20-9-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ”(లేదా...)“కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్”(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)
క్రొవ్విడి వెంకట రాజారావు: చలుపు చుండెడి పనులందు సతము దాను వంక లెంచి పరిభవించి బాధపెట్టు శ్వశ్రువు గృహమునందున పైకొను వడి కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుట్టినింటఁబూచినవిగపువ్వులివియెమేనగోడసుమేనత్తమెఱుపులటులముందరిచ్చినమరియాదమూటగట్టకోడలికినత్తసన్నిధింగోపమెనగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'మేనగోడలు' టైపాటు.
మేనగోడలు
తిక్క నుడులతో నత్త సాధించు చుండ కపట కోపమ్ము నటియించు కలికి జూచినోరు మెదపక తానింక నూరుకొనగకోడలికి నత్తసన్నిధిం గోపమె నగ.ఏ పని జేయబూనిననదేలని వంకల నత్త పెట్టగాతాపము చెందెనా పడతి ధైర్యము తోకను లెర్ర జేయగానాపి వహింప మౌనమది యా వనజాక్షి యెఱంగినంతనే కోపమె భూషణమ్మగును కోడలికిన్ దనయత్త సన్నిధిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు:కోపుగ నింటిలో పనుల గూర్చుచు నెల్లర కింబునిచ్చుచున్నైపుణమున్ సదా తను ఘనమ్ముగ సాగుచు నుండి యుండినన్లోపము లెంచుచున్నతిగ లోకువ జేసెడి శ్వశ్రువుండగాకోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్.
తాపమునందకుండనెదతాల్మినిదాల్చెనుద్రౌపదీసతిన్చూపకభేదభావమునుసౌమ్యతపెండిలియాడెనిండుగాఆపఁగలేనిదాయెనుగయత్తయనుజ్ఞనుకోడలాయెడన్కోపమెభూషణమ్మగునుకోడలికిన్తనయత్తసన్నిధిన్
వంక బెట్టుచు పనులలో పలు విధాల రాచి రంపాన బెట్టె డు బూచి వోలె సతము వర్తించు చుండగా సహ న శీలి కోడలికి నత్త సన్నిధి o గోపమె నగ
పాపము! చిర్రుబుర్రుమని పల్కునువంకలు వెట్టుచుండు దానాపక బాధ బెట్టు పను లన్నయుజేసిన తృప్తిజెందకన్ చూపరులెల్ల చోద్యపడ, శూకముసూడని మూర్ఖురాలపైకోపమె భూషణంబగును కోడలికిన్దన యత్త సన్నిధిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "పనులన్నియు... మూర్ఖురాలిపై" టైపాట్లు.
తేటగీతితల్లిని మఱపించ మిగుల నుల్లమలరరాగలహరిఁ దేలంగఁ బరస్పరమ్ముతీపి తిననెంచ మధుమేహ తీరు దలఁచుకోడలికి నత్త సన్నిధిం గోపమె నగ!ఉత్పలమాలచూపక యత్త నైజమది చొప్పడి తా మఱపించ తల్లినేప్రాపుగ నుండి వారలు పరప్పరమెల్లరు నీర్ష్యఁ జెందగన్"దీపి తినంగ నిష్టపడితే మధుమేహమునెంచవేమ"నన్గోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తాపము గల్గినప్పుడక తాయిగ పల్కువిధమ్మదేమిటోరూపము జూచినంత కడు రోషము బొందరు నెవ్వరెప్పుడున్కాపురమందు నా పడతి నింగన గింపుగ తోచునోపగన్కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అకతాయిగ'?
కె.వి.యస్. లక్ష్మి: తనదు వారల వీడుచు తరలి వచ్చి తనరు సంసార మందున తరుణి తాను తల్లి ప్రేమను పంచక తప్పు లెంచ కోడలికి నత్త సనిధిం గోపమె నగ.
రేపటి రోజుమాటవిని, రెప్పలు వేయుచు బద్ధుడవ్వ గాతాపము సంతసంబులును, దాచుచు జూపడు తండ్రి బిడ్డకున్కోపమె భూషణమ్మగును; కోడలికిన్ దన యత్త సన్నిధిన్తీపిగ దోచ యా గృహము దీదివియై వెలుగొందు చల్లగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...దోచ నా గృహము" అనండి. 'దీదివియై'?
