4-9-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రతికి సిద్ధపడుడు రమణులార”(లేదా...)“రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్”
భక్తి శ్రధ్ధ తోడ భజన బృందమ్ములు నుత్సహించి చేయు నుత్స వమున నూరి లోన దేవి యూ రే గు వేళ హా రతికి సిద్ధ పడుడు రమణు లార !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతులు షోడశోపచార విధిని తాముచేసినట్టి పూజ చివరిదశకుచేరెనయ్యె నింక శీఘ్రమే మంగళారతికి సిద్ధ పడుడు రమణులార.
లింగభేదమెన్నలేదుగసేవకుభూజనంబుమెచ్చపౌరులందుమనసుమంచిదైనమరువరుసేవానిరతికిసిద్ధపడుడురమణులార
శ్రీకృష్ణ పరమాత్మకు స్వాగతం పలికే ఏర్పాట్లలో వారి సతీమణులు...ఆటవెలదిసతికి వల్వలూడ్చ, సభనుండి పతులెల్లఁదలలు వాల్చినంత, దాత గానుచింత దీర్చి రాగ శ్రీకృష్ణమూర్తి హారతికి సిద్ధపడుడు రమణులార!మత్తేభవిక్రీడితముసతి కృష్ణన్ గొని వల్వలూడ్చ సభలో సంతాపమున్ జెందుచున్పతులై యాపగ లేక పాండవులహో! వాల్చంగ శీర్షమ్ములన్గతిజూపెన్ మన కృష్ణుఁడున్ వరదుడై కారుణ్యమేపార హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్అలవాటుగా కందం వ్రాస్తూ సమస్యాపాదం మార్చాల్సి వచ్చింది ...కందంసతి ద్రౌపది కవమానముపతులై వారింపలేక వంచగ తలలన్వెత బాపఁ దమధవుడు హారతికిన్ సిద్ధపడిరంట రమణీమణులున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మాధవుడు మురియును మనము జూపెడి యనురతికి, సిద్ధ పడుడు రమణులార,రాచ కేళి సల్ప రమ్యముగ నిచటననుచు బలికె రాథ మనసుబెట్టి
సతిగాతల్లిగసౌమనస్యగనునాసాంతంబుయానంబులోఅతివానీవునునిల్వగానిలనునీహారంబుశోభిల్లెగాఅతులంబౌనుగనీదుసేవలునునీయాదర్శమీపద్యభారతికిన్సిద్ధముకండికన్రమణులారాశుద్ధచిత్తంబులన్
ప్రతిమాసంబును చేయగోరెనట సౌభాగ్యమ్ము నాశించుచున్ వ్రతమున్ గప్పుర గంధియే పిలువగా పాఱుండు చేయించె నావ్రతమై పోయిన వెంటనే పలికెనా ప్రాజ్ఞుండిటుల్ మంగళారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సమస్య :రతికిన్ సిద్ధము గండికన్ రమణులా రా శుద్ధచిత్తంబులన్ ( శ్రీకృష్ణుడు సుభద్రార్జునులకు పరిణయం చేసి యింద్రప్రస్థానికి పంపుతూ వారికి హారతీయమని తన అష్టభార్యలతో చెబుతున్నాడు )మత్తేభవిక్రీడితము -----------------జతగా బావను నర్జునున్ వలచెగా జంద్రాస్య మాచెల్లి ; రే వతియున్ రాము డెరుంగరాదు; వడిగా వారిర్వురున్ బెండ్లియై ధృతితో నిప్పుడె యేగుచుండిరిక సం తృప్త్యాత్మలై మంగళా రతికిన్ సిద్ధము గండికన్ రమణులా రా ! శుద్ధచిత్తంబులన్ .( రాముడు - బలరాముడు ; రేవతి - బలరాముని భార్య )
అతిమోదంబగు వార్తవింటిమిగదా యానందునిల్లాలికిన్ కృత పుణ్యంబుల లబ్ధమో యనగ యౌత్కృష్ట్యంబు జేకూరెనేఅతి వేగంబున బట్ట బాపనికి యాహార్యంబుతో నంత, హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్.
