17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సమస్య - 3845

18-9-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్”
(లేదా...)
“దారన్ బుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

34 కామెంట్‌లు:

 1. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరును వీడి కుటుంబపు
  గారవమంతయు మడచెడి కార్యము లన్నిన్
  భూరిగ జేయుచు దిరిగెడి
  దారా పుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్.

  రిప్లయితొలగించండి
 2. సారంబేమియులేనిది
  పోరాదురగ్రుహమువెంటపోడిమితోడన్
  తారాడనునీకెందుకు
  దారాపుత్రులవిడచుటెధర్మముగ్రుహికిన్

  రిప్లయితొలగించండి

 3. పారావారమ్మది సం
  సారమ్మని దలచువాడు సద్గతి కొరకై
  భారూపుని సేవింపగ
  దారా పుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్.

  రిప్లయితొలగించండి
 4. సమస్య :

  దారాపుత్రుల వీడిపోవుటె గదా
  ధర్మంబు సంసారికిన్

  ( గృహస్థాశ్రమం విజయవంతంగా నిర్వహించిన తరువాత వానప్రస్థానికి వెళ్దామని భార్యతో పలుకు తున్న భర్త )

  ఆరాటంబది చెందుచుండుట వృథా
  యాసంబు ప్రాణేశ్వరీ !
  ధీరంబౌ శమమున్ వహింపుము సదా ;
  దేదీప్యమానంబుగా
  తోరంబైనది జీవితం బరిగె ; నా
  తో రాగదే కానకున్
  దారా ! పుత్రుల వీడి పోవుటె గదా
  ధర్మంబు సంసారికిన్ !!

  ( దారా - సతీ )

  రిప్లయితొలగించండి
 5. కోరిక తో మనువాడియు
  చేరిన సతి తోడ బెఱిగె చిక్కని బంధం
  బారయ నేరికి నైనన్
  దారా పుత్రుల విడుచుటె ధర్మము గృహి కిన్?

  రిప్లయితొలగించండి
 6. కందం
  చేరెన్ గరోన తనువున్
  దూరమ్ముండగ భిషక్కు నుడివిన విడిగా
  నారోగ్యశాలఁ జేరఁగ
  దారాపుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్!

  శార్దూలవిక్రీడితము
  చేరెన్ గోవిడు కాయమందు పరులన్ సేమమ్ముగానుంచఁగన్
  దూరమ్ముండుమనన్ భిషక్కువినుచున్ దోషమ్ము వారింపఁగా
  నారోగ్యమ్మును బొందు సూచనల వైద్యంబందు ధ్యేయమ్మునన్
  దారాపుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్!

  రిప్లయితొలగించండి
 7. ధీరత్వంబునఁ బోరి యౌవనమునన్ దీండ్రించి గర్వోద్ధతిన్
  బోరాటంబును సల్పుచున్ సతతమున్ పొంకించి ధర్మంబుతోఁ,
  దీరా వార్ధకమందు దివ్యపథియై తీర్థాదులన్ దిర్గుచున్
  దారాపుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్.

  తీండ్రించు=పొంకించు-దీపించు

  రిప్లయితొలగించండి

 8. ఆరాటంబది మోక్షసాధనమె సత్యాణ్వేషణే లక్ష్యమై
  భారూపుండను గొల్వగా వలయునీ వార్ధక్యమందున్ గదా
  పారావారము కాపురమ్మనుచునీ బంధాలనే వీడుమో
  దారా, పుత్రులవీడిపోవుటెగదా ధర్మంబు సంసారికిన్.

  రిప్లయితొలగించండి
 9. పోరుట తప్పని రణమున
  వీరతిలకమును ధరించి విధినెరవేర్చన్
  మారణకాండకు వెరవక
  దారాపుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తీరున్ పోనిడి నాజవంజసపు కీర్తి మాన మర్యాదలన్
  ధారాళమ్ముగ వమ్ముజేయు పథమున్ తామెంచి నారీతినే
  నారాధించుచు సత్ప్రవర్తన పరిత్యజించి తారాడునౌ
  దారాపుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్.

