9, సెప్టెంబర్ 2021, గురువారం

సమస్య - 3837

10-9-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,

వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్”
(లేదా...)
“కుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు, పిజ్జ, కోకులన్”

45 కామెంట్‌లు:

  1. వడిగామారెనుకాలము
    పుడమినిపుట్టినరుచులనుపోందుటతప్పా
    సుడిగోనిదోరగాబ్రతుకగ
    కుడుములరోసిగజముఖుఁడుగోరెన్బర్గర్

    రిప్లయితొలగించండి

  2. కుడువగ నవీన పాకము
    గడసరి బాలుండు మాతృకకు చెప్పెనిటుల్
    విడుమిక యుండ్రాళ్ళనుచును
    కుడుమల రోసి గజముఖుడు గోరెన్ బర్గర్.


    అడిగిన తిట్టునే జనని యాధునికమ్మగు వంటలంచు నా
    గడసరి చెప్పె గల్పితపు గాథను, స్వప్నము నందునన్ ద్విపా
    స్యుడు వృషలోచనమ్ముపయి చువ్వన వచ్చి వచించె నిట్టులన్
    కుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు పిజ్జ కోకులన్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    బుడిబుళ్లుపోవ నొకడున్
    గడువేగంబున వినాయక చవితి ప్రతిమన్
    బొడజూపఁగ విపరీతము
    గుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్!

    చంపకమాల
    పెడసరి చేష్టలన్ దగని విజ్ఞత దైవపు విగ్రహమ్ములన్
    దడబడుటన్నదే మఱచి తక్కవఁజేయుచు సాంప్రదాయముల్
    దొడరి నవీన దృక్పథపు రూపములద్ది సృజించు పోకడన్
    గుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు, పిజ్జ, కోకులన్!

    రిప్లయితొలగించండి
  4. పుడమిని మారిన వంటల
    తడ యక రుచి చూడ దలచి తల్లి గిరిజతో
    నడిగెను మొహ మోటమ్ము న
    కుడుముల రోసి గజ ముఖుడు గోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
  5. విఘ్నపతి ఒక సాధారణ బాలుడు:

    చం:

    కడవను బోలు కుక్షి, గన కాయము పీనము, మాటలాడగన్
    తడబడు చుండు, నాకలిని తట్టు కొనంగను లేని బాలుడై
    గడుసరి హస్తిమల్లు డన కట్టలు ద్రెంచిన సంభ్రమమ్ముగన్
    కుడుములు రోసి విఘ్నపతి గోరెను బర్గరు పిజ్జ కోకులన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  6. బుడిబుడినడకల గణపతి
    వడివడి పుడమికి నిలికముపైనేగెను తా
    నుడికీ యుడకనివని గని
    కుడుముల రోసి గజముఖుఁడుగోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తా నుడికియు నుడకని..." అనండి.

      తొలగించండి
    2. బుడిబుడినడకల గణపతి
      వడివడి పుడమికి నిలికముపైనేగెను తా
      నుడికియు నుడకనివని గని
      కుడుముల రోసి గజముఖుఁడుగోరెన్ బర్గర్

      తొలగించండి
  7. గణపతి వేషధారి

    బడి పిల్లలు నాటకమును
    సడిజేయుచు వేయుచుండ చవితి మహస్సున్
    మడిగా యర్పించినవౌ
    కుడుముల రోసి గజముఖుడు గోరెను బర్గర్

    బుడతలు వేయ నాటకము భూతగణాధిప పర్వమందునన్
    వడివడి విఘ్ననాథునికి పట్టము గట్టెడు ఘట్టమందునన్
    వడలను పాయసాన్నముల పన్నుగ బెట్టిన నేతిబూరెలన్
    కుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు పిజ్జకోకులన్

    రిప్లయితొలగించండి
  8. వడివడి విఘ్ననాయకుడు వచ్చుచు భూమికి మూషికమ్ముపై
    నెడనెడగాంచెనంగడుల నెన్నియొ వింతగు పిండివంటలన్
    కడచిన కాలమంతయును గాటముగా దనకిచ్చినట్టి యా
    కుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు, పిజ్జ, కోకులన్

    రిప్లయితొలగించండి
  9. విడువక దర్శకుడొక్కడు
    కడుపెను చిత్రంబుదీసె కళకళలాడన్
    పొడజూపె విచిత్రంబుగ
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
  10. బుడతకు గణపతి వేషము
    నిడి గారవముగ నతనికి నెరనందించన్
    అడరుచు భక్ష్యము లీయన్
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
  11. సమస్య :

    కుడుముల రోసి విఘ్నపతి
    గోరెను బర్గరు , పిజ్జ , కేకులన్

    ( పార్వతమ్మ చేయి విడిపించుకొని పరువెత్తుతున్న
    బాలగణపతి )

    " విడువిడుమమ్మ ! నా కరము
    వింతగ నుండెను వీని జూడగా ;
    కడుకడు ముచ్చటయ్యె మది ;
    కాంచనవర్ణపు కాంతులొల్కుచున్
    ఎడనెడ చిత్రచిత్రముగ
    నెవ్వియొ క్రొత్తవి వంట " లంచు నా
    కుడుముల రోసి విఘ్నపతి
    గోరెను బర్గరు , పిజ్జ , కేకులన్ .