పరుల సేవ లోన పరమాత్మనేగాంచమనసుపడిన దివ్య వనితలారచేయగలిగినంత సేవతో త్యాగనిరతికి సిద్ధపడుడు రమణులార
అతి తోషంబున శ్రీ గజాస్యునకునున్నత్యంత భవ్యంబుగానుతులన్ బూజలు జేయగావలెగడున్ నూత్నోత్సహంబొప్ప హారతికిన్ సిద్ధము గండికన్ రముణులారా శుద్ధ చిత్తంబులన్సతమున్ విఘ్నములన్ హరించిశుభమల్ సమ్మోద మిచ్చున్సుమీ
మ: వ్రతమున్ జేయగ భక్తితో పొరుగునాహ్వానింప కార్యార్థిగాసుతిగన్ జేరిరి యింతు లెల్లరును కాజూడంగ కార్యంబునున్హితులౌ వారల గోరె, నీశు గొలువ న్నింపారమై, మంగళారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబుగన్వై. చంద్రశేఖర్
మ:బ్రతుకుల్ ఛిద్రములాయె బానిసలుగా వంచింప క్రూరాత్ములైవెతలన్ బాపగ నెంచి పూనుకొనగన్ వెన్నాడ నాంగ్లేయులన్ గతులన్ మార్చిరి దేశ వాసులలరన్ గాంధేయులై యెప్ప హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబుగన్వై. చంద్రశేఖర్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు
చిని చిని చరణముల చిలువాలగాంచరే !బాల కృష్ణుడిటకు వచ్చియుండెపుట్టిన దిన మహము ముగియగ నుండె , హారతికి సిద్ధపడుడు రమణులార
సరదా పూరణ...ఇద్దరికీనేనేగదముద్దులమగడున్ చురుకుగ పోటీపడుచున్హద్దులు మీరంగ రతికి సిద్ధపడుడు రమణులార చెలరేగంగన్
మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శత్రు సైనికులను సమరమందు గెలిచివిక్రమించి విజయలక్ష్మినిగొనివీరులొచ్చినారు వేగరారండు హారతికి సిద్ధపడుడు రమణులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. "విక్రమించి గొనిరి విజయలక్ష్మి" అనండి. 'వచ్చినారు'ను 'ఒచ్చినారు' అనరాదు.
సతతంబాత్మ వివేకమున్ మెలఁగుచున్ సంసక్తులై భక్తితోగతి నీవేయని వేడు వారలను వేగంబే కటాక్షించునర్హితుడా మాధవు పాదపద్మముల సేవింపంగ వేళాయె హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
పనులు సేసి చేసి పద్మ దళాక్షులు దివస మెల్ల నిచట దిట్టముగను మీ రలసితి రింక మిక్కటమ్ముగను విరతికి సిద్ధపడుడు రమణులారవితతానుగ్రహ యుక్త వీక్షణములన్ వీక్షించు నాదిత్య సేవిత భూతేశునకుం ద్రినేత్రునకు వేవేగంబ కాత్యాయినీ పతికిం బన్నగ రత్న భూషణునకున్ భద్రమ్ముగా మీరు హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
మీ రెండు పూరణలు ప్రశస్తమ్గా ఉన్నవి. అభినందనలు.
సతతంబా హిమశైల సానువులలోశౌర్యంబు చూపించుచున్వితతంబౌ హిమపాతమున్ సయిచుచున్ వెల్గొందు తేజంపు భారత మాతాత్మజులైన వీరులకు మీరందించగా దివ్య హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారాశుద్ధ చిత్తంబులన్
పూజయాయె నిపుడె పూర్తిగ కనుకహారతికి సిద్ధపడుడు రమణులార!హారతిచ్చి పిదప యయ్యవారినిబిల్వకనులకద్దు కొండ్రు తనివిదీర
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "దసర పండు గనుచు" అనండి. సూరతును సూరతి అన్నారు.
అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్ మతియందెప్పుడు శంభునేదలచి నీమంబొప్పథ్యానించుచోసతతంబిచ్చును నాయువున్ సిరులు నాజన్మాంతమశ్రాంతమున్
వరలక్ష్మీ వ్రత మాచరించు వనితల్ బంగారుతో గూడు నా భరణమ్ముల్ గొని కాంతులీను ఘనమౌ వస్త్రమ్ములన్ దాల్చుచున్సరి భక్తిన్ భజియించి పల్కిరిటు " తోషం బొప్ప యా యమ్మ హా రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్"
ఆర్యా! ప్రాస మరచితిరి! 🙏🙏🙏
సవరించెదను సూచనకు ధన్యవాదములు 🙏🙏
సవరించిన (మార్చిన)పద్యం:క్షితిపై శ్రావణ మాసమందు వరలక్ష్మీ దేవి ప్రీతిన్ గొనన్ వ్రతమున్ జేయుచు శుక్రవారమున భవ్యంబైన మార్గమ్ములో నతివల్ పూజలొనర్చి పల్కిరిటు లాహ్లాదమ్ము నిండార "హా రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్"
అతి క్రూరంబగు రోగమున్నడచగా నాయాస మంచెంచకేధృతిమంతుల్ వరవైద్యసంచయము ప్రత్యేకంపు శ్రద్ధన్ ప్రజాతతులన్ సేవలతోడ నాదుకొన నా దైవమ్మె వారంచు హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
:దేశ మాత సేవ దీక్షగా నొనరించి శత్రు మూక నెల్ల సంహరించి వచ్చి రిపుడె గనుడు వాసిగా నెత్త హా రతికి సిద్ధ మగుడు రమణులార.శుక్రవారమందు శుద్ధ మనస్కులై పూజ లాచ రించి బుద్ధి గాను అక్ష తలను జల్లి అష్టలక్ష్ములకు హా రతికి సిద్ధపడుడు రమణు లార
సతమున్ సాగుచు ప్రేమతోడపతిదౌ సాంగత్యమున్ బొందుచున్గతినీవేయని రామచంద్రునిదయన్ కాంక్షించిపూజింప హారతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్ధృతితో ప్రార్థన చేసినన్ గలుగ నెంతే మోద మీ పృథ్విపై
భక్తి శ్రధ్ధ తోడ భజన బృందమ్ములు
రిప్లయితొలగించండినుత్సహించి చేయు నుత్స వమున
నూరి లోన దేవి యూ రే గు వేళ హా
రతికి సిద్ధ పడుడు రమణు లార !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసతులు షోడశోపచార విధిని తాము
చేసినట్టి పూజ చివరిదశకు
చేరెనయ్యె నింక శీఘ్రమే మంగళా
రతికి సిద్ధ పడుడు రమణులార.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలింగభేదమెన్నలేదుగసేవకు
రిప్లయితొలగించండిభూజనంబుమెచ్చపౌరులందు
మనసుమంచిదైనమరువరుసేవాని
రతికిసిద్ధపడుడురమణులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీకృష్ణ పరమాత్మకు స్వాగతం పలికే ఏర్పాట్లలో వారి సతీమణులు...
రిప్లయితొలగించండిఆటవెలది
సతికి వల్వలూడ్చ, సభనుండి పతులెల్లఁ
దలలు వాల్చినంత, దాత గాను
చింత దీర్చి రాగ శ్రీకృష్ణమూర్తి హా
రతికి సిద్ధపడుడు రమణులార!
మత్తేభవిక్రీడితము
సతి కృష్ణన్ గొని వల్వలూడ్చ సభలో సంతాపమున్ జెందుచున్
పతులై యాపగ లేక పాండవులహో! వాల్చంగ శీర్షమ్ములన్
గతిజూపెన్ మన కృష్ణుఁడున్ వరదుడై కారుణ్యమేపార హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
అలవాటుగా కందం వ్రాస్తూ సమస్యాపాదం మార్చాల్సి వచ్చింది ...
