27, సెప్టెంబర్ 2021, సోమవారం

సమస్య - 3855

28-9-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్”
(లేదా...)
“మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్”

65 కామెంట్‌లు:


 1. మగువయె కోరెనటంచును
  నగరము జని పట్టుకోక నాథుడు కొని తె
  చ్చి గరిత కివ్వగ ముద్దిడి
  మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జగదంబ పాత్రను పతియె
  అగజాజాని పరిణయపు నంకము నందున్
  పగిదిగ నటించు వేళను
  మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్.

  రిప్లయితొలగించండి
 3. నగరమున నాటకమ్మున
  మగువగ వేషము ధరించి మన్నన నొందన్
  తగు విదపు రూపు గొఱకై
  మగనికి గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 4. సగమాడుదానివలెనుగ
  నగపడతానేశివుఁడునునగజనుకోరెన్
  సిగలోపూవులుదురుముచు
  మగనికిఁగట్టినదిచీరమహిళమురియుచున్

  రిప్లయితొలగించండి

 5. బిగుతగు దుస్తులెన్నొ కొని పేరిమితో సతికిచ్చి దాల్చమం
  చు గరితఁ గోరినట్టి పురుషుషుండను గాంచుచు మందహాసియై
  జగతిని మేటియైన మన సంస్కృతి గొప్పదనమ్ము చెప్పుచున్
  మగనికిఁ, జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.

  రిప్లయితొలగించండి
 6. కందం
  అగణిత బాహు బలంబున,
  వగచెడు సైరంధ్రిఁ గావ, వలలుండొప్పన్
  నగమౌ కీచకుఁ జంపగ
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్

  చంపకమాల
  అగణిత శౌర్యమున్ గలిగి యాలిని మాలినిఁ గావనెంచుచున్
  నగ సముడైన కీచకుని నర్తనశాలకుఁ జేరఁ గూర్చితా
  నగుపడి భామగా వలలుఁడంతముజేసెడు వ్యూహమల్లఁగన్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
 7. గజ్జెలు కాళ్ళకు ఘనముగ కట్టెను
  విజయుడు, పెట్టెను వేళ్ళ నడుమ

  మెట్టెలు నకులుడు, మెడలోన
  వేసె హా
  రమును నగవుతో ధర్మజుడు,కేశ

  ములనల్లి జొనిపెను పూల చెండును సహ
  దేవుడు, ముడుతలు తిప్పుచున్ త

  నదు మగనికి గట్టినది చీర‌ మహిళ ము

  రియుచు,నా భీముడు రిపుని రయము


  గ పరి మార్చగ దలచి నొక పరి లేవ

  బోవ పిలిచెను పార్థుడు, బొట్టు బెట్డి

  ముఖము‌న‌ వెడల మన‌ కుంతి మధ్య ముండు

  సాగె పడతితో నర్తన శాల కపుడు

  రిప్లయితొలగించండి
 8. సగమై దేహమున పతికి
  సిగలో పూవులను దురిమి చిరునగవులతో
  నగలను దాలిచి ప్రీతిగ
  మగనికి, గట్టినది చీర మహిళ మురియుచున్

  సగమయి దేహమందు బతి సమ్ముఖమందున కృష్ణవేణిలో
  సొగసుగ పూలహారమును జొన్పుచు ముద్దుగ మాటలాడుచున్
  నగలను మేనదాల్చి బహు నాజుకు నడ్మున ప్రీతిగొల్పగా
  మగనికి, జీరకట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
 9. వగలునుసోయగంబులునవారితవేషమునందగింపగా
  పగలునుఱేయిపార్ధుడుబ్రుహన్నలగాగనుబుద్ధితోడుతన్
  అగపడక్రుష్ణనయ్యెడనునంగనరూపునుకోరెకవ్వడే
  మగనికిఁజీరఁగట్టెనోకమానినిమిక్కిలిసంతసించుచున్

  రిప్లయితొలగించండి
 10. మొగుడతి మోదమొప్పగను
  ముద్దల భార్యకు దెచ్చె నందమౌ
  ధగధగ మంచు వెల్గు కడు దారణ
  గల్గిన పట్టు చీర దా
  నగుచును దాని దీసుకొని నాట్యమొ
  నర్చెను, చాయ నిచ్చియున్
  మగనికి , చీరె గట్టెనొక మానిని
  మిక్కలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మొగుడు' వ్యావహారికం. 'మగడు' అన్నది సాధురూపం.

   తొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అగజ వివాహ ఘట్టమను నంకమునందు విభుండు నార్యగా
  సొగసగురీతి చిందుగొనుచుండెడి వేళ ధవుండు చీరయే
  బిగుతుగ కట్ట రమ్మనుచు బిల్వగ మోదమునొంది ప్రేమతో
  మగనికి జీరగట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్.

  రిప్లయితొలగించండి
 12. గగనమునంటు వెల గనియు
  తెగువను జూపి కొనబోయి దీనిం దాల్చన్
  సొగసును జూచుటకయి తన
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 13. చం:

  సగమగు టెంచి జీవనము సామెత నొక్కటి జెప్పె నాస్యమున్
  మగటిమి కుంటుగించు మది మార్పు గ్రహించును నర్థనారిగన్
  తగినదనంచు యత్నమున దట్టిన యోచన నాచరింపనై
  మగనికి జీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తగినదనంచు / తగినదటంచు గా చదువగలరు

   తొలగించండి
  2. *ఆదోని మండలంలోని *సంతేకుడ్లూరు* గ్రామంలో స్త్రీల వేష ధారణలో పురుషులు హోళీ పండుగ జరుపు కొంటారు. ఇది అక్కడి ఆచారము.దాని ఆధారంగా ఈ ప్రయత్నము:

   చం:

