప్లయితొలగించండి
 2. కామములేకనుమదిలో
  భూమినియేలగతలపడిపూజితుడౌగా
  నీమముసీతయెముక్తియె
  రామాసతులిద్దరుగలుగమఱోకసతియేలనయా

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు


  1. కందం
   అతులిత బాహుబలమ్మున
   క్షితిపతివై సీత నొంది కీరితి నొకతెన్
   జతఁగొంటివి శ్రీరామా!
   సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా?

   ఉత్పలమాల
   అద్దరి విల్లు ద్రుంచి కొని యంబుజ లోచన జానకీ సతిన్,
   గద్దె నయోధ్యనెక్కి ప్రజఁ గాచు మహీపతివైన చాలదే?
   యిద్దరి ధర్మమూర్తి యన నింపుగ నేలుచుఁ గీర్తిఁ గొంటె! నీ
   కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా!

   తొలగించండి
 4. తద్దయుముక్తికాంతనటధార్మికబుద్ధినినీవుకోరగా
  అద్దిరజానకీసతియునాదరమోప్పగనీకుభార్యనీ
  కిద్దరుభార్యలున్ననువరించితెవేఱోకతెన్రఘూద్వహా
  పెద్దగరాజ్యలక్ష్మినటపేర్మినిజూడగపాలనంబునన్

  రిప్లయితొలగించండి
 5. సుతులు కలుగుట కొఱకు నై
  గతి లేక నిరువురి నొకడు కళ్యాణ మాడెన్
  ధృతి మూడవ దా ! రామా !
  సతు లిద్దరు గలుగ మరొక సతి యేల నయా !

  రిప్లయితొలగించండి
 6. అతులితగుణ ధాముండవు
  వితతంబగు కీర్తికాంత పెనిమిటివీవే
  సతిసీత తోడ రామా
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా

  రిప్లయితొలగించండి
 7. క్షితిపతివై యొకతెను శ్రీ
  మతిగా మైథిలిని గొనుట మరచితివా కీ
  రితి కాంత గోర రామా
  సతులిద్దరు గలుగ మరొక సతియేల నయా

  హద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?
  ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేప ని
  షిద్ధము గాదుగా సతుల జేకొన పెక్కురు వంశవృద్ధికై

  దశరథ మిత్ర సంవాదము  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో

   హద్దులులేని మోహమిది యందము జిందు సుశీలలైన నీ
   కిద్దరు భార్యలున్నను వరించితె వేరొకతెన్ రఘూద్వహా?
   ముద్దులు మూటగట్టెడు సుపుత్రులు లేరను లోపమేపగా
   నొద్దిక బెండ్లియాడితిని యోషను నొక్కతె వంశవృద్ధికై


   తొలగించండి
 8. తద్దయు కీర్తికాంత నిను తావరియించగనయ్యె నీకిలన్
  పెద్ద యనుంగు నెచ్చెలిగ, పిమ్మట సీతను బెండ్లియాడగా
  నిద్దరు భార్యలైరి, యిక నేలొకొ నీకిక రాజ్యలక్ష్మి? నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా

  రిప్లయితొలగించండి

 9. పతి దశరథుండు పాణౌ
  కృతినాడదలచె సుమిత్ర, కేకయ పుత్రిన్
  మతిచెడెనేమో రామా!
  సతులిద్దఱు గలుగ మఱొకసతియేలనయా?

  రిప్లయితొలగించండి

 10. ముద్దియ యందగత్తెయని మోజును జూపుచు పెండ్లియాడగా
  పెద్దలనంపినావుగద విజ్ఞుడు కేకయ రాజు చెంతకున్
  వద్దని చెప్పలేము ప్రభువా! తగదంటిని నా నుడులాలకించు నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా.

  రిప్లయితొలగించండి
 11. (భరతుడు రాజ్యమప్పగించి భూపతిక జేయ వచ్చినపుడు రాముని యాత్మ)

  పితృవాక్య పాలన యొకతె ,
  సతతము నిను వీడకుండుజానకి యౌ భూ
  సుత యొకతె యుండ ! రామా
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా!

  రిప్లయితొలగించండి
 12. సతితో పలువురు భర్తలు
  సతమతమైవగచుచుండ సజ్జనులకు స
  మ్మతమా! అయ్యోరామా!
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా

  రిప్లయితొలగించండి
 13. ముద్దుగ నొక్క మాట పయి ముచ్చట గొన్న విభుండ వైతివే
  ఒద్దిక గా శరంబొకటి యుర్విని రెండవ పత్నియై జనన్
  సద్దొనరించకీ ధరణిజన్ దరి చేరగ పాడి యౌనె ! నీ
  కిద్దరు భార్యలున్న వరియించితె వేఱొకతెన్ రఘూద్వహా!

