15, సెప్టెంబర్ 2021, బుధవారం

సమస్య - 3843

16-9-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్"
(లేదా...)
"రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్"
(కవితాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. సామంతులసౌజన్యము
    నామపువేషముముదరగనాతురమతియై
    మామనుదించెగయల్లుఁడు
    రాముఁడుక్రోధమువహించెరాజ్యమువోవన్

    రిప్లయితొలగించండి

  2. ఏమా మాటలు? రఘుకుల
    సోముడు రాజ్యమ్ము విడెను సుతిమాటలనే
    తా మన్నించుచు కద యే
    రాముడు గ్రోధము వహించె రాజ్యము వోవన్?

    రిప్లయితొలగించండి
  3. శ్యాముడు మధురను వీడెను
    భీముడె మగధాధిపతిని బేలగ సేయున్
    ఆమర్మము తెలియక బల
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

    రిప్లయితొలగించండి

  4. క్షేమము కాదురా మనకు శ్రీరఘురాముని నిందసేయ నీ
    కే మొఱకుండు చెప్పెనిది యింతిమనోరథ సిద్ధికై కదా
    రాముడు రాజ్యమున్ విడి యరణ్యము కేగిన త్యాగమూర్తి, యే
    రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్?

    రిప్లయితొలగించండి
  5. నీమము గల్గిన వాడై
    యే మాత్రము జంకు గొంకు లెరుగని వాడై
    ధీమంతు డై న వాడే
    రాముడు క్రోధము వహించె రాజ్యము వోవన్?

    రిప్లయితొలగించండి
  6. సమస్య :

    రాముడు గ్రోధమందె మది
    రాజ్యము దక్కక జారిపోవగన్

    ( ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు యౌవరాజ్యాభిషేకం
    చేసినప్పుడు దుర్యోధనుని పరిస్థితి )

    ఉత్పలమాల
    .....................

    సోముడు హస్తినాజనుల
    సొంపగు కన్నుల కైరవాళికిన్ ;
    ధీమతి సర్వకార్యముల
    దిన్నగ దీర్చెడి ధర్మపుత్రునే
    తా మది నెంచి రాజుగను
    దండ్రి యొనర్పగ భానుమానసా
    రాముడు ; గ్రోధమందె మది ;
    రాజ్యము దక్కక జారిపోవగన్ .

    (కైరవాళి - కలువల సమూహం ; సోముడు - చంద్రుడు ;
    భానుమానసారాముడు - భానుమతీదేవి మనస్సే
    ఉద్యానవనమైనవాడు దుర్యోధనుడు )

    రిప్లయితొలగించండి
  7. కందం
    ఆ మంధర బోధింపఁగ
    స్వామినడుగఁగ భరతునకు సామ్రాజ్యమ్మున్
    తామసి కైకేయి కలన్
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్!?

    ఉత్పలమాల
    రాముని కానకున్ బనిపి రాజ్యము నా భరతుండు వొందగన్
    స్వామినడుంగు బోధఁగొని సాధ్యమె? మంధర వ్యూహమంచుఁ దా
    తామసి కైకకున్ కలను తర్జనభర్జన డోలనమ్మునన్
    రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్! ?

    రిప్లయితొలగించండి
  8. నీమము మరచిన రీతిన
    తామందరినీ పణమిడి ధర్మజుడాడన్
    భీమునిమదిలోనాత్మా
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. భరతుని మనోగతము గా ఈ నా ప్రయత్నము :
      పట్టాభిషేకం చేసే బదులు అడవికి పంపడమేమిటి ? ఇల్లు విడవ వద్దు అని భరతుడు చెప్పిన మాటను శ్రీరాముడు త్రోసి పుచ్చగా, భరతుని మది కోపముతో రామునికి రాజ్యము దక్కక జారిపోయినదే! అని చింతిస్తుంది ..అని చెప్పే ప్రయత్నం చేశాను.

      ఉ:

      నీమము మేర రామునికి నిక్కము పట్టము గట్టు వారుగన్
      క్షేమము గోరుటన్ బదులు కీడు తలంచిరె కాన కేగనై ?
      ధామము వీడ వద్దనిన తమ్ముని కోరిక త్రోసి పుచ్చ శ్రీ
      రాముడు; గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధీమంతుడు యార్కి పలుక
    రాముడు గ్రోధము వహించె రాజ్యము వోవన్
    కాముక వాలి నొనర్చిన
    ఏమరిక నొసగిన క్రియల నెల్లన్ వినగా.