   ఎగబడి చీర కట్టెదరు యేడులు పైబడు వంశ చారమై
   తగినదటంచు గ్రామమున తాతల పద్ధతి వీడకుండగన్
   సొగసులు గ్రుమ్మరింప సరి చొక్కపు రంగుల హోళి యాడగన్
   మగనికి చీర గట్టె నొక మానిని మిక్కిలి సంతసించుచున్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
  3. మొదటి పాదమును ఈ విధంగా సవరించితిని

   ఎగబడి చీర కట్టెదరు నింటిలిపాదిగ సంప్రదాయమై

   తొలగించండి
 14. మగడొక నాటక మందున
  మగువగ నటియింపబూని మలగుచునుండన్
  అగణితవేగముతో దన
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 15. సమస్య :
  మగనికి జీర గట్టెనొక
  మానిని మిక్కిలి సంతసించుచున్

  ( అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారిన అర్జునుడికి చిరునవ్వుతో ద్రౌపది చేసిన పని )

  " తగవును విస్మరించుచును
  దాలిమి లేనిది యూర్వశమ్మయే
  మగతన ముండకుండ నను
  మాన్యత వీడి శపించె ; నింక నే
  మగువ " ననంగ నర్జునుని
  మంచిగ జేరిన ద్రౌపదమ్మయే
  మగనికి జీర గట్టెనొక
  మానిని మిక్కిలి సంతసించుచున్ .

  ( తగవు - న్యాయము ; తాలిమి - ఓర్పు )

  రిప్లయితొలగించండి
 16. వగలొలికెడు మగనాలిగ
  తగవేషమువేయచీర తప్పక ధరియిం
  పగవలసి రాగ నంతట
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 17. మిగుల గలగొను కరోనకు
  బెగడి గృహము విడి పనులకు వెళ్ళక యుండన్
  మగవాని బొజ్జ యుబుకగ
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 18. అగవుల మునుగుచు మరువగ
  జగమును మదిలో మదనుడు సందడి గొలుపన్
  సొగసుల బిగువును జూపుచు
  మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 19. నగరమునందు వేయబడు 'నాపతి నాగతి' నాటకమ్ములో
  వగలును వన్నెచిన్నెలను వావిరిగా నొలికించు తోయజా
  క్షిగ నటనమ్ముసల్పుటకు చీర ధరించుట రాక వేడగన్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
 20. రగులగ జేయ కోపమును లావునుఁ జూపుచుఁ గీచకుండు వే
  పగతునిఁ జంపగా నిశిని పంపగ నెంచుచు భీమసేనునిన్
  సిగ కుసుమమ్ములన్ దురిమి చెన్నుగఁ దీరిచి మేని సొంపులన్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
 21. మగువలు,దొంగలై, తమకు భాగము నివ్వని దొంగభామినిన్
  తెగడగ, వారలన్ తొలగ దీసెను, మ్రుచ్చిలు చోట తోడుకై
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
  తెగువగ దోచి చీరలను తేరగ పండుగ వేళ కట్టగా!

  రిప్లయితొలగించండి
 22. తగదని జెప్పినన్ వినక తామసుఁడామెను వేఁచుచుండగా
  వగలొలికించి యాతనిని వత్తును నర్తనశాలకంచు దా
  తెగువగ జెప్పి వానికిక దీర్చగ కోర్కె నుపక్రమించెడిన్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

  రిప్లయితొలగించండి
 23. బిగుతగు దుస్తులవేలా
  మగువలకగు మానహాని, మన సంస్కృతికిన్
  తగవని గౌనులు జెప్పుచు
  మగనికిఁ; గట్టినది చీర మహిళ మురియుచున్

  రిప్లయితొలగించండి
 24. తగు చీరయుతికి మడవగ
  తెగనలసెను మగువ,చూడ తెరపై సినిమా
  నిగనిగ దుస్తుల నిచ్చెన్
  మగనికిఁ, గట్టినది చీర మహిళ మురియుచున్.

  రిప్లయితొలగించండి
 25. మగువలకు భర్త మెచ్చం
  గఁ గలుగు నట సంతసమ్ము కర మెద నంద
  మ్ముగ నచ్చు విధమ్ముగఁ దన
  మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్


  పగులును మాన మంచు మది భావనఁ జేయుచు నెవ్వ రేనియుం
  దగ దని మాన వచ్చు మఱి దానిని మానఁడు నూన నెన్నఁడుం
  దగ ధరియింప భద్ర మిడు దైవము దానిని హస్త సూత్రమున్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్

  [చీరన్ = పిలువఁగ ]

  రిప్లయితొలగించండి
 26. చీర గొనగను ముద్దిడె దార తనదు
  మగనికి,గట్టినది చీరమహిళ మురియుచున్
  మిగుల నచ్చిన దగుచును నిగనిగలుగ
  మెఱయు చుండుట కారణ మె మురియుటకు

  రిప్లయితొలగించండి
 27. *మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.*

  ప్రయత్నం:

  పగతుర బిండి జేయగల పాండవ వీరులు మారు రూపునన్
  దిగగ విరాటరాజుకడ ధీర యుధిష్ఠిరుఁ గంకుభట్టుగా,
  రగిలెడు వాయునందనుడు లాఘవమేర్పడ వంటవానిగా,
  మగటిమి జూపు నర్జునుడు మారగ పేడిగఁ, జింత వీడుచున్
  మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్.

  రిప్లయితొలగించండి
 28. మగడొక నాటకంబునకు మానిని వేషమువేయ గోరగా
  మగనికి జీరకట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్
  మగువలు గోరునెప్పుడును
  మన్ననతోడను నుండుచున్ నికన్
  నగవులుజిమ్ముమోముల ననారతమున్ సుఖజీవనంబునౌ

  రిప్లయితొలగించండి