18, సెప్టెంబర్ 2021, శనివారం

సమస్య - 3846

19-9-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె”
(లేదా...)
“మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్”
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

55 కామెంట్‌లు:

  1. సమస్య :

    మాటల దప్పుగా బలుకు
    మానవుడే కద పండితుండనన్

    ( రాకుమారి విద్యావతిపై పగబూని నిరక్షరాస్యుని
    పండితునిగా అలంకరించి తెచ్చిన దుష్టమంత్రి
    వాని మోటుపలుకులను సభలో సమర్థిస్తూ ...)

    చేటుగ నెంచబోకుడిటు
    చెల్వుగ బల్కెను సార్థకాఖ్యు ; డీ
    మేటి సుధీవతంసకుని
    మించిన వాగ్విభవుండు లేడెటన్ ;
    మీటిన వీణతంత్రి వలె
    మేలగు భాషణ సేయుచుండెడిన్ ;
    మాటల దప్పుగా బలుకు
    మానవుడే కద ! పండితుండనన్ .

    రిప్లయితొలగించండి
  2. వచనమర్థమెరిగి పలుకు చుండెడివాడె
    పండితుఁడనఁ ; దప్పుఁ బలుకువాఁడె
    చిక్కుల బడుచుండు జీవితమందున ,
    దప్పుపలుక నెపుడు ముప్పుగలుగు

    రిప్లయితొలగించండి
  3. స్పష్టమైనభాష చక్కని భాషణ
    ఖండితముననుండు పండితుడన
    దప్పు పలుకు వాడె గొప్పచెప్పుకొనిన
    గౌరవమ్ముపొందగలుగలేడు

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    అయిన వారిఁ జంపు నని నుండగా లేను
    కృష్ణ! తొలగుదునను క్రీడి గెలువ
    గీత బలికి నొసఁటి గీత మార్చిన మేటి
    పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?

    ఉత్పలమాల
    పాటవమొప్పు వీరుడగు పార్థుడు బంధములెంచి యుద్ధమున్
    జేటొనరించనన్ దగని చింతన నొప్పక గీత బోధతో
    మేటిగ దీర్చ కృష్ణుఁడట మిన్నగ గెల్పును బొంది మోహపున్
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్!

    రిప్లయితొలగించండి
  5. వేటయె జీవనమ్మయిన వేదవిదూరుడు దేవభాషవౌ
    మాటల తప్పుగాబలుకు; మానవుడేగద పండితుండనన్
    ధాటిగ మాటలాడగల దార్ఢ్యము గల్గి వివేకవంతుడై
    దాట భవాబ్ధినిన్ దగిన దారినిజూపగ శిక్షకుండునై

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మూర్ఖ వాద మెంచు మూఢమతి కెపుడు
    వాస్తవమ్మె నీదు వాక్కు యనుచు
    అంగదనిడు వాడె యాతని దృష్టిలో
    పండితుడనగ, దప్పు బలుకు వాడె?

    రిప్లయితొలగించండి
  7. సూటిగ సత్యమున్ బలుకు శుద్ధమనస్కుల మెచ్చరెవ్వ రే
    నాటికి నేటికిన్ నరులు నమ్ముదు రెప్పు డసత్య వాదులన్;
    చేటును దల్పనట్టి విధిఁ జెల్వము నొప్పగ సత్ప్రవర్తనన్,
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.

    రిప్లయితొలగించండి

  8. ఆర్తిగా బిలిచిన నధిదైవమే వచ్చి
    ప్రోచు నంచు పలుక బుధుడు, తాను
    పల్మరులు పిలిచిన వాడురాక తలచె
    పండితుడనఁ దప్పుఁ బలుకు వాఁడె.

    రిప్లయితొలగించండి

  9. కూటముతోడ పిల్చినను కూరిమితో నరుదెంచు నంచు నో
    మేటి బుధానుడచ్చట సమీకృత భక్తులతో వచింపగా
    చాటుగ విన్న పామరుడు సామిని పిల్చిన రాక తల్చెనే
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్.