ధన్యవాదాలు గురువు గారు ఇలా సరిచేశానండీ!రేపటి రోజుమాటవిని, రెప్పలు వేయుచు బద్ధుడవ్వ గాతాపము సంతసంబులును, దాచుచు జూపడు తండ్రి బిడ్డకున్కోపమె భూషణమ్మగును; కోడలికిన్ దన యత్త సన్నిధిన్తీపిగ దోచ నా గృహము దీదివియై వెలుగొందు చల్లగా!దీదివియై = స్వర్గమై
సమస్య :కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్ ( సూర్యకాంతం , ఛాయాదేవుల ఉమ్మడి లక్షణాల అత్తగారి నెదుర్కోవాలంటే మరి కోడలు కోపం చూపవలసిందేగా ...)ఆపగరాని మిక్కుటపు టాతురతన్ నటి సూర్యకాంతమౌ ;నోపగలేని మూర్ఖతను నోరిమి బూనని ఛాయదేవియౌ ;తాపపు టత్త నాపగను దప్పని దల్పకుడయ్య ! యెంచగా కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉ: పాపడు పాపడంచు పలు వంకలు దిద్దగ పట్టి పట్టి కైనాపని కడ్డు రాకనుచు నాథుడి తప్పు ను దెప్పి చెప్పతారేపును మాపటంచు కడు లీలగ నెట్టుచు తూలనాడగన్కోపము భూషణమ్మగునుకోడలికిన్, దన యత్త సన్నిధిన్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
పాపకు పాలబువ్వ కడుపారగబెట్టి యనంతరంబు తానాపసికందునూయలను హాయిగ నిద్దురబోవ నూపి యాపైపనులందు మగ్నమగు బాయక మోమున గానరానిదౌకోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
కోడలికి నత్త సన్నిధిం గోపమె, నగలివ్వ దని యత్త నొకతరి యింతి యలుగు,పంతములు హెచ్చు తమ వంతు పనులలోనయత్త ,కోడలి గొడవలు క్రొత్త వగునె
వధువు కొత్తగ నింటికి వచ్చియుండవేళతప్పుచు నిరతము ప్రియుడు గృహముచేరుటను తాళలేకుండి చిందులాడుకోడలికి , నత్త సన్నిధిం గోపమె నగ
కోపమనెడిభూషణముతో కోడలుండహద్దు మీరక నడయాడు నత్తగారుహద్దు లెరిగిన వైఖరి హాయి గనుకకోడలికి నత్త సన్నిధిం గోపమె నగ
ఏపుగ బెర్గితీవు నిటనేపని జేయగ జేతరాదె! నిన్మేపగ తెచ్చితీవొ పలు మేటల సంపద సేవకాండ్రతో"తేపకు తేపకున్నిటుల తీరుగ దిట్టెడు నత్తయున్నచోకోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్తసన్నిధిన్
ధన్యవిదములాచార్యా! నమోనమః!🙏🙏🙏
అత్తమామల సేవలం దలుపులేకవారి బాగోగులను జూచు నారి యామెమాట వినకున్న చనువుగా మందలించుకోడలికి నత్త సన్నిధిం గోపమె నగ
ఓపికలేనితత్వమునకోప్పులురెండునుకల్వలేకనేదూపమునేత్తురేమిగులతుంటరిమాటలచెల్లుబాటులోతాపముపెంచి చిత్తమునతత్ క్షణమందున పేర్మినెంచుచున్కోపమెభూషణమ్మగునుకోడలికిన్ దనయత్తసన్నిదిన్ ...తోకల...
ఓపిక నత్తమామలకు నుత్తమ సేవల నందఁ జేయుచున్చూపుచు వైద్యశాలలను క్షోభము నొందుచు నుండ, వ్యాధులన్మోపగు ముత్రరోగమున, మోజున తీపిని కోర నాపగాకోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మూత్ర - టైపో
చూపుచు నోటరన్నలకు సొంపుగ జేతిన దేవలోకమున్పాపపు కార్యముల్ సలిపి పౌరుల నెల్లర మభ్యవెట్టగాజూపెడి రాజ్యపాలకుల, సూటిగ ధిక్క్రియ నెన్నగామదిన్,కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్.