  రిప్లయితొలగించండి
 11. సరదాగా

  మ్యారేజి కాని విఠలుకు
  నైరాశ్యము హెచ్చగాను నవ్యపుటూహల్
  తారాడగ బల్కెనిటుల
  దారా పుత్రులను విడుటె ధర్మము గృహికిన్

  పోరాటమ్మె యగున్ సదా పతికి దాపోషింపగా నింటినిన్
  తీరైనట్టి యుపాధి లేక తనదౌ దేశమ్మునే వీడనై
  ధీరుండౌచు ప్రవాసియై మనగ ప్రత్యేకంపు జాగ్రత్తతో
  దారాపుత్రుల వీడి పోవుటె గదా ధర్మంబు సంసారికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పేరాసన్ ధనసంచయమ్ము గొన దాపీడించి దీనాళినిన్
   దారాపుత్ర సమూహమే తనదిగా దంభంబునన్ మున్గుచున్
   ఘోరంబైన నఘంబులన్ సలుప నాక్రూరంపు పెన్నిద్దురన్
   దారాపుత్రుల వీడి పోవుటె గదా ధర్మంబు సంసారికిన్

   తొలగించండి
 12. దూరాలోచన లేనివాడు సత
  మున్ దుర్మార్గ నేస్తాలతో
  నేరాలంగడు సేసి శిక్షలను దా
  నిర్భీతిగా బొందుచున్
  గారాగారమునందు మ్రగ్గు మొగు
  డున్ గాంతన్ భరించే విధిన్
  దారా పుత్రల వీడి పోవుటె
  గదా ధర్మంబు సంసారికిన్

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. కం:

   వైరాగ్యము శ్రుతిమించగ
   భారంబగు జీవనమ్ము వడిగొని యీదన్
   హోరెత్త దినము గడచుట
   దారన్ పుత్రుల విడచుటె ధర్మము గృహికిన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
  2. శా:

   క్రూరాత్మల్ జతగూడి మిత్రతనుచున్ గుప్తమ్ము కీడెంచగన్
   నేరారోపణ మోయజేయ నకటా నిస్తేజమై పోవగన్
   తీరా పట్టుకొనంగ రక్షక భటుల్ ధీమాగ ఛీ కొట్ట గా
   దారన్ పుత్రుల వీడి పోవుటె గదా ధర్మంబు సంసారికిన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 14. మారాము జేసి పెంచిన
  గారాల కొడుకులు,సతియు,కడరోజులలో
  ఛీరా!పోరా!యన్నన్
  దారాపుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్.

  రిప్లయితొలగించండి
 15. కోరికలు వదలు వానికి
  దారాపుత్రుల విడుచుటె ధర్మము ; గృహికిన్
  వారల వృద్ధి కొరకు సం
  సారము సాగించుటె దగు చరితము ధరపై

  రిప్లయితొలగించండి
 16. దూరాలోచనచేయనెంచమనలో
  దోసంబుతగ్గించగా
  ఆరాతీయుములెక్కలేయుమనసా
  తీరంబుదాటించగా
  కారేమష్యులుఋర్షులౌచుచనరే
  కాంక్షించి నిక్కంబుగా
  దారన్ పుత్రుల వీడిపోవుటె గదా
  ధర్మంబు సంసారికిన్”
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 17. ఆరాటంబున కన్న వీరికిల విద్యాబుద్ధి నేర్పించియున్
  గారాబంబున కంటిపాప వలె సాకన్ కష్టముల్ వొంద వా
  రీరోజెంతయొ యున్నతిం గనిరి, నీకీ తాపమింకేలనో!
  దా! రా! పుత్రుల వీడి పోవుటె గదా ధర్మంబు సంసారికిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 18. గౌరవ మెంతయు జూపక
  భూరిగ గోపంబుతోడ పౌరులనెల్లన్
  దూరుచు నుండెడి తనయా
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్