  రిప్లయితొలగించండి
 14. బీతియులేనట్టిజనము
  నీతినిదప్పిరివివాహనియమముమరువా
  మతిదెల్పుము శ్రీరామా!
  సతులిద్దఱుగలుగ మరొకసతియేలనయా!
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 15. సమస్య :

  ( ఛందో గోపనము )

  నీ
  కిద్దరు భార్యలున్నను వ
  రించితె వేరొకతెన్ రఘూద్వహా

  ( పోతన మహాకవి రచించిన ఆంధ్రమహాభాగవత గ్రంథాన్ని అంకితమందుకొంటున్న శ్రీరామచంద్రునితో
  ఆంజనేయస్వామి )

  ఉత్పలమాల
  ...................

  ఒద్దిక మీరగన్ దలపు
  లొక్కటిగా నిను సేవ జేతురే
  హద్దు లెరుంగనట్టి హృద
  యమ్ముల సీతయు రాజ్యలక్ష్మియున్ ;
  ముద్దుగ వచ్చె నేడిటుల
  ముందుకు భాగవతాఖ్యదేవి ; నీ
  కిద్దరు భార్యలున్నను వ
  రించితె వేరొకతెన్ రఘూద్వహా !!

  రిప్లయితొలగించండి
 16. (మూడవ పెళ్లికి సిద్ధమైన భర్తను జూచి భంగపడిన యిల్లాలి యావేదన)

  కందము:

  సతతము తగవులహితమై 
  సతమతమౌ మా వసతిన సవతి మరొకరా?
  మతిలేదు పతికి!  రామా!
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా

  రిప్లయితొలగించండి
 17. పతిదశరధునకు రామా!
  సతులిద్దరు గలుగ మఱొకసతి యేలనయా
  సుతులుగ బుట్టిరిగదమీ
  రతిసుందరరూపుతోడ నార్యా! చెపుమా

  రిప్లయితొలగించండి
 18. ముద్దులు మూటగట్టునటు మోములు గల్గిన వారుగాను నీ
  కిద్దరు భార్యలున్నను వరించితెవేఱొకతెన్ రఘూద్వహా!
  యద్దిర రామునిన్ నడవికంపుట మూలము కైకపెండ్లియే
  తద్దయు ఘోరమే కమల!ధార్మికరూపుని బంపనిర్దయన్

  రిప్లయితొలగించండి
 19. వితతంపు ధన వ్యయమౌ
  కత కివ్విధిఁ జాలు నయ్య కమనీయముగా
  నుత నటు లీ పతి, రామా!,
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా


  అద్దిర రామ వింటి నట నబ్బుర మందఁగ విర్గఁ జేసి యె
  ప్పొద్దును గాఁగ నీ కవని భూషలు పల్కులు గొప్ప చేతలే
  సుద్దులు సెల్గ సత్య సతి చొప్పడ ధర్మము నాఁగ నాతి నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా

  రిప్లయితొలగించండి
 20. ఉ:

  హద్దులు గల్గు జీవితము నామడ దూరము పత్ను లెచ్చనన్
  బుద్ధిగ నున్న నీకు కవి పుంగవు లెల్లరు చేర్చిరిద్దరున్
  ముద్దుగ మువ్వురంచు కడు ముప్పొనరింపగ , నిగ్గుదేల్చు! నీ
  కిద్దరు భార్యలున్న? వరియించితె వేఱొకతెన్? రఘూద్వహా!

  రిప్లయితొలగించండి
 21. వద్దని చెప్పినన్ జనకు పాత్రకు దానె సమర్థుడంచునా
  పెద్ద వయస్సు వాని నిలబెట్టిరి నాటకమందు గానయో
  నిద్దుర మత్తులోనతడు నివ్వెరబోవగ బల్కెనిట్లు "నీ
  కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా"

  రిప్లయితొలగించండి
 22. కం//
  పతనముజేయకు, భవునకు
  గతి లేదంద్రు, భువిలోని కాంతకు వశమై !
  మతిపోయెన శ్రీరామా, !
  సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా !!

  రిప్లయితొలగించండి
 23. సతతము ప్రజచే మాదిరి
  క్షితిపతిగా ఖ్యాతు డైన సీతానాథా
  సతమతమగు మతి నడిగెద
  *సతులిద్దరు గలుగ మఱొక సతియేలనయా*

  మరొక పూరణ

  ముద్దుల శిష్యుడై మునికి మ్రొక్కుచు విల్లునునెక్కు పెట్టగన్
  హద్దులులేనిసంతసము హర్షము గూర్చగ సీతకచ్చటన్
  ముద్దుల భార్యగా ధరయు మోదముపెంచగనిర్వురొప్పగన్
  *న్నిద్దరు భార్యలున్న వరియించితె వేరొకతెన్ రఘూద్వహా*

  రిప్లయితొలగించండి