చేయుకొలదిని నింకను జేయుమనగకినుక వహియించి కూర్చుండ,కేలుదమ్మివట్టి యత్తమ్మ బ్రతిమాలు వట్టు చూడకోడలికినత్తసన్నిధిం గోపమె నగ
రేపులు మాపులున్ ననక ఱేయియు బ్రొద్దును జేయుచుండగానీపని యాపనియం చికను నిట్టుగ నట్టుగ జెప్పుచుండగాగోపమునొంది కూర్చునగ గోమున యత్తయు జేరదీయుటన్ కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్
తనదు భర్త పైననె కాదు ధాత్రి లోనసత్యము వచింతు నిట్లు నిస్సంశయము వినుండు యుక్తానురాగము నిండి నట్టి కోడలికి నత్త సన్నిధిం గోపమె నగపాప విహీన భావ చయ భాసిత కార్య నికాయ మగ్న సంస్థాపిత శుద్ధ చిత్త నిజ మాతృ దృగంచిత భక్తి యుక్త నిస్తాప నితాంత సద్వినయ శాంత గుణద్యుతి యుక్త నిత్య నిష్కోపమె భూషణమ్మగును గోడలికిం దన యత్త సన్నిధిన్
పద్యమంతా ఒకే సమాసంఆశీస్సులు
ధన్యవాదము లన్నయ్యా.
“పాపము కాదురా సుతుడ! భార్యను మెచ్చుచు సాగి పోవ సం తాపము వీడి దంపతులు తద్దయు ప్రేమముతోజరించగా దాపున గాక దూరముగ తల్లిని దండ్రిని యుంచ మేల”నన్ కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్!
రేపునశాంతి కారణము లేని విరోధములన్ రగుల్చుగాకోపమె; భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్జూప వినమ్రతన్, గృహము శోభిలుగా గన స్వర్గసీమయైలోపములెన్నకొండొరులు క్రోధనమున్ దరి జేరనీనిచో
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచలుపు చుండెడి పనులందు సతము దాను
వంక లెంచి పరిభవించి బాధపెట్టు
శ్వశ్రువు గృహమునందున పైకొను వడి
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుట్టినింటఁబూచినవిగపువ్వులివియె
రిప్లయితొలగించండిమేనగోడసుమేనత్తమెఱుపులటుల
ముందరిచ్చినమరియాదమూటగట్ట
కోడలికినత్తసన్నిధింగోపమెనగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మేనగోడలు' టైపాటు.
మేనగోడలు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండితిక్క నుడులతో నత్త సాధించు చుండ
కపట కోపమ్ము నటియించు కలికి జూచి
నోరు మెదపక తానింక నూరుకొనగ
కోడలికి నత్తసన్నిధిం గోపమె నగ.
ఏ పని జేయబూనిననదేలని వంకల నత్త పెట్టగా
తాపము చెందెనా పడతి ధైర్యము తోకను లెర్ర జేయగా
నాపి వహింప మౌనమది యా వనజాక్షి యెఱంగినంతనే
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దనయత్త సన్నిధిన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
తొలగించండికోపుగ నింటిలో పనుల గూర్చుచు నెల్లర కింబునిచ్చుచున్
నైపుణమున్ సదా తను ఘనమ్ముగ సాగుచు నుండి యుండినన్
లోపము లెంచుచున్నతిగ లోకువ జేసెడి శ్వశ్రువుండగా
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితాపమునందకుండనెదతాల్మినిదాల్చెనుద్రౌపదీసతిన్
రిప్లయితొలగించండిచూపకభేదభావమునుసౌమ్యతపెండిలియాడెనిండుగా
ఆపఁగలేనిదాయెనుగయత్తయనుజ్ఞనుకోడలాయెడన్
కోపమెభూషణమ్మగునుకోడలికిన్తనయత్తసన్నిధిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంక బెట్టుచు పనులలో పలు విధాల
రిప్లయితొలగించండిరాచి రంపాన బెట్టె డు బూచి వోలె
సతము వర్తించు చుండగా సహ న శీలి
కోడలికి నత్త సన్నిధి o గోపమె నగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాపము! చిర్రుబుర్రుమని పల్కును
రిప్లయితొలగించండివంకలు వెట్టుచుండు దా
నాపక బాధ బెట్టు పను లన్నయు
జేసిన తృప్తిజెందకన్
చూపరులెల్ల చోద్యపడ, శూకము
సూడని మూర్ఖురాలపై
కోపమె భూషణంబగును కోడలికిన్
దన యత్త సన్నిధిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పనులన్నియు... మూర్ఖురాలిపై" టైపాట్లు.
