11, సెప్టెంబర్ 2021, శనివారం

సమస్య - 3839

12-9-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్"
(లేదా...)
"గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే"

92 కామెంట్‌లు:

 1. కం//
  నరమేధము జేయుచు తా
  కరముల జిక్కంగ వైరి కరుణన్జూ పన్ !
  మరణమె శరణంబనుకొన
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బిరుసగు పాలన తోడను
  నిరతము జనులను నొగుల్చు నీచ నృపతిపై
  తిరుగాడి మట్టుబెట్టగ
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.

  రిప్లయితొలగించండి
 3. కరమందుకోనగకన్యయె
  పురమునగానకయువకుడుభోరుననేడ్చెన్
  పురహరువారసుడాతఁడు
  గరళముకఱవయ్యెలేదుఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి
 4. దొరలందరు దోచ, బ్రతుకు
  దెరువే కరువైన వేళ, తెలగా ణమునన్
  బరువైన జీవితములకు
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి

 5. మరిమయె శరణంబయ్యె కొ
  మరులకు పట్టని బ్రతుకిది మరణించుటకై
  మరిమరి యత్నించితినే
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. కారుణ్య మరణానికంగీకరింపమని ప్రభుత్వానికి రోగి వేడుకోలు:

   కందం
   దురితమ్మేమొనరించితొ
   చెర మంచమె! నిశ్చలగతిఁ జిక్కితి రుజతో
   మరణపు భిక్ష దయ నిడుమ!
   గరళము గఱవయ్యె! లేదు ఖడ్గంబైనన్! !

   మత్తేభవిక్రీడితము
   దురితమ్మేమొనరించితో నెఱుగ నే దుర్మార్గమున్ దొక్కనే
   చెరమంచమ్ముగ నిశ్చలంపు గతిలో జిక్కంగ రోగిష్టినై
   చరియింపన్ గన లేననన్ మరణ భిక్షన్ జాలినందింపుమా!
   గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే!!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. కం//
  శరములధాటికి వెఱచుచు
  కరముల జిక్కంగ వైరి కరుణన్జూపన్ !
  మరణమె శరణంబనుకొన
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 8. నిరతము శ్రమియించు నరుడు
  ధరలో నిడుములకు క్రుంగి తాను గుములుచున్
  మరణమును గోరు వేళన్
  గరళము గురవయ్యె లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి
 9. సరిజూడంగనుకానడేహరియునేసాంగంబుసాగిల్లినన్
  అరిమాయావియనిశ్చయంబుగనునాయాసంబుగల్గించుగా
  కరిదావిష్ణునిదీనయైపిలచెదాకావంగరమ్మంచునున్
  గరళమ్మేకరవయ్యెనేయకటఖడ్గంబైనలేదయ్యెనే

  రిప్లయితొలగించండి

 10. బెరకుల్ నిండుసభాంతరమ్మున సతిన్ భీష్మాదులే గాంచగన్
  వరవంచున్ దడు పూడదీయ దలపన్ బ్రాణేశులీ యేవురున్
  పరకల్ వోలెను నిల్చిరచ్చటకదా వంశీధరా చావగన్
  గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే.

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్థిరముగ పాండవులు వనిని
  మెరయుట రారాజు జూచి మిక్కిలి నీర్ష్యన్
  తెరలుచు చావగ ననుకొనె
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.

  రిప్లయితొలగించండి
 12. తరమే యెవ్వరికైన దేశమున
  సంతాపంబు నీడేర్చగా
  బరువాయెన్ బ్రతు కీడ్వగా దినదినం
  బయ్యో ! సదా హెచ్చె డీ
  ధరలన్ గాంచి తలంచుచుండి
  రిటులన్ ధైర్యంబు క్షీణించియున్
  గరళమ్మే కరువయ్యనే యకట
  ఖడ్గంబైన లేదయ్యనే

  రిప్లయితొలగించండి
 13. అరుదౌ కాంచన కృష్ణసారమును మాయామోహమున్గోరి నా
  పరుషంబౌ నుడులన్ మరందిని గడున్ బాధించితే దైవమా!
  కరకౌ రాక్షసరాజు పాలబడి దుఃఖాబ్ధిన్నణంగారితే
  పరలోకమ్మున కేగజూతుమన సంప్రాప్తించదే మేవడిన్
  గరళమ్మే కరవయ్యెనే యకట!ఖడ్గంబైన లేదయ్యనే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరిపైరుకు సోకెంగద
   సరికొత్త పురుంగు దాని జంపెదమన్నన్
   తిరిగిన బలు నంగళ్ళను
   గరళము కరువయ్యె లేదు ఖడ్గంబైనన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. పరికించిచూడ నెరిగితి
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్
  పరకలు కోయుటకైనన్
  కరివరదా మరి పశువుల గాసంబెటులో


  [గరళము=గడ్డిమోపు;పరకలు=గడ్డిపోచలు]

  రిప్లయితొలగించండి
 15. కరువాయె నిదుర కనులకు
  చెరువాయెనుగుండె వలపు ఛిద్రంబాయెన్
  బరువాయె బ్రతుకు నాకిక
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్థిరమౌ జీవితమొందుచున్ వనమునన్ క్షేమంబుగా దిర్గుచున్
  గరిమన్ వెల్గెడి పాండురాజు సుతులన్ గాంచంగ రారాజు తా
  నెరుసున్ గల్గి శరీరమున్ విడువగా నెడ్దన్ విచారించి నా
  గరళమ్మే కరువయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే!

