28, సెప్టెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3856

 29-9-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్”
(లేదా...)
“దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే”

59 కామెంట్‌లు:

 1. సమస్య :
  దారుణ కృష్ణసర్పము సు
  ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే

  ( ప్రసన్నవదనంతో అగ్రపూజను అందుకొంటున్న శ్రీకృష్ణుని చూచి ఈర్ష్యతో శిశుపాలుడు )

  ఉత్పలమాల
  ...................

  కారణమేమి లేక నను
  కాంతను వేరుగ జేయ నెంచెనే !
  వారణ జేసినన్ బదులు
  బల్కడు మార్గము మార దల్పడే !
  భీరులు జేరుచున్ భజన
  బెల్లుగ సల్పిన దేవుడాయెగా !
  దారుణ కృష్ణసర్పము సు
  ధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే !

  ( కాంతను - రుక్మిణిని )

  రిప్లయితొలగించండి
 2. ధీరముగా శ్రీ కృష్ణుడు
  తోరముగా నాట్య మాడి త్రుంచ నహంబున్
  మారిన కాళీయు డనెడు
  దారుణ సర్పము గనుడు సుధల్ వెలి గ్రక్కెన్

  రిప్లయితొలగించండి
 3. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భూరి మెడను భూషణమగు
  దారుణ సర్పము గనుడు; సుధల్ వెలిగ్రక్కెన్
  క్షీరాబ్ధి మోదమిడుచున్
  చారణులకు దానవులకు శ్రమఫలితమునై.

  రిప్లయితొలగించండి
 4. సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధఘట్టపు ప్రత్యక్ష వ్యాఖ్యాతగా...

  కందం
  భారత! మోహము వీడుము
  నేరక కర్తృత్వము నని నీదనఁ దగునే?
  మారుమని గీతఁ బలుకుల
  దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్!

  ఉత్పలమాల
  భారత! మోహమున్ విడచి పట్టుమ! వింటిని యుద్ధభూమిలో
  నేరక కర్తవన్నిటికి నీవను భ్రాంతిని వీడ మంచుఁదా
  సారధి విశ్వరూపమున సర్వమెఱుంగగ గీతజెప్పుచున్
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే!

  రిప్లయితొలగించండి
 5. కూరిమిమీరదేవరాక్షసులుకూటమితోడనుచిల్కసమద్రమున్
  తారుగవాసుకిన్దనరదర్వికిగట్టినతాడుఁజేసిరే
  కోరలుసాచునట్టిఘనకౌశలుడయ్యెడశాంతుడయ్యెగా
  దారుణక్రుష్ణసర్పముసుధల్వెలిగ్రక్కుచునుండెఁజూడరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *కూరిమి దేవరాక్షసులు కూటమి..." అనండి. లేకుంటే గణభంగం.

   తొలగించండి
  2. తప్పుగాపరాకునవ్రాసితినిక్షమించగలరు

   తొలగించండి

 6. భురిగ పంచి ధనము మూ
  లేరుగ గెలిచి యొక కల్లరీడు సతతమా
  చోరుడు నీతులు చెప్పెను
  దారుణసర్పముఁ గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.

  రిప్లయితొలగించండి
 7. చేరంబోయినమడుగును
  నీరంబులనున్నపామునేరుపుతోడన్
  పోరునధర్మముదెలిపెను
  దారుణసర్పమున్గనుఁడుసుధల్వెలిగ్రక్కెన్

  రిప్లయితొలగించండి
 8. ఉ:

  పారగ జేసి రొక్కమును భారము మీదె యటంచు నెన్నికన్
  కోరెను వోటు వేయమని క్రూరుడు పూర్వము నెంచి చూడగన్
  మారిన వానిగన్ బ్రజల మన్నన బొందగ మాయసేయనై
  దారుణ కృష్ణ సర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండె జూడరే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 9. నేరము లెన్నియో సలుపు నీచుడు మంత్రిగ గెల్చి నంతనే
  భూరి ప్రజాధనమ్మునిక బొక్కుచు సత్పురుషుండ నంచు తా
  భీరములన్ వచించుచును ఫేరవులన్ క్షమియించనంచనన్
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరుగ ద్యూతము నాడక
  గౌరున ధర్మజు గెలిచియు కస్తిపడునటుల్
  తారాడుచు రారాజను
  దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్.

  రిప్లయితొలగించండి
 11. తోరణములాగ పొడవగు
  దారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్
  సౌరభముల్ జిలుకు సురభి
  యేరీతిగనౌ! నిరతము నిచ్చున్ విషమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లాగ' అనడం వ్యావహారికం. "తోరణము వోలె" అనండి.

   తొలగించండి
 12. వేరొక తావున గనరా
  దీ రసపోషణ నిపుణత దెల్పెడు శిల్పా
  తోరణ సౌందర్య గరిమ
  దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శిల్పతోరణము' అనడం సాధువు కదా?