    రిప్లయితొలగించండి
  10. అన్ని తెలిసిన ట్టి యాఢ్యు డై వెల్గును
    పండితుడన :దప్పు పలుకు వాడె
    తనకు తెలియు నంచు దర్పంబు జూపించి
    గొప్ప యనగ వెల్గి మెప్పు నందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాలుగవ పాదం లో వెల్గ జూచు నట్టి వెఱ్ఱి వాడు అని సవరణ జేయడ మైనది

      తొలగించండి
  11. విద్యలందునొజ్జ విజ్ఞాన ఖని తాను
    పలుకు మాటలందు జిలుకు సుధలు
    సకల శాస్త్రములను చదివిన వాడగు
    పండితుఁడనఁ దప్పుఁ బలుకువాఁడె?

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి:

    పలుకులందు పాటవమ్ము జూపెడివాడె
    పండితుడనగ; దప్పు బలుకు వాడె
    చెప్పు నీతులెన్నొ చెన్నైన రీతిని
    పుడమినందు తానె ప్రోఢ ననుచు.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాటి నొసంగలేని పలు భాషితముల్ ప్రవచించుచుండునౌ
    మేటి వివేకహీనుకట మెచ్చులు నిచ్చుచు సాధువాదముల్
    నాటుచు గొప్పగా పొగడు నర్తకుడాతని దృష్టినిన్ సదా
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్.

    రిప్లయితొలగించండి
  14. చేటును కోరు దూషణలు, చిఱ్ఱు నడంచగ లేక దూఱు నా
    యీటెల బోలు దెప్పరము లెంతయు నీచపు నీసడింపుతో
    ఘాటుగ దోచు శబ్దములు కల్లరి నోటను జారునట్టివౌ
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్

    రిప్లయితొలగించండి
  15. ధీటగుయుద్దమే జరుగ
    దీరులుధర్మజచక్రవర్తులే
    సూటిగగెల్పుగోరుకొని
    సూనృతవాక్యముసృష్టిచేసిరో
    గాటుగ మన్షియోగజమొ
    కాంచగసద్గునిసంహరింపగా
    మాటలఁ దప్పుగాఁ బలుకు
    మానవుఁడే కద పండితుండనన్”
    ...తోకల...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  16. మాటున చేరి పెద్దలకు మాదిరి కావ్యము నల్లుటందునన్
    పాటవమంత బొందుపడ బద్యమ నొక్కటి నాల్గు పాదముల్
    నాటగ వ్రాసి చూపగనె నర్థము భానము లేకనున్న నా
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్

    రిప్లయితొలగించండి
  17. కూటికి లేనివాడనుచు క్రూరపు వాక్కులనాడ నీశుడే
    ధాటిగ పద్యమున్ బలికి తద్దయు క్రోధము పిచ్చలింపగా
    చేటును కల్గజేయగను, చేసిన బన్నము కాల్చఁ జిత్తమున్,
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుడే కద పండితుండనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్ని శాస్త్రములను నవలీల జెప్పును
      పండీతుడన,దప్పు పలుకు వాడె
      యపహసింపబడును నందఱి చేతను
      నొప్పు పలుక వలయు నెప్పు డిలను

      తొలగించండి
  18. ఉ:

    బాటలు వేయు వ్రాయుటకు పద్యములెన్నియొ భావయుక్తమై
    ధీటుగ విన్నవించు పలు దిక్కులు మెచ్చగ ధర్మ శాస్త్రముల్
    కూటికి నోచ కున్న దన కుత్తుక నెంచడు దప్పు బల్కగా,
    మాటలు తప్పుగా బలుకు మానవుడే కద ! పండితుండనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. కాటమరాయుడా,వినుము కాపురు షుండుగ వాసికెక్కుదా
    మాటల దప్పుగా బలుకు మానవుడేకద,పండితుండనన్
    మాటలు సొంపునున్ గలిగి మానవకోటికా భారతాదులన్
    బాటవమొప్పగానుడువు ప్రాఙ్ఞత బుద్ధియు నుండువాడహో

