25, సెప్టెంబర్ 2021, శనివారం

సమస్య - 3853

26-9-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు”
(లేదా...)
“క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో”

47 కామెంట్‌లు:


 1. తెలివితేటల గమనించ తిక్కప్రశ్న
  లే సరియని నమ్మిన యుప దేశికుడొక
  డడిగె యవమున చెప్పుమటంచు నిదియె
  చెన్నపురినుండి మదరాసు కెన్ని మైళ్ళు.

  రిప్లయితొలగించండి
 2. కనగపాతనుబడ్డదికన్నుదెరచె
  భాషనాగరికతకునుభావమిచ్చు
  ద్రవిడతమ్ములగుర్తింపతరలిరండు
  చెన్నపురినుండిమదరాసుకెన్నిమైళ్ళు

  రిప్లయితొలగించండి
 3. పాత పేరది మారియు నూతనంపు
  పేరొకటి వచ్చె నని యన విదిత మయ్యె
  చెన్న పురి మదరాసు కెన్ని మైళ్ళు?
  యనుట సరియైన ప్రశ్నగా నగు నటయ్య?

  రిప్లయితొలగించండి
 4. అన్నలువీరలందఱునుయానముభాషలమూలశోధనన్
  నిన్నటిమోన్నటాంగ్లమునునేరుపుమీరగగద్దెదింపుడీ
  సన్ననిభావముల్దునిమిసాధనఁజేయుడుమాత్రుభాషలో
  క్రన్ననఁజెప్పుడయ్యమదరాసుకుచెన్నయియెంతదూరమో

  రిప్లయితొలగించండి
 5. అన్నకు సుస్తిచేసెనని యందరితో మదరాసు కేగితిన్
  జిన్నతనమ్ములో నపుడు చెన్నయనే పుర నామమెచ్చటన్
  విన్నదిలేదు, కానియిక వెళ్ళక తప్పదు నేడు మిత్రమా!
  క్రన్నన చెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంతదూరమో?

  రిప్లయితొలగించండి
 6. భాగ్య నగరమున బస్సెపుడు‌ బయలు
  దేరి హైద్రాబాదు చేరు నంట


  సింహపురికి బస్సు చేరెడు
  సమమము
  నెల్లూరు పురినుంచి నీవు తెల్పు


  గర్తుపురమునుంచి.కారులో గుంటూరు
  వెడలంగ మనలకే వేళయగును


  భావపురమునుంచి బాపట్ల పోవంగ
  సమయము యెంతయో చదివి తెల్పు

  చెన్నపురినుండి మదరాసు కెన్ని మైళ్ళు

  యెంత దూరము రాజమ హేంద్రవరము

  రాజ మండ్రినుంచి, యనుచు రైలు నెక్కి

  చిలిపిగ నడిగె తల్లిని‌ చిన్ని వాడు

  రిప్లయితొలగించండి
 7. క్రన్నన జెప్పుమయ్య మదరాసుకు
  చెన్నయి యెంత దూరమో
  అన్నయ చెప్పుచుంటి విను హాసము
  వచ్చుచు నుండె జెప్ప యే
  మున్నది యిందులో నడుగ మూఢుడు
  సైతము చెప్పనోపుగా
  నెన్నగ రెండు పట్టణము లేవిధి
  జూచిన నొక్కటే గదా!

  రిప్లయితొలగించండి
 8. నేతిబీరయం దొదిగున్న నెయ్యదెంత?
  చిక్కుడాకుకు చిక్కిన చిక్కులెన్ని?
  నీటిమూటలో నిలిచెడి నీరమెంత?
  చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒదిగి+ఉన్న' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. నేతిబీరయందునగల నెయ్యదెంత?
   చిక్కుడాకుకు చిక్కిన చిక్కులెన్ని?
   నీటిమూటలో నిలిచెడి నీరమెంత?
   చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు

   ఈ విధంగా మారుస్తున్నాను గురువుగారూ!🙏

   తొలగించండి
 9. చెన్నున పాలనన్ సలిపి చెన్నప రాయలు భక్తితోడ దా
  నెన్నుచు చెన్నకేశవుని యీ మదరాసున పాదుకొల్పగా
  మున్నిదె చెన్నపట్నమని పూర్తిగ దెల్పగ మిత్రుడిట్లనెన్
  క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో?

  రిప్లయితొలగించండి
 10. ఉ:

  ఉన్నది దూరమెంత యని యూహలు గూర్చెడి ప్రశ్న వేయగా
  చిన్నది దెల్వ గోరె నట చీటికి మాటికి నేల నీగతిన్
  సన్నని నవ్వు నవ్వి దన సంగతి దేల్చు మటన్న ! ప్రశ్న గా
  క్రన్నన జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 11. చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు ?
  చూడ భౌతిక దూరము శూన్యమేను
  పిసరు కాల దూరము బట్టె , బేరు మార్చ
  నాంగిలేయులు జేసిన యగవెయిదియ

  రిప్లయితొలగించండి
 12. చెన్నపురియన్న నెరుగని చిన్నవాడు
  నిన్న మదరాసు యనుమాట విన్నవాడు
  నన్ను సందేహమీరితి నడిగినాడు
  చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు

  రిప్లయితొలగించండి
 13. ఉత్పలమాల:
  “క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో”
  యన్న చటుక్కునన్ మదిని యద్భుత మొక్కటి తోచె వింతగా
  నిన్నటి యేడు నా తలను నిండుగ నల్లని జుత్తు యుండె నే
  డెన్నగ బోడియయ్యె మరి యేమని జెప్పుదు నేను నేనె! యీ
  చెన్నయి రొంబ రెండవది చేరువలో మదరాసు యుండెలే!
  --కటకం వేంకటరామశర్మ.