  రిప్లయితొలగించండి
 17. అరులకు తాజి క్కి ప్రతా
  పరుద్రు డకటా!మనసున పరిపరి తలచెన్,
  మరణమె మేలని, వెదకగ
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్.

  రిప్లయితొలగించండి
 18. భరతుండేలగ ధారుణీ వలయమున్ భవ్యంబు నూహించుచున్
  గరుణా మూర్తిగ నిన్ దలంచి మది, యాకణ్వర్షి నన్బంపెనే?
  కురు రాజ్యంబున ధర్మమీ గతిని సంక్షోభంబునన్ జిక్కగా
  మరణంబే శరణంబుగా దలప సీమంతమ్ముగా నేడిటుల్,
  గరళమ్మే కఱవయ్యెనే, యకట ఖడ్గంబైన లేదయ్యెనే?

  రిప్లయితొలగించండి
 19. కం//
  త్వరపడి చంపుట కొరకున్
  నరహింసను ప్రోత్సహించు నటనోన్మాదుల్ !
  విరివిగ మందుల నడుగగ
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 20. 5. కం//
  విరహమును తాళలేకను
  సరసము జేయంగ రమణి సఖ్యత లేకన్ !
  పురుగుల మందును త్రాగెను
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 21. పెరుగుచు నున్న కుటుంబపు
  బరువునిక వహించలేక ప్రాణమువిడువన్
  పరిసరమందున సుంతయు
  గరళము గఱవయ్యె , లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి
 22. 6. కం//
  సిరిసంపద గోల్పోవగ
  దరిచేర్చెడివారు లేక ధైర్యమువీడన్ !
  మరణించుటె మేలనుకొనె
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 23. 7. కం//
  పరువే బోయిన పిదపన్
  బరువగు దేహము వలదని ప్రాయము నందున్ !
  కరివనమున జొచ్చి వెఱచె
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 24. కరుణేజూపవుమాటలాడవెటులో
  కారుణ్యమేతగ్గెనా!
  వరమై,రావిటునాదుభక్తిగనుమా!
  వాంచించి నీరూపమే
  స్థిరమై నాయెదనిల్పలేనిబతుకే
  చేధించ శ్రీ రాముడా
  గరళమ్మేకరవయ్యెనే యకట
  ఖడ్గంబైనలేదయ్యెనే
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 25. సమస్య :

  గరళమ్మే కరవయ్యెనే యకట ఖ
  డ్గంబైన లేదయ్యెనే

  ( భీముని గదాఘాతం వల్ల తొడలు విరిగి ఒక్కడుగా మిగిలి కుమిలిపోతున్న రారాజు దుర్యోధనుడు )

  మత్తేభవిక్రీడితము
  ............................

  అరవన్ వందులు లేరు ! మేల్కొలుపగన్
  హా ! లేరు వైతాళికుల్ !
  కురువృద్ధుల్ గురువృద్ధులున్ వెడలిరే !
  కొడ్కుల్ సఖుల్ లేరుగా !
  ధరపై కూలిన నాకు ప్రాణములవే
  తారాడు పోరాడెడిన్ !
  గరళమ్మే కరవయ్యెనే ! యకట ! ఖ
  డ్గంబైన లేదయ్యెనే !!

  ( వందులు - స్తోత్రపాఠకులు ; వైతాళికులు - నిద్ర మేల్కొలిపేవారు )

  రిప్లయితొలగించండి
 26. 10. కం//
  నరమానవు డెదురుబడక
  పరికించితి నలుదిశలను పర్వపు దినమున్ !
  వరిగడ్డిని కోసెదమన
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 27. 11. కం//
  పరిహాసము జేయవలదు
  కరివదనుని బ్రోవమనర గంగాధర,శ్రీ !
  పురమందున కరువు వెలసె
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 28. ధన్యుడను గురువర్యా !🙏
  4. కం//
  వరకట్నము దేలేదని
  మరణించుటె దిక్కనంగ మార్గములేకన్ !
  నురిబోసుకొనెను, పడతికి
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 29. కఱవాయెన్ కనుదోయిలో నిదుర నా కాంతామణిన్ గానకన్
  చెఱువాయెన్ హృదయాంగణమ్ము చెలియన్ చేరంగ లేనైతినే
  మరణమ్మే శరణమ్ము నాకిక భువిన్ మందుండ నాకియ్యెడన్
  గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