    రిప్లయితొలగించండి
  20. సమముదర్శనంబుసాగనిచోటున
    పండితుండనఁబలుకువాడె
    శకునిమాటవినుచుసంగరమందున
    నుత్సహించెరాజునోర్పువిడిచి

    రిప్లయితొలగించండి
  21. ఆటలఱాయిరప్పలనునాదరినీదరిుోఁగుఁజేయుచున్
    చేటలఁబోసిచెర్గగనుచేవనులేనివిశబ్దజాలమున్
    పోటుననేర్చికూర్చుచునుపోడిమినందగఁజూతురేగదా
    మాటలఁదప్రుగాబలుకుమానవుడేగదపండితుండనన్

    రిప్లయితొలగించండి
  22. భీతి నైన తనదు పేరాస నైనను
    మెప్పు కొఱకు నైన ముప్పు నెంచి
    యెవ్వ రైన నేమి యీతని వీక్షించి
    పండితుఁ డనఁ దప్పుఁ బలుకు వాఁడె


    పాటున కోర్చి తర్కమును బన్నుగఁ జేసి సు నిశ్చితాత్ముఁడై
    పాటవ మొప్ప నే నరుని పక్షము నూనక యాలకించుచున్
    మాటల నందు నొప్పయిన మాటల నొప్పుగఁ జెప్పి తప్పులౌ
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుం డనన్

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు
    1. పాటవమొప్పగాను పరిపాటిగ బోటుల మేనిసొంపులన్
      తేటగ వెల్లడించి పలుతీరుల వర్ణనజేసి కావ్యముల్
      మేటిగ వ్రాయగాను భయమేటికి మాకని చేటుదెచ్చునౌ
      మాటల తప్పుగాబలుకు మానవుడేగద పండితుండనన్

      తొలగించండి
  24. నిండు కుండ లాగ, నేర్పులు తగజెప్పు
    పండితుఁడనఁ; దప్పుఁ బలుకువాడె
    కవి, యది తను బలుక గ్రాహ్యమగుచు నొప్పు,
    నుపమలు పలు జూడ నుర్వి కలవు.

    రిప్లయితొలగించండి
  25. ఘాటుగ ముక్క సూటిగను ఖండ
    న జేయుచు ధూర్త చర్యలన్
    బూటక నాయకోత్తముల పుక్కిటి
    మాటలు నీతి హీనమౌ
    నాటక మెండగట్టుటను నచ్చని
    వారల భావమింతియే
    మాటలు తప్పుగా బలుకు మాన
    వుడే గద, పండితుండనన్

    రిప్లయితొలగించండి
  26. కాటుక కన్నులద్భుతము కమ్మని వాతెర జుంటితేనె వి
    స్ఫోటనమైన మేరువును పోలు పయోధర సౌష్టవమ్మునున్
    జూటము కాలనాగు కటి సోమమటంచును సుందరాంగితో
    *మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుండనన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  27. చేటొనరించునెల్లపుడు శ్రీయన ఛీయను నీతిబాహ్యుడా
    మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద; పండితుండనన్
    తేటల మాటలన్ హితము తెల్లముగా వచియించు నాతడే
    మేటియటంచునెల్లరును మెచ్చ చరించును సచ్చరిత్రుడై

    రిప్లయితొలగించండి
  28. సకల శాస్త్రములను చదివిన సుజనుడే
    పండితుడన దప్పు పలుకువాడె
    పామరుడన బరగు పదుగురిలో తాను
    చదువు సంధ్యలు విడి చవట యగుచు

    రిప్లయితొలగించండి