కందం
సతి ద్రౌపది కవమానము
పతులై వారింపలేక వంచగ తలలన్
వెత బాపఁ దమధవుడు హా
రతికిన్ సిద్ధపడిరంట రమణీమణులున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాధవుడు మురియును మనము జూపెడి యను
తొలగించండిరతికి, సిద్ధ పడుడు రమణు
లార,
రాచ కేళి సల్ప రమ్యముగ నిచట
ననుచు బలికె రాథ మనసు
బెట్టి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతిగాతల్లిగసౌమనస్యగనునాసాంతంబుయానంబులో
రిప్లయితొలగించండిఅతివానీవునునిల్వగానిలనునీహారంబుశోభిల్లెగా
అతులంబౌనుగనీదుసేవలునునీయాదర్శమీపద్యభా
రతికిన్సిద్ధముకండికన్రమణులారాశుద్ధచిత్తంబులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రతిమాసంబును చేయగోరెనట సౌభాగ్యమ్ము నాశించుచున్
వ్రతమున్ గప్పుర గంధియే పిలువగా పాఱుండు చేయించె నా
వ్రతమై పోయిన వెంటనే పలికెనా ప్రాజ్ఞుండిటుల్ మంగళా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిరతికిన్ సిద్ధము గండికన్ రమణులా
రా శుద్ధచిత్తంబులన్
( శ్రీకృష్ణుడు సుభద్రార్జునులకు పరిణయం చేసి యింద్రప్రస్థానికి పంపుతూ వారికి హారతీయమని
తన అష్టభార్యలతో చెబుతున్నాడు )
మత్తేభవిక్రీడితము
-----------------
జతగా బావను నర్జునున్ వలచెగా
జంద్రాస్య మాచెల్లి ; రే
వతియున్ రాము డెరుంగరాదు; వడిగా
వారిర్వురున్ బెండ్లియై
ధృతితో నిప్పుడె యేగుచుండిరిక సం
తృప్త్యాత్మలై మంగళా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులా
రా ! శుద్ధచిత్తంబులన్ .
( రాముడు - బలరాముడు ; రేవతి - బలరాముని భార్య )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిమోదంబగు వార్తవింటిమిగదా యానందునిల్లాలికిన్
రిప్లయితొలగించండికృత పుణ్యంబుల లబ్ధమో యనగ యౌత్కృష్ట్యంబు జేకూరెనే
అతి వేగంబున బట్ట బాపనికి యాహార్యంబుతో నంత, హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరుల సేవ లోన పరమాత్మనేగాంచ
రిప్లయితొలగించండిమనసుపడిన దివ్య వనితలార
చేయగలిగినంత సేవతో త్యాగని
రతికి సిద్ధపడుడు రమణులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతి తోషంబున శ్రీ గజాస్యునకు
రిప్లయితొలగించండినున్నత్యంత భవ్యంబుగా
నుతులన్ బూజలు జేయగావలె
గడున్ నూత్నోత్సహంబొప్ప హా
రతికిన్ సిద్ధము గండికన్ రముణు
లారా శుద్ధ చిత్తంబులన్
సతమున్ విఘ్నములన్ హరించి
శుభమల్ సమ్మోద మిచ్చున్సుమీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండివ్రతమున్ జేయగ భక్తితో పొరుగునాహ్వానింప కార్యార్థిగా
సుతిగన్ జేరిరి యింతు లెల్లరును కాజూడంగ కార్యంబునున్
హితులౌ వారల గోరె, నీశు గొలువ న్నింపారమై, మంగళా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబుగన్
వై. చంద్రశేఖర్
మ:
తొలగించండిబ్రతుకుల్ ఛిద్రములాయె బానిసలుగా వంచింప క్రూరాత్ములై
వెతలన్ బాపగ నెంచి పూనుకొనగన్ వెన్నాడ నాంగ్లేయులన్
గతులన్ మార్చిరి దేశ వాసులలరన్ గాంధేయులై యెప్ప హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబుగన్
వై. చంద్రశేఖర్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిచిని చిని చరణముల చిలువాల
రిప్లయితొలగించండిగాంచరే !
బాల కృష్ణుడిటకు వచ్చియుండె
పుట్టిన దిన మహము ముగియగ నుండె , హా
రతికి సిద్ధపడుడు రమణులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరదా పూరణ...
రిప్లయితొలగించండిఇద్దరికీనేనేగద
ముద్దులమగడున్ చురుకుగ పోటీపడుచున్
హద్దులు మీరంగ రతికి
సిద్ధపడుడు రమణులార చెలరేగంగన్
మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశత్రు సైనికులను సమరమందు గెలిచి
రిప్లయితొలగించండివిక్రమించి విజయలక్ష్మినిగొని
వీరులొచ్చినారు వేగరారండు హా
రతికి సిద్ధపడుడు రమణులార
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. "విక్రమించి గొనిరి విజయలక్ష్మి" అనండి. 'వచ్చినారు'ను 'ఒచ్చినారు' అనరాదు.