తేటగీతి
రిప్లయితొలగించండితల్లిని మఱపించ మిగుల నుల్లమలర
రాగలహరిఁ దేలంగఁ బరస్పరమ్ము
తీపి తిననెంచ మధుమేహ తీరు దలఁచు
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ!
ఉత్పలమాల
చూపక యత్త నైజమది చొప్పడి తా మఱపించ తల్లినే
ప్రాపుగ నుండి వారలు పరప్పరమెల్లరు నీర్ష్యఁ జెందగన్
"దీపి తినంగ నిష్టపడితే మధుమేహమునెంచవేమ"నన్
గోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండితాపము గల్గినప్పుడక తాయిగ పల్కువిధమ్మదేమిటో
రిప్లయితొలగించండిరూపము జూచినంత కడు రోషము బొందరు నెవ్వరెప్పుడున్
కాపురమందు నా పడతి నింగన గింపుగ తోచునోపగన్
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అకతాయిగ'?
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండితనదు వారల వీడుచు తరలి వచ్చి
తనరు సంసార మందున తరుణి తాను
తల్లి ప్రేమను పంచక తప్పు లెంచ
కోడలికి నత్త సనిధిం గోపమె నగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరేపటి రోజుమాటవిని, రెప్పలు వేయుచు బద్ధుడవ్వ గా
రిప్లయితొలగించండితాపము సంతసంబులును, దాచుచు జూపడు తండ్రి బిడ్డకున్
కోపమె భూషణమ్మగును; కోడలికిన్ దన యత్త సన్నిధిన్
తీపిగ దోచ యా గృహము దీదివియై వెలుగొందు చల్లగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...దోచ నా గృహము" అనండి. 'దీదివియై'?
ధన్యవాదాలు గురువు గారు ఇలా సరిచేశానండీ!
తొలగించండిరేపటి రోజుమాటవిని, రెప్పలు వేయుచు బద్ధుడవ్వ గా
తాపము సంతసంబులును, దాచుచు జూపడు తండ్రి బిడ్డకున్
కోపమె భూషణమ్మగును; కోడలికిన్ దన యత్త సన్నిధిన్
తీపిగ దోచ నా గృహము దీదివియై వెలుగొందు చల్లగా!
దీదివియై = స్వర్గమై
సమస్య :
రిప్లయితొలగించండికోపమె భూషణమ్మగును
కోడలికిన్ దన యత్త సన్నిధిన్
( సూర్యకాంతం , ఛాయాదేవుల ఉమ్మడి లక్షణాల
అత్తగారి నెదుర్కోవాలంటే మరి కోడలు కోపం చూపవలసిందేగా ...)
ఆపగరాని మిక్కుటపు
టాతురతన్ నటి సూర్యకాంతమౌ ;
నోపగలేని మూర్ఖతను
నోరిమి బూనని ఛాయదేవియౌ ;
తాపపు టత్త నాపగను
దప్పని దల్పకుడయ్య ! యెంచగా
కోపమె భూషణమ్మగును
కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిపాపడు పాపడంచు పలు వంకలు దిద్దగ పట్టి పట్టి కై
నాపని కడ్డు రాకనుచు నాథుడి తప్పు ను దెప్పి చెప్పతా
రేపును మాపటంచు కడు లీలగ నెట్టుచు తూలనాడగన్
కోపము భూషణమ్మగునుకోడలికిన్, దన యత్త సన్నిధిన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిపాపకు పాలబువ్వ కడుపారగబెట్టి యనంతరంబు తా
రిప్లయితొలగించండినాపసికందునూయలను హాయిగ నిద్దురబోవ నూపి యా
పైపనులందు మగ్నమగు బాయక మోమున గానరానిదౌ
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోడలికి నత్త సన్నిధిం గోపమె, నగ
రిప్లయితొలగించండిలివ్వ దని యత్త నొకతరి యింతి యలుగు,
పంతములు హెచ్చు తమ వంతు పనులలోన
యత్త ,కోడలి గొడవలు క్రొత్త వగునె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివధువు కొత్తగ నింటికి వచ్చియుండ
రిప్లయితొలగించండివేళతప్పుచు నిరతము ప్రియుడు గృహము
చేరుటను తాళలేకుండి చిందులాడు
కోడలికి , నత్త సన్నిధిం గోపమె నగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోపమనెడిభూషణముతో కోడలుండ
రిప్లయితొలగించండిహద్దు మీరక నడయాడు నత్తగారు
హద్దు లెరిగిన వైఖరి హాయి గనుక
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏపుగ బెర్గితీవు నిటనేపని జేయగ జేతరాదె! నిన్
రిప్లయితొలగించండిమేపగ తెచ్చితీవొ పలు మేటల సంపద సేవకాండ్రతో"
తేపకు తేపకున్నిటుల తీరుగ దిట్టెడు నత్తయున్నచో
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్తసన్నిధిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవిదములాచార్యా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిఅత్తమామల సేవలం దలుపులేక
రిప్లయితొలగించండివారి బాగోగులను జూచు నారి యామె
మాట వినకున్న చనువుగా మందలించు
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఓపికలేనితత్వమున
రిప్లయితొలగించండికోప్పులురెండునుకల్వలేకనే
దూపమునేత్తురేమిగుల
తుంటరిమాటలచెల్లుబాటులో
తాపముపెంచి చిత్తమున
తత్ క్షణమందున పేర్మినెంచుచున్
కోపమెభూషణమ్మగును
కోడలికిన్ దనయత్తసన్నిదిన్
...తోకల...
