14-9-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."భయపడి పాఱిన ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్"(లేదా...)"భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును మెచ్చి రెల్లరున్"
హయములపై మ్రుచ్చులు నిర్భయమున దోచుకొన నెంచి వచ్చిన తరి మన్నియ గని యటనుండి వడినిభయపడి పారిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందంజయమే ధ్యేయమటంచు సమయానుకూలముగ యుద్ధ మర్మములెంచన్రయమున వెన్నిడి వైరులుభయపడి పాఱిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్చంపకమాలనియమిత కాలమందు కడు నేర్పున వ్యూహములెంచి రాత్రులన్స్వయముగ మారువేషమున వైరుల దూతల మాయలెల్ల విస్మయమన కట్టిపెట్టు సరి మర్మము లేర్పడఁ జేయ వారలున్భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రయమునదోపిడిదోంగలుపయనంబాయిరియెదిరినిపట్టగనంతన్హయముతోదుముకగరాజునుభయపడిపాఱిన,, ప్రభువునుప్రజమెచ్చుకోనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
తోహ్రస్వముగాచూచుకోనగలరు
రయమున వైరుల పీ చము నయమున నడచంగ బూని నైజ బలమునన్ స్వయముగ గెల్వగ నయ్యెడ భయపడి పాఱిన : ప్రభువును ప్రజ మెచ్చు కొనెన్
జయమిక తథ్యమంచనుచు సైన్యము గైకొని శాత్రవుండటన్ రయమున హద్దుమీరగ వరాకమదేలయటంచు యుక్తితో ప్రియమగు మంత్రితో కలిసి భీకర నాదము చేయ శత్రువుల్ భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చిరెల్లరున్.
సమస్య :భయపడి రాజ్యమున్ విడిచి పారిన రాజును మెచ్చి రెల్లరున్ ( దాయాదుల కుట్ర వల్ల రాజధానిని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లి తగినసమయం కోసం నిరీక్షిస్తున్న మనుమసిద్ధిని మెచ్చిన ప్రజలు )నయమగు రాజ్యపాలనము నందున సాటియు లేని ధీరుడున్ ;ప్రియముగ కావ్య మందుకొను ప్రేమపు సత్కవి పోషకుండు ; దు ర్జయుడగు మన్మసిద్ధియె దు రాత్ముల కుట్రకు యోచితాత్ముడై భయపడి రాజ్యమున్ విడిచి పారిన ; రాజును మెచ్చి రెల్లరున్ .
వయసుననున్నమాయలవివానినినమ్మగరాదునంచునున్నయమునతానునేర్చెనుగనందునియన్నయుబుద్ధితోనటన్పయనమునాయెబాయుచునుబంధములన్నియునోక్కరాత్రిలోభయపడ ిరాజ్యమున్విడిచిపోయినరాజునుమెచ్చిరెల్లరున్
రయమున నిందింతు రెపుడుభయపడి పాఱిన ప్రభువును; ప్రజ మెచ్చుకొనెన్స్వయముగ సేనల నడుపుచుజయమును సాధించి జూప చతురత తోడన్
నయమున బిల్చి, జాతకము నాకెరిగింపుము బ్రాహ్మణోత్తమా!రయమున యంచు తానడిగి, రాహువు స్థానము దోషమౌ టచే,స్వయముగ దేశనాశమును వారణ జేయగ, శాస్త్రి పన్పు నన్,భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును మెచ్చి రెల్లరున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "రయమున నంచు.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
స్వయముగ పాలన జేయగనయమేమియు లేకపోయి నాడిక యంతన్లయమగునను యా తలపుకుభయపడి పాఱిన ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "రయమగునను నా తలపుకు.." అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు: స్మయమున కేరు వైరులు భయపడి పాఱిన; ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్ నయవంచకుడగు రిపువును స్వయముగ రణమున బిగించి సాగిన వేళన్.