  రిప్లయితొలగించండి
 19. ఘోరము బాలుర దాచిన
  నేరం బర్హ మగుఁ బుడమినిన్ శిక్షలకున్
  నేరక యుంచినఁ దమకుం
  దా రా పుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్


  పోరాటమ్ములు సాగు చుండును సతమ్మున్ భూ ధన శ్రేణికిన్
  వీరావేశము తోడ జీవన మహో విశ్వంబులో నిత్యమే
  రారే వెంటఁ దలంప నెవ్వరును గాలం బేఁగుదెంచన్ ధరన్
  దారాపుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్

  రిప్లయితొలగించండి
 20. ఘోర 'కరోనా' దంష్ట్రల
  బారినపడికొట్టుమిట్టు పడు సమయమునన్
  కోరుచు వారల సౌఖ్యము
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్

  రిప్లయితొలగించండి
 21. వైరాగ్యంబన నైహికంపు వివిధైశ్వర్యంబులన్ రోయుచున్
  దారాపుత్రుల వీడిపోవుటె గదా; ధర్మంబు సంసారికిన్
  దారాపుత్ర గృహస్థ కర్మముల ప్రాథమ్యంబు పాటించుచున్
  శ్రీరామాంకితమైన మానసమునన్ సేమంబు దా గాంచుటే

  రిప్లయితొలగించండి
 22. ఆర్యా!చక్కగ బల్కిరిప్పుడు నికన్ హ్లాదంబు నయ్యెన్సుమా
  భారంబంతయు బుత్రపుత్రికలకున్ బంధంబుగావించి దా
  నారణ్యంబులనుండ గోరుట మహానందంబు గల్గెన్ నికన్
  దారన్ బుత్రుల వీడిపోవుట గదాధర్మంబు సంసారికిన్

  రిప్లయితొలగించండి
 23. కం//
  పోరాడెడి గుణములు గల
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము, గృహికిన్ !
  శ్రీరాముడె నాదర్శము,
  వేరెవ రైనను వలదిక, వేల్పుగ మాకున్ !!

  రిప్లయితొలగించండి
 24. 2. కం//
  కారాకిళ్ళీ నములుచు
  తారాస్థాయిగ నరుచుచు దయజూపనిదౌ !
  కోరలతో భయపించెడి
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్ !!

  రిప్లయితొలగించండి
 25. 3. కం//
  బారాముల్లా నగమున్
  పారాడగ రిపులు జంపె ప్రాప్తము గలుగన్ !
  భారత భూమిన్ దలచుచు
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్ !!

  రిప్లయితొలగించండి
 26. 4. కం//
  చోరుల సరసన జేరుచు
  జారిణిగా దిరుగునట్టి చంచల మతికిన్ !
  భోరున నేడ్చుచు నుండెడి
  దారన్ బుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్ !!

  రిప్లయితొలగించండి
 27. తీరౌరీతిని బిడ్డలన్ దనరగా తేజస్వులన్ జేయుచున్
  భారమ్మున్ విడి వారిపై, తలచుచున్ బద్మా క్షుతోషమ్ముతో
  పారావారము దాట గైకొనుచు సంభావించు చున్నట్టి యా
  దారన్, బుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్

  రిప్లయితొలగించండి
 28. నేరములెన్నోచేసిన
  కూరిమిచూపినను వారు కోపముగొనుచు
  న్నూరకనిందించవడిగ
  దారన్,పుత్రుల విడుచుట ధర్మము గృహికిన్.

  మరొక పూరణ

  కోరిక లనంతములవగ
  తీరెడుదారులనరయుచుదేవళమందున్
  దూరుచు సొమ్మును దోచిన
  దారన్ పుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్


  రిప్లయితొలగించండి