  రిప్లయితొలగించండి
 14. చెన్నున పాలనన్ సలిపి చెన్నప రాయలు భక్తితోడ దా
  నెన్నుచు చెన్నకేశవుని నీ మదరాసున పాదుకొల్పగా
  మున్నిదె చెన్నపట్నమని పూర్తిగ దెల్పగ, మిత్రుడిట్లనెన్,
  క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో?

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పాత మదరాసు పేరుయె పట్టువడని
  పిల్ల లొకరికొకరు నట వీకదోడ
  యూహ జేయగ దొరలుచు నుండె నిటుల
  చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు?

  రిప్లయితొలగించండి
 16. చెన్నపురి మదరాసని చెలగె నపుడు,
  పేరు మారిన దూరము మారదెపుడు,
  చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు
  కలవనిన, 'సున్న' యనిచెప్ప గలడు శిశువు.

  రిప్లయితొలగించండి
 17. చిన్నడు తన సందేహమును వారి నాన్నగారి నడుగు సందర్భంగా...

  తేటగీతి
  అన్న, పౌలుతో వాదింపఁ జిన్నఁ డడిగెఁ
  దెలుపుమయ్య! వారల మాటలలవికావు
  'మార్చి మార్చి పలుకు' వారి మాటలందు
  'చెన్నపురి' నుండి 'మదరాసు' కెన్ని మైళ్ళు?

  ఉత్పలమాల
  అన్నయ, పౌలుతో రగిలి యందరు జూడగ వాదులాడఁగన్
  నాన్న! వినంగఁ జిత్రమన నాకది యర్థము గాకయున్నదే?
  తిన్నఁగ నొక్కరొక్కటిగఁ దీర్చుచు మాటికి 'నుచ్చరింపఁగన్'
  క్రన్ననఁ జెప్పుమయ్య 'మదరాసు' కు 'చెన్నయి' యెంత దూరమో?

  రిప్లయితొలగించండి
 18. క్రన్ననఁ జెప్పుమయ్య, మదరాసుకు చెన్నయి యెంత దూరమో?
  యన్నుల మిన్న భాగ్యపురి కారయ హైదరబాదు కెంతయో,
  పన్నుగ కాశికాపురికి వాసిఁగడించిన వారణాసికిన్,
  మన్ననఁ గొన్న నేకశిల మాన్యులు మెచ్చిన నోరుగల్లుకున్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 19. మున్నిటు బిల్కుచుండిరట ముద్దుగ చెన్నగు పట్నమంచునే
  తిన్నగ బల్కలేక సుదతీ! మదరాసుగ మార్చిరేదొరల్
  అన్నకు నగ్రజుండు ముదమారగ నేమగు నన్నరీతియౌ
  క్రన్నన జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంతదూరమో

  రిప్లయితొలగించండి
 20. చెన్నపురినుండి మదరాసు కెన్నిమైళ్ళు
  చూడ గూగులు దెలిపెను సుమ్ము, రెండు
  మైలులపయిన నింకను గొలువ వచ్చు
  మూడు ఫర్లాంగులనిడివి చూడు మనుచు

  రిప్లయితొలగించండి
 21. అనవలె మదరాసున కెన్ని యంచు వాక్య
  మందు వ్యాకరణము గాంచ నుంది చిన్న
  తప్పు చిన్నయ సూరి మతమ్ము నెంచ
  చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు


  చెన్నయి నుండి మిత్రవర చెన్నుగ నా మదరాసు దూరమే
  యెన్నఁగ నెంతొ యంతియ వచింపఁగఁ దల్చిన నీకు నిక్కమున్
  నన్నడు గంగ నీ విటుల నా బదు లయ్యది తృప్తి నందితే
  క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో

  రిప్లయితొలగించండి
 22. క్రన్నన జెప్పుమయ్య మదరాసుకు చెన్నయియెంతదూరమో
  విన్నపమాలకించుమయ వేడగ గూగులు జుపెనిట్లుగా
  చెన్నుగ రెండుమైళ్ళకును జేరగ నుండెను బైనకొద్దిగా
  గ్రన్నన జూడ మీరలును కచ్చితమేయని విశ్వసింతురే

  రిప్లయితొలగించండి
 23. అన్నియు నేనెరుంగుదును హైదరబాదు సముద్ర తీరమం
  దున్న యధేచ్చగాదిరుగు దున్నకు లేగజనించె నంచునె
  న్నెన్నియొ బీరముల్ బలుకు నెల్లయ నీవిధి పృచ్ఛ జేసితిన్
  క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో

  రిప్లయితొలగించండి
 24. అన్నిట సంశయంబులణువంతయు కాలు కదల్పడక్కటా
  తిన్నగ మాటలాడడొక తీరుగనుండడు మందుడాతనిన్
  చెన్నయి పోయి రమ్మనగ చిత్రముగానిటు బల్కె జూడుమా
  "క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో"

  రిప్లయితొలగించండి