ఓపిక నత్తమామలకు నుత్తమ సేవల నందఁ జేయుచున్
రిప్లయితొలగించండిచూపుచు వైద్యశాలలను క్షోభము నొందుచు నుండ, వ్యాధులన్
మోపగు ముత్రరోగమున, మోజున తీపిని కోర నాపగా
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
మూత్ర - టైపో
తొలగించండిచూపుచు నోటరన్నలకు సొంపుగ జేతిన దేవలోకమున్
రిప్లయితొలగించండిపాపపు కార్యముల్ సలిపి పౌరుల నెల్లర మభ్యవెట్టగా
జూపెడి రాజ్యపాలకుల, సూటిగ ధిక్క్రియ నెన్నగామదిన్,
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్.
చేయుకొలదిని నింకను జేయుమనగ
రిప్లయితొలగించండికినుక వహియించి కూర్చుండ,కేలుదమ్మి
వట్టి యత్తమ్మ బ్రతిమాలు వట్టు చూడ
కోడలికినత్తసన్నిధిం గోపమె నగ
రేపులు మాపులున్ ననక ఱేయియు బ్రొద్దును జేయుచుండగా
రిప్లయితొలగించండినీపని యాపనియం చికను నిట్టుగ నట్టుగ జెప్పుచుండగా
గోపమునొంది కూర్చునగ గోమున యత్తయు జేరదీయుటన్
కోపమె భూషణమ్మగును గోడలికిన్ దనయత్త సన్నిధిన్
తనదు భర్త పైననె కాదు ధాత్రి లోన
రిప్లయితొలగించండిసత్యము వచింతు నిట్లు నిస్సంశయము వి
నుండు యుక్తానురాగము నిండి నట్టి
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ
పాప విహీన భావ చయ భాసిత కార్య నికాయ మగ్న సం
స్థాపిత శుద్ధ చిత్త నిజ మాతృ దృగంచిత భక్తి యుక్త ని
స్తాప నితాంత సద్వినయ శాంత గుణద్యుతి యుక్త నిత్య ని
ష్కోపమె భూషణమ్మగును గోడలికిం దన యత్త సన్నిధిన్
పద్యమంతా ఒకే సమాసం
తొలగించండిఆశీస్సులు
ధన్యవాదము లన్నయ్యా.
తొలగించండి“పాపము కాదురా సుతుడ! భార్యను మెచ్చుచు సాగి పోవ సం
రిప్లయితొలగించండితాపము వీడి దంపతులు తద్దయు ప్రేమముతోజరించగా
దాపున గాక దూరముగ తల్లిని దండ్రిని యుంచ మేల”నన్
కోపమె భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్!
రేపునశాంతి కారణము లేని విరోధములన్ రగుల్చుగా
రిప్లయితొలగించండికోపమె; భూషణమ్మగును కోడలికిన్ దన యత్త సన్నిధిన్
జూప వినమ్రతన్, గృహము శోభిలుగా గన స్వర్గసీమయై
లోపములెన్నకొండొరులు క్రోధనమున్ దరి జేరనీనిచో