    రిప్లయితొలగించండి
  12. పుడమిన వలసకు జనినను
    విడువక  జనులును తన వ్రత  వేడుక నడపన్
    వడివడిగ రుచుల కలవడి
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
  13. బడిగంటలమ్రోతలలో
    జడివానలుఁగుఱియుచుండచవితికినిచటన్, వడివడి నూతన యొ(నొ)రవడి
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  14. నడిచెడికాలమందున స
    నాతనవంటలురూపుమారెనో
    వడుక ఘటంన సేవలను
    వంతునబాంబినొ సేమియాలనీ
    విడిపులిహోరపుల్సులను
    వేగము కల్పిరినిమ్మకాయతో
    జడమునపాస్టుపుడ్సులవి
    జాప్యములేనివివచ్చిచేరగా
    విడిచెనుటెస్టులెందుకని
    విందుకుభక్తులకష్టపెట్టకా
    కుడుములరోసివిఘ్నపతి
    కోరెనుబర్గరు, పిజ్జ,కోకులన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  15. విడిచెను పంచగట్టులను వెండ్రుకలన్ సరి చేసి చక్కగా
    తొడిగెను జీను పాంటు కడు తోషముతో శకటమ్మునెక్కితా
    వడి నయమౌ చలాడమున వచ్చి ప్రభాతము నందుఁ బెట్ట నా
    కుడుముల రోసి విఘ్నపతి గోరెను బర్గరు, పిజ్జ, కోకులన్

    రిప్లయితొలగించండి
  16. బడిలోనాంగ్లంబేనిక
    వడిగా నడవడియు మారె పాశ్చాత్యంబై
    గుడిలో నొరవడియు సడలె
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్

    రిప్లయితొలగించండి
  17. వినాయక చవితి శుభాకాంక్షలతో.......

    విడువక యందఱు వెట్టగ
    కుడుములురోసి,గజముఖుడుగోరెన్ బర్గర్
    కుడుములు తినితిని విసిగిడి
    యడిగెను విఘ్నేశ్వరుండు నడుగుట సబబే

    రిప్లయితొలగించండి
  18. విడువక దేశవాసులిట వేడుకతోడను బెట్ట యెప్పుడున్
    కుడుములరోసి,విఘ్నపతి గోరెను బర్గరు పిజ్జ కోకులన్
    కుడుములనేట యేటయును గోముగ బెట్టుట కారణంబునన్
    నడిగెను విఘ్ననాయకుడు నైచ్ఛిక యోగిర మీయుడో యికన్

    రిప్లయితొలగించండి
  19. వడివడి పర్విడి ముద్దుగ
    నుడువులు కొన్ని వచియించి నోరారఁ దగం
    గొడు కిట్లనెఁ దాఁ దినుటకుఁ
    గుడుముల రోసి గజ ముఖుఁడు గోరెన్ రొట్టెల్


    అడరుచు లోకు లెల్లరు సు రార్చన లందు నొసంగరే భుజిం
    చెడి నిజ భోజనమ్మును విశేషము గా నమ రాలి కింపుగాఁ
    గడఁగి చరించు విశ్వమునఁ గానని దేశము తిండి యుండునే
    కుడుముల రోసి విఘ్నపతి గోరెను పశ్చిమ దేశ భక్ష్య ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినాయక చవితి శుభాకాంక్ష లెల్లరకు:

      సకల క్ష్మాజన సంత తాదిమ వ రార్చా పాత్రు విఘ్నేశ్వరున్
      సక లాదిత్య గణార్చనీయ ఘన రక్షా దక్షు హేరంబునిన్
      సక లాటంక మహీరు హోత్కర లతా స్తంబఘ్ను ద్వైమాతురున్
      సక లా ఘాగమ కోటి వజ్రు గొలుతున్ సద్భక్తి హస్త్యాననున్

      తొలగించండి
  20. నడవడి మారిపోయినది నమ్ముచు
    నుండిరి కొత్త పోకడల్
    కుడువడు శ్రీగణేశ్వరుడు కోరియు
    నిచ్చెడు తీపి వంటకాల్
    తడబడుచుండె జెప్పుటకు తథ్యము
    నాచెవిలోన జెప్పె దా
    కుడుముల రోసి విఘ్నపతి కోరెను
    బర్గరు ఫిజ్జ కోకులన్.

    రిప్లయితొలగించండి
  21. కం//
    బడిలో కుడుములు చెడినవి
    కడుదీనుని బ్రోచు మనగ గర్వము లేకన్ !
    సడిచప్పుడు జేయక, మా
    కుడుముల రోసి గజముఖుఁడు గోరెన్ బర్గర్ !!

    రిప్లయితొలగించండి