స్మయమున కేరును వైరులు
చ: నియమము లెంచి పావులట నిర్ణయ రీతిని యేగుదెంచగన్జయమిక తప్పదన్న, కొన సాగుట వైరికి వట్టిదైనదై రయమున వీడె నాట చదరంగము, లక్ష్యము లేని పన్నికన్భయపడి, రాజ్యమున్ విడిచి పాఱిన రాజును మెచ్చి రెల్లరున్పన్నిక=రచనవై. చంద్రశేఖర్
రీతిని యేగుదెంచగన్ / రీతినినేగుదెంచగన్ : ధన్యవాదములు
క్రొవ్విడి వెంకట రాజారావు: స్మయనముతో పరాభవము సల్పుచు గేలి నొనర్త్రు నాజిలో భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన; రాజును మెచ్చి రెల్లరున్ స్వయముగ శత్రువౌ దొరను శౌర్యముతో రణమందు గెల్చియున్ ప్రియమగు సఖ్యతెంచి విడిపించియు వానికి స్వేచ్ఛ నివ్వగా!
నయవంచకులగు రిపుసంచయమును సమరాంగణమున చమరగ వారల్రయమున రణభూమివదలిభయపడి పాఱిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
నయ పరి పాలనమ్మున సనాతన ధర్మమునిల్పుచుండగారయము నరాతినాయకులు రాపడ చేయగ నీచవృత్తి, నిశ్చయముగ వారి దౌష్ట్యముల చట్టన నిల్పి చెలంగ, శత్రువుల్భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నియతుడిబీషణుండు'?
భయ భ్రాంతులకు గాను గురయ్యి చెల్లా చెదురు మనసు చే ఆపై కోవిడ్ భయము బోలి ఇంకాను వేరియెంట్లు సమాయాత మవగానే భయపడి పాఱిన ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్ అంతేగా నంతేగా ననుచు ఎల్లరు జనాలులునూ.. ~శ్రీత ధరణి
క్షయమొనరించె వంశజుల ఖ్యాతిని కాతరుఁడీతడందురాభయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును; మెచ్చి రెల్లరున్భయమునెరుంగకన్ జనుల క్రాంతి పథంబున నుద్యమింప నాశయము రగుల్చు నాయకుని శత్రు వినాశకునా మహాత్మునిన్
దయతో వేటకు నాయుధ చయ విస్తారమ్ముగా ససైన్యము, పౌరక్షయమున కెడంద మిక్కిలి భయపడి, పాఱిన ప్రభువును బ్రజ మెచ్చుకొనెన్భయ మన నేరఁ డెన్నఁడును భండన దుర్జయుఁ డంచుఁ బల్కుచున్ రయమునఁ గూలఁగా నిజ బలం బని బొందినిఁ బ్రాణ ముంట సందియ మయి దాడి సేయ నరు దెంచిన శత్రువె యిట్టి ఱేనికిన్ భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
జయమది నిశ్చయమ్మనుచు చయ్యన ముందుకు దూకి శత్రుసంచయమును ఢీకొనన్ జరిగె సంకుల సంగరమట్టివేళలోరయమున శత్రుసైనికుల రంపపుకోత విధించునంతనేభయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
జయమును నొందజాలడిక సంగరమందున శక్తిహీనుడేభయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును,మెచ్చిరెల్లరున్ రయముగ రాజ్యపాలనను రంజిలజేయుచు కన్నబిడ్డలాప్రియముగ జూచుచుండుటను బీదలుసాదలు వృద్ధ జనంబుల్
నయరహితుగ నిందింతురుభయపడి పాఱిన ప్రభువును,ప్రజమెచ్చుకొనెన్నయముగ బాలన జేసి.యభయంబును నిచ్చుప్రభుని ప్రమదము తోడన్