సతతంబాత్మ వివేకమున్ మెలఁగుచున్ సంసక్తులై భక్తితో
రిప్లయితొలగించండిగతి నీవేయని వేడు వారలను వేగంబే కటాక్షించున
ర్హితుడా మాధవు పాదపద్మముల సేవింపంగ వేళాయె హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపనులు సేసి చేసి పద్మ దళాక్షులు
రిప్లయితొలగించండిదివస మెల్ల నిచట దిట్టముగను
మీ రలసితి రింక మిక్కటమ్ముగను వి
రతికి సిద్ధపడుడు రమణులార
వితతానుగ్రహ యుక్త వీక్షణములన్ వీక్షించు నాదిత్య సే
విత భూతేశునకుం ద్రినేత్రునకు వేవేగంబ కాత్యాయినీ
పతికిం బన్నగ రత్న భూషణునకున్ భద్రమ్ముగా మీరు హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
మీ రెండు పూరణలు ప్రశస్తమ్గా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసతతంబా హిమశైల సానువులలోశౌర్యంబు చూపించుచున్
రిప్లయితొలగించండివితతంబౌ హిమపాతమున్ సయిచుచున్ వెల్గొందు తేజంపు భా
రత మాతాత్మజులైన వీరులకు మీరందించగా దివ్య హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారాశుద్ధ చిత్తంబులన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజయాయె నిపుడె పూర్తిగ కనుకహా
రిప్లయితొలగించండిరతికి సిద్ధపడుడు రమణులార!
హారతిచ్చి పిదప యయ్యవారినిబిల్వ
కనులకద్దు కొండ్రు తనివిదీర
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "దసర పండు గనుచు" అనండి. సూరతును సూరతి అన్నారు.
అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హా
రిప్లయితొలగించండిరతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్
మతియందెప్పుడు శంభునేదలచి నీమంబొప్పథ్యానించుచో
సతతంబిచ్చును నాయువున్ సిరులు నాజన్మాంతమశ్రాంతమున్
వరలక్ష్మీ వ్రత మాచరించు వనితల్ బంగారుతో గూడు నా
రిప్లయితొలగించండిభరణమ్ముల్ గొని కాంతులీను ఘనమౌ వస్త్రమ్ములన్ దాల్చుచున్
సరి భక్తిన్ భజియించి పల్కిరిటు " తోషం బొప్ప యా యమ్మ హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్"
ఆర్యా! ప్రాస మరచితిరి! 🙏🙏🙏
తొలగించండిసవరించెదను సూచనకు ధన్యవాదములు 🙏🙏
తొలగించండిసవరించిన (మార్చిన)పద్యం:
తొలగించండిక్షితిపై శ్రావణ మాసమందు వరలక్ష్మీ దేవి ప్రీతిన్ గొనన్
వ్రతమున్ జేయుచు శుక్రవారమున భవ్యంబైన మార్గమ్ములో
నతివల్ పూజలొనర్చి పల్కిరిటు లాహ్లాదమ్ము నిండార "హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్"
అతి క్రూరంబగు రోగమున్నడచగా నాయాస మంచెంచకే
రిప్లయితొలగించండిధృతిమంతుల్ వరవైద్యసంచయము ప్రత్యేకంపు శ్రద్ధన్ ప్రజా
తతులన్ సేవలతోడ నాదుకొన నా దైవమ్మె వారంచు హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
:దేశ మాత సేవ దీక్షగా నొనరించి
రిప్లయితొలగించండిశత్రు మూక నెల్ల సంహరించి
వచ్చి రిపుడె గనుడు వాసిగా నెత్త హా
రతికి సిద్ధ మగుడు రమణులార.
శుక్రవారమందు శుద్ధ మనస్కులై
పూజ లాచ రించి బుద్ధి గాను
అక్ష తలను జల్లి అష్టలక్ష్ములకు హా
రతికి సిద్ధపడుడు రమణు లార
సతమున్ సాగుచు ప్రేమతోడపతిదౌ సాంగత్యమున్ బొందుచున్
రిప్లయితొలగించండిగతినీవేయని రామచంద్రునిదయన్ కాంక్షించిపూజింప హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
ధృతితో ప్రార్థన చేసినన్ గలుగ నెంతే మోద మీ పృథ్విపై