  రిప్లయితొలగించండి
 30. ధన్యుడను గురువర్యా !🙏
  8. కం//
  పరకాయవిద్య నేర్చియు
  పరదేశము కేగునపుడు పర్వత శ్రేణిన్ !
  మురిపెముతో దేహము విడె
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 31. ధన్యుడను గురువర్యా ! 🙏
  9. కం//
  వరుసగ గణపతి దెలుపుచు
  కరుణా ప్రభువై రచించు కలమున జేరన్ !
  పరవశమొందితి ననుగొను
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 32. తటాకములో దాగిన రారాజు
  పరిహాసమ్మునుఁ జేయుచున్ బలుక యాపార్థుల్, విచారమ్ముతో
  తిరుగన్ జాలను భంగపాటుగొని నే తేజమ్ముతోఁ బృథ్విపై
  మరణమ్మేయిక దిక్కునాకని, మదిం భావించె రారాజుతాన్
  గరళమ్మే కఱవయ్యెనే యకట! ఖడ్గంబైన లేదయ్యెనే

  రిప్లయితొలగించండి
 33. (దుర్యోధనుని స్వగతము)
  అరరే యేలొకొ మామ మాట విని నే యాగంబుకేతెంచితిన్
  మరపేలొందితినా సభాంగణమునన్ మ్రాలెన్ గదా పాదమే
  పరువే పోయెనికేల జీవితమయో ప్రాణంబు చాలింపగా
  గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

  రిప్లయితొలగించండి
 34. అరకొర బ్రదుకుల కంటెను
  విరమణ నీయంగదలచి వివిధములుంగాన్
  మరణపు యత్నము జేయగ
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి
 35. గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే
  మరణంబెందుల కోరుచుంటివిల నామార్తాండు సేవించుచో
  నిరతంబీయును నాయువున్ సిరులు పానీయంబులింపారగా
  గరమున్ మానుమ దుష్టచింతనను నోకామాక్షి!నీవిప్పుడున్

  రిప్లయితొలగించండి
 36. తరుణం బిట నేతెంచెను
  బురుషర్షభు లార సిద్ధముగ నుందు మనన్
  మరణింప వధింప నకట
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గం బైనన్


  కరి గంధర్వ శతాంగ సద్భట గణోగ్రవ్యూఢ మొక్కమ్మడిం
  బరివా రార్భక సంచ యోక్ష గణ గో వ్రాతమ్ము భీతిల్లఁగా
  నరి సందోహము మార్కొనంగ నిట మూయం గొట్టఁగా ధిక్సుభా
  గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

  [ధిక్ +సుభాక్ + అరళము = ధిక్సుభా గరళము ; అరళము = తలుపు]

  రిప్లయితొలగించండి
 37. 12. కం//
  చిరుబురులాడెడి బావను,
  "కర పాణ"ను వ్యాధిసోకె కలవొద్దనగన్ !
  తరుణోపాయము దెలవక
  గరళము గఱవయ్యె, లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 38. ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ పరిస్థితి పై నా ప్రయత్నము:

  మ:

  హొరవే మూలమటంచు తాలిబనులున్ హోరెత్త కాబూలుగన్
  నరమేధమ్ము సహించుచున్ బ్రజలు నానాహింస సైరింపనై
  బరువై పోయెను జీవితమ్మనుచు భావంబెంచి రీరీతిగన్
  గరళమ్మే గఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 39. 13. కం//
  జ్వర భారముతో నుండియు
  కరములు జోడించి మ్రొక్కె గౌరీపతికిన్ !
  మొరపెట్టుకున్న వినడే
  గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 40. 14. కం//
  సురనాయక ననుగొనిపో
  వెఱవుట దెలియదు నిజముగ వేడెద స్వామీ !
  పురహరుడిని నేజేరెద
  గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 41. 15. కం//
  వరవర రావను నొక కవి
  పరితాపము జెందె నాడు పలువురి నడుమన్ !
  దొరలెల్లరు వేధించగ
  గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 42. 16. కం//
  నరసింహుని జాతరలో
  కరుకగు కత్తుల కసాయి గర్వము జూపన్ !
  వరమడిగిన మేకను గన
  గరళము గఱవయ్యె,లేదు ఖడ్గంబైనన్ !!

  రిప్లయితొలగించండి
 43. పిలువన్ బోవవు నన్ను నీ గృహముకున్ పేర్మిన్ మదిన్ పూడ్చుకున్
  మరినా వైపుకు రాకపోతివి కదా మాయూరు ఓ! దూరమా?
  మరువన్ జాలక పోతినే నిను మరిన్మాయమ్మ మీ దొట్టుగా
  గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే

  రిప్లయితొలగించండి


 44. విరి తామర బోలు సతిని
  సరసముగా చేరబోవ సమయమదేమో
  చిరుచాపను జూపె నతివ
  గరళము గఱవయ్యె లేదు ఖడ్గంబైనన్

  రిప్లయితొలగించండి