భయశీలుడనుచు దెగడిరి భయపడి పాఱిన ప్రభువును; ప్రజ మెచ్చుకొనెన్భయమెరుగకనెదిరి రిపులభయకంపితమతుల జేయు బల్లిదునరయన్
రిప్లయితొలగించండిహయములపై మ్రుచ్చులు ని
ర్భయమున దోచుకొన నెంచి వచ్చిన తరి మ
న్నియ గని యటనుండి వడిని
భయపడి పారిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిజయమే ధ్యేయమటంచు స
మయానుకూలముగ యుద్ధ మర్మములెంచన్
రయమున వెన్నిడి వైరులు
భయపడి పాఱిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
చంపకమాల
నియమిత కాలమందు కడు నేర్పున వ్యూహములెంచి రాత్రులన్
స్వయముగ మారువేషమున వైరుల దూతల మాయలెల్ల వి
స్మయమన కట్టిపెట్టు సరి మర్మము లేర్పడఁ జేయ వారలున్
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరయమునదోపిడిదోంగలు
రిప్లయితొలగించండిపయనంబాయిరియెదిరినిపట్టగనంతన్
హయముతోదుముకగరాజును
భయపడిపాఱిన,, ప్రభువునుప్రజమెచ్చుకోనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
తోహ్రస్వముగాచూచుకోనగలరు
తొలగించండిరయమున వైరుల పీ చము
రిప్లయితొలగించండినయమున నడచంగ బూని నైజ బలమునన్
స్వయముగ గెల్వగ నయ్యెడ
భయపడి పాఱిన : ప్రభువును ప్రజ మెచ్చు కొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజయమిక తథ్యమంచనుచు సైన్యము గైకొని శాత్రవుండటన్
రయమున హద్దుమీరగ వరాకమదేలయటంచు యుక్తితో
ప్రియమగు మంత్రితో కలిసి భీకర నాదము చేయ శత్రువుల్
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చిరెల్లరున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిభయపడి రాజ్యమున్ విడిచి
పారిన రాజును మెచ్చి రెల్లరున్
( దాయాదుల కుట్ర వల్ల రాజధానిని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లి తగినసమయం కోసం నిరీక్షిస్తున్న మనుమసిద్ధిని మెచ్చిన ప్రజలు )
నయమగు రాజ్యపాలనము
నందున సాటియు లేని ధీరుడున్ ;
ప్రియముగ కావ్య మందుకొను
ప్రేమపు సత్కవి పోషకుండు ; దు
ర్జయుడగు మన్మసిద్ధియె దు
రాత్ముల కుట్రకు యోచితాత్ముడై
భయపడి రాజ్యమున్ విడిచి
పారిన ; రాజును మెచ్చి రెల్లరున్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివయసుననున్నమాయలవివానినినమ్మగరాదునంచునున్
రిప్లయితొలగించండినయమునతానునేర్చెనుగనందునియన్నయుబుద్ధితోనటన్
పయనమునాయెబాయుచునుబంధములన్నియునోక్కరాత్రిలో
భయపడ ిరాజ్యమున్విడిచిపోయినరాజునుమెచ్చిరెల్లరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరయమున నిందింతు రెపుడు
రిప్లయితొలగించండిభయపడి పాఱిన ప్రభువును; ప్రజ మెచ్చుకొనెన్
స్వయముగ సేనల నడుపుచు
జయమును సాధించి జూప చతురత తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినయమున బిల్చి, జాతకము నాకెరిగింపుము బ్రాహ్మణోత్తమా!