    రిప్లయితొలగించండి
  11. నీమమువిడి దన నెదురుట
    జామాతయె గోపనముగ జరిపెనటంచున్
    బూమియలాడ మన తెలుగు
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

    రిప్లయితొలగించండి
  12. నేమముతప్పడు, రాజ్యపు
    కామమువీడగసరగుణ కానలబోయే
    విమలుడు మన్నింపు మెటుల
    రాముడుగ్రోధమువహించె రాజ్యమువోవన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  13. రాముని కేల రాజ్యమది రంజిలె లోకమనోధిపీఠికన్?
    రాముడు విశ్వపాలనపరాత్పరుడై వరదాయియయ్యె, నా
    రాముడు వీర్యవత్పరశురాముడొ? యా బలరాముడౌనొ! యే
    రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్?

    కంజర్లరామాచార్య.

    రిప్లయితొలగించండి
  14. తామసుడౌ గుణహీనుఁడు
    రాముని నైజమ్ము తెలియరాక తనమదిన్
    నీమమెరుంగక తలచెను
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

    రిప్లయితొలగించండి
  15. నీమము గీమము లేదని
    రాముని తమ్ముఁడు ఘనుండు లక్ష్మణుఁడే, ని
    ష్కాముఁడు శాంతము నూనఁగ
    రాముఁడు, గ్రోధము వహించె రాజ్యము వోవన్


    కామిత లబ్ధ కైకయినిఁ గాంచిన భండన రంగ విక్రమో
    ద్దాముఁడు భాతృ వత్సలుఁడు దండ ధరాభుఁడు రక్త నేత్రుఁడున్
    భీమ బలుండు లక్ష్మణుఁడు విస్తృత సంతత సేవి తోల్లస
    ద్రాముఁడు గ్రోధ మందె మది రాజ్యము దక్కక జాఱి పోవఁగన్

    రిప్లయితొలగించండి
  16. భీమ బలోద్ధత నాకముఁ
    వేమారు సమాక్రమించ వేలుపుగొంగల్
    ధామము గోల్పోయిన సు
    త్రాముడు క్రోధము వహించె రాజ్యము వోవన్

    నీమములేని వాలి బహునేర్పుగ దమ్ముని వెంబడించగా
    ధామము ఋష్యమూకమయి తక్కుచు దారుచుదీనుడై తుదన్
    క్షేమమునెంచి రాఘవుని స్నేహము గోరుచు విన్నవించగా
    రాముడు గ్రోధమందె మది,రాజ్యము దక్కక జారిపోవగన్





    రిప్లయితొలగించండి
  17. ఏమీ? దారుణమీయది
    రాముడు గ్రోధము వహించె రాజ్యమువోవన్ ?
    రాముడనంగను దైవమ
    యేమాత్రము నుండబోవు నీర్ష్యాదులహో

    రిప్లయితొలగించండి
  18. రాముడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవగన్
    నేమని బల్కుచుంటిరిట? యిట్లుగ బల్కుట పాడియే?రమా!
    రాముడు శాంతమూర్తియయి రంజిలునట్లుగ మానవాళియున్
    నీమము దప్పకుండగను నిశ్చల బుద్ధిని రాజ్యమేలెగా

    రిప్లయితొలగించండి
  19. రాముడు సద్గుణధాముడు
    రాముడు ధర్మాను సారి, రాముడు త్రేతా
    రాముడె; మన్నెపు సీతా
    రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

    రిప్లయితొలగించండి
  20. స్తోమ శతమ్ములన్ జలిపి సొంపుగ నా నహుషుండు తోరమౌ
    ప్రేమము తోడుతన్ జని త్రివిష్టపమున్ గొని గద్దెనెక్క సు
    త్రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్
    తామసుడై చరించుచును తాపసితో నహుషుం డడంగె చూ

    రిప్లయితొలగించండి
  21. నీమము దప్పకన్ జనకు నిర్ణయమౌదల దాల్చి భ్రాతయున్
    గోమలి సీతతోనరిగె ఘోరవనాంతరసీమకాతడే
    కాముకు రావణున్ దునిమి గాచె జగంబు; ననంగబోకుమీ
    "రాముఁడు గ్రోధమందె మది రాజ్యము దక్కక జారిపోవఁగన్"

    రిప్లయితొలగించండి
  22. భామనుగూడియేగెనట భ్రాతయు ముందుగ సాగుచుండగా
    తామదిజంకకుండగనుతల్లికి మ్రొక్కుచుదీవెనందుచున్
    రాముడుకానకేగెననిరాజ్యమువీడయటంచువింటి యే
    రాముడు గ్రోధమందె మదిరాజ్యముదక్కక జారిపోవగన్

    మరొక పూరణ
    కోమలి తో డను సాగెను
    రాముడు,క్రోధము వహించె రాజ్యము వోవన్
    సౌమిత్రిఖఢ్గమెత్తెను
    తామంథరనచటకూల్చదలచుచుమదిలో


    రిప్లయితొలగించండి