   తొలగించండి
 13. కారణకారణమ్ము తన కంఠమునన్ గరళంబు దాల్చితా
  వారణజేసె లోకముల పల్లటముల్, గళమందు గ్రాలగా
  దారుణ కృష్ణసర్పము, సుధల్ వెలి గ్రక్కుచు నుండెఁ జూడరే
  గౌరుడు మూర్ధమందు తెలి కాంతులు నింపుచు నాల్గు దిక్కులన్

  రిప్లయితొలగించండి
 14. మారణ సలుపు విషమునిడు
  దారుణ సర్పముఁ ; గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్
  క్షీర సముద్రము , దానిని
  దారుణ సర్పము నగముకు తాడై చిలుకన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మారణము సల్పు విషమిడు" అనండి. 'నగమునకు' అనడం సాధువు.

   తొలగించండి
 15. కారణకారణుని మెడను
  దారుణ సర్పముఁ గనుఁడు, సుధల్ వెలిగ్రక్కెన్
  గౌరుడు మూర్ధమునందున
  సారించుచు చంద్రికలను సకల జగములన్

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరునుగాని చందమున తియ్యని మాటలు పల్కుచుండుచున్
  గౌరునొనర్చి జూదమున కంకుని గెల్చి సుయోధనుండటన్
  భూరిగ బాధనొందునటు ముమ్మరమౌ నటనమ్ము జేయుటన్
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే1

  రిప్లయితొలగించండి
 17. దారుణ 'కాన్సరు' వ్యాధి ని
  వారణ 'కీమో థెరపి'గ వాడగ విషమున్
  జోరున యౌషధ మేర్పడ
  దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలిగ్రక్కెన్

  రిప్లయితొలగించండి
 18. నేరమయంపు జీవితము నిర్భయమున్ గడియించి సొమ్ములన్
  ధారుణి పైన నున్నతపు స్థానము పొందగ కోర్కెపుట్టగా
  చేరెను రాజకీయముల, చెన్నగు పల్కుల నాడు చున్ భళా!
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే.

  రిప్లయితొలగించండి
 19. మారణ తత్వమున్కలిగి మాయురె మానుష జాతి భీతికిన్
  కారణమైననేమి తను కమ్మని యమ్మతనంబు చూపుచున్
  ప్రాణము బెట్టి సంతుకను రాగము బంచుచు పుట్టనుండు యీ
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండెఁ జూడరే

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు


  1. ఓ రమణీమణీ! తగిన యోచన జేయుము స్వర్ణ లంకలో
   ఆ రఘురామునిన్ విడచి హ్లాదమునొందుము నాదుతోడుతన్
   మీరకయుందురీ సతులు మిక్కిలి భక్తిని నీదునాజ్ఞలన్
   సారసలోచనా! తెలిసి చక్కగ నేలుము రాజ్ఞివైదగన్
   దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె చూడరే

   తొలగించండి
 21. వేరిక దిక్కు లేరనుచు వేడ మహేశుఁడు మ్రింగెనయ్యెడన్
  మారణ ధూమమున్ జలధి మంథన వేళ విషాగ్ని రేపగా
  దారుణ కృష్ణసర్పము; సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే
  భూరికృపాకరుండు హరి మోహినియై కలశంబు చేగొనన్

  రిప్లయితొలగించండి
 22. చేరగ భయపడు నటులుగ
  నీరము దావిషముజేయ,నిర్భయముగనా
  నీరజనాభుడు ద్రొక్కగ
  దారుణ సర్పము గనుడు సుధల్ వెలిగ్రక్కెన్

  రిప్లయితొలగించండి
 23. వేరయినట్టి రాష్ట్రమున పేదకు రాజ్యము నిత్తునంచు దా
  బీరములాడి ముఖ్యపదవిన్ గొని హీనజనంబునంత, వి
  డ్డూరము గొల్ప, నేతలు కడున్ మొరగున్ సలుపంగఁ జూడగా
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే.

  రిప్లయితొలగించండి
 24. వారక తిరిగి తిరిగి యా
  వారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగఁ జెలఁగం
  బేరిమి మందర గిరి కొని
  దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలి గ్రక్కెన్


  దారగ ధర్మమే యనుచు దైత్య కులోద్భవ రాజ కోటికిం
  గోరిన స్త్రీల నెల్లరను గొంకక పొందుట సర్వ నిర్జరౌ
  ఘారి వచించె నౌర జనకాత్మజతో ఘన రాజనీతినిన్
  దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే

  రిప్లయితొలగించండి
 25. నీరము నంతయున్ విషమునింపుచు భీతిని గల్గజేయగా
  నీరజనాభు డత్తఱిని నిర్భయమొందుచు బాపఱేనినిన్
  నారడి వెట్టగా మిగుల,హాహరి!కావుమ యంచు కోరియా
  దారుణకృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచునుండె జూడరే

  రిప్లయితొలగించండి