రిప్లయితొలగించండిరయమున యంచు తానడిగి, రాహువు స్థానము దోషమౌ టచే,
స్వయముగ దేశనాశమును వారణ జేయగ, శాస్త్రి పన్పు నన్,
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును మెచ్చి రెల్లరున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రయమున నంచు.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వయముగ పాలన జేయగ
రిప్లయితొలగించండినయమేమియు లేకపోయి నాడిక యంతన్
లయమగునను యా తలపుకు
భయపడి పాఱిన ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రయమగునను నా తలపుకు.." అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్మయమున కేరు వైరులు
భయపడి పాఱిన; ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
నయవంచకుడగు రిపువును
స్వయముగ రణమున బిగించి సాగిన వేళన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్మయమున కేరును వైరులు
తొలగించండిచ:
రిప్లయితొలగించండినియమము లెంచి పావులట నిర్ణయ రీతిని యేగుదెంచగన్
జయమిక తప్పదన్న, కొన సాగుట వైరికి వట్టిదైనదై
రయమున వీడె నాట చదరంగము, లక్ష్యము లేని పన్నికన్
భయపడి, రాజ్యమున్ విడిచి పాఱిన రాజును మెచ్చి రెల్లరున్
పన్నిక=రచన
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరీతిని యేగుదెంచగన్ / రీతినినేగుదెంచగన్ : ధన్యవాదములు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిస్మయనముతో పరాభవము సల్పుచు గేలి నొనర్త్రు నాజిలో
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన; రాజును మెచ్చి రెల్లరున్
స్వయముగ శత్రువౌ దొరను శౌర్యముతో రణమందు గెల్చియున్
ప్రియమగు సఖ్యతెంచి విడిపించియు వానికి స్వేచ్ఛ నివ్వగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినయవంచకులగు రిపుసం
రిప్లయితొలగించండిచయమును సమరాంగణమున చమరగ వారల్
రయమున రణభూమివదలి
భయపడి పాఱిన, ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినయ పరి పాలనమ్మున సనాతన ధర్మమునిల్పుచుండగా
రిప్లయితొలగించండిరయము నరాతినాయకులు రాపడ చేయగ నీచవృత్తి, ని
శ్చయముగ వారి దౌష్ట్యముల చట్టన నిల్పి చెలంగ, శత్రువుల్
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి'నియతుడిబీషణుండు'?
భయ భ్రాంతులకు గాను గురయ్యి చెల్లా చెదురు మనసు చే ఆపై కోవిడ్ భయము బోలి ఇంకాను వేరియెంట్లు సమాయాత మవగానే భయపడి పాఱిన ప్రభువును ప్రజ మెచ్చుకొనెన్ అంతేగా నంతేగా ననుచు ఎల్లరు జనాలులునూ.. ~శ్రీత ధరణి
రిప్లయితొలగించండిక్షయమొనరించె వంశజుల ఖ్యాతిని కాతరుఁడీతడందురా
రిప్లయితొలగించండిభయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును; మెచ్చి రెల్లరున్
భయమునెరుంగకన్ జనుల క్రాంతి పథంబున నుద్యమింప నా
శయము రగుల్చు నాయకుని శత్రు వినాశకునా మహాత్మునిన్
దయతో వేటకు నాయుధ
రిప్లయితొలగించండిచయ విస్తారమ్ముగా ససైన్యము, పౌర
క్షయమున కెడంద మిక్కిలి
భయపడి, పాఱిన ప్రభువును బ్రజ మెచ్చుకొనెన్
భయ మన నేరఁ డెన్నఁడును భండన దుర్జయుఁ డంచుఁ బల్కుచున్
రయమునఁ గూలఁగా నిజ బలం బని బొందినిఁ బ్రాణ ముంట సం
దియ మయి దాడి సేయ నరు దెంచిన శత్రువె యిట్టి ఱేనికిన్
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిజయమది నిశ్చయమ్మనుచు చయ్యన ముందుకు దూకి శత్రుసం
రిప్లయితొలగించండిచయమును ఢీకొనన్ జరిగె సంకుల సంగరమట్టివేళలో
రయమున శత్రుసైనికుల రంపపుకోత విధించునంతనే
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్
జయమును నొందజాలడిక సంగరమందున శక్తిహీనుడే
రిప్లయితొలగించండిభయపడి రాజ్యమున్ విడిచి పాఱిన రాజును,మెచ్చిరెల్లరున్
రయముగ రాజ్యపాలనను రంజిలజేయుచు కన్నబిడ్డలా
ప్రియముగ జూచుచుండుటను బీదలుసాదలు వృద్ధ జనంబుల్
నయరహితుగ నిందింతురు
రిప్లయితొలగించండిభయపడి పాఱిన ప్రభువును,ప్రజమెచ్చుకొనెన్
నయముగ బాలన జేసి.య
భయంబును నిచ్చుప్రభుని ప్రమదము తోడన్
భయశీలుడనుచు దెగడిరి
రిప్లయితొలగించండిభయపడి పాఱిన ప్రభువును; ప్రజ మెచ్చుకొనెన్
భయమెరుగకనెదిరి రిపుల
భయకంపితమతుల జేయు బల్లిదునరయన్